వీనస్ అల్సర్ - Venous Ulcer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 14, 2019

March 06, 2020

వీనస్ అల్సర్
వీనస్ అల్సర్

వీనస్ అల్సర్ (సిరల పుండు) అంటే ఏమిటి?

రక్తనాళాల పుండ్లు లేక సిరల పుండ్లు అనేవి లోతైన రక్తనాళాల పుండ్లు, ఇవి సాధారణంగా శరీరం దిగువభాగం అంగాల్లో ఏర్పడతాయి. నరాల్లో (సిరల్లో) రక్తం గుండె వరకూ సరఫరా కాలేనపుడు రక్తం వెనుకకు మరలడంవల్ల ఈ పుండ్లు ఏర్పడతాయి. ఈ రుగ్మతకు చికిత్స చేయకుండా వదిలేస్తే, అది పెరిగిన రక్తపీడనానికి గురై, ప్రభావిత ప్రాంతంలో ద్రవ సంచితమవుతుంది. ఫలితంగా బహిర్గతంగా పుండు ఏర్పడుతుంది. ఈ పుండు నెమ్మదిగా నయమవుతుంది మరియు సాధారణంగా చీలమండ పైన కానవస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వీనస్ అల్సర్ యొక్క అత్యంత సాధారణ చిహ్నాలు మరియు లక్షణాలు:

  • దురదతో కూడిన పలుచని చర్మం మరియు చర్మవివర్ణీకరణం (డిస్కోలరేషన్), ఈ చర్మవివరణీకరణం ముదురు ఎరుపు, ఊదా, గోధుమ రంగు కావచ్చు.
  • గట్టిబడిపోయిన (కఠినమైన) చర్మం
  • జ్వరం లేదా చలి
  • కాళ్ళలో వాపు
  • కాళ్ళు నొప్పి, భారము మరియు తిమిర్లు (cramps)
  • జలదరింపు
  • పుండ్లు కానరావడం:
  • ఈ పుండు చర్మంపై మరీ అంతగా లోతుగా ఏర్పడకుండా అసమాన సరిహద్దులతో కానవస్తుంది; పుండు కింది భాగంలో ఎర్రగా ఉండి పసుపు కణజాలంతో కప్పబడి ఉంటుంది; ఇంకా, ఈ పుండు వివర్ణీకరణంతో నిండి, మెరాస్తూ ఉండి, పుండుచుట్టూ చర్మం బిరుసుగా, గట్టిగా ఉంటుంది మరియు తాకితే వెచ్చగా లేదా వేడిగా ఉంటుంది. అంటువ్యాధి సోకిన పుళ్ళు ఒక దుర్వాసనతో కూడుకుని ఉండి, చీము లేదా రక్తం కారుతూ ఉంటాయి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

వీనస్ అల్సర్లకు కారణాలు:

  • సిరల్లోని కవాటాలు బలహీనపడటం
  • శరీరం దిగువ అంగాల (అంత్య భాగాల) సిరల్లో పెరిగిన ఒత్తిడి
  • మచ్చలు ఏర్పడ్డ, (scarred) మరియు అడ్డంకులు గల్గిన సిరలు
  • సిరల లోపానికి దారి తీసే పరిస్థితులు

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వ్యక్తి  వైద్యచరిత్రను తనిఖీ చేసి, గాయాలైన శరీరభాగాన్ని పరీక్ష చేసింతర్వాత వైద్య  (క్లినికల్) తీవ్రత స్కోర్ ను క్లినికల్, ఎటియోలజీ, అనాటమీ అండ్ పాథోఫిజియాలజీ (CEAP) ఆధారంగా జరుగుతుంది, ఇది దీర్ఘకాలిక సిరల రుగ్మతలను అంచనా వేయడానికి సహాయపడుతుంది.

వీనస్ అల్సర్కు ప్రధానంగా గాయాల సంరక్షణతో చికిత్స చేస్తారు:

  • పుండును శుభ్రపరిచి దాన్ని కట్టు కట్టి ఉంచండి ( పండును ఇలా కప్పి  ఉంచడం అనేది అంటువ్యాధి నివారించడానికి సహాయపడుతుంది), తర్వాత వైద్యుడి సూచన మేరకుమార్చాలి.
  • పుండుకు కట్టు కట్టేందుకు డ్రస్సింగ్ చేసేముందు పుండును పూర్తిగా శుభ్రం చేయాలి మరియు పుండు పైన ఉండే డ్రెస్సింగ్ మరియు దానిచుట్టూ చర్మాన్ని పొడిగా మరియు శుభ్రంగా ఉంచుకోవాలి.
  • పుండుకు చేసిన డ్రెస్సింగ్ను పట్టీలతో లేదా బ్యాండేజీలతో కప్పిఉంచండి.
  • కాళ్ళ నరాల్లో (సిరల్లో) రక్తం యొక్క అతి ఒత్తిడిని తగ్గించండి, కాళ్లలో రక్తం గుమిగూడడాన్ని నిరోధించడానికి, నొప్పి మరియు వాపును తగ్గించడానికి మరియు పుండు మానడాన్ని ప్రోత్సహించడానికి ఇది చాలా అవసరం.
  • సాధ్యమైతే మీ పాదాలను గుండె స్థాయికి ఎత్తులో ఉండేట్టుగా ఉంచండి (పాదాల  కింద దిండ్లు ఉంచి పడుకోవడం చేయచ్చు.)
  • శరీరం అంతటా రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు శారీరక శ్రమను పెంచండి.
  • వైద్యుడు సూచించిన మందులను తీసుకోండి

నయం కాని సిరల పుండ్ల కోసం, కొన్ని విధానాలు లేదా శస్త్రచికిత్సల్ని వైద్యులు సూచించవచ్చు, ఇది నరాల్లో రక్తప్రసరణను మెరుగుపర్చడానికి ఉపయోగపడుతుంది.



వనరులు

  1. Lauren Collins et al. Diagnosis and Treatment of Venous Ulcers. Am Fam Physician. 2010 Apr 15;81(8):989-996. American Academy of Family Physicians.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Venous ulcers - self-care
  3. Biju Vasudevan. Venous leg ulcers: Pathophysiology and Classification . Indian Dermatol Online J. 2014 Jul-Sep; 5(3): 366–370. PMID: 25165676
  4. J.A. Caprini et al. Venous Ulcers . J Am Coll Clin Wound Spec. 2012 Sep; 4(3): 54–60. PMID: 26236636
  5. National Health Service [Internet]. UK; Venous leg ulcer.

వీనస్ అల్సర్ కొరకు మందులు

Medicines listed below are available for వీనస్ అల్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Medicine Name

Price

₹280.0

Showing 1 to 0 of 1 entries