మన శరీరంలో 60 నుండి 70 శాతం వరకూ నీరు ఉంటుంది. మరలాంటపుడు, ప్రతిరోజూ మనమెందుకు నీరు త్రాగాలి?

ఎందుకంటే, మనం నిరంతరం చెమట, మూత్రం మరియు ఇతర వ్యర్ధాల ద్వారా నీటిని శరీరం నుండి కోల్పోతున్నాం గనుక. మరియు నీటిని మనం రోజువారీ కార్యకలాపాలు మరియు ఇతర విధుల్లో కూడా ఉపయోగిస్తున్నాము. శరీరానికి నీరు చాలా అవసరం కాబట్టి, నీటిని తరచుగా ‘జీవిత అమృతం’ అని పిలుస్తారు. ఈ అద్భుత ద్రవం లేకుండా జీవించడం అసాధ్యం. మనుగడకు మరియు మనిషి శరీరం సక్రమంగా పనిచేయడానికి తగినంత ఆర్ద్రీకరణ (hydration)  అవసరం.

కానీ, మనం నిజంగా ఒక రోజులో ఎంత నీరు త్రాగాలి? తెలుసుకోవడానికి ముందుకు చదవండి.

 1. తగినంత నీటిని ఎందుకు తాగాలి - Why have enough water in Telugu
 2. రోజులో ఎన్ని లీటర్ల నీరు తాగాలి - How many litres of water in a day in Telugu
 3. ప్రతి రోజు 8 గ్లాసుల నీటి ప్రామాణిక లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి - How to meet the standard goal of 8 glasses of water each day
 4. నీరు ఎప్పుడు త్రాగాలి - When to drink water in Telugu
 5. శరీర బరువు ప్రకారం ఎంత నీరు త్రాగాలి - How much water to drink according to body weight in Telugu
రోజుకు మనమెన్ని లీటర్లు లేదా గ్లాసుల నీరు తాగాలి వైద్యులు

గ్లాసులకొద్దీ నీటిని ఎందుకు తాగాలి అని మీరు ఇంకా ఆలోచిస్తుంటే, ఈ విభాగం మీ ప్రశ్నలకు కొన్ని శాస్త్రీయమైన ఆధారాలతో పాటు సమాధానాల్నిస్తుంది.

శరీరం పనులకు నీరు అవసరం

శరీరంలో ప్రతి కణానికి నీరు ఒక ముఖ్యమైన అంశం మరియు ఇది పోషకాల రవాణా మరియు శోషణకు సహాయపడుతుంది. ఇది శ్వాసక్రియ మరియు విసర్జన వంటి అనేక శరీర విధులను నియంత్రిస్తుంది మరియు లాలాజలం మరియు సెరెబ్రోస్పానియల్ ద్రవం వంటి ఇతర శరీర ద్రవాల సంశ్లేషణకు సహాయపడుతుంది. ఇవి వరుసగా జీర్ణక్రియ మరియు మెదడు పనితీరుకు అవసరం.

నీరు మీ శక్తి స్థాయిలను పెంచుతుంది

2 లీటర్ల నీరు తాగడంవల్ల మీ శక్తి స్థాయిలు 400 జూల్స్ వరకు పెరుగుతాయని పేర్కొంటూ అనేక వైద్య అధ్యయనాలు ఈ వాస్తవాన్ని సమర్థించాయి. కాబట్టి, మీరు తరచుగా వ్యాయామం చేస్తుంటే లేదా బరువు తగ్గడం మరియు కేలరీల తగ్గింపును లక్ష్యంగా చేసుకుని ప్రయత్నిస్తుంటే మీరు ఎక్కువ నీరు తాగడం చాలా ముఖ్యం. అంతేకాక, అలసటను తొలగించడం వలన మీ శారీరక పనితీరును మెరుగుపరచడంలో నీరు సహాయపడుతుంది.

నీరు మెదడు పనితీరును పెంచుతుంది మరియు మీ మానసిక స్థితిని ఉత్తేజపరుస్తుంది 

ఇటీవలి అధ్యయనం ప్రకారం, నిర్జలీకరణానికి-క్షీణించిన జ్ఞానానికి సంబంధం ఉంది. కాబట్టి, తగినంత నీరు తాగడం అనేది ఈ పరిస్థితిని తిప్పికొట్టగలదు. అంతేకాక, త్రాగునీరు మంచి ఏకాగ్రతను సాధించడంలో సహాయపడుతుంది, ఇది మీ విద్య లేదా పని పనితీరును మెరుగుపరుస్తుంది. కొన్ని ఇటీవలి అధ్యయనాల ప్రకారం, నీరు తాగడం అనేది మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుందని నిరూపించాయి.

మేలైన జీర్ణక్రియకు నీరు తాగడం తోడ్పడుతుంది

జీర్ణక్రియ ప్రక్రియలో పాల్గొన్న ఎంజైమ్‌ల సంశ్లేషణలో నీరు సహాయపడుతుంది మరియు జీర్ణక్రియ యొక్క మొత్తం ప్రక్రియపై ఇతర పరోక్ష మరియు ప్రత్యక్ష ప్రభావాలను కలిగి ఉంటుంది. మలబద్ధకం మరియు గుండెల్లో మంట వంటి పరిస్థితులకు నీరు తాగడం చాలా సాధారణ నివారణ.

(మరింత చదవండి: అజీర్ణానికి చికిత్స)

నీరు మీ శరీరాన్ని నిర్విషీకరణ చేస్తుంది

మీ శరీరం నుండి విషతుల్యమైన వ్యర్థ ఉత్పత్తుల తొలగింపును నీరు నియంత్రిస్తుంది కాబట్టి, నీరు టాడడం నిర్విషీకరణకు ఎంతో సహాయపడుతుంది.

నీరు తాగడం మీ చర్మానికి మంచిది

తగినంతగా నీరు తాగడం వల్ల మీ చర్మం యొక్క ఆర్ద్రీకరణను పెంచడానికి మరియు చర్మ తత్వాన్ని (skin physiology) మెరుగుపరచడానికి సహాయపడుతుంది. నీళ్లు తాగడంవల్ల మీ చర్మాన్ని మృదువుగా మరియు సున్నితంగా ఉంచడంలో సహాయపడుతుంది మరియు ముడతలు మరియు వృద్ధాప్యం యొక్క ఇతర సంకేతాలను దరి చేరకుండా ఉంచుతుంది.

నీరు నొప్పిని తగ్గిస్తుంది

నిర్జలీకరణ (డీహైడ్రేషన్) ప్రేరిత తలనొప్పి నుండి ఉపశమనానికి నీరు తాగడం సహాయపడుతుంది మరియు కీళ్ళలో నొప్పిని నివారించడంలో కూడా నీళ్లసేవనం సహాయపడుతుంది.

అద్భుత ద్రవం (wonder liquid)గా వాసికెక్కిన నీటి యొక్క అనేక ఉపయోగాలలో పైన పేర్కొన్నవి కొన్ని మాత్రమే. 

Nasal congestion
₹224  ₹249  10% OFF
BUY NOW

రోజులో ఎన్ని లీటర్ల నీరు తాగాలన్న అంశానికి ఒక ప్రత్యేకమైన సమాధానం లేదు. ఇది మీ వయస్సు, లింగం మరియు శరీరతత్త్వం, నిర్మాణం కాకుండా మీ శారీరక శ్రమ స్థాయిలు, మీరు పనిచేసే వాతావరణం మరియు వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది.

అయితే, ప్రతిరోజూ కనీసం 8 నుండి 10 (ఎనిమిది ఔన్సుల గ్లాసు) గ్లాసుల నీరు తాగాలని సిఫార్సు చేస్తారు. దీనిని “8 * 8” నియమం అని గుర్తుంచుకోవచ్చు. లీటర్లలో, ఇది సుమారు 2 లీటర్లకు సమానమవుతుంది, కనీసం ఇంతమాత్రం నీరు మీకు అవసరమవుతుంది.

ప్రతిరోజూ పురుషులు 3 లీటర్ల నీరు, మహిళలకు 2.2 ఉండడం మంచిది.

కానీ, మీరు వీటిపై పూర్తిగా ఆధారపడతారని మరియు మీ శరీర అవసరాలను ఖాతరు చేయవద్దని కాదు దీని అర్థం. మన శరీరాలు దాహం యొక్క స్వాభావిక యంత్రాంగాన్ని కలిగి ఉంటాయి, ఇది మనం త్రాగవలసిన నీటి పరిమాణంపై మార్గనిర్దేశం చేస్తుంది.

ఏదేమైనా, మరొక ఆలోచనా విధానం ఏమిటంటే, దాహం చాలా ఆలస్యంగా మొదలవుతుంది మరియు మీకు దాహం రాకముందే మీకు చాలా నీరు ఉండాలి. ఈ కారణాల వల్ల, ఆరోగ్య నిపుణులు రోజంతా కొంత మొత్తంలో నీటిని పదేపదే సిప్ చేయాలని సిఫార్సు చేస్తారు.

ఇది కాకుండా, మీరు వేడి వాతావరణంలో లేదా తీవ్రమైన వ్యాయామం చేస్తే మీ శరీరానికి ఎక్కువ నీరు అవసరం అవుతుంది.

మీకు నీళ్లు తాగే అలవాటు లేకపోతే లేదా మీకు సాధారణంగా చాలా దాహం కలగకపోతే, మీరు తగినంత నీరు త్రాగటం మరచిపోయే అవకాశం ఉంది. దీనిని నివారించడానికి, మీరు రోజంతా మీ నీటి వినియోగాన్ని విభజించే నీటి తాగుడు షెడ్యూల్‌ను రూపొందించవచ్చు. కిందిది అనువైన షెడ్యూల్. అయితే, మీ శరీర అవసరాలు మరియు రోజువారీ దినచర్యల ప్రకారం మీ నీటి అవసరాలు మరియు సమయాలు మారుతూ ఉంటాయని మీరు గమనించవచ్చు.

ఉదయం 7.00 గంటలకు మొదటి గ్లాసు నీరు

మీ ఉదయపు అల్పాహారం తీసుకునే ముందు నిర్జలీకరణ (డీహైడ్రేషన్) స్థితిని తిప్పికొట్టడానికి మీరు మేల్కొన్న వెంటనే మొదటి గ్లాసు నీరు త్రాగాలి. ఈ సమయంలో, మీరు నీరు తాగడం యొక్క అదనపు ప్రయోజనాల కోసం వెచ్చని నీటిని ఎంచుకోవచ్చు. నీటి రుచిని పెంచడానికి మరియు ఉదయాన్నే నీళ్లు తాగడం, నీటి రుచి మీకు నచ్చకపోతే ఆ నీళ్ల  రుచిని మెరుగుపరచడానికి మీరు ఒక నిమ్మకాయ చీలిక (half-cut-lemon) ఆనీళ్లకు పిండుకోవచ్చు, దాల్చినచెక్క లేదా కొంత తేనెను కూడా ఆ నీటికి కలిపి తాగొచ్చు.

(మరింత చదవండి: తేనె మరియు వెచ్చని నీటి సేవనం ప్రయోజనాలు)

ఉదయం 9.00 గంటలకు రెండవ గ్లాస్ నీరు

మీ ఉదయపు అల్పాహారం తర్వాత గంటకు ఒక గ్లాసు నీరు తాగండి, భోజనానికి ముందు తగినంత సమయం ఉండేలా నిర్వహించుకోండి.

మధ్యాహ్నం 12.30 గంటలకు మూడవ గ్లాస్ నీరు

మధ్యాహ్నం భోజనానికి గంట ముందు ఓ పెద్ద గ్లాసు నీరు తాగండి. ఇలా భోజనానికి ముందు నీళ్లు తాగడంవల్ల మీ సంతృప్తిని మెరుగుపరుస్తుంది మరియు వివిధ పరిశోధకులు సూచించినట్లుగా ఊబకాయాన్ని నివారిస్తుంది. భోజన సమయంలో మీకు దాహం అనిపిస్తే మీ ఆహారంతో పాటు కొంచెం నీరు కూడా తీసుకోవచ్చు.

మధ్యాహ్నం 2.00 గంటలకు నాల్గవ గ్లాసు నీరు

మీ మధ్యాహ్నం భోజనం నుండి ఒక గంట గడిచింతర్వాత ఒక గ్లాసు నీరు తాగడంవల్ల రోజులో మీరు ముందుకు సాగడానికి వీలవుతుంది. ఇది మీ ఆహారం నుండి నీటిలో కరిగే పోషకాలను గ్రహించడానికి కూడా వీలవుతుంది.

సాయంత్రం 4.00 గంటలకు ఐదవ గ్లాస్ నీరు

సాధారణ టీకి బదులుగా, మీరు గ్రీన్ టీ లేదా అల్లం టీ వంటి ఆరోగ్యకరమైన ద్రవాహారాల్ని  ఎంచుకోవచ్చు, వీటిని నీటిలో కలిపి తాగొచ్చు. మీరు మీ సాధారణ టీ సేవిస్తున్నప్పటికీ, అది సరే, మీ రోజువారీ నీటి సేవనంలో మీరు తాగే అన్ని ద్రవాల గణన మీకుంటుంది.

సాయంత్రం 6.00 గంటలకు ఆరవ గ్లాస్ నీరు

రాత్రి భోజనానికి ఒక గంట ముందు ఒక గ్లాసు నీరు తాగడంవల్ల పొట్టకు మంచి సంతృప్తినిస్తుంది మరియు అతిగా తినకుండా ఉండటానికి కూడా ఇది సహాయపడుతుంది. ఇతర భోజనాలతో పోల్చితే మితిమీరినవిధంగా రాత్రిపూట భోజనం తినడంవల్లనే బరువు పెరగడానికి ఎక్కువగా కారణమవుతుంది.

రాత్రి 8.00 గంటలకు ఏడవ గ్లాసు నీరు

రాత్రి భోజనానంతరం గ్లాస్ పూర్తిగా నీరు తాగండి, ఇదెందుకంటే మధ్యాహ్నం భోజనానంతరం ఏ ప్రయోజనాల కోసం మనంనీళ్లు తాగుతామో ఇదీ అందుకే.

ఎనిమిదవ గ్లాస్ మరియు చివరి గ్లాస్ నీరు రాత్రి 10.00 గంటలకు

రాత్రిపూట నిర్జలీకరణాన్ని నివారించడానికి, ఆ రోజు ఎదుర్కొన్న ఒత్తిడిని, మీ మనస్సును శాంతపరచడానికి మరియు బాగా నిద్రపోవడానికి నిద్రపోయే ముందు ఒక గ్లాసు నీటిని తాగండి.

సాధారణ నీటి రుచి మీకు నచ్చకపోతే, మీరు ఒక నిమ్మకాయ ముక్క, కిరదోసకాయ ముక్కలు లేదా ఆపిల్, స్ట్రాబెర్రీ వంటి పండ్లు లేదా అల్లం మరియు దాల్చినచెక్క వంటి సుగంధ ద్రవ్యాలు కూడా నీటికి కలిపి ‘నిర్విషీకరణ నీటిని’ (detox water) తయారు చేసుకొని తాగవచ్చు. ఇది రోజంతా సాగిన మీ ఉత్త నీటి సేవనానికి ఒక మార్పుగా ఉండేందుకు సహాయపడుతుంది మరియు నిర్విషీకరణ యొక్క అదనపు ప్రయోజనాన్ని కూడా కలిగిస్తుంది.

నీటిసేవనాన్నిపెంచే మరో మార్గం ఏమిటంటే, ఒక పెద్ద నీటి బాటిల్‌ను ఎప్పుడూ మీ దగ్గర ఉంచుకుని, అప్పుడప్పుడు సిప్ చేస్తూ ఉండడం.

మీరు ఇప్పటికీ మీ దినచర్యలో నీటిని పుష్కలంగా తాగడాన్ని చేర్చలేకపోతే, పుచ్చకాయ, దోసకాయ, నారింజ, టమోటాలు, కోరిందకాయ (rasberry), అనాస పండు (పైనాపిల్) మొదలైన కొన్ని ఆహార పదార్థాలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.

మీరిప్పుడు, నీరు ఒక అద్భుత ద్రవమని అర్థం చేసుకున్నారు మరియు మీరు ప్రతిరోజూ తగినంత మొత్తంలో నీటిని తాగకుండా ఉండలేరు. మరి మీరు నీటిని ఎప్పుడు తాగాలి అని మీరు ఆలోచిస్తున్నారా? మీకు దాహం వేసినప్పుడల్లా తాగొచ్చునన్న ప్రాథమిక సమాధానం కాకుండా, ఈ విభాగం దీనికి సంబంధించి మీకు మార్గనిర్దేశం చేస్తుంది. ఆ అంశాలనే కిందిస్తున్నాం.

మీరు మేల్కొన్న వెంటనే ఒక గ్లాసు లేదా రెండు గ్లాసుల నీరు తాగడం - A glass or two of water right after you wake up in Telugu

ఏడు నుండి తొమ్మిది గంటలు సుదీర్ఘ నిద్ర తర్వాత, మీ శరీరాలు తరచుగా నిర్జలీకరణ స్థితిలో ఉంటాయి, దాన్ని మీరు అనుభూతి చెందవచ్చు లేక చెందకపోవచ్చు. కాబట్టి, మీరు లేచిన వెంటనే తగినంత నీరు తాగడం ముఖ్యం. ఇది రోజంతా నిర్జలీకరణం మరియు తలనొప్పిని నివారించడంలో సహాయపడుతుంది. ఉదయం అలా నీళ్లు తాగడంవల్ల రోజులో కొనసాగడానికి మీకు శక్తిని అందిస్తుంది.

కానీ, ఉదయంపూట తాగేందుకు ఉపయోగించే నీటి ఉష్ణోగ్రత ఎంత ఉండాలి?

సాధారణంగా, బరువు తగ్గాలని కోరుకునేవారికి ఉదయం వెచ్చని నీరు తాగేందుకు సిఫార్సు చేస్తారు, కాని, సాధారణమైన చల్లని నీరు (సాదా నీరు) తాగడంవల్ల కూడా మీకు సమానంగా జలీకరణం (హైడ్రేషన్) కల్గుతుంది. నిజానికి, చల్లటి నీరు తాగడంవల్ల దానికే స్వంతమైన ప్రయోజనాలనిస్తుంది. ఇది మీకు మరింత విశ్రమాన్ని (refreshness) మరియు శక్తిని కలిగిస్తుంది. అలాగే, మీరు నిర్జలీకరణంతో బాధపడుతుంటే, సరైన స్థాయిలో ఆర్ద్రీకరణను నిర్వహించడానికి 16’ కల్గిన చల్లటి నీరు తాగాలని పరిశోధకులు సిఫార్సు చేశారు. కొన్ని అధ్యయనాలు, బరువు తగ్గడానికి చాలా చల్లటి నీరు కూడా సహాయపడుతుందని సూచించాయి ఎందుకంటే, ఆ చల్లటి నీటిని సాధారణ ఉష్ణోగ్రతకు తీసుకురావడానికి మన శరీరం కొన్ని అదనపు కేలరీలను ఉపయోగిస్తుంది. ఇది మీ జీవక్రియను మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది.

(మరింత చదవండి: ఉదయం నీళ్లు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు)

Peppermint Essential Oil
₹386  ₹429  9% OFF
BUY NOW

భోజనానికి ముందు నీరు తాగండి - Have water before meals in Telugu

పగటిపూట, నీళ్ళు తాగడానికి సరైన సమయం మీ భోజనానికి ముందు, భోజనానికి తరువాత కాదు. భోజనానికి ముందు నీళ్లు తాగడంవల్ల ఉపయోగమేమంటే భోజనం సమయంలో నీరు సంతృప్తిని ప్రోత్సహిస్తుంది, దానివల్ల తక్కువగా తినడంజరుగుతుంది. ఇది మీకు గణనీయమైన బరువు తగ్గే ప్రయోజనాన్నిస్తుంది, దీనికి అనేక రకాల పరిశోధనలు కూడా మద్దతు ఇస్తున్నాయి. కొవ్వు అణువుల మెరుగైన ఆక్సీకరణ కారణంగా శరీర ద్రవ్య సూచిక (Body Mass Index-BMI)  మరియు శరీర బరువు తగ్గడానికి ఇది వీలు కల్పిస్తుంది. మీ భోజనంతో పాటు నీరు త్రాగటం వల్ల ఇలాంటి ప్రయోజనాలు ఉంటాయి.

భోజనం తర్వాత నీరు త్రాగటం, మీరు బరువు తగ్గాలని చూడకపోయినా సరే, ఉత్తమ పద్ధతి కాదు. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మందగిస్తుందని సూచించబడింది కాని ఇందుకు సాక్ష్యం పరిమితం. సాధారణంగా, భోజనం చేసిన 30 నిమిషాల వరకు నీరు తాగకూడదని సిఫార్సు చేయబడింది.

(మరింత చదవండి: జీర్ణక్రియను ఎలా మెరుగుపరచాలి)

వ్యాయామం చేసే ముందు నీరు త్రాగాలి - Drink water before exercising in Telugu

అంతటా ఆర్ద్రీకరణ (hydration)ను నిర్వహించడానికి ఏదైనా శారీరక శ్రమను ప్రారంభించడానికి ముందు ఒక గ్లాసు నీరు తాగడం ఒక ఉత్తమ పద్ధతి. ఇది కండరాల అలసటను నివారించడం ద్వారా మీ పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది వ్యాయామం తర్వాత మెరుగైన కండరాల పునరుద్ధరణకు మరింత సహాయపడుతుంది. దీన్ని సాధించడానికి, మీరు వ్యాయామం చేస్తున్నప్పుడు నీరు కలిగి ఉండటం కూడా చాలా ముఖ్యం. మీరు పరుగులో పాల్గొంటుంటే, మధ్యలో నీరు ఆగిపోకుండా ఉండటం మంచిది. బాడీ స్టోర్స్‌ను తిరిగి నింపడానికి మీరు పని చేసిన తర్వాత కూడా నీరు అవసరం. ఇది కాకుండా, మీరు ఎక్కువ గంటలు వ్యాయామం చేస్తుంటే, కోల్పోయిన ద్రవాలు మరియు ఎలక్ట్రోలైట్లను తిరిగి నింపడానికి శక్తి పానీయాలు సిఫార్సు చేయబడతాయి.

కానీ, వ్యాయామం చేసేటప్పుడు మీరు ఎంత నీరు త్రాగాలి?

మీరు తీవ్రమైన శారీరక శ్రమతో కూడిన పనులు, వ్యాయామాలు చేస్తే మీకు ఖచ్చితంగా అదనపు నీరు తాగే అవసరం పడుతుంది, ఎందుకంటే మీరు చెమట ద్వారా శరీరం నుండి ఎక్కువ నీటిభాగాన్ని కోల్పోతారు కాబట్టి. వ్యాయామ నియమావళిలో తేడాల కారణంగా ప్రశ్నలన్నింటికీ సరిపోయే సమాధానం ఏదీ లేదు కాబట్టి, మీ శిక్షణా సెషన్లలో అవసరమైన నీటి మొత్తాన్ని లెక్కించడంలో మీకు సహాయపడే ఒక సూత్రం మాదగ్గర ఉంది.

ప్రతి అరగంట వ్యాయామం కోసం, మీకు అదనంగా 0.35 లీటర్ల నీరు అవసరం. అంటే మీరు అరగంట వ్యాయామం చేస్తే, మీకు 0.35 అదనపు లీటర్ల నీరు అవసరం అవుతుంది. మీరు ఒక గంట పాటు వ్యాయామం చేస్తే మీకు 0.7 లీటర్లు ఎక్కువ నీరు అవసరం ఉంటుంది. ఇది మీ బరువు ఆధారంగా లెక్కించిన మొత్తానికి అదనంగా ఉండాలి.

నిద్రపోయే ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగడం - A glass of water before bedtime in Telugu

రాత్రి సమయంలో నిర్జలీకరణాన్ని నివారించడానికి మీరు నిద్రపోయే ముందుగా కొంచెంగా  నీళ్లు తాగడం మంచిది. రోజు చివరిలో ఒక గ్లాసు నీరు తాగడంవల్ల రోజు మొత్తంలో సంభవించిన నష్టాన్ని పూరించడానికి అదనంగా సహాయపడుతుంది.

నీటి సేవనం యొక్క ఒక ముఖ్యమైన నిర్ణయాధికారి మీ శరీర బరువు. అధిక శరీర బరువు ఉన్న వ్యక్తులకు సాధారణ పనితీరును నిర్వహించడానికి ఎక్కువ ద్రవాలు అవసరం అవుతాయి. అధిక బరువున్నవారు బరువు తగ్గడానికి సహాయపడటానికి ఎక్కువ నీరు తాగడం మంచిది. మీ బరువు ప్రకారం మీకు అవసరమైన నీటి మొత్తాన్ని లెక్కించడంలో మీకు సహాయపడే మార్గదర్శకం ఇక్కడ ఉంది:

 • మీ బరువును కిలోగ్రాములలో కొలవండి
 • ఇప్పుడు, మీరు రోజువారీగా ఎంత నీరు తాగాలో తెలుసుకోవడానికి మీ బరువును 30 సంఖ్యతో విభజించండి. అంటే మీరు 60 కిలోగ్రాముల బరువు ఉంటే, మీకు కనీసం 2 లీటర్ల నీరు కావాలి మరియు మీరు 90 కేజీల బరువు ఉంటే, సరైన శరీర పనితీరు కోసం ప్రతిరోజూ 3 లీటర్లు తాగడం అవసరం.
Dr. Padam Dixit

Dr. Padam Dixit

Ayurveda
10 Years of Experience

Dr Mir Suhail Bashir

Dr Mir Suhail Bashir

Ayurveda
2 Years of Experience

Dr. Saumya Gupta

Dr. Saumya Gupta

Ayurveda
1 Years of Experience

Dr. Jatin Kumar Sharma

Dr. Jatin Kumar Sharma

Ayurveda
5 Years of Experience

వనరులు

 1. Abdollah Hosseinlou et al. The effect of water temperature and voluntary drinking on the post rehydration sweating Int J Clin Exp Med. 2013; 6(8): 683–687. PMID: 24040477
 2. Jodi J. D. Stookey. Negative, Null and Beneficial Effects of Drinking Water on Energy Intake, Energy Expenditure, Fat Oxidation and Weight Change in Randomized Trials: A Qualitative Review . Nutrients. 2016 Jan; 8(1): 19. PMID: 26729162
 3. Vinu A. Vij, Anjali S. Joshi. Effect of ‘Water Induced Thermogenesis’ on Body Weight, Body Mass Index and Body Composition of Overweight Subjects . J Clin Diagn Res. 2013 Sep; 7(9): 1894–1896. PMID: 24179891
 4. Lappalainen R et al. Drinking water with a meal: a simple method of coping with feelings of hunger, satiety and desire to eat. Eur J Clin Nutr. 1993 Nov;47(11):815-9. PMID: 8287852
 5. Ministry of Health & Wellness. Physical Activity & Water – A Healthy Combination. Jamaica [Internet]
 6. Melissa C. Daniels, Barry M. Popkin. The impact of water intake on energy intake and weight status: a systematic review . Nutr Rev. 2010 Sep; 68(9): 505–521. PMID: 20796216
 7. U.S. Geological Survey. The Water in You: Water and the Human Body. U.S. Department of the Interior
 8. Boschmann M et al. Water-induced thermogenesis. J Clin Endocrinol Metab. 2003 Dec;88(12):6015-9. PMID: 14671205
 9. Barry M. Popkin, Kristen E. D’Anci, Irwin H. Rosenberg. Water, Hydration and Health . Nutr Rev. 2010 Aug; 68(8): 439–458. PMID: 20646222
 10. Na Zhang et al. Effect of Water Supplementation on Cognitive Performances and Mood among Male College Students in Cangzhou, China: Study Protocol of a Randomized Controlled Trial . Int J Environ Res Public Health. 2017 Sep; 14(9): 966. PMCID: PMC5615503
 11. Nathalie Pross et al. Effects of Changes in Water Intake on Mood of High and Low Drinkers. PLoS One. 2014; 9(4): e94754. PMID: 24728141
 12. Lídia Palma et al. Dietary water affects human skin hydration and biomechanics . Clin Cosmet Investig Dermatol. 2015; 8: 413–421. PMID: 26345226
Read on app