ప్రపంచవ్యాప్తంగా అతి సాధారణంగా తినే మాంసం ఏదంటే అది కోడి మాంసమే (చికెన్). ప్రపంచవ్యాప్తంగా వివిధ సంస్కృతుల వారు వారి వారి ప్రాంతీయ ప్రాధాన్యతల ప్రకారం కోడి మాంసాన్ని వివిధ రకాల కూరలు, వంటకాల్ని రుచికరంగా వండుకుని తింటారు. ఇతర రకాల మాంసాలతో పోలిస్తే కోడి మాంసం ఎంతో సరసమైనది మరియు సులభంగా లభిస్తుంది. వివిధ ఫాస్ట్ ఫుడ్ల తయారీల్లో కోడి మాంసం ఓ ప్రధానమైన పదార్ధంగా కూడా ఉపయోగించబడుతోంది. కోడి మాంసాన్ని వండే పాత్రను బట్టి మరియు ఏ రకం భోజనంలోకి (ఉదా: వరి అన్నం, గోధుమ  రొట్టె, సంకటి) కోడిమాంసం వండాలి అన్నదాన్నిబట్టి వివిధ రకాలైన కోడిమాంసం కూరల్ని, వంటల్ని వండుతారు. వీటిలో ఇంకా, గ్రిల్లింగ్, బేకింగ్, ఫ్రైయింగ్ మరియు బార్బెక్యూయింగ్ (పొయ్యిపై ఓ లోహపు చట్రం ఉంచి దానిపై మాంసాన్ని కాల్చి వండటం) విధానాల్లో కోడిమాంసం వంటకాలు, కూరల్ని వండుకుని తినడం జరుగుతోంది.

అనేక రకాలైన పక్షి మాంసాల్లో కోడి మాంసం కూడా ఒకటి. ఇంకా, ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలలో కోడి మాంసం ఉత్పత్తి కోసం ఆధునిక పద్ధతులను ఉపయోగించి కోళ్ల పెంపకం (పౌల్ట్రీ పెంపకం) వ్యసాయాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నారు. మరోవైపు, తక్కువ అభివృద్ధి చెందిన దేశాల్లో కోళ్ల పెంపకానికి ఇంకా సంప్రదాయ పద్ధతులనే ఆశ్రయిస్తున్నారు. కోడి మాంసం తినడమనేది క్రీస్తుపూర్వం 600 నాటిది. చరిత్ర మధ్యకాలం (క్రీ.శ 1000 నుండి 1400)లో  కోడిమాంసం సాధారణంగా లభించే ఓ మాంసం రకం. భారతదేశంలో కూడా కోడి మాంసం అన్ని వయసులవారు ఎక్కువగా ఇష్టపడే మాంసం. ఆయుర్వేద గ్రంథాలు "వాతం " మరియు "పిత్తం” దోషాల కోసం కోడి మాంసం తినడంవల్ల కలిగే ప్రయోజనాలను పేర్కొన్నాయి.

  1. కోడి మాంసం పోషక వాస్తవాలు - Nutritional facts about chicken in Telugu
  2. కోడి మాంసం యొక్క ఆరోగ్య ప్రయోజనాలు - Health benefits of chicken in Telugu
  3. ఆరోగ్యకరమైన కోడి మాంసం వంటకం వండే పధ్ధతి - Healthy Chicken Recipe in Telugu
  4. కోడి మాంసం దుష్ప్రభావాలు - Side effects of chicken in Telugu

కోడి మాంసం (చికెన్‌) వివిధ పోషకాలు, విటమిన్లు, ఖనిజాలను పుష్కలంగా కల్గి ఉంటుంది. దిగువ పట్టిక 100 గ్రాముల వండని పచ్చి కోడి మాంసంలోని పోషక వాస్తవాలను వివరిస్తుంది. తయారుచేసిన పద్ధతిని బట్టి వండిన మాంసం యొక్క పోషక విలువలు భిన్నంగా ఉండవచ్చు.

పోషకాలు

విలువ (100 గ్రాములకి)

శక్తి

143

పిండిపదార్థాలు

0.04

ప్రోటీన్లు

17,44

కొవ్వులు (మొత్తం లిపిడ్లు)

8.1

నీటి అంశము  

73,24

విటమిన్లు

విటమిన్ బి 1

0,109

విటమిన్ B2

0,241

విటమిన్ బి 3

5,575

విటమిన్ బి 6

0,512

విటమిన్ B9

1

విటమిన్ బి 12

0.56

విటమిన్ ఇ

0.27

విటమిన్ కె

<0.8

మినరల్స్

కాల్షియం

6

ఫాస్ఫరస్ 

178

పొటాషియం

522

మెగ్నీషియం

21

ఇనుము (ఐరన్)

0.82

జింక్

1.47

సోడియం

60

కొవ్వు ఆమ్లాలు (లిపిడ్లు)

కొవ్వులు (కొలెస్ట్రాల్)

86

సంతృప్త (సాచ్యురేటెడ్) ఆమ్లాలు   

2,301

ట్రాన్స్ కొవ్వు ఆమ్లాలు

0,065

మోనో అన్శాచ్యురేటెడ్ ఆమ్లాలు

3,611

పాలీఅన్శాచ్యురేటెడ్ ఆమ్లాలు

1.508

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

తగిన మొత్తంలో తీసుకుంటే కోడి మాంసం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. కావలసిన ఆరోగ్య ప్రయోజనాలను పొందడానికి కోడి మాంసం తయారుచేసే విధానం కూడా ముఖ్యమైనది. కోడి మాంసం తినడం వల్ల కలిగే కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు క్రింద చర్చించబడ్డాయి.

  • శరీర ద్రవ్యరాశిని పొందడానికి సహాయపడుతుంది: మాంసకృత్తుల్ని (ప్రోటీన్ల)  దండిగా కల్గిన వనరులలో కోడి మాంసం కూడా ఒకటి. ఉడికించిన లేదా ఇనుప తడకపై కాల్చిన లేదా పేల్చిన (గ్రిల్డ్ ) కోడి మాంసాన్ని తినడంవల్ల బరువు తగ్గడానికి మరియు శరీరంలో కండర ద్రవ్యరాశి పెంచుకోవడానికి దోహదపడుతుంది.  
  • ఎముకలు మరియు దంతాలను బలోపేతం చేస్తుంది: కోడి మాంసంలో భాస్వరం దండిగా లభిస్తుంది, కాల్షియంతో పాటు ఎముక ద్రవ్యరాశిలో ఎక్కువ భాగం ఉండే ఖనిజం భాస్వరం. మీ ఆహారంలో కోడి మాంసాన్ని చేర్చడం వల్ల ఎముకల నష్టం మరియు బోలు ఎముకల వ్యాధిని నివారిస్తుంది.
  • జలుబు మరియు మూసుకుపోయిన ముక్కు దిబ్బేడ తొలగిస్తుంది: వెచ్చని కోడి మాంసం సూప్ చలికి మంచి నివారణలలో ఒకటి. ఇది రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది మరియు రద్దీ మరియు గొంతు నుండి ఉపశమనం ఇస్తుంది.
  • రక్తహీనతను నివారిస్తుంది: చికెన్‌లో వికోడి మాంసంలో విటమిన్ బి, ఇ మరియు కె పుష్కలంగా ఉన్నాయి, ఇవన్నీ ఎర్ర రక్త  కణాల (ఆర్‌బిసిలు) ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి మరియు రక్తహీనత ప్రమాదాన్ని తగ్గిస్తాయి. కోడి మాంసంలోని  కాలేయం తగినంత మొత్తంలో ఇనుమును మన శరీరానికి అందిస్తుంది, తద్వారా ఇనుము లోపం ఉన్న రక్తహీనతను నివారిస్తుంది.
  • జుట్టు మరియు గోర్లు కోసం: విటమిన్ ఇ మరియు విటమిన్ కె లు పుష్కలంగా ఉన్న కోడి మాంసం జుట్టు రాలడాన్ని నివారించడంలో దోహదం చేస్తుంది, ఇంకా, జుట్టు పెరుగుదలను ఈ విటమిన్లు ప్రోత్సహిస్తాయి. పెళుసైన గోర్లు సమస్యను నివారించడానికి మరియు గోళ్ళను బలోపేతం చేయడానికి కూడా కోడిమాంసం సేవనం సహాయపడుతుంది.
  • మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది: కోడి మాంసంలో విటమిన్ బి దండిగా  ఉంటుంది, ఇది ఆందోళన మరియు నిరాశను నివారించడంలో సహాయపడుతుంది. ఇది అల్జీమర్స్ ప్రమాదాన్ని తగ్గించడంతో పాటు మెదడు పనితీరు మరియు జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుంది.

శరీర ద్రవరాశి లాభానికి కోడి మాంసం - Chicken for body mass gain in Telugu

కోడి మాంసం శరీర ద్రవ్యరాశిని నిర్వహించడానికి సహాయపడుతుంది, ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి. కోడి మాంసం మాంసకృత్తులకు (ప్రోటీన్) గొప్ప మూలం, శరీర ద్రవ్యరాశిని నిర్వహించడానికి ఈ మాంసకృత్తులు చాలా అవసరం. చికెన్‌లో తగినంత మొత్తాల్లో ఉండే మాంసకృత్తులు కడుపు నిండిన అనుభూతిని కల్గించి వ్యక్తికి ఉండే అనియంత్రిత లేదా అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్లను నిరోధిస్తాయి. అయితే, చికెన్‌ను గ్రిల్లింగ్ లేదా ఉడకబెట్టడం వంటి ఆరోగ్యకరమైన పద్ధతిలో వండటం అవసరం.

ఎముకలు మరియు దంతాలకు చికెన్ - Chicken for bones and teeth in Telugu

ఎముక సాంద్రతను కోల్పోవడం అనేది ప్రపంచవ్యాప్తంగా మధ్య వయస్కులలో, ముఖ్యంగా మహిళల్లో ప్రబలంగా ఉన్న ఒక సాధారణ రుగ్మత. ఎముక సాంద్రత కోల్పోవడం బోలు ఎముకల వ్యాధి వంటి ఇతర తీవ్రమైన పరిస్థితులకు దారితీయవచ్చు. చికెన్‌లో భాస్వరం కూడా పుష్కలంగా ఉంటుంది మరియు తగిన మొత్తంలో ఆహారంలో చేర్చడంవల్ల ఎముక ద్రవ్యరాశి మరియు సాంద్రతను పెంచడంలో సహాయపడుతుంది

ఆరోగ్యకరమైన దంతాలకు కాల్షియం మరియు భాస్వరం అత్యంత అవసరమైన పోషకాలు. దంత ఆరోగ్యం, దంతాల అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాస్వరం తగిన మొత్తంలో అవసరం. కోడి మాంసంలో లభించే భాస్వరం దంత క్షయాన్ని నివారించడంలో ప్రయోజనకరంగా ఉంటుందని కనుగొనబడింది.

చక్కెరవ్యాధికి కోడి మాంసం - Chicken for diabetes in Telugu

చక్కెరవ్యాధి (మధుమేహం లేక డయాబెటిస్)తో ఉన్నవారి ఆహార అవసరాలు తీర్చేందుకు ఆరోగ్యకరమైన మాంసకృత్తుల ఆహారాలు చాలా అవసరం. టైప్ 2 డయాబెటిస్ ఉన్న రోగులపై ఒక అధ్యయనం జరిగింది, అంతవరకూ వాళ్ళు నిత్యం తింటున్న ఆహారంలో భాగంగా ఎర్ర మాంసానికి బదులుగా కోడిమాంసం ఇవ్వడం జరిగింది. అటువంటి రోగులకు చికిత్స చేయడానికి ప్రత్యామ్నాయ వ్యూహాన్ని ఉపయోగించవచ్చని అధ్యయన ఫలితాలు సూచించాయి. చక్కెరవ్యాధి (డయాబెటిస్) నిర్వహణ కోసం అటువంటి వ్యక్తుల సాధారణ ఆహారంలో మాంసం యొక్క ఏకైక వనరుగా కోడి మాంసాన్ని ఉపయోగించడం ఈ వ్యూహంలో భాగంగా ఉంటుంది.

మూత్రపిండాలకు కోడి మాంసం - Chicken for kidney in Telugu

టైప్ 2 డయాబెటిస్ (చక్కెరవ్యాధి) ఉన్నవారిలో మూత్రపిండ రుగ్మతలు (కిడ్నీ సమస్యలు) సాధారణంగా కనిపిస్తాయి. అలాంటి వ్యక్తులు సాధారణంగా ఎక్కువసార్లు మూత్రవిసర్జన చేయడమనే సమస్యతో బాధపడుతుంటారు. అటువంటి వ్యక్తుల ఆహారంలో కోడి మాంసాన్ని మాత్రమే మాంసకృత్తుల (ప్రోటీన్) వనరుగా తినడంవల్ల ప్రయోజనకరమైన ఫలితాలను చూపించింది. కోడి మాంసం తిన్న రోగులలో మూత్రవిసర్జన రేటు గణనీయంగా తగ్గిందని అధ్యయన ఫలితాలు కనుగొన్నాయి. అదనంగా, మైక్రోఅల్బుమినూరియాతో బాధపడుతున్న రోగులు (మూత్రంలో అల్బుమిన్ పెరుగుదల, మూత్రపిండాల ద్వారా చిన్న మొత్తంలో ఫిల్టర్ చేయబడిన సీరం ప్రోటీన్) కూడా వారి మూత్రంలో అల్బుమిన్ అంశం తగ్గినట్లు కనుగొనబడింది.

క్యాన్సర్ కోసం కోడి మాంసం - Chicken for cancer in Telugu

కోడి మాంసం క్యాన్సర్‌ విరుద్ధంగా ప్రభావవంతంగా పని చేయగలదని కనుగొనబడింది. అవసరమైన మొత్తంలో కోడి మాంసం తినేవారికి క్యాన్సర్ రాకుండా ఉండటానికి మంచి అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. చికెన్‌లో ఉండే విటమిన్ బి 3 క్యాన్సర్ నిరోధకశక్తికి దోహదం చేస్తుందని నమ్ముతారు. అయినప్పటికీ, కోడి మాంసం యొక్క క్యాన్సర్ నిరోధకశక్తిని స్థాపించడానికి వివో అధ్యయనాల అవసరం ఉంది.

రక్తహీనతకు కోడి మాంసం - Chicken for anaemia in Telugu

కోడి మాంసం విటమిన్ బి , విటమిన్ ఇ , విటమిన్ కె వంటి విటమిన్లకు కూడా నిలయం.    ఈ విటమిన్లు రక్త కణాల ఉత్పత్తికి సహాయపడతాయి.

మన శరీరంలో ఇనుము లోపం వల్ల రక్తహీనత వస్తుంది. మన ఆహారంలో కోడి మాంసాన్ని, ముఖ్యంగా కోడి కాలేయం, ఓ భాగంగా చేసుకుని తినడంవల్ల, శరీరానికి అవసరమైన ఇనుము (ఐరన్) అనుబంధకాలు (సప్లిమెంట్లు) లభిస్తాయి. ఇనుము కల్గిన ఆహారాలు తినడంవల్ల రక్తానికి ఇనుము తోడై  రక్తహీనత మరియు ఇతర సంబంధిత రుగ్మతలకు చికిత్స లభిస్తుంది.

మానసిక ఆరోగ్యానికి కోడి మాంసం - Chicken for mental health in Telugu

ఉత్తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి విటమిన్ బి అవసరం. ఇది చికెన్‌లో పుష్కలంగా లభిస్తుంది. కోడి మాంసం తినడంవల్ల ఆందోళన, ఒత్తిడి మరియు ఇతర మానసిక ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనాలు కనుగొన్నాయి. కోడి మాంసం తినడంవల్ల పిల్లలు మరియు పెద్దలలో ఏకాగ్రత శక్తిని మెరుగుపర్చడానికి సహాయపడుతుందని ఓ అధ్యయనం తెలిపింది. కోడి మాంసం తినడంవల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల పురోగతిని తగ్గిస్తుందని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తున్నారు.

రోగనిరోధక వ్యవస్థకు కోడి మాంసం - Chicken for immune system in Telugu

చికెన్‌లో వివిధ పోషకాలు మరియు ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. రోగనిరోధక వ్యవస్థ యొక్క సరైన పనితీరు కోసం ఈ పోషకాలు తగిన మొత్తంలో మన శరీరానికి అవసరం. అందువల్ల, ఇది శరీరం యొక్క రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. అంతర్గత అవయవాలకు నష్టం కలిగించే స్వేచ్చా రాశులు (ఫ్రీ రాడికల్స్) వంటి విషాన్ని వదిలించుకోవడంలో కోడి మాంసం తినడమనేది ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది.

జలుబుకు కోడి మాంసం సూప్ - Chicken soup for cold

జలుబు వంటి అంటువ్యాధుల నుండి బయటపడటానికి కోడి మాంసంలోని ఖనిజాలు మరియు పోషకాలు చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. పైన చెప్పినట్లుగా, ఇది రోగనిరోధక వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది మరియు యాంటీబయాటిక్స్ మందులు మరింత సమర్థవంతంగా పనిచేయడానికి దోహదపడుతుంది. రద్దీగా ఉండే ముక్కు లేదా గొంతు నుండి ఉపశమనం పొందడానికి కోడి మాంసం సూప్ తాగాలని పోషకాహార నిపుణులు సిఫార్సు చేస్తారు, గొంతు గీరుకుపోవడమనేది సాధారణంగా జలుబుతో సంబంధం కలిగి ఉంటుంది.

శరీర కణజాలాలకు కోడి మాంసం - Chicken for body tissues in Telugu

విటమిన్లు మరియు ఖనిజాల లోపం శరీర కణాలు మరియు కణజాలాలకు నష్టం కలిగిస్తుంది. ఇది చర్మంపై పొడి పాచెస్ మరియు చర్మం పగుళ్లకు దారితీస్తుంది. శరీర కణాలు మరియు కణజాలాల పెరుగుదల మరియు నష్టం మరమ్మత్తు కోసం రిబోఫ్లేవిన్ (విటమిన్ బి 2) అవసరం. కోడి మాంసంలో కోడి యొక్క రొమ్ముభాగమాంసం (బ్రెస్ట్) మరియు కాలేయంలో ముఖ్యంగా విటమిన్ బి 2 పుష్కలంగా ఉంటుంది. కోడి మాంసం తినడంవల్ల శరీర కణాలకు నష్టం జరగకుండా సహాయపడుతుంది మరియు అరిగిపోయిన కణజాలాల పెరుగుదలను సమర్థవంతంగా ప్రోత్సహిస్తుంది.

ఆరోగ్యకరమైన జుట్టు మరియు గోర్లకు కోడి మాంసం - Chicken for healthy hair and nails in Telugu

ఆరోగ్యకరమైన గోర్లు మరియు జుట్టుకు విటమిన్ ఇ మరియు కె అవసరం. ఈ విటమిన్ల లోపం జుట్టు రాలడం మరియు గోర్లు పెళుసుగా తయారవడం వంటి వివిధ సమస్యలకు దారితీస్తుంది. చికెన్‌లో ఈ విటమిన్లు మంచి మొత్తంలో ఉంటాయి, దానివల్ల జుట్టు లేదా గోర్లు చిట్లకుండా వాటి ఆరోగ్యకరమైన పెరుగుదలను ప్రోత్సహించడానికి ఆహారంలో కోడిమాంసాన్ని చేర్చాలి.

బరువు నిర్వహణకు కోడి మాంసం - Chicken for weight management in Telugu

కోడి మాంసాన్ని తెల్ల మాంసం (white meat)గా పరిగణిస్తారు, అందువలన, ఇది మాంసకృత్తులకు (ప్రోటీన్లకు) ఆరోగ్యకరమైన మూలం. మన సరైన బరువు నిర్వహణ కార్యక్రమానికి మనం తినే ఆహారంలో తగిన మొత్తంలో మాంసకృత్తుల్ని (ప్రోటీన్లను) చేర్చడం అవసరం. సమర్థవంతంగా బరువు తగ్గడం లేదా బరువు నిర్వహణ పాలనను ప్రయత్నించడానికి సిద్ధంగా ఉన్నవారు తప్పనిసరిగా తమ దిననిత్య ఆహారంలో (రెగ్యులర్ డైట్‌లో) కోడిమాంసాన్ని చేర్చుకోవాలి. ఆరోగ్యకరమైన పదార్ధాలను ఉపయోగించి వండిన కోడి మాంసాన్ని తినడం చాలా ముఖ్యం. అనారోగ్యకరమైన కొవ్వులు తీసుకోకుండా వ్యాయామం చేయడానికి అవసరమైన పోషకాలను శరీరానికి అందజేయడంలో శుభ్రంగా వండిన కోడిమాంసం నిర్ధారిస్తుంది.

ఆరోగ్యకరమైన మరియు పోషకమైన పదార్ధాలను ఉపయోగించి తయారుచేసిన కోడి మాంసం వంట తినడంవల్ల నిజంగా ప్రయోజనకరంగా ఉంటుంది. మెరుగైన ఆరోగ్యం కోసం కోడి మాంసాన్ని వండే పద్ధతుల్లో స్టీమింగ్ (ఆవిరిపై వండడం), ఉడకబెట్టడం, గ్రిల్లింగ్ లేదా వేయించడం ఉన్నాయి. ఆరోగ్యకరమైన కోడి మాంసం వంటకం తయారు  చేయడం సరళమైనది మరియు వండటం కూడా సులభమే.

రెసిపీ కోసం కావలసినవి

  • ఒక మొత్తం కోడి (1 kg) ముక్కలుగా కట్ చేసినవి
  • క్యారెట్లు (2) ముక్కలుగా కట్ చేసినవి
  • క్యాబేజీ (1) ముక్కలుగా కట్ చేసినవి
  • బ్రోకలీ (2) పువ్వులు
  • బంగాళాదుంపలు (2) ముక్కలుగా కట్ చేసినవి
  • ఉల్లిపాయ (1) బాగా ముక్కలుగా కట్ చేసినవి
  • వెల్లుల్లి పాయలు (5-7) పేస్ట్ గా తయారు చేయడానికి
  • అల్లం పేస్ట్ (1 టీస్పూన్)
  • మిరియాల గింజలు  (1 టేబుల్ స్పూన్)
  • నిమ్మ కాయ (1)
  • నూనె (ఆయిల్) (1 టేబుల్ స్పూన్)
  • రుచికి తగినంత ఉప్పు

ఆరోగ్యకరమైన కోడి మాంసం కూర చేయడానికి దశలవారీ పధ్ధతి

  • కోడి మాంసం ముక్కలను సరిగ్గా కడగాలి.
  • నిమ్మకాయ రసం పిండి, కోడి మాంసానికంతా కలపండి.
  • వంట పాత్రను వేడెక్కించండి.
  • అందులో కోడి మాంసం ముక్కలు వేసి దానికి నూనెను చేర్చండి.
  • కట్ చేసుకున్న కూరగాయలు వేసి మిశ్రమాన్ని కలపండి.
  • ఇపుడు వెల్లుల్లి, అల్లం, మిరియాలు వేయండి. అవసరమైతే మిరియాలు కూడా చూర్ణం చేయవచ్చు.
  • రుచికి ఉప్పు కలపండి.
  • ఈ మిశ్రమాన్ని తక్కువ ఆవిరిపై 5-7 నిమిషాలపాటు ఉడకనివ్వండి.
  • కోడి మాంసం మరియు కూరగాయలు మునిగేలా అందులో నీరు కలపండి.
  • పాత్రపై మూత (lid) పెట్టి 20-25 నిమిషాలపాటు ఉడికించాలి.
  • మాంసం బాగా ఉడికిందో లేదో తనిఖీ చేసి వేడిగా వడ్డించండి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹799  ₹850  6% OFF
BUY NOW

కోడి మాంసం తినడంవల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అయినప్పటికీ, కోడిమాంసాన్ని అధికంగా మరియు అనారోగ్యకరమైన పద్ధతిలో తినడంవల్ల తరచుగా దుష్ప్రభావాలకు దారితీస్తుంది. కోడిమాంస సేవనం యొక్క కొన్ని దుష్ప్రభావాలు క్రింద ఇవ్వబడ్డాయి.

  • ఆహారం విషతుల్యమవడం (Food poisoning)
    కోళ్ల పెంపకం కర్మాగారం ద్వారా లభ్యమయ్యే (farm-raised chicken) కోడి మాంసం తరచుగా క్యాంపిలోబాక్టర్ మరియు సాల్మొనెల్లావంటి బ్యాక్టీరియాకు నిలయం కావచ్చు. ఈ బ్యాక్టీరియా మనిషికి హానికరం మరియు అనేక ఆరోగ్య సమస్యలను కలిగిస్తుంది. అందువల్ల, ఆహార నాణ్యత నియంత్రణ అధికారులు సురక్షితంగా ఆమోదించిన కోడి మాంసాన్నే కొనడం చాలా ముఖ్యం. అదనంగా, సరిగా ఉడకని (undercooked) కోడి మాంసం అటువంటి బ్యాక్టీరియాలను కూడా కల్గిఉంటే అది ఫుడ్ పాయిజనింగ్కు కూడా కారణం కావచ్చు.
  • క్రిమి కాలుష్యం (Contamination)
    బ్రాయిలర్ కోళ్లను తరచుగా క్వార్టర్స్‌లో పెంపకం చేస్తారు. ఈ బ్రాయిలర్ కోళ్లు ఎస్చెరిచియా కోలి అనే బ్యాక్టీరియాతో కలుషితమైన మల పదార్థాన్ని కలిగి ఉంటాయి. ఈ బాక్టీరియం విరేచనాలు వంటి పేగుసంబంధ ఇన్ఫెక్షన్లకు కారణమవుతుందని అంటారు. ఇది మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ మరియు శ్వాసకోశ వ్యాధులకూ కారణమవుతుంది. అందువల్ల, అటువంటి హానికరమైన బ్యాక్టీరియా యొక్క ఆనవాళ్లను తొలగించడానికి కోడి మాంసాన్ని సరిగ్గా శుభ్రం చేసి ఉడికించాలి.
  • రోగక్రిమి నాశక నిరోధకత (antibiotic resistance)
    రోగక్రిమి నాశక నిరోధకత కల్గిన బాక్టీరియా వైద్య ప్రపంచానికే రోతను (nuisance) కల్గిస్తోంది.  కొల్లపరిశ్రమలో పెరిగిన కోడి యొక్క (ఫార్మ్ బ్రీడ్ కోడి) మాంసం అంటువ్యాధుల నుండి రక్షించడానికి తరచుగా యాంటీబయాటిక్స్ ఇస్తారు. కాలక్రమేణా, బ్యాక్టీరియా ఒక నిర్దిష్ట యాంటీబయాటిక్స్‌కు నిరోధకతను సంతరించుకుంటుంది. యాంటీబయాటిక్స్ యొక్క జాడలతో కోడి మాంసం తీసుకోవడం పేగు బ్యాక్టీరియాతో సాధ్యమయ్యే ప్రతిచర్యలకు కారణమవుతుంది. అయితే, ఈ వాదనకు మద్దతు ఇవ్వడానికి మరింత పరిశోధన అవసరం అయినప్పటికీ, యాంటీబయాటిక్స్‌కు నిరోధకత కలిగిన సాల్మొనెల్లా యొక్క కొన్ని జాతులను పరిశోధకులు కనుగొన్నారు, వీటి సంతతితో కూడిన కోడిమాంసాన్ని తినడం వల్ల ఆ బాక్టీరియా మానవులకు బదిలీ చేయబడి ఉండవచ్చు.
  • కొవ్వులు (కొలెస్ట్రాల్)
    కోడి మాంసం ఆరోగ్యకరమైన మాంసంగా పరిగణించబడుతున్నప్పటికీ, దాని అధిక వినియోగం సీరం కొలెస్ట్రాల్ స్థాయి పెరుగుదలకు దారితీస్తుంది. కోళ్ల  పెంపకం పరిశ్రమలు-పొలాల్లో, (ఫార్మ్-బ్రెడ్) పెంచిన కోళ్ల మాంసం యొక్క కొవ్వును స్థానిక జాతి కోళ్లతో పోలిస్తే కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అంతేకాక, పెద్ద మొత్తం నూనె మరియు ఇతర కొవ్వులలో కోడి మాంసంకూరల తయారీ శరీరంలో సంతృప్త మరియు అసంతృప్త కొవ్వు ఆమ్ల స్థాయిని పెంచుతుంది. తత్ఫలితంగా, ఇది రక్తంలో అధిక కొలెస్ట్రాల్ను పెంచడం, దానివల్ల సంబంధిత హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • విషపూరిత లోహాలకు గురికావడం
    కోళ్ల పెంపకం కర్మాగారాలు, పొలాలల్లో కోళ్లకు తినిపించే దాణాలో పాషాణం (arsenic) ఉంటుంది. కోళ్ల దాణాలో వాటి యొక్క మంచి ఎదుగుదలను నిర్ధారించడానికి, పిగ్మెంటేషన్ మెరుగుపరచడానికి మరియు కోళ్ళలో అతిసారంనివారించడానికి ఈ పాషాణం అంశాన్నికలుపుతారు. ఈ  పాషాణంతో కూడిన ఆహారానికి మనుషులు బహిర్గతమైతే డయాబెటిస్, గుండె జబ్బులు , నాడీ సమస్యలు మరియు క్యాన్సర్ వంటి రోగాలను కలిగిస్తుంది.

వనరులు

  1. K.M. BEAVERS et al. EFFECT OF PROTEIN SOURCE DURING WEIGHT LOSS ON BODY COMPOSITION, CARDIOMETABOLIC RISK AND PHYSICAL PERFORMANCE IN ABDOMINALLY OBESE, OLDER ADULTS: A PILOT FEEDING STUDY. J Nutr Health Aging. 2015 Jan; 19(1): 87–95. PMID: 25560821
  2. Pijls LT, de Vries H, van Eijk JT, Donker AJ. Protein restriction, glomerular filtration rate and albuminuria in patients with type 2 diabetes mellitus: a randomized trial. Eur J Clin Nutr. 2002 Dec;56(12):1200-7. PMID: 12494305
  3. Gross JL et al. Effect of a chicken-based diet on renal function and lipid profile in patients with type 2 diabetes: a randomized crossover trial. Diabetes Care. 2002 Apr;25(4):645-51. PMID: 11919119
  4. de Mello VD et al. Long-term effect of a chicken-based diet versus enalapril on albuminuria in type 2 diabetic patients with microalbuminuria. J Ren Nutr. 2008 Sep;18(5):440-7. PMID: 18721739
  5. Pecis M, de Azevedo MJ, Gross JL. Chicken and fish diet reduces glomerular hyperfiltration in IDDM patients. Diabetes Care. 1994 Jul;17(7):665-72. PMID: 7924775
  6. Lauren T. Ptomey et al. Portion Controlled Meals Provide Increases in Diet Quality During Weight Loss and Maintenance. J Hum Nutr Diet. 2016 Apr; 29(2): 209–216. PMID: 25664818
Read on app