ఆవు హిందువులకు ఒక పవిత్ర జంతువు. ప్రాచీన భారతదేశంలో వ్యవసాయo మరియు పశువుల పెంపకం అనేది పురాతన భారతదేశంలో ఆదాయ వనరుగా ఉన్నప్పటికీ పురాతన కాలం నుంచి ఆవులు ఇక్కడ ఆరాధించబడుతూ ఉన్నాయి. గొప్ప ఆర్థిక ప్రాభల్యం మరియు పాలకు మూలాధారం అయినప్పటికీ, ఆవులను వాటి యొక్క మూత్రం కోసం ఉపయోగించడేవి.

మీరు ఎందుకు గోమూత్రం కావాలని అడుగుతారు?

ఆవుల యొక్క మూత్రం మరియు పేడ గొప్ప ఔషధ విలువను కలిగి ఉన్నాయనేది తెలుసుకోనుటలో మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి, ఆవు నుండి లభించే మూత్రం, నెయ్యి, పెరుగు, పేడ మరియు ఆవు పాలతో కలిపి చేసిన మిశ్రమం పంచగవ్య తయారు అవుతుంది, ఇది ఆయుర్వేదంలో దానిలో గల ఔషధ గుణాలకు పేరు పొందింది. సంస్కృత పదం అయిన సుశ్రుత సంహిత ప్రకారం ఒక ఆవు నుంచి ఉత్పన్నమైన అన్ని ఉత్పత్తుల్లో, ఆవు యొక్క మూత్రం అత్యంత సమర్థవంతమైన రోగ నివారిణిగా పరిగణించబడుతుంది.

ఆయుర్వేదంలో గోమూత్రo అమృతoగా లేదా జీవ జలంగా భావించబడుతుంది. నైజీరియా మరియు మయన్మార్ దేశాలలోని సాధారణ మెడిసిన్ ప్రాక్టీస్­నర్లు కూడా తమ మందులలో గోమూత్రాన్ని ఉపయోగిస్తారు.

వేకువజామునకు ముందే యవ్వన దశలో ఉన్న ఆవు యొక్క మూత్రాన్ని సేకరించడం చాలా ఉత్తమం అని కొంతమంది నమ్ముతారు, అయితే చూలుతో ఉన్న ఆవు యొక్క మూత్రం ప్రత్యేక హార్మోన్లను కలిగి ఉండటం వలన అధిక పోషకతత్వాన్ని కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. సుమారు 80 నయం కాని వ్యాధులు మరియు అనేక ఇతర పరిస్థితులు గోమూత్రం ఉపయోగించి నయo చేయబడతాయని నమ్మబడుతుంది.

గోమూత్రం దాని ఔషధ గుణాలను బట్టి ఉపయోగించడం మాత్రమే కాకుండా అది విస్తృతమైన వివిధ ఉపయోగాలను కలిగి ఉంది. ఇది ఎరువుగా సేంద్రీయ వ్యవసాయంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. వేప ఆకులతో కలిపినప్పుడు ఇది ఒక అద్భుతమైన బయో పెస్టిసైడ్­గా పనిచేస్తుంది. గోమూత్రo సాంప్రదాయికంగా శుభ్రపరిచే ద్రావణాల యొక్క యాంటీ మైక్రోబయాల్ చర్యలను పెంచుతుంది మరియు అందుకే దీనిని శుభ్రపరిచే ఏజెంట్­గా ఉపయోగిస్తారు, ప్రత్యేకంగా ఇది నేలను శుద్ది చేయుటకు వాడబడుతుంది. ఆవు మూత్రంతో నేలను తుడవడం వలన అది అన్ని బ్యాక్టీరియాలను తొలగించడం ద్వారా స్థలాన్ని శుద్ధి చేస్తుందని నమ్ముతారు. ఇది సౌందర్య సాధన సామగ్రి, ముఖ్యంగా షాంపూ మరియు సబ్బుల్లో కూడా ఉపయోగించబడుతుంది.

  1. క్యాన్సర్ రోగుల కోసం గోమూత్రం - Cow urine for cancer patients in Telugu
  2. గాయం నయం చేయుట కోసం గోమూత్రం - Cow urine for wound healing in Telugu
  3. పేగు పురుగుల చికిత్స కోసం గోమూత్రం - Cow urine for intestinal worms in Telugu
  4. బయో-ఎన్¬హేన్సర్¬గా గోమూత్రం - Cow urine as bio-enhancer in Telugu
  5. రోగనిరోధక వ్యవస్థ కోసం గోమూత్రం - Cow urine for immune system in Telugu
  6. మధుమేహం నయం చేయుట కోసం గోమూత్రం - Cow urine for diabetes in Telugu
  7. గోమూత్రం వలన వృద్ధాప్యం రాకుండా చేయు ప్రయోజనాలు - Cow urine anti-ageing benefits in Telugu
  8. చర్మానికి సంబంధించి గోమూత్రం యొక్క ప్రయోజనాలు - Cow urine benefits for skin in Telugu
  9. మూల వ్యాధులను నయం చేయుట కోసం గోమూత్రం - Cow urine for haemorrhoids in Telugu
  10. గోమూత్రం యొక్క ఇతర ప్రయోజనాలు - Other benefits of Cow urine in Telugu
  11. గోమూత్రoలో గల పోషకత్వ వాస్తవాలు - Cow urine nutrition facts in Telugu
  12. గోమూత్రo యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Cow urine health benefits in Telugu
  13. గోమూత్రం యొక్క దుష్ప్రభావాలు - Cow urine side effects in Telugu
  14. ఉపసంహారం - Takeaway in Telugu

గోమూత్రంలో గల యూరిక్ ఆమ్లం యొక్క యాంటీ ఆక్సిడెంట్ లక్షణం మరియు DNA లను సరిచేసే దాని సామర్థ్యం క్యాన్సర్ వ్యాదికి ఇది సమర్థవంతమైన నివారణను అందిస్తుంది. ఒక ప్రీక్లినికల్ అధ్యయనంలో, ఆవు మూత్రాన్ని ఉపయోగిస్తూ కణితుల ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగించడం జరుగుతుంది. గోమూత్రం యొక్క నిరంతర ఉపయోగం వలన కణితుల యొక్క తీవ్రత కూడా తగ్గిపోతుంది.

మరిన్ని పరిశోధనల ప్రకారం, కౌపతీ లేదా పంచగవ్యపతి అని పిలవబడే ప్రత్యేకమైన చికిత్స క్యాన్సర్ లక్షణాలపై ప్రభావం చూపుటలో ఇది అత్యంత సమర్థవంతమైనది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

వివో (జంతు ఆధారిత) అధ్యయనాల్లో ఆవు మూత్రం యొక్క సమయోచిత వాడకం అనేది తీవ్రతరమైన గాయాన్ని స్వస్థ పరచే వైద్య లక్షణాలను కలిగి ఉంటుంది. ఎందుకంటే ఇది అల్లాంటిన్ కలిగి ఉంటుంది, ఇది గాయానికి చేయవలసిన చికిత్సను మెరుగుపరుస్తుంది. ఇది యాంటిబాడీ స్థాయిని పెంచుతుంది, ఇది మీ గాయాలకు వ్యాధి సంక్రమణ జరుగుకుండా ఉండేలా నిర్ధారిస్తుంది. 

సాంప్రదాయకంగా, పేగు పురుగుల చికిత్స కోసం ఆవు మూత్రం ఉపయోగిస్తారు. ఈ ప్రభావాన్ని నిర్ధారించడానికి, పాలు, పెరుగు, నెయ్యి, పేడ మరియు మూత్రం నుంచి తయారుచేసిన ఔషధ ఉత్పత్తి అయిన పంచగవ్యను భారతీయ వానపాములపై ​​పరీక్షించబడింది. వానపాములు శారీరకంగా మరియు శరీర నిర్మాణ సంబంధమైన ప్రేగులలో ఉండే నులి పురుగుల లాగానే ఉంటాయి, ఈ అధ్యయనం పంచగవ్య యొక్క అంధేల్మిక్టిక్ లక్షణాలను అర్థం చేసుకోవడంలో సహాయపడింది. ఇతర ఔషధాలతో పోలిస్తే, పంచగవ్య మోతాదు-ఆధారితమైనది ఇది వానపాములు పక్షవాతానికి గురి కావడం మరియు మరణించుటలో చాలా ప్రభావవంతమైనదని తేలింది.

ఈ అధ్యయనం గోమూత్రం యొక్క క్రిమినాశక సంబంధ లక్షణాలను నొప్పి మరియు ఇతర పరాన్నజీవుల నివారణ చర్యలలో ఉపయోగించవచ్చని నిర్ధారించబడింది.

ఆయుర్వేద ఔషధంలో గోమూత్రం ఒక బయో ఎన్­హేన్సర్­గా పిలువబడుతుంది. అంటే, ఇతర మత్తుపదార్థాలతో పాటుగా వాడినప్పుడు, ఇది వాటి బయో లభ్యతను పెంచుతుంది. అనేక ఆయుర్వేద మందులలో ఈ గోమూత్రం యొక్క జీవ సంబంధిత మెరుగుదల వంటి లక్షణం ఉపయోగించబడుతుంది. కానీ ఇది ముఖ్యంగా దుష్ప్రభావాలు మరియు మోతాదు సంబంధిత ప్రభావాలను నివారించడానికి తక్కువ మోతాదులో అనేక మందులతో పాటు ఉపయోగించగించబడుతుంది. ఆయుర్వేదలో ఈ భావనను యోగావహి అని అంటారు.

వివిధ మూలకాలతో మిశ్రమం చేయబడినప్పుడు, ఇది మానసిక రుగ్మతల చికిత్సకు ఉపయోగించబడుతుంది. ఆవు మూత్రం యొక్క ఈ లక్షణాలను అధ్యయనం చేయడానికి నిర్వహించిన పరిశోధన, ఆవు మూత్రం, కణ త్వచం అంతటా మందులను రవాణా చేయడంలో సహాయపడుతుంది, ఇది శరీరానికి మరింత సులభంగా అందుబాటులో ఉండేలా చేస్తుంది. ఆయుర్వేదo ప్రకారం, గోమూత్రంలో 'రసాయన' తత్వాలు ఉన్నాయి, ఇది ఒక బయో ఎన్­హేన్సర్­గా పనిచేస్తుంది. 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

రోగనిరోధక తత్వాన్ని మెరుగుపరిచేందుకు మూలికలు మరియు ఖనిజ లవణాలు ఉపయోగించుటలో ఆయుర్వేదం బాగా ప్రసిద్ధి చెందింది. మన శరీరానికి కావలసిన నిరోధక శక్తిని 104% వరకు గోమూత్రo ద్వారా మెరుగుపరచబడుతుందని పురాతన వైద్య నిపుణులు విశ్వసించారు. జంతు నమూనాలపై నిర్వహించిన ఒక పరిశోధనలో, కణాల-మధ్యవర్తిత్వం మరియు హ్యూమరల్ రోగ నిరోధకత రెండింటినీ మెరుగుపరచుటలో గోమూత్రం తోడ్పడినట్లు కనుగొనబడింది. గోమూత్రం సేవించడం వలన ఇది మన శరీరంలోని తెల్ల రక్త కణాల సంఖ్య పెరుగుదలకు దారితీస్తుందని మరియు ఒక నెల లోపు కలిగే రోగ నిరోధక ప్రతిస్పందనను కూడా ఈ అధ్యయనం సూచిస్తుంది. గోమూత్రంలో ఉన్న "రసాయన" తత్వo మన శరీర రోగ నిరోధక వ్యవస్థను బలవంతం చేయుటలో బాధ్యత కలిగి ఉంటుంది అని సూచించబడింది.

(ఇంకా చదవండి: రోగనిరోధక శక్తిని మెరుగుపరచే ఆహారాలు)

మధుమేహం యొక్క చికిత్సలో కౌపథి లేదా పంచగవ్యపథి అనేవి అత్యంత ప్రభావవంతమైనవని పరిశోధనా సంబంధిత ఆధారాలు సూచిస్తున్నాయి. మధుమేహం పై గోమత్రo యొక్క ప్రభావం గురించి మధుమేహ జంతు నమూనాలపై అధ్యయనం చేయబడింది. గోమత్రo యొక్క వినియోగం రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని, ఈ మోతాదు పెరుగుతున్నప్పటికీ ఎటువంటి దుష్ప్రభావాలు కనిపించలేదని ఈ అధ్యయనం ద్వారా నిర్ధారించడం జరిగింది.

మరొక అధ్యయనంలో, గోమూత్రం యొక్క యాంటీ-డయాబెటిక్ ప్రభావాలను మధుమేహ లక్షణాలను ఉపశమనం చేయడానికి, గోమూత్రం మరియు కొన్ని ఆయుర్వేద మూలికలతో కూడిన సాంప్రదాయిక పాలీ హెర్బల్ మిశ్రమంతో సరిపోల్చడం జరిగింది. ఈ అధ్యయనం యొక్క ఫలితాల ప్రకారం, గోమూత్రం ఒక్కటే ఇతర వాటితో మిశ్రీకరణ కంటే మరింత ప్రభావవంతంగా పని చేస్తుంది.

అయితే, మధుమేహ వ్యాధిగ్రస్తులు ఏదైనా రూపంలో గాని మూత్రం తీసుకునే ముందు వారి యొక్క డాక్టరుతో తప్పని సరిగా సంప్రదించవలెను.

మన శరీరంలోని కొన్ని ఆరోగ్యకరమైన సూక్ష్మ పోషకాలు ప్రతీ రోజూ మూత్ర వ్యర్థాలతో సహా బయిటికి పోవుచున్నాయి. ఇది మన శరీరం యొక్క వృద్ధాప్యానికి కారణం అవుతుంది. గోమూత్రం తీసుకోవడం అనేది ఈ కోల్పోయిన అంశాలను వాటి లోప నివారణను పూరించడం కోసం శరీరంలో తిరిగి నింపుతుంది. అందువల్ల ఇది వృద్ధాప్య ప్రక్రియను తగ్గిస్తుంది మరియు అందుకే ఇది ఒక అమృతం మరియు జీవన ప్రదాత అని కూడా సూచించబడుతుంది.

అంతేకాకుండా, యాంటీ ఆక్సిడెంట్స్ కోసం ఒక మూలాధారంగా, గోమూత్రం మీ శరీరం నుండి ఫ్రీ రాడికల్స్­ను శుద్ధి చేయడంలో సహాయపడుతుంది, మీ కణజాలాలకు ఆక్సీకరణ ఒత్తిడి వలన ఎలాంటి ప్రభావం పడకుండా ఉండేలా నిర్ధారిస్తుంది. కాబట్టి మీరు గోమూత్రంలో లభించే పోషకాలను పొందండి మరియు అకాల వృద్ధాప్య సంకేతాలకు వీడ్కోలు చెప్పండి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

గోమూత్రం సాంప్రదాయకంగా బొల్లి మరియు చర్మపు ఫంగల్ ఇన్ఫెక్షన్లతో సహా వివిధ చర్మ వ్యాధుల చికిత్సకు ఉపయోగించబడుతుంది. ఇది మొటిమలను దూరం చేస్తుందనేది కూడా నమ్ముతారు. కేండిడా రకానికి వ్యతిరేకంగా పనిచేయు యాంటీ ఫంగల్ కార్యకలాపాలను కలిగి ఉన్నట్లు, మరియు కొన్ని స్థాయి యాంటీ బాక్టీరియల్ ప్రభావాలను కూడా కలిగి ఉంది, అయినప్పటికీ, బలమైన ప్రభావాన్ని చూపలేకపోవడంతో, ఈ ప్రభావాన్ని నిర్ధారించడం కష్టమే.

ఇది గాయాలను నయం చేయుటలో ఒక అద్భుతమైన గాయాలను నయం చేసే కారకం మరియు దాని యాంటీ బాక్టీరియల్ మరియు రోగనిరోధక ప్రభావం ద్వారా అటువంటి గాయాలకు కలిగే బ్యాక్టీరియా సంక్రమణ వంటి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

ఇది ఒక సహజ యాంటీ ఆక్సిడెంట్ల మూలం కావడం వలన, ముందస్తు వృద్ధాప్యం, చర్మ ముడతలు పడటం మరియు వదులుగా అయ్యే చర్మం వంటి అకాల వృద్ధాప్యం యొక్క సంకేతాలను తగ్గించడంలో సహాయపడుతుంది.

మూల వ్యాధులు లేదా మూల శంక అనేది కూర్చొనే గుదమ భాగంలో మరియు చుట్టూ కలిగే మంట మరియు నొప్పి ద్వారా గుర్తించడే ఒక పరిస్థితి ఇది. చిరాకు పుట్టించే అసౌకర్యాన్ని కలిగించడమే కాకుండా, ఇది హెమరాయిడ్ కణజాలం నుండి రక్తస్రావానికి కారణం అవుతుంది. సాంప్రదాయకంగా, గోమూత్రం మూలవ్యాధి లక్షణాలను తగ్గించడానికి మరియు రక్తస్రావం మరియు నొప్పిని తగ్గించడానికి ఒక పాలీహెర్బల్ ఫార్ములేషన్ అందిస్తుంది.

మూలవ్యాదికి సంబంధించి ఖచ్చితమైన కారణం మరియు రక్తస్రావ నివారిణ కోసం సహజ చికిత్సను కనుగొనడానికి విస్తృతమైన పరిశోధన జరిగింది. మూలవ్యాదికి మలబద్ధకం అనేది అనేక కారకాలలో ఒకటిగా బాధ్యత వహిస్తుంది. ఫార్మాస్యూటికల్ సైన్స్ ఇన్వెన్షన్ ఇంటర్నేషనల్ జర్నల్­లో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, గోమూత్రం ప్రేగులలో ఉపశాంతి ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆయుర్వేదలో మల-భేదన అని కూడా పిలువబడుతుంది, ఇది మీ పాయువు నుండి మలాన్ని సులభంగా తొలగించటానికి వీలు కల్పిస్తుంది, తద్వారా పాయువు గోడలపై అధిక ఒత్తిడిని కలుగుకుండా ఉండేలా ఉపశమనం కలుగజేస్తుంది.

పర్యవేక్షించబడిన గోమూత్రాన్ని నోటి ద్వారా తీసుకోవడం వలన గ్రేడ్ 1 మరియు 2 మూల వ్యాదుల యొక్క బాధాకరమైన మరియు తీవ్ర సమస్యలను నిరోధిస్తుంది.

  • సుశ్రుత సంహిత, అష్టాంగ సంగ్రహ మరియు భావ్ ప్రకాష్ నిఘంటువు వంటి ఆయుర్వేద గ్రంథాలు గోమూత్రం యొక్క ఉపయోగాలను గోమూత్రం ఒక్కటే తీసుకోవడం లేదా ఇతర సహజ మిశ్రమాలు లేదా భాగాల కలయికతో కలిగే ప్రయోజనాలను హైలైట్ చేస్తున్నాయి. గోమూత్రం ఒక యాంటీబాక్టీరియల్ కారకం కావడంతో క్షయవ్యాధి చికిత్సలో కూడా ప్రభావవంతంగా పని చేస్తుంది. డ్రగ్-రెసిస్టంట్ వ్యాధి కారకాలు వృద్ధి చెందుట వలన సాంప్రదాయికమైన చికిత్సలను చాలా వరకు పనికిరానివిగా చేయబడినవి, గోమూత్రం ఒక సహజమైన ఉత్పత్తి అయినందున అటువంటి యాంటీబయాటిక్స్­కు ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా పనిచేయవచ్చు.
  • రక్తహీనత చికిత్స కోసం గోమూత్రం యొక్క ఉపయోగం గురించి ఆయుర్వేద ప్రస్తావిస్తుంది. భారతదేశంలో రక్తహీనతకు అత్యంత సాధారణ కారణం మన రోజువారీ ఆహారంలో తగినంత ఐరన్ అధికంగా కలిగిన పదార్ధాలను తీసుకొనకపోవడం. గోమూత్రం ఎరిత్రోపోయిటేన్ కలిగి ఉండుటచే అది రక్తహీనతకు ప్రభావవంతమైన చికిత్సను అందిస్తుంది అని నమ్ముతారు, ఇది RBCs మరియు హేమోగ్లోబిన్ల సంఖ్యను పెంచుతుంది. అంతేకాకుండా, గోమూత్రంలో కూడా యూరియా ఉంటుంది, ఇది RBC యొక్క నిర్మాణం నిర్వహించడానికి, వాంఛనీయ పనితీరును కలిగి ఉండుటలో సహాయపడుతుంది.
  • కాలేయపు మృదువైన పనితీరులో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు గోమూత్రం చూపించబడింది. అందువలన ఆరోగ్యకరమైన కాలేయానికి గోమూత్ర స్వేదన జలాన్ని ఉపయోగించవచ్చని ప్రోత్సహించబడుతుంది
  • గోమూత్రతో మూర్ఛ వ్యాధిని నివారించవచ్చా అనేది తెలుసుకోవడానికి ఒక అధ్యయనం నిర్వహించబడింది. అధ్యయనం ముగిసిన తరువాత, పంచగవ్యలో ఉన్న గోమూత్రం మూర్చ రోగ నివారక లక్షణాలను కలిగి ఉంటుంది, కానీ దాని యంతటగా మూర్ఛరోగము పూర్తిగా నివారించబడదు.

ఒక పరిశోధన ప్రకారం, గోమూత్రo అనేది విషరహితమైనదిగా పరిగణించబడుతుంది. ఇది 95% నీరు, 2.5% యూరియా మరియు మిగిలినది 2.5% వివిధ లవణాలు, ఖనిజాలు, ఎంజైమ్లు మరియు ఇతర ఉపయోగకరమైన హార్మోన్లతో తయారు చేయబడుతుంది. గోమేత్రంలో ముఖ్యమైన ఖనిజాలు మరియు ఎంజైమ్­లలో కొన్ని క్రియేటినిన్, ఆరం హైడ్రాక్సైడ్, కార్బోలిక్ ఆమ్లం, ఫినాల్స్, కాల్షియం మరియు మాంగనీస్ మొదలైనవి ఉంటాయి.

పోషకాలు విలువ, శాతంలో
నీరు 95%
యూరియా 2.5%
ఇతర ఎంజైములు మరియు సమ్మేళనాలు 2.5%

అధిక పోషకాలను కలిగిన గోమూత్రంను అనేక వ్యాధుల యొక్క చికిత్సలో ఉపయోగించవచ్చు. ఆయుర్వేదం ప్రకారం, గోమూత్రo మాత్రమే లేదా ఆవు పాలు లేదా త్రిపాలతో కలిపి, జ్వరం, నొప్పి, రక్తహీనత, కుష్టు వ్యాధి, క్యాన్సర్ మరియు మూర్ఛ వంటి అనారోగ్యాల చికిత్సకు కోసం ఉపయోగించవచ్చు.

  • క్యాన్సర్ కోసం: ఆవు మూత్రం యొక్క యాంటీ ఆక్సిడెంట్ సంభావ్యత అనేది క్యాన్సర్­ను సమర్థవంతమైన నివారణ చేస్తుంది, DNA కు నష్టo కలిగించుటను తగ్గించే సామర్ధ్యానికి కారణమవుతుంది.
  • ప్రేగులలో ఉండే పురుగుల కోసం: ఆవు మూత్రాన్ని సంప్రదాయబద్ధంగా పేగు పురుగుల చికిత్సలో ఉపయోగిస్తారు మరియు ఇది క్లినికల్ స్టడీస్ సహాయంతో ధృవీకరించబడింది.
  • ఒక బయో-ఎన్హేన్సర్ గా: ఆవు మూత్రం తరచుగా నిర్వహించబడే ఇతర ఔషధాల జీవ లభ్యతను మెరుగుపరచడానికి ఉపయోగించబడుతుంది.
  • రోగనిరోధకత: మీ రోగనిరోధక వ్యవస్థకు ఆవు మూత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అది WBC ల సంఖ్య పెరుగుదల వలన హ్యూమరల్ మరియు సెల్-మధ్యవర్తిత్వ రోగనిరోధక శక్తిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది.
  • చర్మం కోసం: ఆవు మూత్రం అధిక యాంటీ-ఆక్సిడెంట్ స్థాయి కలిగి ఉండుటచే అది మీ చర్మం కోసం ఒక యాంటీ ఏజింగ్ కారకం వలే పని చేస్తుంది, ఇది ముడుతలు మరియు చారలు కనిపించడాన్ని చాలా వరకు తగ్గిoచుటలో సహాయపడుటను సూచిస్తుంది. ఆవు మూత్రం దాని ప్రభావాల కారణంగా వృద్ధాప్యం తగ్గించుటలో సహాయపడుతుంది, ఇది జీవాన్ని అందించే ద్రవంగా కూడా పిలువబడుతుంది.
  • జీర్ణక్రియ కోసం: ఆవు మూత్రం జీర్ణక్రియకు సహాయపడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారించడంలో కూడా ఉపయోగపడుతుంది. ఇది మొలల వ్యాధులు మరియు వాటికి సంబంధించిన ఏవైనా సంక్లిష్టాలను కూడా నిరోధిస్తుంది.
  • ఇతరములు: అంటువ్యాధులు, రక్తహీనత, మూర్చ రోగం వంటి వ్యాదుల నివారణకు గోమూత్రం దోహదం చేస్తుంది మరియు కాలేయం యొక్క పనితీరును కూడా మెరుగుపరుస్తుంది.

గోమూత్రo అనేక వ్యాధులకు వ్యతిరేకంగా పనిచేసే ఒక సహజమైన పరిహారం అయినప్పటికీ, సరికాని నిల్వ, సరికాని మిశ్రమం లేదా తప్పు వాడకం వంటికి ఆరోగ్య ప్రమాదానికి దారి తీస్తుంది.

  • ఆవుకు ఏదైనా వ్యాధి సోకినట్లయితే గోమూత్రంలో వ్యాధి కారకాలను కలిగి ఉంటుంది.
  • ఒక గంటకు పైగా ఆవు నుండి పొందిన గొమూత్రాన్ని నిల్వచేయడం మంచిది కాదు.
  • 10 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు కూడా గోమూత్రంను సేవించరాదు అనేది సూచించడo జరిగింది
  • సంతానోత్పత్తి సమస్యలను ఎదుర్కొంటున్న లేదా నిద్ర లేకపోవడం వంటి సమస్యలు గల పురుషులు కూడా గోమూత్రాన్ని తీసుకోరాదు.
  • ఒక అధ్యయనంలో, వైద్య సలహా తీసుకోకుండా ఒక వ్యక్తి తన కంటిలో గోమూత్రాన్ని వేశారు మరియు అతను కంటి నొప్పి మరియు కంటి చూపులో అస్పష్టత వంటి సమస్యలతో రెండు రోజుల పాటు బాధపడ్డారు.

గోమూత్రం అనేది వివిధ రకాల ఆరోగ్య ప్రయోజనాలతో లభిస్తుంది. ఇది మధుమేహ నిర్వహణ, గాయాలను నయం చేయడం మరియు రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం కోసం పరిపూర్ణ నివారిణిగా అనేక అద్భుతమైన లక్షణాలను కలిగి ఉంది. ఇది వివిధ యాంటీబయాటిక్స్ మరియు ఔషధాల సామర్ధ్యాన్ని మెరుగుపరచడంలో ఒక బయో ఎన్­హేన్సర్­గా పనిచేస్తుంది. ఏదేమైనా, గోమూత్రం అనేది విశ్వసనీయ మూలాల నుండి ఎల్లప్పుడూ కొనుగోలు చేయాలి లేకుంటే ఇది అనారోగ్యకరమైన ఆవు నుండి వ్యాధి సంక్రమణ చేయు సూక్ష్మజీవులను కలిగి ఉంటుంది. మీరు ఎవరైనా ఒక వైద్యునిచే సూచించబడిన ఔషధాలు లేదా కొన్ని రోగాల వలన బాధపడుతున్నట్లయితే, దానిని ఉపయోగించటానికి ముందు డాక్టరుని సంప్రదించడం మంచిది. ఈ ఆయుర్వేద చికిత్సలో ఉత్తమం ఫలితాలను పొందడానికి చాలా వరకు పరిశోధన కొనసాగుతోంది.


Medicines / Products that contain Cow Urine

వనరులు

  1. Gurpreet Kaur Randhawa. Cow urine distillate as bioenhancer. J Ayurveda Integr Med. 2010 Oct-Dec; 1(4): 240–241. PMID: 21731367
  2. Gurpreet Kaur Randhawa, Rajiv Sharma. Chemotherapeutic potential of cow urine: A review. J Intercult Ethnopharmacol. 2015 Apr-Jun; 4(2): 180–186. PMID: 26401404
  3. Devender O. Sachdev, Devesh D. Gosavi, Kartik J. Salwe. Evaluation of antidiabetic, antioxidant effect and safety profile of gomutra ark in Wistar albino rats. Anc Sci Life. 2012 Jan-Mar; 31(3): 84–89. PMID: 23284212
  4. Sonia Singla, Satwinder Kaur. BIOLOGICAL ACTIVITIES OF COW URINE: AN AYURVEDIC ELIXIR. EUROPEAN JOURNAL OF PHARMACEUTICAL AND MEDICAL RESEARCH.
  5. Dr. Omaprakash W.Talokar, Dr.Archana R. Belge, Dr.Raman S. Belge. Clinical Evaluation of Cow-Urine Extract special reference to Arsha (Hemorrhoids). International Journal of Pharmaceutical Science Invention, Volume 2 Issue 3 ‖ March 2013 ‖ PP.05-08
  6. Javid Ahmad Ganaie, Varsha Gautam, Vinoy Kumar Shrivastava. Effects of Kamdhenu Ark and Active Immunization by Gonadotropin Releasing Hormone Conjugate (GnRH-BSA) on Gonadosomatic Indices (GSI) and Sperm Parameters in Male Mus musculus. J Reprod Infertil. 2011 Jan-Mar; 12(1): 3–7. PMID: 23926493
  7. Sumeet Khanduja, Prachi Jain, Sumit Sachdeva, Jitender Phogat. Cow Urine Keratopathy: A Case Report. J Clin Diagn Res. 2017 Apr; 11(4): ND03–ND04. PMID: 28571179
  8. Jian Meng Hoh and B. Dhanashree. Antifungal effect of cow's urine distillate on Candida species. J Ayurveda Integr Med. 2017 Oct-Dec; 8(4): 233–237. PMID: 28869083
  9. Madhav University [internet]. Rajasthan. India. Cow Urine: A Divine Medicine
Read on app