ప్రతి స్త్రీ ఒక తల్లి కావాలని కలలు కంటుంది. కొందరు తల్లులు అవుతారు, కానీ కొందరి కి మాత్రం ఎప్పటికీ ఒక కలలనే ఉంటుంది. కొందరు మహిళలు చాలా సులభంగా గర్భం దాల్చుతారు, మరికొందరు గర్భాన్ని పొందడంలో చాలా సవాళ్లను ఎదుర్కొంటారు. మీరు కింది సమస్యలను ఎదుర్కొంటున్న వారిలో ఒకరు అయితే, మేము క్రింద పేర్కొన్న చిట్కాల నుండి మీకు సహాయం పొందవచ్చు.

 1. మీ ఆహారంలో కొవ్వులను చేర్చండి - Include fat in your diet in Telugu
 2. వైద్యుల సహాయం తీసుకునే ముందు గర్భం పొందడానికి ఎంత కాలం ప్రయత్నించాలి - How long to try to get pregnant before getting help in Telugu
 3. గర్భాన్ని పొందడానికి ఎంత సమయం పడుతుంది - How long does it take to get pregnant in Telugu
 4. జారినట్లు చేసే నూనెలను (lubricant) ఉపయోగించవద్దు - Do not use a lubricant in Telugu
 5. సరైన సమయంలో శృంగారం జరపండి - Have sex at the right time in Telugu
 6. గర్భధారణ కోసం శృంగారంలో ఎలా పాల్గొనాలి - How to have sex to get pregnant in Telugu
 7. గర్భనిరోధక మాత్రలు తీసుకోవడం ఆపేయండి - Stop taking contraceptive pills in Telugu
 8. గర్భధారణ కోసం ప్రయత్నిస్తున్నపుడు వేటికీ దూరంగా ఉండాలి - What to stay away from when trying to get pregnant in Telugu
 9. పురుషులు వీర్య కణాలా ఆరోగ్యాన్ని పెంచుకోవాలి - Men should boost sperm health in Telugu
 10. మీ లైంగిక ఆరోగ్యం పై దృష్టి పెట్టండి - Focus on your sexual health in Telugu
 11. ఆరోగ్యకరమైన దినచర్యను పాటించండి - Get a healthy routine in Telugu
 12. నీటిని పుష్కలంగా తాగండి - Drink plenty of water in Telugu
 13. ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినండి - Eat protein-rich food in Telugu
 14. మీ ఋతుచక్రం గురించి తెలుసుకోండి - Know your ovulation cycle in Telugu
 15. కార్భోహైడ్రాట్లను తీసుకోవడం ప్రారంభించండి - Start taking carbohydrates in Telugu
 16. సంపూర్ణ ఆహరం తీసుకోండి - Take complete diet in Telugu
 17. గర్భధారణ ముందు మీ శరీరాన్ని ఆరోగ్యంగా చేసుకోండి - Make your body healthy before getting pregnant in Telugu
 18. మీ గైనకాలెజిస్ట్ను కలవండి - Meet your gynecologist in Telugu
 19. Know your ovulation cycle
 20. గర్భాన్ని దాల్చడానికి శృంగారం తరువాత ఇవి చెయ్యరాదు - To get pregnant do not do this after having sex in Telugu
 21. Healthy Food for Sperm Production
 22. మీ సంతనొంత్పత్తి సామర్ధ్యాన్ని పెంచుకోవడానికి ప్రయత్నించండి - Try to improve your fertility in Telugu
 23. గర్భధారణకు ప్రయత్నిస్తున్నప్పుడు వేటిని నివారించాలి - What to avoid when trying to get pregnant in Telugu
 24. గర్భధారణ కోసం ఈ మందుల వాడకం ఆపండి - Stop taking these medicines to get pregnant in Telugu
 25. గర్భాన్ని పొందడానికి సరైన శృంగార భంగిమను ఎంచుకోండి - Choose the right sex position to get pregnant in Telugu

మన శరీరంలో కొవ్వు, ముఖ్యంగా అన్-సాచురేటెడ్ కొవ్వు అవసరం. ఇది శరీరానికి ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతుంది. శరీరం యొక్క సరైన పనితీరులో ఇది సహాయపడుతుంది. ఇది మన రక్తంలో లో చెడ్డ కొలెస్ట్రాల్ (ఎక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా HDL) స్థాయిని తగ్గిస్తుంది. HDL యొక్క పెరిగిన స్థాయి గుండె వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. అన్-సాచురేటెడ్ కొవ్వు మన ఎముకలలో కాల్షియం పెరుగుదలకు సహాయపడుతుంది, అందుకే అన్-సాచురేటెడ్ కొవ్వు మన ఎముకలకు కూడా చాలా ముఖ్యమైనది. ఎముకలకే కాకుండా, అన్-సాచురేటెడ్ కొవ్వు కాలేయం, ఊపిరితిత్తులు, మెదడు, నరములు మరియు రోగనిరోధక వ్యవస్థ వంటి ఇతర శరీర అవయవాలకు కూడా చాలా ముఖ్యమైనది.

గర్భిణీ స్త్రీ యొక్క శరీరానికి ప్రధానంగా కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్స్) అవసరం. అవి హార్మోన్ల యొక్క సాధారణ పనితీరులో సహాయపడతాయి మరియు గర్భాశయం (శిశువును మోసే ఒక పియర్ ఆకారపు బ్యాగ్-వంటి నిర్మాణం) యొక్క రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. అవి కూడా అండోత్సర్గము చక్రం (ovulation cycle) నియంత్రిస్తాయి మరియు గర్భాశయ మార్గాన్ని (యూనిమార్గం లో ఒక భాగం) ఆరోగ్యకరమైన ఉంచుతాయి. అందువలన, ఇవి అండంతో  వీర్య కణాలను (స్పెర్మ్ సెల్స్) విజయవంతంగా కలవడానికి సహాయపడతాయి. అన్-సాచురేటెడ్ కొవ్వు యొక్క ముఖ్యమైన సహజ వనరులు కొబ్బరి మరియు కొబ్బరి నూనె, ఆలీవ్లు మరియు ఆలివ్ నూనె, వెన్న, గుడ్లు, అవోకాడో,ఎండు పండ్లు, మొదలైనవి జంక్ ఫుడ్ మరియు శుద్ధి చేసిన నూనెలో వండబడిన ఆహార పదార్దాలు శరీరానికి హానికరం. అందువల్ల, సహజంగా లభించే అన్-సాచురేటెడ్ కొవ్వును మాత్రమే మీరు తినాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

35 ఏళ్ల లోపు వయస్సు ఉన్న మహిళలకు ఒక సంవత్సరం ప్రయత్నించినా కూడా గర్భం దాల్చక పోతే వారు వైద్యున్నీ సంప్రదించాలి. 35 ఏళ్ల పైన వయస్సు ఉన్నవారు ఆరునెలల తర్వాత కూడా గర్భాన్ని పొందలేకపోతున్నారని తెలుసుకుంటే వారి వైద్యున్ని సంప్రదించాలి.

మీరు యుక్త వయస్సులో ఉన్నప్పుడు మరియు మీ ఋతు చక్రం మరియు అండోత్సర్గం ప్రక్రియ క్రమముగా ఉన్నప్పుడు, గర్భం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టదు. కానీ, మీ వయస్సు పెరిగితే, అది గర్భధారణలో ఆలస్యానికి కారణమవుతుంది. అయితే,గర్భధారణకు ఖచ్చితమైన వయస్సు గురించి తెలియదు, కానీ కొంతమంది నిపుణులు గర్భం కోసం 35ఏళ్ళు దాటిన మహిళలకు కొంచెం సమయం పడుతుంది అని అభిప్రాయ పడతారు. అలాంటి స్త్రీలు ఆరు నెలల పాటు ప్రయత్నించినా కూడా గర్భం ధరించలేక పోతే ఒక వైద్యుడిని సంప్రదించాలి.

శృంగార సమయం లో లూబ్రికెన్ట్లను ఉపయోగించి స్పెర్మ్ యొక్క నాణ్యతను ప్రభావితం చేయవచ్చు. బహిర్గతంగా లేదా సమయోచితంగా ఉపయోగించిన లూబ్రికెన్ట్లు వీర్య కణాలను నాశనం చేసే కొన్ని రసాయనాలను కలిగి ఉంటాయి. అనేక అధ్యయనాలు శృంగార సమయంలో లూబ్రికెన్ట్లను ఉపయోగిస్తే వీర్యకణాల యొక్క సామర్థ్యాన్ని తగ్గిస్తుందని తెలిపాయి. లూబ్రికెన్ట్ ను సంభోగ ప్రేరణ (foreplay) సమయంలో ఉపయోగించవచ్చు, కానీ మీరు గర్భం పొందాలి అనుకుంటే,ఉపయోగించకుండా ఉండటానికి ఉండాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

మీరు మీ అండోత్సర్గాన్ని (ovulation) పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, ఆ సమయంలో మీరు శృంగారం జరపాలి. స్పె వీర్యకణం అండంతో  కలవగానే, ఆ రోజు నుంచే గర్భం మొదలవుతుంది. అండోత్సర్గ కాలంలో గర్భాన్ని పొందే అవకాశాలు ఎక్కువ. అందువల్ల, ఇద్దరు భాగస్వాములు అదే సమయంలో స్త్రీ యొక్క గర్భధారణ కోసం ప్రయత్నించాలి.

గర్భం పొందడానికి శృంగారం చెయ్యడం చాలా ముఖ్యం. ఇది గర్భం యొక్క పునాది / పునాది-రాయిగా పరిగణించబడుతుంది. మీరు మరియు మీ భాగస్వామి సంభోగిస్తేనే గర్భం దదాల్చడం సాధ్యమవుతుంది. కానీ, సులభంగా గర్భాన్ని పొందేందుకు, మీరు సరైన మార్గాన్ని ఎంచుకోవడం ముఖ్యం. సరైన సమయం లో శృంగారం జరపడం, సంతానోత్పత్తి కాలం, అండోత్సర్గం చక్రం, గర్భం పొందడానికి సరైన భంగిమలు మొదలైనవి కింద వివరించబడ్డాయి.

మీరు ఏదైనా జనననియంత్రణ మాత్రలు ఉపయోగిస్తూ ఉంటే, మీ గర్భధారణ కోసం, ముందు వాటిని ఆపాలి. కొన్నిసార్లు గర్భధారణ, మీరు ఉపయోగించిన గర్భనిరోధక పద్ధతిని బట్టి మరియు గర్భనిరోధకాలను ఆపిన తర్వాత, మీ శరీరం గర్భధారణకు అనుకూలంగా మారాడానికి పట్టే సమయాన్ని బట్టి ఉంటుంది. మీరు జనన నియంత్రణ కోసం కాపర్-టిని ఉపయోగిస్తుంటే, దానిని తొలగించిన వెంటనే మీ శరీరం గర్భధారణకు సిద్ధంగా అవుతుంది. కానీ,ఒకవేళ హార్మోన్ మాత్రలు వాడుతుంటే, గర్భధారణ కోసం మీ శరీరం అనుకూలించడానికి కొంత సమయం పడుతుంది. చాలా కాలం జనన నియంత్రణ మాత్రలు ఉపయోగించిన మహిళలుకు గర్భందాల్చడం కోసం ఎక్కువ సమయం పట్టవచ్చు. సాధారణంగా, మాత్రలు ఆపిన తర్వాత, మీ శరీరం గర్భం కోసం సిద్ధం కావడానికి 6-8 వారాలు పడుతుంది.

కండోమును ఉపయోగించకూడదు. గర్భం కోసం చూస్తున్నపుడు ఏవిధమైన జనన నియంత్రణ మందులలైనా ఆపివేయాలి. 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

గర్భధారణ కోసం ఆలోచిస్తున్నప్పుడు స్త్రీలు వారి ఆహారపు అలవాట్లను జీవన శైలిని మార్చుకోవాలి. గర్భధారణ కోసం మీరు మార్చాల్సిన లేదా ఆపవల్సిన అలవాట్లను మీకు మేము తెలియజేస్తున్నాము:

ఒక మనిషి యొక్క వీర్యం లో విడుదల అయ్యే వీర్య కణాల సంఖ్య మరియు నాణ్యత పెరగడం అనేది విజయవంతమైన గర్భధారణ కోసం చాలా ముఖ్యమైనదని భావిస్తారు. మీ వీర్యం లో వీర్యకణాల సంఖ్యను పెంచడానికి, మీ దినచర్యను మెరుగుపరుచుకోవడం చాలా ముఖ్యం. అలాగే, చెడు అలవాట్లకు మరియు వ్యసనాలకు దూరంగా ఉండటం కూడా ముఖ్యం. పొగాకు, ధూమపానం మరియు మద్యపాన సేవనం మీ లైంగిక ఆరోగ్యంపై హానికరమైన ప్రభావాన్ని కలిగి ఉంటాయి, ఎందుకంటే అవి వీర్య కణాల సంఖ్యను తగ్గిస్తాయి. వీటితో పాటు పురుషులు ఆరోగ్యకరమైన బరువు కలిగి ఉండాలి.

చాలా వేడి నీటిని ఉపయోగించి స్నానం చేయడం వల్ల, ఆ వేడినీరు వీర్య కణాలను నాశనం చేసి, వాటి సంఖ్యను వీర్యంలో తగ్గించవచ్చు.

వీర్య కణాల సంఖ్యను మెరుగుపరచడానికి, మీరు మీ ఆహారాన్ని మార్చి మరియు మెరుగుపరచాలి. మీ ఆహారంలో జింక్, ఫోలిక్ ఆమ్లం మరియు విటమిన్ -సిలను చేర్చుకోవాలి. ఈ పోషకాలు వీర్య కణాల సంఖ్యను పెంచడంలో చాలా ప్రభావవంతమైనవి. ఏదేమైనా, వీర్య కణాల సంఖ్య పెరగడానికి మూడు నెలల వరకు సమయం పడుతుంది.

ఒక విజయవంతమైన గర్భధారణ ఒక మహిళ యొక్క లైంగిక ఆరోగ్యానికి మాత్రమే సంబంధించినది కాదు, దాని అవకాశాలు పురుషుని ఆరోగ్యంపై కూడా ఆధారపడి ఉంటాయి. అందువల్ల పురుషులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడమనేది ముఖ్యమైనది. వీర్యం యొక్క ఉత్పత్తి మరియు నాణ్యతను మెరుగుపరిచే కొన్ని పోషకాలు:

జింక్
ఇది గుమ్మడికాయ మరియు బచ్చలికూరలో ఉంటుంది. ఇది వీర్యకణాల సంఖ్యను పెంచి మరియు వీర్యకణాల చలనము మెరుగుపరుస్తుంది.

విటమిన్ సి
ఇది ఆకు కూరలు మరియు సిట్రస్ పండ్లలో లభిస్తుంది. ఇది వీర్యకణాలు ఉండలుగా మారడాన్ని నుండి నిరోధిస్తుంది.

సెలీనియం మరియు విటమిన్ ఈ (E)
ఇవి బాదం మరియు చియా గింజలలో కనిపిస్తారు మరియు వీర్య కణాల యొక్క నాణ్యతను మెరుగుపరుస్థాయి

ఒమేగా -3 ఫ్యాటీ యాసిడ్స్
అవి చేపల నూనె మరియు చియా విత్తనాలలో లభిస్తాయి, మరియు వీర్య కణాల యొక్క జీవన సామర్ధ్యాన్ని (విజయవంతంగా పని చేసే సామర్థ్యం) మెరుగుపరచబడతాయి.

సొయా గింజలను తినకూడదు ఎందుకంటే సొయా -ఆధారిత ఆహార ఉత్పత్తులు పాలు, టోఫు మరియు ఎడామామెలో జన్యుసంబంధమైనవి ఉంటాయి, ఇవి వీర్యకణాల చలనాన్ని తగ్గించి మరియు వాటిని నాశనం చేస్తాయి.

గర్భాన్ని పొందడానికి, మీ మరియు మీ భాగస్వామి యొక్క లైంగిక ఆరోగ్యం పై శ్రద్ధ వహించాలి. పునరుత్పాదక వ్యవస్థ (reproductive system) లో ఉన్న ఏదైనా అసాధారణత, గర్భం దాల్చడం లో సమస్యలు మొదలైయ్యేలా చేస్తుంది. అందుకే, మీ జంట మానసికంగా, లైంగికంగా ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించుకోవాలి.

ఒక ఆరోగ్యకరమైన దినచర్య మిమ్మల్ని చాలా వ్యాధుల నుండి దూరంగా ఉంచుతుంది. ఒక విజయవంతమైన గర్భధారణ కోసం, మీరు ఈ విధంగా మీ దినచర్యను మార్చుకోవచ్చు:

తగినంత నిద్రపోండి

అన్ని శరీర భాగాలు మరియు అంతర్గత అవయవాలు సరిగ్గా మరియు సమర్ధవంతంగా పనిచేయడానికి గాఢంగా నిద్రపోవడం చాలా ముఖ్యం. శరీర హార్మోన్లను నిర్వహించడం లో ఇది ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.మెలటోనిన్ మరియు సెరోటోనిన్ల (నిద్రకు చాలా ముఖ్యమైన హార్మోన్లు) తక్కువ స్థాయి ల్టియల్ ఫేజ్ (luteal phase) యొక్క కాలవ్యవధిని తగ్గిస్తుందని అది అండోత్సర్గము (ovulation) మరియు ఋతు చక్రం (menstrual cycle)తో  సంబంధం కలిగి ఉందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యండి

క్రమమైన వ్యాయామం మీరు సులభంగా గర్భందాల్చడానికి సహాయపడుతుంది. అందువల్ల మీరు ఆరోగ్యకరమైన బరువును కొనసాగించి మరియు మీ గర్భాశయం ఆరోగ్యంగా మరియు క్రియాశీలంగా ఉంచడంలో సహాయపడే వ్యాయామాలను మీ దినచర్య లో భాగంగా చేసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం అనేది, గర్భధారణకు ఆటంకం కలిగించే వ్యాధులను నివారించడానికి కూడా సహాయం చేస్తుంది.

ఒత్తిడి లేకుండా ఉండండి / మీ ఒత్తిడిని విడుదల చేయండి

గర్భధారణను ఆటంకపరుస్తున్న ప్రధాన కారకాల్లో ఒత్తిడి కూడా ఒకటి. మీరు మీ ఒత్తిడిని విడిచిపెట్టడానికి యోగా మరియు ధ్యానం సాధన చేయవచ్చు.

నీరు మన శరీరానికి చాలా ముఖ్యమైనది అని భావిస్తారు. నిర్జలీకరణం (డిహైడ్రాషన్) అన్ని శరీర భాగాల సాధారణ పనితీరును అడ్డుకుంటుంది. మీరు గర్భం పొందడానికి అన్ని శరీర భాగాలు సరిగా పనిచేయడం చాలా ముఖ్యం. తగినంత నీటిని తాగడం వల్ల,అది మీ గర్భాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంద. ఇది గర్భాశయ శ్లేష్మం (మ్యూకస్) యొక్క ఉత్పత్తిని పెంచుతుంది, అది వీర్య కణాలు అండం వరకు ప్రయాణించడానికి ఒక మాధ్యమాన్ని అందిస్తుంది. అందువల్ల, గర్భం ధరించడానికి, మీరు ప్రతిరోజూ తగినంత నీరు త్రాగడం ఎంతో ముఖ్యమైనది.

గర్భధారణ కోసం ప్రోటీన్లు ముఖ్యమైనవి. శరీరానికి ప్రోటీన్లు ఒక ముఖ్యమైన పోషకాలు అని భావిస్తారు. అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రీషియన్స్ (obstetricians) మరియు గైనకాలోజిస్ట్స్ నిర్వహించిన ఒక పరిశోధనలో, ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం తినడం వల్ల ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) పద్ధతిలో సంతానోత్పత్తి ని (పునరుత్పాదక సామర్థ్యం) పొందిన మహిళల మీద సానుకూల ప్రభావాన్ని చూపిందని కనుగొనబడింది. కాబట్టి, ప్రోటీన్లు అధికంగా మరియు కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం, మహిళల్లో అండాల నాణ్యతను మెరుగుపరుస్తుంది. అందువల్ల, మీరు ప్రోటీన్లు ఎక్కువగా మరియు కార్భోహైడ్రేట్లు తక్కువగా ఉన్న ఆహారం కనీసం గర్భం దాల్చాడానికి మూడు నెలలు ముందు నుండి ఒక ప్రణాళిక వేసుకొని తినడం ముఖ్యం. చికెన్, గుడ్లు, తక్కువ కొవ్వు ఉన్న మాంసం, చేపలు, పాల ఉత్పత్తులు, బీన్స్, మరియు ఎండు పండ్లు వంటి వివిధ ఆహార ఉత్పత్తుల నుండి ప్రోటీన్ పొందవచ్చు.

అండోత్సర్గము (ovulation) మరియు ఫలదీకరణం (fertilization) అంటే ఏమిటి?

ప్రతి నెల, మీ అండాశయాలలో ఒకటి అండాలను విడుదల చేస్తుంది, ఊహగా ఒకే అండం. ఈ ప్రక్రియను అండోత్సర్గం (ovulation) అని పిలుస్తారు. అప్పుడు ఈ అండంఫాలోపియన్ గొట్టాల ద్వారా ప్రయాణించి, వీర్యకణంతో కలుస్తుంది. ఈ ప్రక్రియను ఫలదీకరణం (fertilization) అంటారు. ఈ సమయంలో మీ అండోత్సర్గము చక్రాన్ని గుర్తించడం ముఖ్యం ఎందుకంటే సంతానోత్పత్తి కాలం ఐదు రోజులు మాత్రమే ఉంటుంది. ఇది ఎందుకంటే మీ గర్భంలో వీర్యకణాల యొక్క సాధ్యత ఐదు రోజులు మాత్రమే ఉంటుంది, మరియు మీ అండం 12-24 గంటలకు మాత్రమే ఫలదీకరణకు అందుబాటులో ఉంటుంది.

అండోత్సర్గము ట్రాకింగ్ (Ovulation tracking)

ప్రతి స్త్రీకి అండోత్సర్గము వ్యవధి (ovulationperiod) ఆమె ఋతు చక్రం మీద ఆధారపడి ఉంటుంది. సాధారణంగా, ఋతు చక్రంలో 12 నుండి 16 రోజు మధ్య కాలం అత్యంత సంతానోత్పత్యక కాలం అని గైనకాలజిస్ట్ల సూచన. అండోత్సర్గము 28 రోజుల రుతు చక్రంలో 14 వ రోజు జరుగుతుంది మరియు ఈ సమయంలో సంభోగం జరపడం వల్ల గర్భాన్ని పొందే మీ అవకాశాలను పెంచుతుంది. ఉదాహరణకు, ఒక నెలలో 30 వ తేదీన మీ ఋతు చక్రం ప్రారంభమైతే, మరుసటి నెలలో 14 నుండి 18 వ తేదీ వరకు మీ అండోత్సర్గం కాలం ఉంటుంది. 

కార్బోహైడ్రేట్ల యొక్క నిర్దిష్ట స్థాయి మన శరీరానికి ఎంతో ముఖ్యం. కార్బోహైడ్రేట్ గర్భధారణకు అవసరమైన ముఖ్యమైన పోషకాలలో ఒకటిగా పరిగణించబడింది.ఇది కేవలం గర్భం కోసమే ముఖ్యమైనది కాకుండా,మన శరీరంలోని ప్రాథమిక జీవక్రియ (శక్తి ఉత్పత్తి) ప్రక్రియల్లో కూడా ఇది ముఖ్యమైన భాగం. ప్రాసెస్ చేసిన మరియు చైనీస్ ఆహారం వంటి శరీరానికి హాని కలిగించే కార్బోహైడ్రేట్లు అధికంగా ఉన్న ఆహారాన్ని తినకుండా ఉండటం కూడా చాలా ముఖ్యమైనది. బదులుగా, మీరు ఆకుపచ్చ కూరగాయలు మరియు పండ్లు తినాలి. కార్బోహైడ్రేట్ల యొక్క సహజ వనరులు తీపి బంగాళాదుంపలు, బంగాళాదుంపలు, చామదుంప ("అర్బి"), పప్పులు, అరటిపండ్లు, మామిడి, బీన్స్ మరియు ఇతర కూరగాయలు (అన్ని పండ్లు కార్బోహైడ్రేట్ల మంచి మూలం) .

మీరు గర్భాన్ని పొందడానికి ప్రయతించే ముందు మీ శరీరం ఆరోగ్యంగా ఉంచుకోవడం ముఖ్యం.

మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోకపోతే, మీరు గర్భధారణ సమయంలో కొన్ని సమస్యలు మరియు కష్టాలు అనుభవించవచ్చు. ఈ సమస్యలను నివారించడానికి, మీరు మొదట మీ ఆహారంలో కొవ్వు మరియు ప్రోటీన్-రిచ్ ఆహార పదార్ధాలు తగినంత మొత్తంలో చేర్చాలి. మీరు గర్భాన్ని పొందడానికి ముందు బరువు తగ్గించాలని కోరుకుంటే, కొవ్వులో కొంచెం తక్కువగా ఉండి, మరియు ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినాలి. అంతే కాకుండా మీ ఆహారంలో కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు మరియు ఖనిజాలు కూడా చేర్చుకోవాలి. ఇవి మీ శరీరంలోని హార్మోన్ స్థాయిలను సమతుల్యపరచడంలో సహాయపడతాయి మరియు మీరు గర్భదారణను సులభతరం చేస్తాయి.

మీరు ఏ పనిని అయినా ప్రారంభించడానికి ముందు ఒక ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. అదేవిధంగా, మీ శరీరాన్ని మరియు మనస్సుని పూర్తిగా గర్భధారణ కోసం తయారు చేయడానికి జాగ్రత్తయిన ప్రణాళిక అవసరం.దాని కోసం, మీరు కొన్ని ముఖ్యమైన విషయాలను ప్రారంబించవలసి ఉంటుంది. వాటిలో ఒకటి ఫోలిక్ యాసిడ్ ను క్రమముగా తీసుకోవడం. ఇందులో, మీరు ఒక నెల ఫోలిక్ యాసిడ్ (విటమిన్ B9) ఉండే పదార్ధాలు తీసుకోవాల్సి ఉంటుంది. విటమిన్ B9 గర్భధారణ సమయంలో సంభవించే పలు సమస్యలను నిరోధిస్తుంది. అదీకాకుండా, ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి ఫోలిక్ యాసిడ్ చాలా ముఖ్యం. అధిక బరువు ఉండటం వల్ల మీ శరీరం అనేకరకాలైన వ్యాధుల బారిన పడేలా చేస్తుంది. అందువల్ల మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడం ముఖ్యం. మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి, అవి:

గర్భాన్ని పొందడం చాలా వరకు మీ శరీరం మీద ఆధారపడి ఉంటుంది. గర్భం దాల్చేముందు, మీరు మీ వైద్యున్ని కలసి, గర్భధారణ యొక్క మొత్తం ప్రక్రియను గురించి తెలుసుకోవాలి. మీరు దాని కోసం కొన్ని పరీక్షలు చేయించుకోవలసి ఉంటుంది.ఈ పరీక్షలు మీ శరీరం గర్భం కోసం సిద్దపడి ఉందా లేదా అని తెలియజేస్తాయి. ఈ పరీక్షల ద్వారా, మీ శరీరంలో ఏదైనా అసాధారణత ఉంది అని తెలిసినట్లయితే దానికి ప్రారంభ దశలో పూర్తిస్థాయిలో చికిత్స పొందాలి.

చాలా తరచుగా, మహిళలు తెలియకుండానే గర్భాన్ని నిరోధించే కొన్ని తప్పులు చేస్తారు. మీరు శృంగారం తర్వాత చేయకూడని కొన్ని విషయాలను పరిశీలించండి:

శృంగారం జరిపిన వెంటనే నిలబడడం

కొంతమంది స్త్రీలు శృంగారం జరిపిన వెంటనే నిలబడి పోతారు, ఇది వీర్యకణాలు వాళ్ళ శరీరంలో పైకి వెళ్ళడానికి బదులుగా బయటకు వచ్చేసేలా చేస్తుంది. కాబట్టి శృంగారం జరిపిన తరువాత,కొంతసేపు ఆలా వెనుకకి జారబడి ఉండాలి వేయండి, అది వీర్యకణాలు మీ గర్భాసయం లో ఉన్నఅండాన్ని కలిసేటట్లు చేస్తుంది.

శృంగారం తర్వాత మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోవడం

కొందరు మహిళలు అంటువ్యాధులను నివారించడానికి సెక్స్ తర్వాత వారి యోనిని శుభ్రం చేసుకుంటారు. యోనిని నీటితో శుభ్రపరిచేటప్పుడు, వీర్యకణాలు వారి శరీరం నుండి బయటకు వచ్చేస్తాయి అందువలన వారు గర్భాన్ని పొందలేరు. కాబట్టి, గర్భం పొందే అవకాశాలను పెంచడానికి, శృంగారం జరిపిన వెంటనే మిమ్మల్ని మీరు శుభ్రం చేసుకోకుండా ఉండాలి.

మీ శారీరక మరియు పునరుత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, మీరు పుష్కలంగా పండ్లు మరియు కూరగాయలను తినాలి. ఆహారం మరియు సంతానోత్పత్తిపై ఎనిమిదేళ్లపాటు 18000 మంది మహిళలపై జరిపిన అధ్యయనాలు, మహిళల్లో సంతానోత్పత్తి మెరుగుపరిచే ఎనిమిది విషయాలను ఈ క్రింది విధంగా తెలిపాయి:

 • అన్ సాచురేటెడ్ నూనె
  ఇది నేరేడు, బాదం, ఆలివ్ నూనె మరియు అవోకాడో నూనె వంటి గింజలు మరియు
 • గింజలలో కనిపిస్తుంది. ఇది ఇన్సులిన్ పై శరీర కణాల యొక్క సున్నితత్వాన్ని పెంచుతుంది మరియు వాపు తగ్గించడంలో సహాయపడుతుంది. మీ సంతానోత్పత్తి మెరుగుపరచడానికి ఈ రెండు గుణాలు ముఖ్యమైనవి.
 • సాల్మొన్ మరియు సార్డిన్ వంటి చేపలను మీరు మంచి ప్రదేశాల నుండి కొనుగోలు చెయ్యాలి, ఎందుకంటే కుళ్ళిన చేపలు తినడం వల్ల మీ ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమవుతుంది.
 • బీన్స్, బఠానీలు మరియు గింజలు వంటి ప్రోటీన్ కూరగాయల తినండి.
 • తృణధాన్యం, కూరగాయలు, పండ్లు తినండి.
 • పాలు మరియు పూర్తి క్రీమ్ గలపెరుగు లేదా యోగర్ట్ ను తీసుకోండి.
 • ఫోలిక్ ఆమ్లం మరియు మల్టీవిటమిన్లను తీసుకోండి.
 • తృణధాన్యం, గుమ్మడి, బచ్చలికూర, టమాటాలు, మరియు బీట్రూట్లు వంటి ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారం తినడం ఆరోగ్యానికి మంచిది.
 • నీటి పుష్కలంగా త్రాగాలి.
 • ఇది కాకుండా, 20-24 మధ్య ఉండే BMI (బాడీ మాస్ ఇండెక్స్)తో  ఆరోగ్యకరమైన బరువును నిర్వహించండి. BMI అనేది మీ బరువు మరియు ఎత్తు యొక్క ప్రమాణాన్ని లెక్కించే సూచిక. అధిక బరువు ఉండటం వలన క్రమరహిత ఋతు చక్రాలకు దారి తీయవచ్చు మరియు అండోత్సర్గం (ovulation) ప్రక్రియను కూడా ప్రభావితం చేయవచ్చు. అందువల్ల, చురుకుగా ఉండటం మరియు క్రమంగా వ్యాయామం చెయ్యడం కూడా చాలా ముఖ్యం.
 • మీ వైద్యసంబంధమైన చరిత్రను స్రీలవైద్యనిపుణులకు (గైనకాలజిస్ట్) వివరంగా తెలియజేయండి. మీరు అధిక రక్తపోటు, మధుమేహం, పిసిఒఎస్ (పాలీసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్), థైరాయిడ్ సమస్యలు మొదలైన వ్యాధులకు మందుల మీద ఉంటే వైద్యునికి తెలియజేయండి. మీ మునుపటి గర్భధారణ లేదా గర్భస్రావం (ఏదైనా ఉంటే) గురించి, ఆహారం మరియు జీవనశైలి గురించి మీ వైద్యుడికి తెలియజేయండి.

శాస్త్రీయ అధ్యయనాలు ఆడవాళ్ళలో మద్యపాన అలవాటు, గర్భధారణ యొక్క అవకాశాలను తగ్గిస్తుందని చూపుతున్నాయి. స్త్రీలు మద్యం సేవిస్తే, తమ సంతానయోగ్యమైన కాలంలో శృంగారం తరువాత కూడా ఆమెకు గర్భధారణ అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు నిర్ధారించారు.

ఒకవేళ, మీరు ఒక వారంలో ఐదు రోజులు మద్యం త్రాగుతూ ఉంటే అప్పుడు మీకు పిల్లలను కలిగే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. ఇది కష్టంగా ఉండవచ్చు, కానీ మీరు ఒక బిడ్డను కోరుకుంటే, మీరు మరియు మీ భాగస్వామి వైన్, విస్కీ, స్కాచ్ లేదా ఆల్కహాల్ ఆధారిత పానీయాల నుండి దూరంగా ఉండాలని.మీ భాగస్వామి తన వీర్యం యొక్క నాణ్యతతో రాజీపడకూడని కోరుకుంటే అతడు మద్యపానానికి దూరంగా ఉండాలని మీరు తెలియజేయాలి. అధిక మద్యపానం రక్త సీరం (blood serum) లో టెస్టోస్టెరాన్ స్థాయిని పెంచుతుంది, ఇది వీర్యం యొక్క పరిమాణాన్ని అలాగే వీర్య కణాలను తగ్గిస్తుంది. అధిక మద్యపానం శృంగార సమయంలో మీ పనితీరును కూడా ప్రభావితం చేయవచ్చు. ఇదికాకుండా, మీరు మరియు మీ భాగస్వామీ కాఫీ మరియు ధూమపానాన్ని తగ్గించాలి.

మీరు గర్భం పొందడానికి ప్రణాళిక చేస్తున్నట్లయితే మీరు తినకూడని కొన్ని ఆహార ఉత్పత్తులు ఉన్నాయి,

చక్కెర

చక్కెరలో ఉండే కార్బోహైడ్రేట్ మీ శరీరానికి హాని కలిగిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది మీ రక్త సీరం లో ఇన్సులిన్ స్థాయిని సమతుల్యం చెయ్యడం కష్టం చేస్తుంది. అందువల్ల గర్భిణీ స్త్రీలు అధికంగా చక్కెరను తినకూడదు. శుద్ధి చేసిన చక్కెర కలిగిన ఆహార ఉత్పత్తుల నుండి దూరంగా ఉండండి.

పాదరసం (mercury)

చేపలు మాంసకృత్తుల (ప్రోటీన్)తో  పుష్కలంగా ఉంటాయి, కానీ కొన్నిసార్లు అవి పెద్ద మొత్తంలో పాదరసాన్నికలిగి ఉంటాయి. ఈ పాదరసం అధికంగా మీ రక్తంలో కరిగిపోతే, అది మీ సంతానోత్పత్తిపై ప్రతికూల ప్రభావాలను చూపిస్తుంది. మీరు మీ గర్భధారణ సమయంలో లేదా ముందు, పాదరసం ఎక్కువగా ఉండే చేపలను తింటే, మీ గర్భంలో అభివృద్ధి చెందుతున్న బిడ్డ యొక్క మెదడు మరియు నాడీ వ్యవస్థను తరువాత ప్రభావితం చేయవచ్చు.

కొన్ని మందులు గర్భధారణ మీద ప్రతికూల ప్రభావాన్ని కలిగి ఉంటాయి. మీరు ఈ క్రింది ఔషధాలలో ఏదైనా వాడుతుంటే, గర్భంకోసం ప్రయత్నించే ముందు మీ వైద్యుడిని సంప్రదించాలి.

 • యాంటీఇన్ఫ్లమేటరీ మందులు
 • వీటిలో ఐబుప్రోఫెన్ లేదా ఆస్పిరిన్ వంటి ఎక్కువ ప్రతికూలంగా ఉండే మందులు ఉన్నాయి.
 • కీమోథెరపీ
 • క్యాన్సర్ చికిత్స కోసం కీమోథెరపీలో ఉపయోగించే మందులు శాశ్వత అండాశయ వైఫల్యాన్ని కలిగిస్తాయి.
 • న్యూరోలెప్టిక్ మందులు
 • ఇవి ఋతు చక్రాలకు అంతరాయం కలిగించే యాంటిసైకోటిక్ మందులు. వంధ్యత్వానికి (infertility) కూడా కారణం కావచ్చు.
 • స్పిరోనోలక్టన్ (Spironolactone)
 • ఈ ఔషధం శరీరంలో ద్రవం నిలుపుదల (ఫ్లూయిడ్ రేటెన్షన్) తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మందు వ్యతిరేక ప్రభావాలు కలిగి ఉంటుంది మరియుఈ మందు వాడడం ఆపిన కొద్ది నెలల తర్వాత మీరు గర్భం ధరించవచ్చు.
 • నొప్పి నివారిణులు (pain killers)
 • యాంటిడిప్రేసన్ట్స్
 • మీ భాగస్వామి ఈ క్రింది ఔషధాలలో ఏదో ఒకదానిని తీసుకుంటున్నారేమో గమనించి, ఒకవేళ తీసుకుంటుంటే మీరు వైద్యుడిని సంప్రదించాలి:
 • టెస్టోస్టెరాన్
 • ప్రత్యామ్నాయటెస్టోస్టెరాన్ (కంప్లీమెంటరీ టెస్టోస్టెరాన్ అని కూడా పిలుస్తారు) సహజ టెస్టోస్టెరాన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, ఇది వీర్యకణాల ఉత్పత్తిని నిరోధిస్తుంది.
 • అనాబాలిక్ స్టెరాయిడ్స్
 • ఇవి కండరాల పెరుగుదల పెంచడానికి మరియు శరీర కొవ్వు తగ్గించేందుకు ఉపయోగిస్తారు. కానీ, ఈ మందు ఉపయోగించడం వల్ల మీ సంతానోత్పత్తి కూడా ప్రభావితమవుతుంది. అందువల్ల, మీ భాగస్వామి బాడీబిల్డర్ అయితే, అతడు బాడీ బిల్డింగ్ ప్రయత్నాలను ఆపాలి.
 • యాంటిడిప్రెసెంట్స్ మరియు ఆందోళనవ్యతిరేక (యాంటీ ఆంక్సియేటి) మందులు
 • ఒత్తిడి మరియు నిస్పృహ (డిప్రెషన్) చికిత్సకు ఉపయోగించే కొన్ని మందులు పునరుత్పాదక మార్గంలో ప్రవేశించవచ్చు మరియు వీర్యకణాల యొక్క చలనాన్ని తగ్గించవచ్చు.
 • యాంటీ ఫంగల్ మందులు
 • కేటోకానజోల్, ఒక యాంటి ఫంగల్ మందు, దాని నోటి (oral) టాబ్లెట్గా ఉపయోగించినట్లయితే టెస్టోస్టెరాన్ మరియువీర్యకణాల ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది.

ఎదో ఒక సరైన శృంగార భంగిమ గర్భాన్నిదాల్చడానికి అవకాశాలను పెంచుతుందని శాస్త్రీయ ఆధారాలు లేవు. అయితే, గురుత్వాకర్షణ-వ్యతిరేక (gravity-defying) భంగిమలైన నిలబడడం లేక కూర్చోవడం మరియు స్త్రీ పైన ఉండే భంగిమలు వీర్యకణాలను ఎగువకి ప్రయాణించడాన్నీ కష్టతరం చేస్తాయి. కాబట్టి, మిషనరీ భంగిమలలో శృంగారం జరిపి గర్భాన్ని పొందడం ఉత్తమం. మీరు వెనుక ప్రవేశ భంగిమ లేదా డాగీ శైలిని కూడా ప్రయత్నించవచ్చు. గర్భాశయం లోకి గర్భాశయ మార్గం సహాయం ద్వారా వీర్యకణాలు ప్రయాణించడానికి సంభోగం తర్వాత (సెక్స్) 15-20 నిమిషాలు మీరు పడుకోవాలని చెప్తారు.

వనరులు

 1. National Health Service [Internet]. UK; Your pregnancy and baby guide.
 2. healthdirect Australia. Getting pregnant. Australian government: Department of Health
 3. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Trying to conceive.
 4. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Preconception health.
 5. Office of Population Affairs. Female Infertility. U.S. Department of Health & Human Services [Internet]
 6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Pregnancy - identifying fertile days
 7. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Age and fertility
Read on app