బార్లీని సాధారణంగా హిందీలో “జౌ” ​​అని పిలుస్తారు. బార్లీ పశుగ్రాసం (బార్లీ గడ్డి) స్వేదన (distilled) పానీయాలలో ఉపయోగించే ఒక ప్రసిద్ధ పదార్థం. ఇంకా, బీర్ ఉత్పత్తికి పులియబెట్టిన పదార్థానికి మూలం ఇది. అయితే, బార్లీలో ఆరోగ్యానికి ఉపకరించే కొన్ని అద్భుతమైన ప్రయోజనాలున్నాయని మీకు తెలుసా?

సూప్‌లు మరియు వంటకాల తయారీలో మరియు వివిధ సంస్కృతులలో బార్లీ రొట్టెల  తయారీకి బార్లీని విస్తృతంగా ఉపయోగిస్తారు. సంప్రదాయిక మరియు పురాతన తయారీ పద్ధతిలో, బార్లీ ధాన్యాలు సాధారణంగా మాల్ట్‌గా తయారవుతాయి, తరువాత దీనిని బీర్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు.

ఆయుర్వేద ఔషధాల్లో కఫదోషాన్ని నిర్వహించడానికి (ఎముకల నిర్మాణం మరియు వాటి కదలికలకు సరళతను నిర్వహించడం) మరియు శీతలీకరణ మూత్రవిసర్జనకు బార్లీని ఒక మంచి ధాన్యంగా ఉపయోగిస్తారు.

అదనంగా, జీర్ణక్రియను ప్రోత్సహించడానికి బార్లీ నీటిని ఉపయోగిస్తారు మరియు ఇది చైనావాళ్ళు మూలిక మందులు, మూలికావైద్యంలో ఉపయోగించే ఓ ముఖ్యమైన మసాలా దినుసు. వాస్తవానికి, బార్లీ గడ్డిని దాని వైవిధ్యమైన ఉపయోగాలకు ‘తృణధాన్యాల రాజు’ అని పిలుస్తారు.

ఈ వ్యాసం బార్లీ నీళ్ల యొక్క వివిధ ప్రయోజనాలు, తయారీ పద్ధతులు మరియు బార్లీ నీటి వల్ల కలిగే దుష్ప్రభావాలను చర్చిస్తుంది.

బార్లీ గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు

బార్లీ ప్రపంచంలో నాల్గవ అతి ముఖ్యమైన ధాన్యపు పంట. ఇది గడ్డి కుటుంబానికి చెందినది మరియు మొదటి సాగు ధాన్యాలలో ఒకటి. దీనిని మొదట యూరప్ మరియు ఆసియాలో 10,000 సంవత్సరాల క్రితం సాగు చేశారు.

  • వృక్షశాస్త్ర నామం (బొటానికల్ పేరు): హోర్డియం వల్గారే (Hordeum vulgare)
  • కుటుంబం: పోయేసీ (Poaceae)
  • సాధారణ పేరు: జౌ, బార్లీ
  • సంస్కృత నామం: యవ
  • ఉపయోగించే భాగాలు: ధాన్యాలు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: సమశీతోష్ణ వాతావరణంలో స్థానికంగా పండించబడుతుంది.
  1. బార్లీ నీటి యొక్క పోషక వాస్తవాలు - Barley water nutrition facts in Telugu
  2. బార్లీ నీటి ఆరోగ్య ప్రయోజనాలు - Barley water health benefits in Telugu
  3. బార్లీ నీరు తయారు చేసేదెలా - How to make barley water in Telugu
  4. బార్లీ నీటి దుష్ప్రభావాలు - Side effects of barley water in Telugu

యుఎస్ డిఏ (USDA) ప్రకారం, ప్రతి100 గ్రాముల బార్లీ గింజలలో కింది పోషక విలువలుంటాయి:

పోషకాలు

100గ్రాములకు 

శక్తి

354 kcal

నీరు

9.44 గ్రా

కార్భోహైడ్రేట్

73.48 గ్రా

ప్రోటీన్

12.48 గ్రా

ఫ్యాట్స్ (టోటల్ లిపిడ్స్)

2.30 గ్రా

ఫైబర్స్

17.3 గ్రా

చెక్కెరలు

0.80 గ్రా

విటమిన్లు 

విటమిన్ ఏ

1 ug

విటమిన్ బి1

0.646 mg

విటమిన్ బి2

0.285 mg

విటమిన్ బి3

4.604 mg

విటమిన్ బి6

0.318 mg

విటమిన్ బి9

19 ug

విటమిన్ ఇ

0.57 mg

మినరల్స్

 

పొటాషియం

452 mg

కాల్షియం

33 mg

మెగ్నీషియం

133 mg

ఫాస్ఫరస్

264 mg

సోడియం

12 mg

ఐరన్

2.60 mg

జింక్

2.77 mg

సెలీనియం

37.7 ug

కాపర్ 

0.498 mg

మాంగనీస్

1.943 mg

ఫ్యాట్స్/ఫ్యాటీ ఆసిడ్స్ 

మొత్తం

0.482 mg

మోనో అన్సాచురేటెడ్ 

0.295 mg

పోలి అన్సాచురేటెడ్ 

1.108 mg

 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

నానబెట్టిన బార్లీ ధాన్యాల నుండి బార్లీ నీటిని తయారు చేస్తారు. ఈ ఆరోగ్యకరమైన పానీయం బరువు తగ్గడానికి ఉద్దేశించిన ప్రజలకు కొత్త ఇష్టమైనది. బార్లీ నీరు తాగడం వల్ల కలిగే అనేక ఆరోగ్య ప్రయోజనాలు క్రింద వివరంగా వివరించబడ్డాయి.

  • బరువు తగ్గుదల కోసం: బార్లీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది మరియు కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు చెక్కెర శాతం తక్కువగా ఉంటుంది. అలాగే ముఖ్య విటమిన్లు మరియు మినరల్స్ ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి సహాయం చేస్తాయి. క్రమంగా తీసుకుంటుంటే బార్లీ నీళ్లు  ఊబకాయ ప్రమాదాన్ని కూడా నివారిస్తుంది. 
  • మధుమేహం కోసం: బార్లీలో అనేక బయోఆక్టివ్ సమ్మేళనాలు సమ్మేళనాలు ఉంటాయి అవి పెరిగిన రక్త చక్కెరను తగ్గించడంలో సహాయం చేస్తాయి.అలాగే దీనిలో మెగ్నీషియం మరియు కాల్షియం కూడా ఉంటాయి.  మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల టైపు 2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది.
  • కాన్సర్ కు: బార్లీలో ఉండే అధిక ఆల్కలైన్, శక్తివంతమైన యాంటీ-ఆక్సిడేటివ్, ఫైటోకెమికల్, ఫ్లేవినోయిడ్ మరియు క్లోరోఫిల్ ప్రభావాల వలన దానికి క్యాన్సర్ కణాలను నివారించే చర్యలు ఉంటాయి. ఒక అధ్యయనంలో బార్లీ నీళ్లను త్రాగడం వలన రొమ్ము క్యాన్సర్ కణాల వేగవంతమైన పెరుగుదల తగ్గిందని తెలిసింది.
  • యూరిక్ ఆసిడ్ కోసం: యూరిక్ ఆసిడ్ అనేది శరీర జీవక్రియల వల్ల ఏర్పడే ఉప-ఉత్పత్తి. ఇది అధికంగా చేరడం వలన గౌట్ వంటి సమస్యలు ఏర్పడతాయి. బార్లీ నీళ్లు రక్తంలోని యూరిక్ ఆసిడ్ ను తగ్గిస్తాయి అలాగే శరీరంలోని అదనపు యూరిక్ ఆసిడ్ ను ఫిల్టర్ చేస్తాయి.
  • మూత్రనాళ ఇన్ఫెక్షన్ కోసం: బార్లీ నీళ్లు మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించి  మూత్రనాళ మార్గమును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతేకాక ఇవి సమర్ధవంతమైన డైయూరెటిక్ గా పనిచేస్తాయి మరియు మూత్రపిండాల నుండి టాక్సిన్లను బయటకు తొలగిస్తాయి.
  • చర్మం కోసం: బార్లీ నీళ్లు చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుతాయి. దీనిలో అనేక యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి మరియు జింక్, సెలీనియం వంటి ఖనిజాలు కూడా ఉంటాయి అవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి మరియు మొటిమలను తగ్గించడానికి సహాయం చేస్తాయి.
  • బార్లీ నీళ్లు యాంటీఇన్ఫలమేటరీగా కూడా పనిచేస్తాయి తద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి సమస్యలకు సహజ ఔషధంగా పనిచేస్తాయి. బార్లీ నీళ్లు రక్తపోటు తగ్గిస్తాయి మరియు జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి. బార్లీలో పొటాషియం అధికంగా ఉండడం వలన గుండె ఆరోగ్యానికి కూడా సహాయంచేస్తుంది.

గుండెకు బార్లీ నీరు - Barley water for the heart in Telugu

బార్లీ నీటిని తీసుకోవడం వల్ల మెరుగైన రక్త స్నిగ్ధత మరియు ప్రవాహాన్ని పెంచడం ద్వారా థ్రోంబోసిస్ మరియు హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. బార్లీలోని ట్రిప్టోఫాన్ యొక్క జీవక్రియ హృదయ సంబంధ రోగులకు తగిన చికిత్సలను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు.

బార్లీలో పొటాషియం కూడా పుష్కలంగా ఉంది. పొటాషియం తీసుకోవడంవల్ల  పెరిగిన మంట మరియు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంతో సంబంధం కలిగి ఉంటుంది, ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని నివారించగలదు.

క్యాన్సర్ కోసం బార్లీ నీరు - Barley water for cancer in Telugu

అధిక ఆల్కలీన్, బలమైన యాంటీఆక్సిడేటివ్, ఫైటోకెమికల్స్, ఫ్లేవనాయిడ్లు మరియు క్లోరోఫిల్ యొక్క మిశ్రమ ప్రభావాల ద్వారా క్యాన్సర్ కణాల పెరుగుదలను బార్లీ నిరోధిస్తుంది. బార్లీ యొక్క ఫైటోకెమికల్ మిశ్రమాలు రొమ్ము క్యాన్సర్‌ వ్యాధిలో మంచి కణతినివారణా (యాంటీ-ట్యూమర్) ప్రభావాలను చూపుతాయి.

గ్రీన్ బార్లీ సారం కూడా యాంటీకాన్సర్ ప్రభావాన్ని కలిగి ఉన్నట్లు కనుగొనబడింది, ఎందుకంటే ఇది లుకేమియా, లింఫోమాతో పాటు మానవ రొమ్ము క్యాన్సర్ కణాలపై యాంటీప్రొలిఫెరేటివ్ మరియు ప్రోపోప్టోటిక్ విధులను చూపిస్తుంది.

2014 లో నిర్వహించిన ఒక అధ్యయనం రొమ్ము క్యాన్సర్ కణాలపై మొక్కల కణాల బయోయాక్టివ్ భాగాలు గ్లూకాన్ల (β-d-glucans) యొక్క ప్రభావాలను పరిశీలించింది. బార్లీ నీరు తాగడంవల్ల రొమ్ము క్యాన్సర్ కణాల వేగవంతమైన కణ విభజనను నిలిపివేయడానికి సహాయపడుతుందని అధ్యయనం కనుగొంది.

రోగనిరోధక వ్యవస్థకు బార్లీ నీరు - Barley water for the immune system in Telugu

బార్లీ నీటిలో విటమిన్లు మరియు యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. రోజూ బార్లీ నీటిని తీసుకోవడంవల్ల పుండ్లు, గాయాలు వేగవంతంగా మానడానికి మరియు శరీరం జలుబు మరియు ఫ్లూజ్వర వ్యాధులకు గురి కాకుండా నిరోధించడానికి సహాయపడుతుంది. అదనంగా, బార్లీ నీటిని, యాంటీబయాటిక్స్‌తో పాటు తీసుకున్నప్పుడు మందుల పనితీరు మరియు ప్రభావాన్ని ప్రోత్సహించడానికి సహాయపడుతుంది.

(మరింత చదవండి: రోగనిరోధక శక్తి పెంచే ఆహారాలు)

ఎముకలకు బార్లీ నీరు - Barley water for bones in Telugu

బార్లీలో కాల్షియం కూడా అధికంగా ఉంటుంది. కాల్షియం యొక్క హోమియోస్టాసిస్ ఆరోగ్యంనిర్వహణ మరియు వ్యాధినివారణలో శారీరక మరియు పాథోఫిజియోలాజికల్ ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది. బార్లీ నీరు తాగడం వల్ల మీకు తగినంత కాల్షియం లభిస్తుంది, తాద్వారా బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

అలసట కోసం బార్లీ నీరు - Barley water for fatigue in Telugu

బార్లీ నీరు తాగడంవల్ల అలసటతో పోరాడటానికి కూడా సహాయపడుతుంది. బార్లీ గింజ మొత్తంలో లుటోనారిన్ మరియు సాపోనారిన్ అనేవి రెండూ కలిసి 17% ఉంటాయి. ఈ రెండుపదార్థాలు యాంటీహైపోక్సియా (కణజాలాలకు ఆక్సిజన్ సరఫరాను పెంచుతాయి) మరియు మానవులపై అలసట నిరోధక ప్రభావాలను కలిగి ఉన్న ఫ్లేవోన్లుగా పనిచేస్తాయి.

కాబట్టి, ఆ అలసటను ఒక గ్లాసు బార్లీ నీటితో తరిమికొట్టండి.

యూరిక్ యాసిడ్ కోసం బార్లీ నీరు - Barley water for uric acid in Telugu

యురిక్ ఆమ్లం శరీర జీవక్రియ యొక్క ఉప-ఉత్పత్తి మరియు మూత్రపిండాల ద్వారా ఫిల్టర్ చేయబడుతుంది. అయినప్పటికీ, యూరిక్ ఆమ్లం అధికంగా చేరడం మూత్రపిండాల్లో రాళ్ళు మరియు గౌట్ ప్రమాదాన్ని పెంచుతుంది. బార్లీ నీరు బ్లడ్ యూరిక్ ఆమ్లాన్ని తగ్గిస్తుంది, ఇది మలం యొక్క జీవక్రియ, లిపిడ్ జీవక్రియ, కాలేయ పనితీరు మరియు మానవ యాంటీఆక్సిడెంట్ వ్యవస్థ యొక్క జీవక్రియకు కూడా ఉపయోగపడుతుంది. బార్లీ నీటి యొక్క మూత్రవిసర్జన ప్రభావాలు శరీరం నుండి అదనపు యూరిక్ ఆమ్లాన్ని ఫిల్టర్ చేయడం ద్వారా హైపర్‌యూరిసెమియా (రక్తంలో అదనపు యూరిక్ ఆమ్లం) ను మెరుగుపరుస్తాయి.

మూత్ర మార్గ సంక్రమణకు బార్లీ నీరు - Barley water for urinary tract infection in Telugu

బార్లీ నీరు యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ) ను నివారించడం ద్వారా మూత్ర మార్గాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. ఇంకా, ఇది శక్తివంతమైన మూత్రవిసర్జన మరియు మూత్రపిండాల నుండి విషాన్ని తొలగించడంలో సహాయపడుతుంది. 151 హిస్పానిక్ మహిళలతో 2012 లో ఓ  గుణాత్మక అధ్యయనం జరిగింది. అధ్యయనంలో పాల్గొన్న వారికి యుటిఐకి సంబంధించిన అనేక రకాల లక్షణాలు ఉన్నాయి. అనేక ఇంటర్వ్యూలు జరిగాయి, ఇక్కడ పెద్ద సంఖ్యలో హిస్పానిక్ పురుషులు మరియు మహిళలు యుటిఐని నయం చేయడానికి వారు ఆధారపడిన ఉత్తమ గృహ నివారణలలో ఒకటి బార్లీ నీరు అని పేర్కొన్నారు.

అయినప్పటికీ, అటువంటి ప్రభావాలను చూపించే బార్లీ యొక్క ఖచ్చితమైన భాగాలను నిర్ణయించడానికి మరిన్నీ పరిశోధనలు అవసరం.

యాంటీ ఇన్ఫ్లమేటరీగా బార్లీ నీరు - Barley water as an anti-inflammatory in Telugu

బార్లీ నీరు వాపును తగ్గించే శక్తిని కలిగి ఉంది. బయోయాక్టివ్ సమ్మేళనం, సపోనారిన్ బార్లీ నీటి యొక్క వాపు-మంట నిరోధక లక్షణాలకు బాధ్యత వహించే ఒక ముఖ్యమైన క్రియాత్మక అంశం.

రియాక్టివ్ ఆక్సిజన్ జాతులను తటస్తం చేయడం ద్వారా మరియు కణితి నెక్రోసిస్ కారకాన్ని తగ్గించడం ద్వారా రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉన్న రోగుల చికిత్స కోసం యాంటీఆక్సిడెంట్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలతో కూడిన బార్లీ నీటిని ఓ సహజ  ఔషధంగా ఉపయోగించవచ్చని అధ్యయనాలు కనుగొన్నాయి. కణతి నెక్రోసిస్ కారకమనేది సెల్ సిగ్నలింగ్ ప్రోటీన్ పరిధీయ రక్తం మరియు రోగుల కీళ్ళలో ఉండే రసం (సైనోవియల్ ద్రవం) మంటను ప్రేరేపిస్తుంది.

బార్లీ నీరు చర్మానికి మేలు చేస్తుంది - Barley water benefits for the skin in Telugu

బార్లీ నీరు తాగడం వల్ల చర్మ ఆరోగ్యానికి అపారమైన ప్రయోజనాలు ఉంటాయి, ఎందుకంటే ఇందులో యాంటీఆక్సిడెంట్లు మరియు ఇతర పోషకాలు అధికంగా ఉన్నాయి. బార్లీలో ఉన్న జింక్ దెబ్బతిన్న చర్మాన్ని నయం చేయడానికి మరియు గాయాలను మాన్పడానికి సహాయపడుతుంది. బార్లీ నీరు తాగడం వల్ల కాలక్రమేణా ముఖ గాయాలు లేదా  పుండ్లు,గాయాలను తగ్గించడంలో కూడా సహాయపడుతుంది.

అలాగే, బార్లీలో పెద్ద మొత్తంలో సెలీనియం ఉండటంవల్ల చర్మం యొక్క స్థితిస్థాపకతను కాపాడటానికి మరియు స్వేచ్ఛా రాశుల  నష్టాన్ని నివారించడం ద్వారా చర్మాన్ని అరోగ్యాంగా (టోన్గా) ఉంచడానికి సహాయపడుతుంది. కాబట్టి మీరు ఆ మొటిమలను వదిలించుకోవాలనుకుంటే, బార్లీ నీరు తాగడం ప్రారంభించండి.

బార్లీ నీరు చర్మాన్ని నీటి తేమను కల్గి (హైడ్రేట్) ఉండేట్టుగా ఉంచడానికి కూడా సహాయపడుతుంది. బార్లీ నీరు వృద్ధాప్యాన్ని నివారించగలదని ఒక అధ్యయనం నుండి  తెలిసొచ్చిన ఆధారాలు సూచిస్తున్నాయి. పాల్గొనేవారికి బార్లీ మరియు సోయా బీన్లను 8 వారాల పాటు ఆహార పదార్ధంగా ఇచ్చారు మరియు ఆర్ద్రీకరణ ప్రభావాలను అంచనా వేశారు. అధ్యయనం చివరిలో, చర్మం హైడ్రేషన్ స్థాయిలలో గణనీయమైన పెరుగుదల గమనించబడింది. చర్మం ఆర్ద్రీకరణలో ఈ పెరుగుదల వృద్ధాప్యాన్ని నెమ్మదిస్తుందని పేర్కొంది.

రక్తపోటు కోసం బార్లీ నీరు - Barley water for blood pressure in Telugu

బార్లీలో కనిపించే బయోయాక్టివ్ సమ్మేళనం, ఫ్లేవనాయిడ్ సాపోనారిన్ రక్తపోటును నియంత్రించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. రక్త ప్రవాహం మరియు జీర్ణక్రియను నియంత్రించడంలో బార్లీ నీరు సహాయపడుతుంది. సూపర్ ఆక్సైడ్ డిస్ముటేస్, లుటోనారిన్ మరియు సాపోనారిన్ ఉండటం వల్ల మానవ శరీరం యొక్క సాధారణ టాక్సిఫికేషన్ను క్రమబద్ధీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది.

జర్నల్ ఆఫ్ అమెరికన్ డైటెటిక్ అసోసియేషన్లో ప్రచురించబడిన 2006 లో నిర్వహించిన ఒక అధ్యయనంలో, కరగని ఫైబర్ అధికంగా ఉండే బార్లీ వంటి తృణధాన్యాలు తీసుకోవడంవల్ల  రక్తపోటును తగ్గించడానికి మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుందని కనుగొన్నారు.

(మరింత చదవండి: అధిక రక్తపోటు లక్షణాలు)

కొలెస్ట్రాల్ కోసం బార్లీ నీరు - Barley water for cholesterol in Telugu

క్రమం తప్పకుండా బార్లీ నీరు సేవించడంవల్ల మొత్తం కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది, ఎలాగంటే తక్కువ కొలత కలిగిన లిపోప్రొటీన్ (ఎల్‌డిఎల్) కొలెస్ట్రాల్‌ను ఇది మొదట తగ్గిస్తుంది కాబట్టి, అయితే అధిక-సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) కొలెస్ట్రాల్ స్థాయిలను గణనీయంగా పెంచుతుంది. బార్లీలో ఉన్న హెక్సాకోసానాల్ అనే బయోయాక్టివ్ సమ్మేళనం కొలెస్ట్రాల్ సంశ్లేషణను తగ్గించడం ద్వారా కొలెస్ట్రాల్ జీవక్రియను మెరుగుపరుస్తుంది.

బార్లీ నీటి వినియోగం మీద సీరం లిపిడ్ మరియు కొలెస్ట్రాల్ స్థాయిలలో ఏదైనా మార్పును గుర్తించడానికి మరియు రికార్డ్ చేయడానికి ఆరోగ్యకరమైన మరియు హైపర్ కొలెస్టెరోలెమిక్ పురుషులు మరియు మహిళలపై ఇటీవల ఒక అధ్యయనం జరిగింది. అధ్యయనం యొక్క వ్యవధి 4 నుండి 12 వారాలు, మరియు బార్లీ ఎల్‌డిఎల్‌తో పాటు మొత్తం కొలెస్ట్రాల్‌ను మరియు శరీరంలో ట్రైగ్లిజరైడ్ స్థాయిలను గణనీయంగా తగ్గిస్తుందని తేల్చింది.

(మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)

చక్కెరవ్యాధికి బార్లీ నీరు - Barley water for diabetes in Telugu

బార్లీ నీరు ఆక్సిజన్ లేని స్వేచ్చారాశుల్ని (ఫ్రీ రాడికల్స్‌ను) తటస్తం చేస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు డయాబెటిక్ రోగుల ప్యాంక్రియాస్ ఎండోక్రైన్‌ను బలహీనపరుస్తుంది. బార్లీలో జీవశాస్త్రపరంగా చురుకైన సమ్మేళనాలు ఉన్నాయి, ఇవి హైపర్గ్లైసీమియాను (రక్తంలో చక్కెర పెరగడమనే రుగ్మత) నియంత్రించడంలో సహాయపడతాయి.

మధుమేహం విషయంలో రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రించగల అటువంటి భాగం సపోనారిన్. బార్లీ కణాలలోని పాలిమైన్లు ఒత్తిడి పరిస్థితులలో పెరుగుతాయి మరియు ఇది ఇలాంటి ఇన్సులిన్ పనితీరు మరియు రక్తంలో గ్లూకోజ్ తగ్గించే ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

బార్లీలో మెగ్నీషియం మరియు కాల్షియం రెండింటిలోనూ పుష్కలంగా ఉంది. యునైటెడ్ స్టేట్స్లో ఆఫ్రికన్ అమెరికన్ మహిళలపై 2006 లో ఒక అధ్యయనం జరిగింది. ఇది మెగ్నీషియం మరియు కాల్షియం అధికంగా ఉన్న ఆహారం తినడం మరియు టైప్ 2 డయాబెటిస్ సంభవించే ప్రమాదం మధ్య సంబంధాన్ని పరీక్షించింది. 41,186 మంది మహిళల ఆహార పౌనహ్పున్య (frequency) నమూనాలను ఈ అధ్యయనం గమనించింది మరియు మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు, ముఖ్యంగా తృణధాన్యాలు రోజువారీ వినియోగం టైప్ -2 డయాబెటిస్ యొక్క తక్కువ ప్రమాదంతో ముడిపడి ఉందని కనుక్కొంది.

బరువు తగ్గడానికి బార్లీ నీరు - Barley water for weight loss in Telugu

బరువు కోల్పోయే విషయానికి వస్తే బార్లీ నీరు ఎంతో సహాయపడుతుంది. బార్లీలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది మరియు కొవ్వు, కొలెస్ట్రాల్ మరియు చక్కెర శాతం చాలా తక్కువగా ఉంటుంది. ఇది అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలతో నిండి ఉంటుంది. ఈ లక్షణాలు బార్లీని బరువు తగ్గడానికి అనువైన పోషకంగా మారుస్తున్నాయి . 

కేలరీలు కాల్చివేసి వాటిని తగ్గించుకోవడానికి బార్లీ నీటిని తాగడం అనేది ఇటీవల బాగా ప్రాచుర్యం పొందింది. సమర్థవంతమైన బరువు తగ్గే జీవక్రియను వేగవంతం చేయడానికి ప్రతిరోజూ 2 నుండి 3 గ్లాసుల బార్లీ నీటిని తీసుకోవచ్చు.

క్రమం తప్పకుండా బార్లీ నీరు తాగితే ఇది ఊబకాకాయం ప్రమాదాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.

నిమ్మకాయ తేనెతో కలిపిన బార్లీ నీటిసేవనం కేలరీలు అధికంగా ఉండే పానీయాలకు ఓ అద్భుతమైన ప్రత్యామ్నాయం.

(మరింత చదవండి: బరువు కోల్పోయే డైట్ చార్ట్)

బార్లీ నీటిని తయారు చేసుకోవడానికి దశల వారీగా ఒక వివరణాత్మక విధానం క్రింద వివరించబడింది.

  • పావు కప్పు బార్లీ గింజల్ని రాత్రిపూట నీటిలో నానబెట్టండి.
  • బార్లీ గింజలను సుమారు 4 కప్పుల నీటిలో ఒక సాస్పాన్లో (in a sauce pan) వేడి చేసి మరిగించాలి.
  • మిశ్రమంలో ఒక చిటికెడు ఉప్పు వేసి బార్లీ సుమారు 30 నిమిషాలపాటు బాగా ఉడకనివ్వండి.
  • నీటిని ఒక గ్లాసులోకి వడకట్టి, ఆ నీటిని పూర్తిగా చల్లబరచండి. 
  • రుచిని పెంచడానికి మీరు నిమ్మరసం, దాల్చినచెక్క, తేనె మరియు అల్లం వంటి వాటిని జోడించవచ్చు లేదా సాదా బార్లీ నీటినే తాగండి.
  • అలాగే, (వడగట్టగా మిగిలిన) బార్లీ గింజల్నిపారవేయడానికి బదులుగా, మీరు వాటిని రుబ్బడం లేదా మాష్ చేసి వాటిని స్మూతీస్ మరియు కూరలకు గట్టిపడే ఏజెంట్‌గా ఉపయోగించవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

బార్లీ నీటి ప్రయోజనాల గురించి  మనం ఇప్పుడు తెలుసుకున్నాము. ఏదేమైనా, నిపుణులు పర్యవేక్షించని బార్లీ నీటిసేవనం  మరియు అధికంగా తీసుకోవడంవల్ల కొన్ని తీవ్రమైన దుష్ప్రభావాలను కల్గిస్తుంది, ఆ దుష్ప్రభావాలు క్రింద వివరంగా చర్చించబడ్డాయి.

  • బార్లీ నీటిని ఎక్కువగా తాగడంవల్ల ఉబ్బరం, గ్యాస్ ఏర్పడటం మరియు కొన్నిసార్లు విరేచనాలు కూడా కలుగుతాయి.
  • బార్లీ నీటి యొక్క మరొక సాధారణ దుష్ప్రభావం అలెర్జీలు మరియు దద్దుర్లు, మంట, వాచి, పాలిపోయిన ఎర్ర దద్దుర్లు, కళ్ళమంటతో పాటు, కనురెప్పలు, ముక్కు, చేతులు, కాళ్ళ వాపులు మరియు తీవ్ర ప్రక్రియ అఘాతం (అనాఫిలాక్సిస్) వంటి ఇతర లక్షణాలు ఏర్పడతాయి. ఈ మధ్య కాలంలో హైపర్సెన్సిటివిటీ లేదా అలెర్జీ కేసులలో, బార్లీ నీటి రోజువారీ వినియోగాన్ని నియంత్రించాలి. మీ రోజువారీ ఆహారసేవనలో బార్లీ నీటిని చేర్చే ముందు మీ వైద్యుడి అభిప్రాయాన్ని పొందడం మంచిది.
  • బార్లీ ధాన్యం బేకరీలలో పనిచేసే ప్రజలలో ‘బేకర్స్ ఆస్తమా’ అనే తీవ్రమైన శ్వాసకోశ అలెర్జీని కలిగిస్తుంది. బార్లీ నీటిని తయారుచేసేటప్పుడు, బార్లీ పిండికి గురికాకుండా ఉండేట్లు జాగ్రత్తగా ఉండాలి.
  • ఉదరకుహర వ్యాధి (చిన్నపేగులకు వచ్చే వ్యాధి) ఉన్నవారు బార్లీ నీటిని సేవించకూడదు. ఉదరకుహర వ్యాధి ముఖ్యంగా గ్లూటెన్ అసహనం వల్ల కలిగే గోధుమ అలెర్జీ. బార్లీలో పెద్ద మొత్తంలో గ్లూటెన్ ఉంది, అది ఈ  రుగ్మతను మరింత దిగజార్చుతుంది.
  • మీరు గర్భవతులైతే, మీ వైద్యుడితో సరైన సంప్రదింపులు జరిపిన తర్వాత మాత్రమే బార్లీ నీటిని తాగాలి.

వనరులు

  1. Zhigang Han et al. Association mapping for total polyphenol content, total flavonoid content and antioxidant activity in barley. BMC Genomics. 2018; 19: 81. PMID: 29370751
  2. Yawen Zeng et al. Preventive and Therapeutic Role of Functional Ingredients of Barley Grass for Chronic Diseases in Human Beings. Oxid Med Cell Longev. 2018; 2018: 3232080. PMID: 29849880
  3. Byun AR et al. Effects of a Dietary Supplement with Barley Sprout Extract on Blood Cholesterol Metabolism. Evid Based Complement Alternat Med. 2015;2015:473056. PMID: 26101533
  4. Hokazono H, Omori T, Yamamoto T, Akaoka I, Ono K. Effects of a fermented barley extract on subjects with slightly high serum uric acid or mild hyperuricemia. Biosci Biotechnol Biochem. 2010;74(4):828-34. Epub 2010 Apr 7. PMID: 20378966
  5. Kubatka P et al. Young Barley Indicates Antitumor Effects in Experimental Breast Cancer In Vivo and In Vitro. Nutr Cancer. 2016 May-Jun;68(4):611-21. PMID: 27042893
  6. Ikeguchi M et al. Effects of young barley leaf powder on gastrointestinal functions in rats and its efficacy-related physicochemical properties. Evid Based Complement Alternat Med. 2014;2014:974840. PMID: 25114709
  7. Bamba T et al. A new prebiotic from germinated barley for nutraceutical treatment of ulcerative colitis. J Gastroenterol Hepatol. 2002 Aug;17(8):818-24. PMID: 12164955
  8. United States Department of Agriculture Agricultural Research Service. Full Report (All Nutrients): 20004, Barley, hulled. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
Read on app