రావి చెట్టును భారతదేశంలో పవిత్రమైందిగా భావిస్తారు. దీన్నే వృక్షశాస్త్రంలో ‘ఫెకస్ రిలిజియోసా’ అంటారు. ఇది భారతదేశ సంస్కృతిలో లోతుగా వేళ్లను పాతుకుని ఉంది, ఎందుకంటే ఈ చెట్టు కిందనే బుద్ధుడికి జ్ఞానోదయం అయినట్లు నమ్మడం జరుగుతోంది. కాబట్టి, దీనిని తరచుగా 'బోధి చెట్టు' గా సూచిస్తారు. సంప్రదాయ భారతీయ సాహిత్యం రావి వృక్షాన్ని 'అశ్వత్త' వృక్షంగా వర్ణిస్తుంది, అంటే దీనర్థం, రావి చెట్టు 'జీవితం యొక్క చెట్టు' కు చిహ్నం అని.

ఫికస్ రిలిజియోసాను సాధారణంగా పవిత్రమైన అశ్వత్థము (the sacred fig) అని పిలుస్తారు, ఇది ఆసియా, ముఖ్యంగా భారతదేశం మరియు చైనా, యొక్క ఉష్ణమండల భాగాలకు చెందినది. ఇది విస్తృతమైన కాండంతో (ట్రీ -ట్రంక్) పెద్దది గా ఉండే చెట్టుగా  ఉంటుంది, దీని యొక్క వ్యాసం 3 మీటర్లు వరకు ఉంటుంది. చెట్టు యొక్క ఆకులు హృదయం ఆకారంలో ఉంటాయి మరియు విలక్షణమైన ఆకుచివరను (tip) ను కల్గి ఉంటుంది. చెట్టు యొక్క పండ్లు సాధారణంగా చిన్న చిన్న అత్తి పండ్లను లేదా చిన్న మేడిపండ్లను పోలి నేతగా ఉన్నపుడు ఆకుపచ్చగా  మరియు మాగి పండైనపుడు ఊదా రంగులోకి మారుతాయి.

రావిచెట్టు యొక్క జీవిత కాలం సాధారణంగా 900 నుండి 1500 సంవత్సరాల వరకు ఉంటుంది. శ్రీలంకలోని “జయ శ్రీ మహా బోధి” రావిచెట్టు, మత ప్రాముఖ్యత కలిగిన అతిపురాతనమైన చారిత్రక చెట్టు' అని చెప్పబడింది. వాస్తవానికి దీని వయస్సు 2250 సంవత్సరాల కంటే ఎక్కువ అని, ఇది ప్రపంచంలోనే పురాతనమైన చెట్టు అని చెప్పబడుతోంది.

రావి చెట్టు గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు

  • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: ఫికస్ రిలిజియోసా (Ficus religiosa)
  • కుటుంబం: మోరసీయే (Moraceae)
  • సాధారణ పేరు: పవిత్రమైన అత్తి, బోధి చెట్టు, రావిచెట్టు, పీపల్ చెట్టు
  • సంస్కృత పేరు: అశ్వత్త , పిప్పల
  • రావి చెట్టు యొక్క ఉపయోగించే భాగాలు: ఆకులు, శాఖలు, పువ్వులు, పండ్లు, బెరడు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఉష్ణమండల ఆసియాకు చెందినది ప్రత్యేకించి, భారతదేశం మరియు చైనాల్లో ఎక్కువగా కనబడుతుంది.
  1. రావి చెట్టు యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of peepal tree in Telugu
  2. రావి చెట్టు దుష్ప్రభావాలు - Side effects of peepal tree in Telugu

రావిచెట్టును పురాతన కాలం నుండి ప్రబలంగా సేవిస్తుండడంవల్ల దీని యొక్క ఆరోగ్య ప్రయోజనాలు అనేకం మరియు అవన్నీ సుస్పష్టంగా తెలుస్తున్నాయి. ఆ ప్రయోజనాల్లో అతి ముఖ్యమైనవి, వాటి వివరాలు క్రింద వివరించబడ్డాయి.

  • తెగిన గాయాలకు: వివిధ పరిశోధనల ప్రకారం రావిచెట్టు ఆకుల సారాలు తెగిన గాయాలను త్వరగా నయం చెయ్యడంలో సహాయపడతాయని తెలుస్తుంది. ఈ చెట్టు ఆకుల రసంలో గాయాలనను నయం చేసే లక్షణాలు ఉంటాయి.
  • చెక్కెర వ్యాధికి రావిచెట్టు: రావి చెట్టు బెరడు మరియు వేరులలో ఉండే β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్ అనే సమ్మేళనం రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుందని పరిశోధనలలో తేలింది.
  • రావిచెట్టు యాంటీబాక్టీరియల్ గుణాలు: రావి చెట్టు వివిధ భాగాలలో ఉండే ఇథనాలిక్ సారాలు స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టైఫి వంటి అనేక బాక్టీరియాలకు వ్యతిరేకంగా పనిచేస్తాయి.
  • యాంటీఆక్సిడెంట్ లక్షణాలు: రావి చెట్టు బెరడు మరియు పండ్లలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి అవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను న్యూట్రలైజ్ చెయ్యడంలో సహాయపడతాయి.
  • రోగనిరోధక శక్తికి: పరిశోధనల ప్రకారం రావిచెట్టు బెరడు సారాలు యాంటీబాడీ ప్రతిచర్యలు/ప్రతి స్పందనలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయని తేలింది. ఇది రోగనిరోధక వ్యవస్థ సామర్ధ్యాన్ని మెరుగుపరుస్తుంది.
  • అల్జీమర్స్ కోసం: రావి చెట్టు బెరడు యొక్క మేథనోలిక్ సారాలలో  శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరేస్ (acetylcholinesterase) అనే ఎంజైమ్ ఉన్నట్లు గుర్తించబడింది. ఇది అసిటైల్ కోలిన్ యొక్క బ్రేక్ డౌన్ (పతనానికి) కి అవసరం అవుతుంది. రావి చెట్టు సారాలకు ఉన్న ఈ లక్షణం అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
  • క్యాన్సర్కు: రావి చెట్టు యొక్క అన్ని భాగాలకు క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలు ఉన్నట్లు గుర్తించబడింది. ఒక పరిశోధన ప్రకారం రావి చెట్టులో ఉండే సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను చంపుతాయని తెలిసింది. అంతేకాక అవి ఫ్రీ రాడికల్స్ యొక్క ప్రభావాన్ని తగ్గించి క్యాన్సర్ ప్రమాదాన్ని కూడా నివారిస్తాయి.

తెగిన గాయాలకు రావి చెట్టు - Peepal tree for wounds in Telugu

తెగిన గాయాలు (cuts) లేదా కాలిన గాయాలు కారణంగా అయిన గాయాలను నయం చేయడానికి రావి చెట్టు యొక్క ఆకుల సారం బాగా ఉపయోగపడుతుంది, దీని ఆకులసారంలో అలాంటి గాయాన్ని మాన్పగల గుణాల్ని కలిగివుంది  ఒక అధ్యయనం ప్రకారం, ఈ గాయాలకు రావిఆకుల సారాన్నిపూసినపుడు తెగి గాయపడిన భాగాన్నిగణనీయంగా సంకోచింపచేసి త్వరగా మానేట్లుచేసింది, అంటే మామూలుగా మానే సమయాన్ని తగ్గించింది. రావి ఆకు రసంలోని గాయాన్ని మానిపే ఔషధ గుణం యొక్క ప్రభావం రావి ఆకు యొక్క మోతాదు పై ఆధారపడి పనిచేస్తుంది మరియు గాయానికి ఎంత తొందరగా రావి ఆకు రసాన్ని పూస్తే అంత త్వరగా గాయం మానుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Madhurodh Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for diabetes with good results.
Sugar Tablet
₹899  ₹999  10% OFF
BUY NOW

చక్కెరవ్యాధికి రావి చెట్టు - Peepal tree for diabetes in Telugu

రావి చెట్టు (ఫికస్ రిలిజియోసా) వేరు యొక్క బెరడు సారం రక్త చక్కర స్థాయిల్ని (బ్లడ్ షుగర్ని) తగ్గిస్తుందని గుర్తించారు. ఈ అధ్యయనాల్లో తేలిందేమంటే రావిచెట్టు వేరు బెరడు సారాన్ని తగిన మోతాదుల్లో చక్కెరవ్యాధి రోగులకు సేవింపజేసినపుడు అది గణనీయమైన (యాంటీ-డయాబెటిక్) చక్కెరవ్యాధిని మానుపే గుణాన్ని కలిగి ఉందని, అంటే రక్తంలో చక్కెరను తగ్గించే గుణం ఉందని, తెలిసింది. రావిచెట్టు యొక్క వేరు సారం యొక్క హైపోగ్లైసిమిక్ లేదా బ్లడ్లో చక్కెరను తగ్గించే చర్య “సమ్మేళనం β- సిటోస్టెరోల్-డి-గ్లైకోసైడ్” ఉనికి కారణంగానే జరుగుతుందని తెలుస్తోంది. .

(మరింత చదువు: డయాబెటిస్ లక్షణాలు )

పుండ్లకు రావి చెట్టు - Bodhi tree for ulcers

రావి చెట్టు ఆకులు నుండి తయారు చేసిన సారానికి పుండును మానిపే గుణం ఉంది.  ఇటీవల జరిపిన అధ్యయనం ప్రకారం, ఒత్తిడి పరిస్థితి వల్ల ఏర్పడే పుండ్లని అవి ఏర్పడకుండా నిరోధించే ఔషధ గుణం రావిచెట్టు ఆకు రసానికి లేదా సారానికి ఉందని తెలిసింది.  

పుండు నివారణ చర్య  (లేదా యొక్క యంత్రాంగాన్ని) ను ఫ్లేవానాయిడ్స్ వంటి జీవక్రియాశీల సమ్మేళనాల కారణంగా  జరుగుతుంది. ఏమైనప్పటికీ, రావి చెట్టు యొక్క ఆకు సారం ద్వారా ప్రదర్శించబడిన పండ్లను మానిపే గుణం యొక్క ఖచ్చితమైన యంత్రాంగం ఏర్పాటు గురించిన వివరాల్ని అధ్యయనాలు ఇంకా  తేల్చాల్సి ఉంది.

వాపు మరియు నొప్పి నివారణకు పవిత్రమైన రావిచెట్టు - Sacred fig for inflammation and pain in Telugu

రావి చెట్టు (ఫికస్ రిలిజియోసా-Ficus religiosa) యొక్క ఆకు మరియు బెరడు సారం వాపు నిరోధకంగా మరియు నొప్పి నివారణి (అనాల్జేసిక్ ) గా పని చేస్తుంది. ఆయుర్వేద వైద్యంలో పంటి నొప్పి (toothaches) నివారిణిగా రావి చెట్టు బెరడు సారాన్ని ఉపయోగించవచ్చని సూచించింది.

రావి చెట్టు యొక్క బెరడును సంప్రదాయకంగా వాపు తగ్గించడానికి భారతీయ జానపద ఔషధం (folk medicine) లో కూడా ఉపయోగించబడుతోంది. రావిచెట్టు ఆకు మరియు బెరడు సారాంశాల్లోని తానినాలు (tannins) మరియు ప్రేరకద్రవ్యాలు (steroids) వంటి జీవక్రియాశీల పదార్థాల ఉనికివల్ల శరీరంలో వాపు మరియు నొప్పి నివారణ అవుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. 

యాంటీబాక్టరియల్గా రావి చెట్టు - Peepal tree as antibacterial in Telugu

రావిచెట్టు చెట్టు యొక్క వివిధ భాగాలోని ఈథనాల్ (ethanolic) సంబంధమైన మరియు  సజల పదార్దాలు (aqueous) స్టాపైలాకోకస్ , సాల్మోనెల్లా పరాటిఫి, సాల్మోనెల్లా ఔరియుస్ , సాల్మోనెల్లా టిఫి, షిగెల్లా డైసేంటి రియే, సూడోమొనాస్ ఎరుగినోస , బాసిల్లస్ సబ్టిల్లీస్ మరియు ఎస్చేరిచియా కోలి  వంటి వివిధ సూక్ష్మజీవుల విరుద్దంగా పనిచేస్తాయని కనుక్కోబడింది.

పత్రహరితభరితమైన (chlorophyll) రావి చెట్టు యొక్క పండ్ల సారం అజోబాక్టర్ క్రూకోకమ్ , బాసిల్లస్ మెగటేరియం , బాసిల్లస్ సెరెయస్ , స్ట్రెప్టోమైసిన్ లాక్టిస్ , స్ట్రెప్టోకోకస్ ఫెకాలిస్ మరియు క్లబ్సియెల్లా న్యుమోనియాలకు వ్యతిరేకంగా గణనీయమైన చర్యలను చూపించిందని మరొక అధ్యయనం కనుగొంది . అంతేకాకుండా, రావి చెట్టు యొక్క సారాంశాలు ఆస్పెర్గిల్లస్ నైగర్ మరియు పెన్సిలియం నోటాటముల విరుద్ధంగా కూడా పని చేశాయని అధ్యయనంలో తెలిసింది.

పరాన్నభక్కుక్రిమినాశినిగా రావి చెట్టు - Bodhi tree against parasitic worms in Telugu

రావిచెట్టు బెరడు సారం హేమాంచస్ కాంటోర్దస్ (Haemonchus contortus) పురుగుల. విరుద్ధంగా కూడా పని చేస్తుందని కనుక్కోబడింది. వివిధ రకాలైన పరాన్నజీవి క్రిములు మనుషులకు వివిధ రకాల వ్యాధులకు కారణమవుతాయి. పేగులలో ఏలిక పాముల వలన కలిగే జబ్బు “ఆస్కారియాసిస్,” ఈ జబ్బుకు కారణమయ్యే ‘అస్కారిస్’ అనే పరాన్నజీవికి  రావిచెట్టు సారం ప్రాణాంతకంగా పని చేస్తుంది. రావిచెట్టులోని లేటెక్స్ రబ్బరులోని ఫిసిన్ (ficin) అనే పదార్ధం పరాన్నజీవి క్రిములవిరుధ్ధంగా యాంట్ హెల్మింటిక్ (anthelmintic) చర్య తీసుకుంటుంది.

యాంటీఆక్సిడెంట్గా రావి వృక్షం - Peepal tree as an antioxidant in Telugu

రావిచెట్టు బెరడు మరియు రావి చెట్టు పండ్లు ఓ బలమైన ప్రతిక్షకారిని లక్షణాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. రావి పండ్లు మరియు బెరడు నుండి లభించే సజల సారం స్వేచ్ఛా రాశుల్ని  (ఇవి శరీర అంతర్గత అవయవాలకు నష్టం కలిగిస్తాయి) తటస్థీకరించి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది. రావి ఆకు సారం “నైట్రిక్ ఆక్సైడ్లు” అనబడే మరొక రకం స్వేచ్ఛా రాశు (ఫ్రీ రాడికల్స్)ల ఉత్పత్తిని నిరోధిస్తుంది, అందుచే రావిచెట్టు యాంటీఆక్సిడెంట్ గుణం కల్గి  పని చేస్తుంది.

(మరింత చదువు: యాంటీఆక్సిడెంట్లు)

మంచి రోగనిరోధకతకు రావి వృక్షం - Sacred fig for better immunity in Telugu

రావిచెట్టునే ‘అశ్వత్థ’ వృక్షమంటారు. రావిచెట్టు బెరడు నుండి తీసిన సారంలో రోగనిరోధకతను పెంచే  తత్వాలున్నాయని కనుక్కోబడింది. అధ్యయనాల ప్రకారం, రావిచెట్టు బెరడు పదార్దాల్ని తగిన మోతాదుల్లో సేవిస్తే కణసంబంధమైన మరియు ప్రతిరక్షక స్పందనను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని మన శరీరానికి కలిగిస్తాయి. రావిచెట్టు బెరడులోని సారం యొక్క రోగనిరోధక వ్యవస్థను ఉత్తేజపరిచే ఖచ్చితమైన యంత్రాంగ సామర్థ్యాన్ని ధృవీకరించే పరిశోధనలు మరింత అవసరం.   

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రావి చెట్టు - Peepal tree for cholesterol in Telugu

రావి చెట్టు యొక్క వివిధ భాగాల నుంచి తీసిన సారం సేవించడంవల్ల తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (చెడు కొవ్వుల్ని) ను తగ్గించడానికి వీలవుతుందని అధ్యయనాల ద్వారా ప్రదర్శించబడింది.  మలవిసర్జనలో మలంద్వారా రక్తంలోని కొవ్వు (కొలెస్ట్రాల్) విసర్జింపబడిపోవడంవల్ల “హైపోకొలెస్టెరోమిక్” అనబడే రక్తంలో కొవ్వు తగ్గిన (కొలెస్ట్రాల్-తగ్గిన రుగ్మత) వ్యాధి సంభవిస్తుంది. అయినప్పటికీ, ఈ పరిశోధనలు రావిచెట్టు యొక్క ‘చెడు కొవ్వును తగ్గించే తత్వా’న్ని స్థాపించడానికి మరిన్ని అధ్యయనాలు అవసరం.

(మరింత చదువు: అధిక కొలెస్ట్రాల్ లక్షణాలు)

మూర్ఛకు రావి చెట్టు - Peepal tree for epilepsy in Telugu

కేంద్ర నాడీ వ్యవస్థకు సంబంధించిన అనేక వ్యాధులకు చికిత్స చేసేందుకు రావి చెట్టు (ఫికస్ రెలిజియోసా) నుండి తయారు చేసిన మందును జానపద వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడింది. మూర్ఛ చికిత్సకు జానపద వైద్యాల్లో రావిచెట్టు ఉపయోగం గురించిన నివేదికలు కూడా ఉన్నాయి. రావి చెట్టు యొక్క సారం మూర్ఛను తగ్గించడంలో ప్రభావాన్ని చూపుతుంది, ఇది మూర్ఛను తగ్గిస్తుంది, అందుకే మూర్ఛవ్యాధి చికిత్సకు రావిచెట్టు మందు ఉపయోగించబడుతుంది. కండరాలపై సడలించే ప్రభావాన్ని ఉత్పత్తి చేసే ‘సిప్రోహెఫ్తాడైన్’ (cyproheptadine) అని పిలువబడే ఒక జీవ క్రియాత్మక సమ్మేళనం కారణంగా రావి సారంలో మూర్ఛ-వ్యతిరేక ప్రభావం ఉందని అధ్యయనాలు కనుగొన్నాయి.

(మరింత సమాచారం: మూర్ఛలు)

మతిమరుపు వ్యాధి అల్జీమర్స్ కు రావి చెట్టు - Sacred fig tree for Alzheimer’s in Telugu

భారతదేశంలో, అనేకమంది సంప్రదాయ ఔషధ అభ్యాసకులు (traditional medical practitioners)రావి చెట్టు (ఫిక్కస్ రిషిలియాయో) యొక్క కాండం బెరడు నుండి తయారు చేసిన నిర్దిష్ట మూలికా మందుల్ని జ్ఞాపకశక్తి నష్టం మరియు వివిధ నరసంబంధమైన  న్యూరోడెజెనరేటివ్ ( పతనమైపోయే నాడీ కణాలు) రుగ్మతల చికిత్సకు సిఫార్సు చేస్తారు .

రావి చెట్టు  యొక్క కాండం బెరడు నుండి తీసిన మిథనాలిక్ సారానికి శక్తివంతమైన ఎసిటైల్కోలినెస్టెరాస్ (acetylcholinesterase-అసిటైల్ కోలిన్ యొక్క పతనానికి కారణమయ్యే ఎంజైమ్) నిరోధక తత్వాన్ని కలిగి ఉంటుంది, ఇది అల్జీమర్స్ వంటి వ్యాధుల చికిత్సకు ఉపయోగకరంగా ఉంటుంది .

అల్జీమర్స్ వ్యాధికి కారణం అసిటైల్కోలిన్ వేగవంతంగా పతనమవడమే, అంటే జ్ఞాపకశక్తి కోల్పోవడానికి కారణం. 2014 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో కనుగొన్న ఫలితాల ప్రకారం, రావిచెట్టు సారంలో ఉన్న అనేక జీవక్రియాశీల పదార్థాలకు నాడీ కణజాల పెరుగుదలను ప్రోత్సహించడంతో పాటు అసిటైల్కోలిన్ ఎస్టేరేజ్ యొక్క చర్యను నిరోధించే సామర్థ్యం ఉందని నిరూపించబడింది. రావిచెట్టు యొక్క కాండం బెరడు నుండి తీసిన సారం మెదడుకు సంబంధించిన రుగ్మతల చికిత్సకు కూడా ఒక సంభావ్య మందు.

పార్కిన్సన్స్ వ్యాధికి రావి చెట్టు - Peepal tree for Parkinson’s disease in Telugu

మన నాడీ వ్యవస్థలో అన్ని నాడి కణాలకు సంకేతాలను అందించే “డోపమైన్” అనబడే న్యూరోట్రాన్స్మిటర్ ను కోల్పోవటంవల్ల ‘పార్కిన్సన్స్’ వ్యాధి సంభవిస్తుంది. ఈ వ్యాధి వలన చిత్తవైకల్యం, కండరాల కాఠిన్యత ఇతర రుగ్మతలక్షణాలు కల్గుతాయి. న్యూరోట్రాన్స్మిటర్ అయిన డోపామైన్ యొక్క జీవక్రియను దెబ్బ తీసే కారకాల్లో ఆక్సీకరణ ఒత్తిడి ఒకటి, ఈ ఆక్సీకరణ ఒత్తిడి వల్లనే పార్కిన్సన్స్ వ్యాధి సంభవిస్తోంది.

రావిచెట్టు ప్రభావాలపై జరిపిన పరిశోధనలో లభించిన సాక్ష్యం ప్రకారం రావి చెట్టు ఆకు రసం యొక్క యాంటీ-ఆక్సిడైజింగ్ తత్త్వం పార్కిన్సన్స్ వ్యాధికి వ్యతిరేకంగా పని చేస్తుంది.  పార్కిన్సన్స్ వ్యాధిపై అనామ్లజనకాల యొక్క యాంత్రిక విధానం అంచనా మరియు వ్యాధిపై దాని ప్రభావంపై మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉంది.

క్యాన్సర్ కు బోధి వృక్షం - Bodhi tree for cancer in Telugu

రావిచెట్టుని ‘బోధి వృక్షం’ అని కూడా పిలుస్తారు. రావి చెట్టు యొక్క అన్ని భాగాలూ, అంటే, ఆకులు, బెరడు, వేర్లు, మరియు పండ్లు, క్యాన్సర్ వ్యతిరేక లక్షణాలను కలిగి ఉన్నట్లు గుర్తించబడ్డాయి. 2012 లో జరిపిన ఒక అధ్యయనంలో, రావి చెట్టు నుంచి సేకరించిన పదార్ధాలు కణిత కణాలపై పనిచేసి కణ పెరుగుదలను నిరోధిస్తాయి (యాంటిప్రోలిఫెరేటివ్ గా) అని మరియు కణాల్ని చంపేస్తాయనీ (అపోప్టోసిస్ గా పని చేస్తుంది) నిరూపించబడింది.

రావి చెట్టు  సారం యొక్క గడ్డల పెరుగుదలను నిరోదించే (యాంటీ-ప్రోలిఫెరిటేటివ్ గా పని  చేస్తుంది) ప్రభావానికి కారణాలేవంటే దాని యొక్క జీవరసాయానిక యంత్రంగాన్ని మార్చగల సామర్థ్యం, కణవిస్తార (సెల్ ప్రోలిఫెరేషన్) నిరోధక సామర్థ్యం, కణ చక్రం యొక్క నిరోధం మరియు కణాల్ని చంపేసే సామర్థ్యం. .

రావి చెట్టు యొక్క జీవక్రియాశీల (బయో ఏక్టివ్) భాగాలకు, ప్రత్యేకించి ఆకు సారానికి, కణాల లోపలే ప్రతిచర్య కల్గిన (రియాక్టివ్) ఆక్సిజన్ జాతుల ద్వారా, కణ మరణాన్ని (అపోప్టోసిస్ను) ప్రేరేపించగల సామర్థ్యం ఉంటుంది. ఈ ప్రతిచర్య ఆక్సిజెన్ జాతులు (స్వేచ్ఛా రాశులకు సంబంధించినవివి) పెరుగుతున్న కణాల వేగవంతమైన మరణానికి మధ్యవర్తిత్వం చేస్తాయి, తద్వారా రావి చెట్టు  సారం యొక్క క్యాన్సర్ వ్యతిరేక తత్వానికి దోహదం చేస్తుంది.

(మరింత చదువు: క్యాన్సర్ చికిత్స)

తగిన మోతాదులో ఉపయోగించినప్పుడు రావి సాధారణంగా సురక్షితంగా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, కొందరు వ్యక్తులు రావి ని సేవించినప్పుడు  కొన్ని దుష్ప్రభావాలను అనుభవిస్తారు. రావి సేవనం వల్ల కలిగే దుష్ప్రభావాలు క్రింద వివరించబడ్డాయి.

  • రావి చెట్టు చెట్టు ఆకు సారాన్ని (రసం), ఒక నెల వరకు ఔషధ మోతాదుల్లో సేవించినపుడు సాధారణంగా సురక్షితం. అయినప్పటికీ, అధిక మోతాదులో వినియోగిస్తే, రావిచెట్టు యొక్క రబ్బరు పాలు (latex) కొందరు వ్యక్తులలో జీర్ణవ్యవస్థలో రక్తస్రావాణ్ని కలిగిస్తుంది. రావి చెట్టు సారాన్ని తీసుకోవటానికి ముందు వైద్యుడి సలహాను తీసుకోవడం మంచిది.
  • రావిచెట్టు యొక్క సారాన్ని సేవించడంవల్ల కొంతమందిలో సూర్యుని పట్ల (ఎండకు) సున్నితత్వాన్ని కలిగిస్తుంది. అందువల్ల చర్మానికి రావిచెట్టు సారాన్ని పూసుకున్న వెంటనే ఎండలో బయటకు రావడం మంచిది కాదు.
  • రావిచెట్టు పండ్లు చర్మానికి అంటడంవల్ల కొంతమంది వ్యక్తులలో చర్మంపై దద్దుర్లు లేదా అలెర్జీలు కూడా సంభవించేందుకు కారణం కావచ్చు. అదనంగా, సహజమైన రబ్బరు పాలకు సున్నితంగా ఉండే వ్యక్తులు అత్తి చెట్లకు లేదా అత్తి పండ్లకు అలెర్జీ ప్రతిచర్యలు కలిగి ఉండవచ్చు.
  • గర్భిణీలు మరియు చంటి పిల్లలకు పాలిచ్చే తల్లులు రావిచెట్టు సారాంశాల సేవనంవల్ల కలిగే ప్రభావం గురించి తెలిపే అధ్యయనాలు ఏవీ లేవు. కనుక, అటువంటి మహిళలలు రావిచెట్టు సారాంశాలు కల్గిన మందుల్ని ఉపయోగించేందుకు ముందుగా వైద్యుడిని సంప్రదించడం మంచిది.
  • రావి చెట్టు చక్కెరవ్యాధి (డయాబెటిక్)కి వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. రావిచెట్టు పదార్ధాల నుండి తయారైన మందుల్ని సేవించేవారు తమ రక్తంలో చక్కెర స్థాయిలను సమయానుసారంగా పర్యవేక్షించవలసి ఉంటుంది. శస్త్రచికిత్సా సమయంలో లేదా తర్వాత ఇటువంటి రావిచెట్టు సారాలతో కూడిన మందుల వాడకం రక్తంలో చక్కెర స్థాయిలను దెబ్బ తీస్తుంది. అందువల్ల, శస్త్రచికిత్సకు ముందు కనీసం రెండు వారాల పాటు రావిచెట్టు సారాంశాల్ని ఉపయోగించకుండా ఉండాలని మీకు సలహా ఇవ్వడమైంది.

Medicines / Products that contain Peepal

వనరులు

  1. Jazir Haneef et al. Bax Translocation Mediated Mitochondrial Apoptosis and Caspase Dependent Photosensitizing Effect of Ficus religiosa on Cancer Cells. PLoS One. 2012; 7(7): e40055. PMID: 22792212
  2. S. B. Chandrasekar, M. Bhanumathy, A. T. Pawa, T. Somasundaram. Phytopharmacology of Ficus religiosa. Pharmacogn Rev. 2010 Jul-Dec; 4(8): 195–199. PMID: 22228961
  3. Singh D, Goel RK. Anticonvulsant effect of Ficus religiosa: role of serotonergic pathways. J Ethnopharmacol. 2009 Jun 22;123(2):330-4. PMID: 19429380
  4. Priyanka Siwach, Anita Rani Gill. Micropropagation of Ficus religiosa L. via leaf explants and comparative evaluation of acetylcholinesterase inhibitory activity in the micropropagated and conventionally grown plants . 3 Biotech. 2014 Oct; 4(5): 477–491. PMID: 28324379
  5. Oyinlola O Olaokun et al. Evaluation of the inhibition of carbohydrate hydrolysing enzymes, antioxidant activity and polyphenolic content of extracts of ten African Ficus species (Moraceae) used traditionally to treat diabetes . BMC Complement Altern Med. 2013; 13: 94. PMID: 23641947
  6. Jitendra O. Bhangale, Sanjeev R. Acharya. Anti-Parkinson Activity of Petroleum Ether Extract of Ficus religiosa (L.) Leaves . Adv Pharmacol Sci. 2016; 2016: 9436106. PMID: 26884755
  7. Amit S. Choudhari, Snehal A. Suryavanshi, Ruchika Kaul-Ghanekar. The Aqueous Extract of Ficus religiosa Induces Cell Cycle Arrest in Human Cervical Cancer Cell Lines SiHa (HPV-16 Positive) and Apoptosis in HeLa (HPV-18 Positive) . PLoS One. 2013; 8(7): e70127. PMID: 23922932
  8. Marslin Gregory et al. Anti-ulcer activity of Ficus religiosa leaf ethanolic extract. Asian Pac J Trop Biomed. 2013 Jul; 3(7): 554–556. PMID: 23836366
  9. Vishal Gulecha et al. Screening of Ficus religiosa leaves fractions for analgesic and anti-inflammatory activities . Indian J Pharmacol. 2011 Nov-Dec; 43(6): 662–666. PMID: 22144770
Read on app