రాగుల్ని మనం రాగి పంట పండించడం ద్వారా పొందుతాం. ఆంగ్లంలో  రాగిని “ఫింగర్ మిల్లెట్స్” అని పిలుస్తారు. రాగి పైరును ‘ఎలుస్సైన్ కరాకన’ (Eleusine Coracana) అని కూడా పిలుస్తారు. రాగి తృణధాన్యం పంట. భారతదేశంలో మరియు ఆఫ్రికాలో తినే అత్యంత సాధారణ మరియు పురాతనమైన తృణధాన్యాల్లో రాగులు కూడా ఒకటి. రాగి పిండి (రాగుల పిండి-finger millet powder) ఈ తృణధాన్యం యొక్క ఒక ముఖ్యమైన ఆహార స్వరూపం. ఆహారంపట్ల శ్రద్ధ వహించే నేటితరంలో రాగిపిండి చాలా ప్రసిద్ధిని పొందింది. రాగులతో గంజి, రాగి రొట్టె మరియు ఇతర వేపుడు పదార్ధాలను చేయడానికి ఉపయోగించబడుతుంది. ‘మిల్క్ షేక్స్’ మరియు ఐస్ క్రీమ్ లకు వాటిని మరింత పోషకమైనవి మరియు ఆరోగ్యకరమైన తినుబండారాలుగా చేయడానికి రాగిపిండిని కలుపుతారు. వాస్తవానికి, భారతదేశంలోని కొన్ని భాగాలలోని ప్రజలకు రాగులు ఓ ప్రధానమైన ఆహారం(staple food). రాగి సంకటి (ఆంధ్రప్రదేశ్), రాగి ముద్ద (కర్ణాటక) రాగి రొట్టె ఆహారాలు దక్షిణభారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ప్రధాన (staple) ఆహారం.

రాగులు తినడంవల్ల మనం పొందుతున్న ఆరోగ్య ప్రయోజనాలకుగాను ఆ కీర్తి (క్రెడిట్)  రాగుల్లోని ఆహార పీచుపదార్థాలు (dietary fibre) మరియు పోలీఫెనాల్ (polyphenol) పదార్థాలకు దక్కుతుంది. కానీ రాగుల్లో మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి సహాయపడే అనేక ఇతర ఆహారపోషకాదుల్ని కలిగి ఉంది. రాగుల్లో ఇతర తృణధాన్యాలలో కంటే ఎక్కువ అధిక ఖనిజ పదార్థాలున్నాయి. శాకాహారులకు అవసరమైన ప్రోటీన్ యొక్క ఖచ్చితమైన మూలం రాగులే. రాగిలో అత్యధిక పొటాషియం మరియు కాల్షియం ఉన్నాయి; రాగుల్లో ఇనుము అధికంగా ఉండడం మూలంగా రక్తంలో హిమోగ్లోబిన్ యొక్క తక్కువ స్థాయి కలిగిన వ్యక్తులకు రాగి ఒక ముఖ్యమైన తరుణోపాయమవుతుంది. అదనంగా, రాగులు గ్లూటెన్ (బంక పదార్ధం) రహితంగా ఉంటాయి మరియు తక్కువ కొవ్వు పదార్థాల్ని మాత్రమే కల్గి ఉంటాయి. కాబట్టి, సులభంగా జీర్ణమవుతుంది మరియు గ్లూటెన్-అసహనాన్ని కలిగినవారికి రాగులతో చేసిన ఆహారం సురక్షితంగా ఉంటుంది. రాగుల గంజి (లేక రాగి సరి)ని పసి పిల్లలకు వారి మొట్టమొదటి ఆహారంగా తినిపించబడుతుంది, ఎందుకంటే, రాగిలో ఉన్న పోషకాల నాణ్యతే అందుక్కారణం.

రాగుల్ని తినడానికి ఉపయోగించేందుకు ముందుగా బాగా కడిగి శుభ్రం చేయడం ఉత్తమం. రాగి పిండి కొట్టడానికి ముందుగా రాగుల్ని సాధారణంగా ఎండలో సుమారు 5 నుండి 8 గంటలు వరకూ ఎండబెట్టడం జరుగుతుంది.

రాగులు గురించిన ప్రాథమిక వాస్తవాలు: 

 • వృక్షశాస్త్రనామం: ఎలుసైనే కొరానా
 • కుటుంబం: గడ్డి (గ్రాస్) కుటుంబం
 • సాధారణ పేరు: రాగి, హిందీలో రాగిని ‘మందువా’ అంటారు
 • సంస్కృత నామం: నందిముఖి, మధులీ
 • స్థానిక ప్రాంతం: భారతదేశంలో, రాగిని ఆంధ్రప్రదేశ్, బీహార్ మరియు ఉత్తరప్రదేశ్ వంటి పలు రాష్ట్రాల్లో పండిస్తారు. కర్ణాటక మరియు తమిళనాడు రాగుల్ని ప్రాధమికంగా పండిస్తున్న రెండు రాష్ట్రాలు. భారతదేశంతో పాటు ఆఫ్రికా, శ్రీలంక, చైనా, మడగాస్కర్, మలేషియా మరియు జపాన్ వంటి ఉపఉష్ణమండల మరియు ఉష్ణమండల ప్రాంతాల్లో , రాగుల్ని విస్తృతంగా సాగు చేస్తారు.
 • రాగుల గురించిన ఆసక్తికరమైన విషయాలు:
  రాగుల పంట ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో మరియు దక్షిణ భారతదేశంలోని పొడి ప్రాంతాలలో పండించే ముఖ్యమైన తృణధాన్యం.
  తక్కువ వర్షపాతం మరియు తీవ్రమైన కరువు ప్రాంతాల్లో రాగుల పంటను పండించొచ్చు.
  ఒండ్రు మట్టి నేలలు, నల్లరేగడి నేలలు లేదా ఎరుపురంగు నేలల్లో రాగిపంట బాగా పండుతుంది. 50 నుంచి 100 సెం.మీ. వర్షపాతం ప్రాంతాల్లో రాగులు పండుతాయి. రాగులు పండటానికి ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ వరకు అవసరం ఉంటుంది.
 1. రాగుల యొక్క పోషక వాస్తవాలు - Ragi nutrition facts in Telugu
 2. రాగుల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of Ragi in Telugu
 3. రాగుల దుష్ప్రభావాలు - Ragi side effects in Telugu
 4. ఉపసంహారం - Takeaway in Telugu

కాల్షియం మరియు పొటాషియం వంటి ఖనిజాలు ఎక్కువగా ఉన్న బంక-రహిత (గ్లూటెన్-ఫ్రీ ఫుడ్) ఆహారం రాగులు. ఇది వివిధ అనామ్లజనకాలు మరియు అమైనో ఆమ్లాలతోపాటు డైయిటరి ఫైబర్స్  కూడా సమృద్ధిగా కల్గి ఉంటుంది. రాగుల్లో లెసిన్, ఫెనిలాలనిన్, సోలేసిన్ మరియు మెథియోనిన్ వంటి ముఖ్యమైన అమైనో ఆమ్లాలు ఉంటాయి, ఇవి సాధారణంగా అనేక పిండి పదార్ధాలలో ఉండవు. రాగిలో ఒక పెద్ద భాగంగా కార్బోహైడ్రేట్లని కలిగి ఉంటుంది మరియు ఇది తక్కువ మొత్తంలో కొవ్వుల్ని కలిగి ఉంటుంది. తృణధాన్యం అవటంవల్ల రాగుల్లో కొవ్వులుండవు.

యు.యస్.డి.ఏ (USDA) న్యూట్రియెంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రా. రాగులు క్రింది విలువలను కలిగి ఉంటాయి:

రాగుల పోషకాలు

100 గ్రాలకు విలువ

నీరు

8.67 గ్రా

శక్తి

378 కిలో కే

ప్రోటీన్

7.3 గ్రా

ఫాట్స్

1.3 గ్రా

కార్బోహైడ్రేట్

72.6 గ్రా

ఫైబర్

19.1 గ్రా

 

మినరల్స్

100 g లకు విలువ

కాల్షియం

344 mg

ఐరన్

3.9 mg

మెగ్నీషియం

137 mg

ఫాస్ఫరస్

283 mg

పొటాషియం

408 mg

సోడియం

11 mg

జింక్

2.3 mg

 

విటమిన్లు

100 g లకు విలువ

విటమిన్ B1

0.421 mg

విటమిన్ B2

0.19 mg

విటమిన్ B3

1.1 mg

(మరింత చదువు: విటమిన్ బి కాంప్లెక్స్ ఆరోగ్య ప్రయోజనాలు )

 • అన్ని మొక్క పదార్దాల నుండి వచ్చే క్యాల్షియం కంటే రాగుల నుండి ఎక్కువ కాల్షియం వస్తుంది. ఇది ఎదిగే  పిల్లలలికే కాక పెద్దలకు కూడా చాలా అవసరం. రాగులలో విటమిన్ డి కూడా ఉంటుంది ఈ రెండు ఎముకల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. 
 •  రాగులలో అధిక శాతంలో డైయిటరీ  ఫైబర్ ఉంటుంది, ఇది జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది మరియు ఎక్కువ సమయం పాటు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి రాగులు మంచి ఆహారం. అంతేకాక రాగులలో ట్రీప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ ఉంటుంది ఇది ఆకలిని తగ్గిస్తుంది.  
 •  రాగులు సీరం ట్రైగ్లీసరైడ్స్ చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్.డి.ఎల్ కొలెస్ట్రాల్ సాంద్రతను తగ్గిస్తాయి. పులియబెట్టిన/నానబెట్టిన రాగులలో స్టాటిన్ మరియు డైయిటరీ స్టెరాల్ వంటి ముఖ్యమైన మెటాబోలైట్స్ ఇవి చెడు కొలెస్ట్రాల్ను నిరోధించే ఎంజైమ్లుగా పనిచేస్తాయి.
 • రాగులు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు మధుమేహ రోగులకు ఎంతో ఉపయోగకరంగా  ఉంటాయి, ఇవి జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది తద్వారా రక్తంలోకి గ్లూకోజ్ నెమ్మదిగా విడుదల అవుతుంది . అంతేకాక వీటిలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీరం నుండి ఫ్రీ రాడికల్స్ను తొలగించి మధుమేహంతో  ముడిపడి ఉండే లక్షణాలను తగ్గిస్తాయి. 
 •  వాటిలో అధిక పోలీఫెనోలిక్ శాతం ఉండడం వలన రాగులు సమర్ధవంతమైన యాంటీ మైక్రోబియల్ లక్షణాలను చుపించాయని కొన్ని అధ్యయనాలు తెలిపాయి. 
 • రాగులు ఐరన్ కు ఒక సహజమైన వనరులు, కాబట్టి రంగులను క్రమముగా తీసుకోవడం వలన ఐరన్ లోపం తగ్గుతుంది అలాగే రక్తహీనత లక్షణాలు కూడా నయం అవుతాయి .   
 • రాగుల పై పొరలలో ఫెనోలిక్ యాసిడ్, టెనిన్లు, ఫ్లావనోయిడ్లు ఉంటాయి ఇవి శక్తివంతంమైన యాంటీఆక్సిడెంట్ చర్యలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ ను  నిరోధించడంలో సహాయపడతాయి. అంతేకాక రాగులలో నైట్రిలోసైడ్  ఉంటుందని నివేదించబడింది దీనికి మాములు శరీర కణాలకు హాని కలిగించకుండా  క్యాన్సర్ కణాలను మాత్రమే చంపగల సామర్థ్యం ఉంటుంది.          

ఎముకల కోసం రాగులు - Ragi for bones in Telugu

ఆరోగ్యకరమైన ఎముకలు పెరిగే పిల్లలకే కాకుండా పెద్దలకు కూడా చాలా అవసరం. మొక్కల ఆహారాలలో, రాగుల్ని (finger millets) 100 గ్రాముల ధాన్యానికి 300-350 mg కాల్షియం కలిగిన సంపన్న వనరుగా చెప్పవచ్చు. అదనంగా, రాగులు కూడా విటమిన్ డి యొక్క సహజ వనరుగా ఉంది,  ఇది ఎముక ఆరోగ్యాన్ని కాపాడటానికి చాలా ముఖ్యమైనది. లింగం మరియు వయస్సు వంటి అంశాలతో సంబంధం లేకుండా మనిషికి కావాల్సిన కాల్షియం యొక్క రోజువారీ సిఫార్సు ప్రమాణాన్ని రాగులసేవనం కల్పిస్తుందని, భారతీయ గ్రామాలలో జరిపిన ఏకమాత్ర అధ్యయనం సూచించింది. రాగుల సేవనం బోలు ఎముకల వ్యాధిని ఎదుర్కోవడంలో చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆ అధ్యయన నిర్వాహకులు సూచించారు.

బరువు కోల్పోయేందుకు రాగి - Ragi for weight loss in Telugu

అన్ని తృణధాన్యాలు ఆహార పిండిపదార్థాల (కార్బోహైడ్రేట్ల) యొక్క గొప్ప మూలం, కానీ ఇతర తృణధాన్యాలతో పోలిస్తే రాగుల్లో ఆహార పీచుపదార్థాలు (ఫైబర్) అధికంగా ఉంటాయి. పీచుపదార్థాలు పుష్కలంగా ఉండే ఆహారాలు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి మరియు ఆహారానికి గాత్రాన్ని అధిక మొత్తంలో అందిస్తాయి, తద్వారా, మనం ఎక్కువసేపు కడుపునిండిన అనుభూతిని కల్గి ఉంటాము. ఆ విధంగా, కొన్ని అదనపు కిలోల బరువును కోల్పోవాలని ప్రయత్నిస్తున్నవాళ్ళకు రాగులు చాలా ఉపయోగకరం. కాల్షియమ్ను ఎక్కువగా ఆహారంగా తీసుకోవడం వలన, బరువు తగ్గడానికి మరియు ఊబకాయాన్ని  అధిగమించటానికి ఎక్కువ అవకాశం ఉందని, పరిశీలనాత్మక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ అధ్యయనాల ప్రకారం, అధిక కాల్షియం సేవించడంవల్ల శరీరంలో కొవ్వు కణాల సంఖ్యను తగ్గించడం వీలవుతుంది, తద్వారా మనం బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

అలాగే, రాగులు ట్రిప్టోఫాన్ అనబడే ఒక అమినో ఆంలాన్ని కల్గి ఉంటుంది. (ఆహార మరియు వ్యవసాయ సంస్థ (FAO) ప్రకారం, ట్రిప్టోఫాన్ 191 mg / g ప్రోటీన్ నుకల్గిఉంటుంది.) ఈ సమ్మేళనం ఆకలిని తగ్గిస్తుంది మరియు ఆహారసేవనాన్ని నియంత్రించడానికి మనకు సహాయపడుతుంది.

(మరింత చదువు: బరువుతగ్గుదల ఆహారవిధాన పట్టిక)

కొలెస్ట్రాల్ తగ్గించేందుకు రాగి - Ragi for cholesterol in Telugu

శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో రాగులు సహాయం చేయవచ్చని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. రాగులతో చేసిన ఆహారాల రసేవనం సీరం ట్రైగ్లిజెరైడ్స్ లేదా చెడ్డ కొలెస్ట్రాల్ (లేదా LDL) యొక్క గాఢతను తగ్గిస్తుంది. అలాగే, పులియబెట్టిన రాగుల్లో స్టాటిన్ మరియు ఆహార స్టెరాల్ వంటి ముఖ్యమైన మెటాబోలైట్స్ ఉన్నాయి, ఇది కొలెస్టరాల్ దారి (passage way) యొక్క ఎంజైమ్ నిరోధకంగా పని చేస్తుంది మరియు హెచ్.డి. ఎల్ (HDL) కొలెస్ట్రాల్ స్థాయిలను ప్రభావితం చేయకుండా సీరం చెడు కొవ్వుల్ని (LDL) తగ్గించడంలో సహాయపడుతుంది.

జంతువులపై జరిపిన ఒక ఇన్ వివో అధ్యయనం ప్రకారం, వివిధ తృణధాన్యాల (multigrain) ఆహారం తినడంవల్ల ధమనులలో కొవ్వు ఆక్సీకరణాన్ని నిరోధించవచ్చు, తద్వారా, ఎథెరోస్క్లెరోసిస్ మరియు అధిక రక్తపోటు వంటి రుగ్మతల ప్రమాదం తగ్గుతుంది.

(మరింత చదువు: అధిక కొవ్వులకు చికిత్స )

చక్కెరవ్యాధికి రాగులు - Ragi for diabetes in Telugu

చక్కెరవ్యాధి జీవక్రియ-సంబంధమైన మరియు అంతస్స్రావ-సంబంధమైన రుగ్మత. రక్తంలోనుండి అధిక గ్లూకోజ్ను గ్రహించడంలో శరీరం యొక్క అసమర్థతే చక్కెరవ్యాధి లక్షణం. ఆహారసేవనాలు మరియు జీవనశైలి కారకాల కారణంగా, గత సంవత్సరాలలో చక్కెరవ్యాధి బారిన పడినవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. చక్కెరవ్యాధికిస్తున్న చికిత్స యొక్క ప్రస్తుత శ్రేణిలో ఆహార మార్పులు మరియు చక్కెరవ్యాధి నయమవడానికిచ్చే ఔషధాలు ఉన్నాయి.

అయితే, చక్కెరవ్యాధి గురించిన సాధారణ అవగాహన పెరుగుదల కారణంగా, సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు (పిండిపదార్థాలు), అధిక పీచుపదార్థాలు (ఫైబర్), మరియు ప్రయోజనకరమైన చెట్టుచేమల రసాయనాలు (ఫైటోకెమికల్స్) కలిగి ఉన్న ఆహారాల కోసం గిరాకీ పెరుగుతోంది. రాగులు వంటి పీచుపదార్థాలు పుష్కలంగా ఉన్న (ఫైబర్-రిచ్) ఆహారాలు చక్కెరవ్యాధి రోగులకు ఒక వరం, ఎందుకంటే ఇది జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది, మరి, అందువల్ల, గ్లూకోజ్ నెమ్మదిగా రక్తంలోకి విడుదల అవుతుంది.

శరీరంలో అదనపు స్వేచ్ఛా రాశుల ఉనికి కారణంగా చక్కెరవ్యాధి (మధుమేహం) అంకురించి, అటుపై వ్యాధి మరింతగా అభివృద్ధిచెందుతుంది. రాగులఆహారసేవనం  రక్తం-గ్లూకోజ్ స్థాయిల్ని మరియు ఆక్సీకరణ ఒత్తిడిని నియంత్రిస్తాయని వివో అధ్యయనాలలోని చక్కెరవ్యాధి ప్రయోగాత్మక నమూనాలు సూచించాయి. అంతేకాకుండా, రాగులలోని మిథనాలిక్ సారం యొక్క రభసతో కూడిన వ్యర్థ పదార్థాలను తొలగించే గుణం  చక్కెరవ్యాధిని తగ్గించగలదని నిరూపించబడింది.

సూక్ష్మజీవినాశినిగా రాగులు - Ragi as an anti-microbial in Telugu

అధ్యయనాలు ప్రకారం, రాగి గింజలపైన ఉండే పొట్టు (seed coat) సంగ్రహాల్లో ఉండే  అధిక పాలిఫినోల్ పదార్ధం కారణంగా రాగులసేవనం వల్ల మన శరీరంలో సూక్ష్మజీవి నాశక శక్తి (యాంటీమైక్రోబయాల్) పెరుగుతుంది. రాగులమీది పొట్టులో పుష్కలంగా ఉండే ఫినోలిక్ సమ్మేళనాలు శిలీంధ్ర ప్రవేశాన్ని కూడా నిరోధించవచ్చు.

అధ్యయనం ప్రకారం, బాసిల్లస్ సెరెయస్ మరియు ఆస్పెరిగిల్లస్ ఫ్లేవస్ వంటి బూజు రకం సూక్ష్మజీవులకు వ్యతిరేకంగా రాగులు శక్తివంతమైన సూక్ష్మజీవినాశక (యాంటిమైక్రోబయల్) చర్యను కలిగి ఉన్నాయి.

(మరింత చదువు: ఫంగల్ ఇన్ఫెక్షన్ లక్షణాలు)

పుండ్లు-గాయాలు మానడంకోసం రాగి - Ragi for healing wounds in Telugu

గాయపడిన కణాలలో కణజాల మరమ్మత్తు ప్రక్రియ సాధారణంగా వాపు సంబంధంతో మొదలవుతుంది. రియాక్టివ్ ఆక్సిజన్ జాతుల (reactive oxygen species-ROS) లేదా ఫ్రీ రాడికల్స్ స్థాయిల పెరుగుదల వృద్ధులలో మరియు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వ్యక్తులలో గాయం తగ్గించే ప్రక్రియను తగ్గిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. వివో అధ్యయనాల ప్రకారం, రాగుల్లో యాంటీ-ఆక్సిడెంట్ ప్రభావాలు ఉంటాయి. దీని అర్థం రాగులు శరీరంలోని స్వేచ్ఛా రాశుల్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది మరియు పుండ్లు-గాయాల్ని మానిపే ప్రక్రియను సమర్ధవంతంగా సులభతరం చేస్తుంది.

అయినప్పటికీ ఇప్పటి వరకూ దీని  గురించి మానవులపై ఎలాంటి అధ్యయనం జరుపబడలేదు.

(మరింత చదువు: బహిరంగ పుండ్లకు చికిత్స)

వృద్ధాప్య వ్యతిరేక లక్షణాలకు రాగి - Ragi for anti ageing in Telugu

రాగుల్లో పాలిఫినోల్స్ వంటి అనామ్లజనక (యాంటీఆక్సిడెంట్) సమ్మేళనాలు ఉంటాయని చెప్పబడింది. కాబట్టి రాగులు మన శరీరంలో ఉండే స్వేచ్ఛా రాడికల్స్ను శుభ్రపరచడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను తగ్గించడంలో చాలా సమర్థవంతమైనవి.

మనకు వయస్సు పెరిగే కొద్దీ, మన శరీరంలోని కొల్లాజెన్ అణువులు  అనుసంధానానికి గురికావడం ప్రారంభమవుతుంది. మన శరీర కణాలకు స్థితిస్థాపకతను కల్గించే కొల్లాజెన్ ఒక సహజమైన ప్రోటీన్. ఈ కొల్లాజెన్ అణువుల అనుసంధానం (క్రాస్-లింకింగ్)వల్ల చర్మం దాని స్థితిస్థాపకతను కోల్పోయేలా చేస్తుంది, తద్వారా  చర్మంపై ముడుతల వంటి హాని మరియు వయస్సు-సంబంధిత రుగ్మతలకు సులభంగా గురయ్యే అవకాశం ఉంటుంది. మన శరీరంలో జరిగే వృద్ధాప్య ప్రక్రియ రక్త నాళాలు గట్టి పడి పోవడం మరియు చక్కెరవ్యాధి (డయాబెటిస్) వంటి కొన్ని వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.

అధ్యయనాల ప్రకారం, రాగులు మరియు అరికలు (కోడో మిల్లెట్) రెండూ కలిపి తినడంవల్ల శరీరంలో కణాల అనుసంధానాన్ని తగ్గించి తద్వారా చర్మపు వృద్ధాప్యాన్ని అడ్డుకోవడం జరుగుతుంది.   

(మరింత చదువు:  అనామ్లజనకాలు పుష్కలంగా ఉండే ఆహారాలు)

క్యాన్సర్ కోసం రాగి - Ragi for cancer in Telugu

యాంటీఆక్సిడెంట్స్ మరియు వృక్ష-సంబంధ రసాయనాలు (ఫైటోకెమికల్స్) క్యాన్సర్ నిరోధక (అంటిక్సార్సినోజెనిక్) లక్షణాలను ప్రదర్శిస్తాయి, అని పరిశోధన చెబుతోంది. పేర్కొన్న ఈ సమ్మేళనాలు అధిక కణాల (సెల్యులార్) ఆక్సీకరణను అణిచి, క్యాన్సర్కు వ్యతిరేకంగా పోరాడి మన శరీరాన్ని కాపాడుతాయి. రాగి అనామ్లజనకాల్ని  అధికంగా కల్గి ఉంటుంది. రాగి గింజపైన ఉండే పొట్టు (seed cover) టానిన్లు, మరియు ఫ్లేవానాయిడ్లను కలిగి ఉంటుంది, ఇవన్నీ సమర్థవంతమైన ప్రతిక్షకారిణి లక్షణాలను కలిగి ఉంటాయి. రాగిలో ఉన్న ఫినాలిక్ ఆమ్లాల ప్రధాన భాగం ఫెరులిక్ యాసిడ్ నాలుక క్యాన్సర్, పెద్దప్రేగు కాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ కణాలను అణిచివేసే ప్రభావాన్ని కలిగి ఉంటుంది .

అదనంగా, రాగిలో ఉన్న నైట్రిలోసైడ్ (విటమిన్ B17) సాధారణ శరీర కణాలకు నష్టం కలిగించకుండా క్యాన్సర్ కణాలను చంపగలదని నివేదించబడింది. అయినప్పటికీ, రాగుల యొక్క యాంటీ-క్యాన్సర్ ప్రభావాలను అర్థం చేసుకోవటానికి మరిన్ని అధ్యయనాల అవసరం ఉంది.

రక్తహీనతకు రాగులు - Ragi for anemia in Telugu

రాగులు ఇనుముకు సహజ వనరు. రాగుల్ని ప్రతినిత్యం తినడంవల్ల ఇనుము లోపం లేదా రక్తహీనతతో బాధపడుతున్నవాళ్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది .

రాగుల్ని నిత్యం తింటే రక్తంలో హేమోగ్లోబిన్ స్థాయిలను పెంచవచ్చని 60 యువతులపై చేసిన ఓ వైద్య  అధ్యయనం సూచిస్తుంది.

రాగుల యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of Ragi in Telugu

 • ప్రపంచ జనాభాలో సుమారు 65% మంది పాలచక్కెర (లాక్టోస్)-అసహనంతో ఉన్నారు, అంటే వారు తమ కాల్షియం అవసరాల కోసం పాల ఉత్పత్తుల మీద ఆధారపడటం లేదు. ఇక రాగులు కాల్షియం యొక్క అత్యంత సంపన్న వనరుగా ఉన్నందున రోజువారీ కాల్షియం అవసరాల కోసం ఇటువంటివారు రాగి ఆహారాన్ని ఓ మంచి ప్రత్యామ్నాయంగా ఎంచుకోవచ్చు.
 • రాగిలో బంక లేక జిగట (గ్లూటెన్) ఉండదు. అందువలన, ఉదరకుహర రోగులు (celiac patients) రాగిని తినడం మంచిది. రాగుల్ని పిండిగా మర పట్టించి వాడుకోవచ్చు. రాగి పిండి సులభంగా జీర్ణమయ్యే పదార్ధం మరియు దీన్ని ఎక్కువగా వండనవసరం లేదు, కొద్దిసేపులోనే తినడానికి సిద్ధమయ్యేలా ఉడికిపోగలదు.
 • పాలిచ్చే తల్లి తన శరీరంలో కన్న బిడ్డకు తగినంతగా పాలను  ఉత్పత్తి చేయడానికి ఆమె సేవించే ఆహారం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఆమె సేవించే ఆహారంలో కాల్షియం, పొటాషియం, భాస్వరం, ప్రోటీన్, ఇనుము, మరియు విటమిన్ సి వంటి పోషకాలను కలిగి ఉండాలి. రాగులు ఈ పోషకాలకు మంచి నిలయం. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది, తద్వారా పాలిచ్చే చిన్నపిల్లల తల్లికి రాగి చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
  (మరింత చదువు: ఉదరకుహర వ్యాధి (సిలియక్ వ్యాధి)
 • రాగులు మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవచ్చు
  రాగులతో కూడిన ఆహారాన్ని సాధారణ స్థాయిల కంటే ఎక్కువగా తీసుకోవడం వలన అది మూత్రపిండాల్లో రాళ్ళు ఏర్పడడానికి కారణమవచ్చని చెప్పబడుతోంది. రాగుల్ని సాధారణ స్థాయిల కంటే ఎక్కువ తినడాన్ని నిరోధించాలని, ముఖ్యంగా మూత్రపిండాల్లోరాళ్ళ వ్యాధితో బాధపడుతున్న రోగులకు సూచించడమైంది. రాగుల్లో క్యాల్షియం ఎక్కువగా ఉన్నందున రాగుల్ని ఎక్కువగా తినడంవల్ల శరీరంలో ఉండే ఆగ్జాలిక్ ఆమ్లం స్థాయిని పెంచవచ్చని చెప్పడమైంది.
 • రాగులు థైరాయిడ్ కు కారణమవచ్చు
  రాగుల్లో ఉండే ‘గోట్రోజెన్’ థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అంతరాయం కలిగించగలదు, ఇది థైరాయిడ్ గ్రంధి అయోడిన్ ను గ్రహించడాన్నినిరోధిస్తుంది. అందువలన, థైరాయిడ్తో బాధపడుతున్న రోగులు రాగిని తీసుకోవడానికి ముందు వారి వైద్యుడిని సంప్రదించాలి.
 • రాగులు కారణం కావచ్చు గాయిటర్ వ్యాధి
  శరీరంలో అయోడిన్ లోపం ఒక విస్తారిత థైరాయిడ్ గ్రంథి ఏర్పడడానికి దారి తీయవచ్చు, దీన్నే కంఠగ్రంథి యుబ్బే వ్యాధి లేక గాయిటర్ వ్యాధి అంటారు. అభివృద్ధికి దారితీయవచ్చు. గాయిటర్ వ్యాధి పొడి చర్మం, ఆందోళన, నెమ్మదిగా ఆలోచించడం మరియు నిరాశ వంటి లక్షణాలను కల్గి ఉంటుంది. కాబట్టి, మీరు గోయిటర్తో బాధపడుతుంటే, రాగితో తయారైన ఆహారాన్ని నివారించడం ఉత్తమం.

గొప్ప పోషక విలువల్ని కలిగి ఉన్న రాగులు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. పొటాషియం మరియు కాల్షియం వంటి అద్భుతమైన పోషకాలు రాగుల్లో ఉన్నాయి. అనామ్లజనకాలు మరియు అమైనో ఆమ్లాలను ఇది ఎక్కువగా కల్గిఉంటుంది. ఇది చక్కెరవ్యాధి వంటి రుగ్మతలు మరియు క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులపై పోరాడడానికి కూడా ఉపయోగించవచ్చు. రాగుల్లో మలబద్ధకం, హైపర్ కొలెస్టెరోలెమోమియా వంటి అనేక ఆరోగ్య రుగ్మతల విరుద్ధంగా పోరాడేందుకు సహాయపడే ఆహార పీచుపదార్థాలు (ఫైబర్) మరియు పాలిఫేనోల్స్ ఉన్నాయి. రాగుల్ని ఆహారంగా మరియు చిరుతిండిగాను ఉపయోగించవచ్చు, ఎందుకంటే రాగుల్లో ఆరోగ్యనిర్మాణ గుణాలు మరియు రోగచికిత్సకు ఉపయోగపడే గుణాలు ఉన్నాయి కాబట్టి.

కొవ్వులు ఏమాత్రం లేని (జీరో కొలెస్ట్రాల్) రాగులు బరువు తగ్గించుకోవాలనుకునేవారు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఆహారం మరియు రాగి ఆహారం గ్లూటెన్ రహితంగా ఉంటుంది. రాగులు చాలా ప్రయోజనాలను కలిగి ఉన్న ఒక సహజమైన వ్యవసాయ ఉత్పత్తి. ఏదేమైనా, లాభాలెన్నో ఉన్నంత మాత్రాన రాగుల్నిచాలా తరచుగా తినొచ్చునని అర్థం కాదు. ఏదైనా సరే అతిగా తింటే దుష్ప్రభావాలకు దారి తీయవచ్చు మరియు రాగులు కూడా అందుకు భిన్నం కాదు. ప్రతి ఆహారాన్ని వివిధ వ్యక్తులు తిన్నపుడు అది వేరు వేరు ప్రభావాల్ని కలిగించవచ్చు. ఏ పదార్థాన్నైనా మితమైన స్థాయిల కంటే ఎక్కువగా తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించడం మంచిది.

చిన్న చిన్న విషయాల్లో మార్గదర్శనం (గైడెన్స్) ఖచ్చితంగా సంతోషకరమైన మరియు  ఆరోగ్యకరమైన జీవనవిధానాన్ని నిర్వహించుకోవడానికి సహాయపడుతుంది, దానివల్ల జీవితం ఆనందకరం మరియు ఆరోగ్యదాయకం కాగలదు!


Medicines / Products that contain Finger millet

వనరులు

 1. Swati Puranik et al. Harnessing Finger Millet to Combat Calcium Deficiency in Humans: Challenges and Prospects . Front Plant Sci. 2017; 8: 1311. PMID: 28798761
 2. Vasant RA et al. Physiological Role of a Multigrain Diet in Metabolic Regulations of Lipid and Antioxidant Profiles in Hypercholesteremic Rats: Multigrain diet in hyperlipemia. J Pharmacopuncture. 2014 Jun;17(2):34-40. PMID: 25780697
 3. Anoma Chandrasekara, Fereidoon Shahidi. Antioxidant Phenolics of Millet Control Lipid Peroxidation in Human LDL Cholesterol and Food Systems. Journal of the American Oil Chemist's Society, 20 August 2011
 4. Khodr B, Khalil Z. Modulation of inflammation by reactive oxygen species: implications for aging and tissue repair. Free Radic Biol Med. 2001 Jan 1;30(1):1-8. PMID: 11134890
 5. Rajasekaran NS et al. The effect of finger millet feeding on the early responses during the process of wound healing in diabetic rats. Biochim Biophys Acta. 2004 Aug 4;1689(3):190-201. PMID: 15276645
 6. Hegde PS, Anitha B, Chandra TS. In vivo effect of whole grain flour of finger millet (Eleusine coracana) and kodo millet (Paspalum scrobiculatum) on rat dermal wound healing. Indian J Exp Biol. 2005 Mar;43(3):254-8. PMID: 15816412
 7. Anamika M Rasik, Arti Shukla. Antioxidant status in delayed healing type of wounds . Int J Exp Pathol. 2000 Aug; 81(4): 257–263. PMID: 10971747
 8. Hegde P1, Chandrakasan G, Chandra T. Inhibition of collagen glycation and crosslinking in vitro by methanolic extracts of Finger millet (Eleusine coracana) and Kodo millet (Paspalum scrobiculatum). J Nutr Biochem. 2002 Sep;13(9):517. PMID: 12231421
 9. Jess G. Snedeker, Alfonso Gautieri. The role of collagen crosslinks in ageing and diabetes - the good, the bad, and the ugly . Muscles Ligaments Tendons J. 2014 Jul-Sep; 4(3): 303–308. PMID: 25489547
 10. Karkada S et al. Beneficial Effects of ragi (Finger Millet) on Hematological Parameters, Body Mass Index, and Scholastic Performance among Anemic Adolescent High-School Girls (AHSG). Compr Child Adolesc Nurs. 2019 Jun;42(2):141-150. PMID: 29595341
Read on app