మన పొట్ట మీదున్న ‘నాభి’ నే ‘బొడ్డు’ అని కూడా పిలుస్తారు, దీన్నే ఆంగ్లంలో ‘బెల్లీ బటన్’ అంటారు. పొట్టపై లోనికి చొచ్చుకుని పోయినట్లు ఓ రంధ్రం ఆకారంలో ఉంటుంది బొడ్డు, లేదా ఈ బొడ్డు కొందరిలో పొట్టకు సమాంతరంగా చదునైనది గా కూడా ఉండవచ్చు లేదా పొట్ట పైకి పొడుచుకు వచ్చినట్లు కూడా ఉంటుంది. శిశువు పుట్టినపుడు ఈ బొడ్డు స్థానంలోనే ‘బొడ్డు తాడు’ (umbilical cord) ఉంటుంది  (బొడ్డు తాడు అనేది పిండానికి తల్లి నుండి మావి ద్వారా పోషకాన్ని అందించే త్రాడు). బిడ్డ పుట్టినప్పుడు ఈ బొడ్డు తాడు అనేది తల్లి-బిడ్డకు జతచేయబడి ఉంటుంది. వైద్యపరంగా, బొడ్డు ఓ ‘మచ్చ’ (scar)గా పరిగణించబడుతుంది. అయినప్పటికీ, చైనా వారి ‘ఆక్యుపంక్చర్’ వైద్యం మరియు భారతీయ ‘ఆయుర్వేద మందుల వైద్యం’ బొడ్డును ఉపయోగించి పాము కాటు ఆపద మరియు ఏలికపాము (రౌండ్‌వార్మ్స్) వంటి రుగ్మతలతో సహా అనేక వ్యాధులను విజయవంతంగా చికిత్స చేస్తాయి.

సంప్రదాయ భారతీయ యోగాలో బొడ్డును మానవ శరీరంలోని ఏడు ప్రధాన చక్రాలలో లేదా శక్తి బిందువులలో ఒకటిగా పేర్కొనబడింది. వివిధ రుగ్మతలకు చికిత్స చేసి నయం చేయడానికి ఆయుర్వేద వైద్యం బొడ్డులో వివిధ రకాల నూనెలను వేయమని సిఫారసు చేస్తుంది. వివిధ ప్రయోజనాలను పొందటానికి బొడ్డులో వేయదగిన నూనెల రకాలను మరియు వాటిని ఏయే విధానాల్లో బొడ్డులో వేయవచ్చో ఈ వ్యాసం చర్చిస్తుంది.

 1. బొడ్డులో నూనె వేయడం వల్ల కలిగే ప్రయోజనాలు - Benefits of putting oil in the belly button in Telugu
 2. బొడ్డులో నూనె వేసుకోవడం వల్ల కలిగే దుష్ప్రభావాలు - Side effects of putting oil in the belly button in Telugu

వివిధ ఆరోగ్య ప్రయోజనాల్ని పొందడానికి బొడ్డులో నూనెను వేయడం అనేది పురాతన పద్ధతుల్లో ఒకటి. నూనెను తగిన పద్ధతిలో బొడ్డులో వేయడాన్ని తెలుసుకోవడం, ఉదాహరణకు, ముఖ్యమైన నూనెలను పలుచన చేయడం ఎలాగో తెలుసుకోవడం కూడా ముఖ్యం. బొడ్డులో నూనె వేసుకోవడం  వల్ల కలిగే అనేక ప్రయోజనాలు క్రింద వివరించబడ్డాయి.

మృదువైన చర్మం కోసం బొడ్డులో నూనెను వేయడం - Putting oil in the belly button for a smooth skin in Telugu

మీ చర్మానికి సహజమైన  తేమను కల్గించడానికి నూనెలు అద్భుతంగా పని  చేస్తాయి. మన శరీరంలో సాధారణంగా మరచిపోయిన భాగాలైన బొడ్డు  మరియు కడుపు వంటి ప్రాంతంలో నూనెను వేసుకోవడంవల్ల ఆ నూనెలు బాగా పనిచేస్తాయి. శీతాకాలంలో గాలి విపరీతంగా పొడిగా ఉన్నప్పుడు ఇలా బొడ్డులో నూనె  వేసుకోవడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కొబ్బరి నూనె మరియు ఆలివ్ నూనెలు కొన్ని మంచి నూనె ఎంపికలలో ఉన్నాయి. ఈ నూనెల్లోని కొవ్వు ఆమ్లం కారణంగా అవి చర్మాన్ని మెత్తబరిచే (ఎమోలియంట్) ప్రభావాలను కలిగి ఉంటాయి. బొడ్డుమార్గం అనేది ఈ నూనెలు చర్మంలోకి లోతుగా వెళ్లి చర్మానికి  తేమను కల్పించడానికి ఓ ప్రత్యక్ష మార్గంగా పనిచేస్తుంది.

మోతాదు: ఉత్తమ ఫలితాల కోసం స్నానం చేసిన తర్వాత కొన్ని చుక్కల నూనెను మీ బొడ్డుపైన వేసి తర్వాత బొడ్డు మరియు కడుపుపైన సుతారంగా ​​రుద్దండి.

(మరింత చదవండి: కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు)

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long time capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

ప్రక్షాళన కోసం బొడ్డులో నూనె వేసుకోవడం - Putting oil in the belly button for cleansing in Telugu

బొడ్డును తరచుగా శుభ్రం చేసుకోవడాన్ని మనం సులభంగా మర్చిపోవటం జరుగుతుంటుంది. అయితే బొడ్డును శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఈ ప్రయోజనం కోసం ఉపయోగించే నూనెలు ఏవంటే జోజోబా, పొద్దుతిరుగుడు మరియు ద్రాక్ష విత్తనాల నూనెలు. ఈ నూనెలు చనిపోయిన చర్మాన్ని విప్పి అందులోని ధూళిని తొలగించడాన్ని సులభం చేస్తుంది.

మోతాదు: ఈ ప్రక్రియ కోసం కాస్త దూదిని తీసుకుని దానిపై 2-3 చుక్కలు నూనె వేసి బొడ్డును శుభ్రముపరచడానికి వాడండి కాని నొప్పి కల్గించేంత కఠినంగా లేదా గాయం అయ్యేంత గట్టిగా రాపిడి చేయకుండా జాగ్రత్తగా శుభ్రం చేయండి.

సంక్రమణ చికిత్సకు నాభిలో నూనె వేయడం - Putting oil in navel to treat infection in Telugu

సాధారణంగా బొడ్డు తేమగా ఉంటుంది మరియు తేమతో కూడిన బొడ్డు సూక్ష్మజీవులకు (బ్యాక్టీరియా) మరియు శిలీంధ్రాలకు ఓ మంచి నిలయం. అటువంటి పరిస్థితులలో బొడ్డులో సంక్రమణ సులభంగా అభివృద్ధి చెందుతుంది లేదా బొడ్డు ప్రాంతంలో గాయం లేదా పుండు అయితే అది నయం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. బొడ్డులో సరైన నూనెను వేస్తే అంటువ్యాధిని (ఇన్‌ఫెక్షన్‌ను) నయం చేసుకోవచ్చు. టీ చెట్టు నూనె (టీ ట్రీ ఆయిల్), కొబ్బరి నూనె మరియు యూకలిప్టస్ ఆయిల్ బ్యాక్టీరియాను సమర్థవంతంగా చంపగల ఉత్తమ నూనెల ఎంపిక. పేర్కొన్న ఈ నూనెలు యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీవైరల్ లక్షణాలను కల్గి సంక్రమణను నయం చేయగలవు.

 మోతాదు: పుండు మానేంతవరకూ లేదా సంక్రమణ నయమయ్యే వరకు 3 చుక్కల నూనెను బొడ్డులో వేస్తూ ఉండండి.

కడుపు నొప్పికి బొడ్డులో నూనె వేయడం - Putting oil in the belly button for stomach ache in Telugu

మీ బొడ్డులో నూనెను వేయడంవల్ల కడుపు నొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. బొడ్డు ప్రాంతం నుండి ఒత్తిడిని తొలగించడం ద్వారా ఇలా బొడ్డులో నూనె వేయడం పనిచేస్తుంది. అజీర్ణం, ఆహారం విషతుల్యమవడం (ఫుడ్ పాయిజనింగ్), వికారం, పొట్టలో పుండ్లు (గ్యాస్ట్రైటిస్), ఉబ్బ

రం మరియు విరేచనాలు వంటి లక్షణాలను నయం చేయడానికి బొడ్డులో నూనెను వేయవచ్చు. సాధారణ గ్యాస్ట్రిక్ సమస్యలతో బాధపడుతున్న వారికి, ఈ చిట్కా (లేదా పరిహారం) అద్భుతాలే చేస్తుంది. కడుపు నొప్పిని మటుమాయం చేయడానికి ఈ బొడ్డులో నూనె వేయడమనే ప్రక్రియ ద్వారా ఉత్తమంగా పనిచేసే నూనెలు పిప్పరమింట్ నూనె మరియు అల్లం నూనెలు, ఈ నూనెలకు నొప్పిని తగ్గించే లక్షణాలున్నాయి.

ఋతుస్రావ నొప్పులకు బొడ్డులో నూనె వేయడం - Putting oil in the belly button for menstrual cramps in Telugu

బొడ్డును మెత్తగా రుద్దడం (అంటే మసాజ్ చేయడం) వల్ల రుతుస్రావం నొప్పి (తిమ్మిరి) నుండి ఉపశమనం లభిస్తుంది. ఇది ఉదర కండరాలను సడలించడం ద్వారా మరియు గర్భాశయ సంకోచం వల్ల కలిగే అసౌకర్యాన్ని తగ్గించడం ద్వారా పనిచేస్తుంది. అలాగే, నూనెలో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి, ఇది నొప్పిని తొలగించడానికి పనిచేస్తుంది. పిప్పరమింట్, చీకటి మాను లేక తమాల మాను నూనె (సైప్రస్), క్లారి సేజ్ నూనె మరియు అల్లం నూనెల వంటి ముఖ్యమైన నూనెలను బొడ్డులో వేయడానికి తద్వారా మంచి ప్రయోజనం పొందడానికి ఉత్తమమైన నూనెలు.

మోతాదు: మీ బొడ్డులో 5-6 చుక్కల నూనె వేయాలి. మీ కడుపుపై ఈ ముఖ్యమైన తైలాన్ని మసాజ్ చేయడం వల్ల నొప్పి తొలగిపోయిన అనుభూతిని పొందవచ్చు.

సంతానానికి బొడ్డులో నూనె వేయడం - Putting oil in the belly button for fertility in Telugu

గర్భాశయం మరియు ఉదర కండరాల సడలింపును ప్రోత్సహించడం, ఫలదీకరణం కోసం అండవాహిక (ట్యూబ్) లోపల వీర్యాన్ని (స్పెర్మ్‌ను) రక్షించడం, వీర్యం యొక్క చలనశీలత మరియు గణనను పెంచడం మరియు క్రమరహిత ఋతుస్రావాల వంటి ముట్టు సమస్యలకు చికిత్స చేయడం ద్వారా ‘ఈ బొడ్డులో నూనెవేయడం’ అనే పరిహారం పనిచేస్తుంది. ముఖ్యమైన నూనెలు (essential oils) డామియానా నూనె, జామ ఆకు నూనె, జునిపెర్ లేదా క్లారి సేజ్ యొక్క నూనెలు బొడ్డుపై వేయడంవల్ల అద్భుతాలు చేస్తాయి. ఈ నూనెల్ని బొడ్డులో వేయడంవల్ల అవి శరీరంలో విశ్రాంతిని ప్రోత్సహించడం, వీర్యాన్ని రక్షించడం మరియు రుతు సమస్యలకు (ముట్టు సమస్యలు) చికిత్స చేయడం ద్వారా పని చేస్తాయి. మీ హార్మోన్లు కూడా నియంత్రించబడతాయి మరియు దానివల్ల, గర్భం ధరించే అవకాశాలు పెరుగుతాయి.

మోతాదు: దూదితో మీ బొడ్డులో 2-3 చుక్కల నూనెను వేయండి, మరియు బొడ్డు ప్రదేశం చుట్టూ ఒక నిమిషం పాటు మర్దన (మసాజ్) చేయండి.

పిగ్మెంటేషన్ కోసం బొడ్డులో నూనె వేసుకోవడం - Putting oil in the belly button for pigmentation in Telugu

వర్ణకవిధానం (పిగ్మెంటేషన్) అనేది లక్షలాది మంది మహిళలను పట్టి పీడిస్తున్నఅందానికి సంబంధించిన (చర్మ) వ్యాధి. దీనితో విసిగి వేసారిన కొంత సమయం తరువాత, క్రమ తప్పకుండా మీ చర్మవ్యాధి నిపుణుడితో కలిసే మీ సంప్రదింపులు (regular appointments) కూడా వ్యర్థం అని మీకు అనిపిస్తుంది. నిమ్మరసంలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది, కాబట్టి మీ చర్మం నుండి పిగ్మెంటేషన్ యొక్క అన్ని సంకేతాలను తొలగించడానికి నిమ్మ నూనెను ఉపయోగించడమే వివేకవంతమైన పని.

మోతాదు: ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజూ మీ బొడ్డులో 2-3 చుక్కల నిమ్మ నూనెను వేయండి.

మొటిమల నిర్మూలనకు నాభిలో వేప నూనెను వేసుకోవడం - Neem oil in navel for acne in Telugu

ఆయుర్వేద మందుల వైద్యం మొటిమలను వదిలించుకోవడానికి బొడ్డులో నూనె వేసుకొమ్మని సిఫారసు చేస్తోంది. మొటిమలను నయం చేయడానికి వేప నూనెను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాలు అందరికీ తెలుసు. బొడ్డులో నేరుగా నూనెను వేసుకోవడంవల్ల చర్మంలోనికి దాని ప్రత్యక్ష శోషణ జరుగుతుంది, తద్వారా, మొటిమల నిర్మూలనపై మెరుగైన ప్రభావం చూపుతుంది.

మోతాదు: ఉత్తమ ఫలితాలను సాధించడానికి ప్రతిరోజూ 2-3 చుక్కల వేప నూనెను బొడ్డులో వేయాలి.

సమతౌల్యాన్ని పునరుద్ధరించడానికి బొడ్డులో నూనె వేయడం - Putting oil in the belly button for restoring balance in Telugu

ఆయుర్వేదంలో, నాభిచక్రం శక్తికి ఓ ప్రధాన వనరు అన్న భావన ఉంది. నాభి (లేక బొడ్డు) మీ అతిపెద్ద కలలు, కల్పనలు మరియు లక్ష్యాలకు నిలయంగా భావించడం జరుగుతుంది. మీరు మీ సృజనాత్మకతతో సంబంధాన్ని పెంచుకోవాలంటే మీ నాభిని సమతుల్యంగా ఉంచుకోవాలి.

ఆయుర్వేదం ప్రకారం, మీరు నాభిని సమతుల్యం చేయడానికి రపీసీడ్ (rapeseed- రపీ గింజల) నూనెను ఉపయోగించవచ్చు. మీ బొడ్డులో కొన్ని చుక్కలు రపీ గింజల నూనెను వేసి మర్దన (మసాజ్) చేయండి. గంధపు చెక్క నూనె మరియు రోజ్‌వుడ్ నూనెలనే ముఖ్యమైన నూనెలను కూడా ఎక్కువ ప్రయోజనాలను పొందడానికి ఉపయోగించవచ్చు. మీ సృజనాత్మక శక్తిని పెంచడానికి వారానికి ఒకసారి ఇలా చేయండి.

బొడ్డులో నూనె వేయడంవల్ల అనేక ప్రయోజనాలున్నాయి. అయినప్పటికీ, నూనెను తగిన పద్ధతిలో వేసుకోకపోతే, లేదా ఉపయోగించకపోతే కొన్ని దుష్ప్రభావాలు తలెత్తుతాయి.

 • తులనాత్మకంగా బొడ్డు సున్నితమైన భాగమైనందున నేనెను రుద్దే ముందు ఆ నూనెను బాగా  కరిగించాలి. కరిగించని నూనెలు బొడ్డులో చికాకు కలిగించవచ్చు.
 • నూనెలను బొడ్డుపై వేసి మర్దన  చేసే ముందు చర్మం యొక్క కొద్ది భాగంపై (చిన్న ప్యాచ్ పైన) పరీక్షించడం చాలా ముఖ్యం, ఎందుకంటే కొంతమందికి ఇలా బొడ్డు పైన నూనె ను వేసి రుద్దడంవల్ల చర్మంపై దద్దుర్లు లేదా అసనీయతలు (అలెర్జీలు) రావచ్చు .

వనరులు

 1. Rupert F. Warren. Acid-Fast Infection of Umbilicus . Can Med Assoc J. 1951 Nov; 65(5): 475–476. PMID: 14879335
 2. Alexandrovich I et al. The effect of fennel (Foeniculum Vulgare) seed oil emulsion in infantile colic: a randomized, placebo-controlled study. Altern Ther Health Med. 2003 Jul-Aug;9(4):58-61. PMID: 12868253
 3. Shamkant B. Badgujar, Vainav V. Patel, Atmaram H. Bandivdekar. Foeniculum vulgare Mill: A Review of Its Botany, Phytochemistry, Pharmacology, Contemporary Application, and Toxicology . Biomed Res Int. 2014; 2014: 842674. PMID: 25162032
 4. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Definition & Facts for Constipation.
 5. Ying Zhao, Yan-Bo Yu. Intestinal microbiota and chronic constipation . Springerplus. 2016; 5(1): 1130. PMID: 27478747
 6. Kim JS1, Jo YJ, Hwang SK. [The effects of abdominal meridian massage on menstrual cramps and dysmenorrhea in full-time employed women]. [Article in Korean] Taehan Kanho Hakhoe Chi. 2005 Dec;35(7):1325-32. PMID: 16418559
 7. Wang TJ et al. The effect of abdominal massage in reducing malignant ascites symptoms. Res Nurs Health. 2015 Feb;38(1):51-9. PMID: 25558030
Read on app