పర్వత అనారోగ్యం - Altitude Sickness in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 21, 2018

March 06, 2020

పర్వత అనారోగ్యం
పర్వత అనారోగ్యం

పర్వత అనారోగ్యం అంటే ఏమిటి?

ఎత్తైన ప్రదేశాలకి  చేరేటప్పుడు లేదా పర్వతాల మీదకు వేగంగా ఎక్కినప్పుడు పర్వత అనారోగ్యం లేదా ఎత్తు ప్రదేశాల అనారోగ్యం సంభవిస్తుంది. అధిక ఎత్తుల వద్ద పీడనం (pressure) తగ్గడం వలన, శరీరం మార్పులకు అలవాటు పడడానికి సమయం అవసరం. పర్వత అనారోగ్యం సాధారణంగా 8000 అడుగులపైన ఎత్తులో ఉన్నప్పుడు అనుభవంలోకి వస్తుంది.

వివిధ రకాల పర్వత అనారోగ్యాలు:

  • తీవ్రమైన పర్వత అనారోగ్యం, ఇది చాలా సాధారణ రకం.
  • హై ఆల్టిట్యూడ్ పల్మనరీ ఎడెమా (High altitude pulmonary edema), ఇది ప్రాణాంతకం కావచ్చు.
  • హై ఆల్టిట్యూడ్ సెరెబ్రల్ ఎడెమా (High altitude cerebral oedema), ఇది మూడింటిలో   అతి ప్రాణాంతకమైనది.

పర్వత అనారోగ్యం ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అనుభవించిన పర్వత అనారోగ్యం మీద ఆధారపడి లక్షణాలు మారుతూ ఉంటాయి. కొందరు వ్యక్తులు సాధారణ లక్షణాలు కలిగి ఉండవచ్చు, అయితే కొందరికి అధిక ఎత్తులో ఊపిరితిత్తులలో ద్రవం చేరి ఊపిరితిత్తుల వాపునకు గురవుతారు. అధిక ఎత్తులో సెరెబ్రల్ ఎడెమా విషయంలో, ద్రవం మెదడులో చేరడం మొదలవుతుంది.

కొన్ని సాధారణ లక్షణాలు:

ఈ సామాన్యమైన లక్షణాలు సాధారణంగా ఎత్తైన ప్రదేశాలలో కొన్ని గంటలు ఉన్న తర్వాత తగ్గుతాయి  మరియు శరీరం దానికి అలవాటు పడుతుంది. అదికాక తీవ్రమైన సందర్భాల్లో, వ్యక్తి ఈ క్రింది వాటిని అనుభవించవచ్చు:

  • తీవ్రమైన తలనొప్పి.
  • ఛాతీలో ఆటంకంగా ఉన్న భావన.
  • నడవడంలో సమస్య.
  • సమన్వయం సరిగా లేకపోవడం.
  • స్థితి భ్రాంతి.
  • గులాబి రంగు కఫంతో తీవ్ర దగ్గు.
  • కోమా.

పర్వత అనారోగ్యాన్ని ఎలా  నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వైద్య సదుపాయాలు మరియు ప్రథమ చికిత్స పరిమితంగా ఉన్నందున రోగ నిర్ధారణ కష్టం. ఏదేమైనా, ఈ లక్షణాలలో ఏవైనా లేక లక్షణాల యొక్క  కలయికను ఎదుర్కొంటున్నప్పుడు, ఈ లక్షణాలు కొంత సమయం తర్వాత తగ్గకపోతే దానిని పర్వత అనారోగ్యం అని చెప్పవచ్చు మరియు శ్రద్ధ అవసరం. ఊపిరితిత్తుల ధ్వనులకు వైద్యుడు వినవచ్చు, ఆ  ధ్వనులు ద్రవం సేకరణను సూచిస్తాయి.

ఈ పరిస్థితిని పరీక్షించడానికి తదుపరి వైద్య పరీక్షలు క్రింది విధానాల్లో ఒకదానిని కలిగి ఉండవచ్చు:

  • ఎలక్ట్రోకార్డియోగ్రామ్ (ఈసీజీ) పరీక్ష(ECG)
  • ఛాతీ యొక్క ఎక్స్-రే (X-ray)
  • రక్త పరీక్షలు

పర్వత అనారోగ్యాన్ని తీవ్రంగా ఎదుర్కొంటున్నప్పుడు చికిత్స అనేది క్లిష్టమైనది. అయితే, అందరి రోగులపై  జాగ్రత్త తీసుకోవడం అత్యవసరం. జాగ్రత్తలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • తక్కువ ఎత్తులకు దిగడం మరియు /లేదా కృత్రిమ ఆక్సిజన్ సరఫరా.
  • అధిక రక్తపోటు కోసం మందులు.
  • శ్వాసను మెరుగుపరచడానికి మరియు ఆటంకాలను తగ్గించడానికి ఇంహేలర్ల చికిత్స.
  • ఊపిరితిత్తులకు మెరుగైన రక్త ప్రసరణ కొరకు మందులు.
  • పర్వత అనారోగ్యానికి మందులు, ఇవి సాధారణంగా అధిరోహణ ప్రారంభ దశల్లో ఇవ్వబడతాయి.



వనరులు

  1. Hackett P, Roach RC. Altitude Sickness. High altitude cerebral oedema. hamb 2004; 5(2):136-146
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Acute mountain sickness
  3. Wiedman M, Tabin GC. High-altitude retinopathy and altitude illness.. Ophthalmology. 1999 Oct;106(10):1924-6; discussion 1927. PMID: 10519586
  4. The Institute for Altitude Medicine. Institute For Altitude Medicine. [internet]
  5. Union Internationale des Associations d’Alpinisme. A BRIEF GUIDE TO ALTITUDE SICKNESS. International Climbing and Mountaineering Federation. [internet]