బలహీనత - Weakness in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

April 24, 2019

July 31, 2020

బలహీనత
బలహీనత

బలహీనత అంటే ఏమిటి?

బలహీనత అంటే శరీరంలోని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ కండరాలలో తక్కువ బలం ఉండడం. కొంతమంది వ్యక్తులు బలహీనంగా ఉన్న భావనను అనుభవిస్తారు, కానీ భౌతికంగా వారికి బలం తక్కువగా ఉండదు, ఉదాహరణకు, నొప్పి కారణంగా బలహీనమైన అనుభూతి కలగడం. అయితే కొన్ని సందర్భాలలో కొందరి వ్యక్తులలో వైద్యులు నిర్వహించిన భౌతిక పరీక్షలో మాత్రమే వారికి బలం తక్కువగా ఉందని తెలుస్తుంది; ఇటువంటి బలహీనతను "ఆబ్జెక్టివ్ బలహీనత" (objective weakness) కూడా అని పిలుస్తారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

బలహీనత యొక్క సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

బలహీనత యొక్క అంతర్లీన కారణాలు నిర్దిష్ట/ప్రత్యేక ఆరోగ్య సమస్యల కారణంగా ఉంటాయి, వాటిలో కొన్ని:

  • తక్కువ సోడియం మరియు పొటాషియం స్థాయిలు
  • శ్వాసకోశ మార్గము లేదా మూత్ర మార్గము యొక్క అంటువ్యాధులు/సంక్రమణలు
  • థైరాయిడ్ హార్మోన్ తక్కువ లేదా అధిక స్థాయిలు
  • గిలియన్-బర్రే సిండ్రోమ్
  • మస్తినేనియా గ్రేవిస్ (కండరాలను బలహీనపరచే ఒక దీర్ఘకాలిక రుగ్మత)
  • స్ట్రోక్
  • అనారోగ్యం వలన చురుకుగా లేకపోవడం, ముఖ్యంగా వృద్ధులలో
  • ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) మైయోపాతీ (ICU లో ఎక్కువ కాలం ఉండడం వల్ల కండరాల నష్టం)
  • కండరాల బలహీనత, హైపోకలైమియా (తక్కువ పొటాషియం స్థాయిలు) మరియు ఆల్కహాలిక్ మైయోపతి వంటి సాధారణ మైయోపతీలు (కండర కణజాల వ్యాధులు)
  • పోలియో
  • అధిక శారీరక శ్రమ
  • నిద్ర లేకపోవడం
  • క్రమరహిత వ్యాయామం
  • జ్వరం వంటి అనారోగ్యం
  • తక్కువ ఆహారం తీసుకోవడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

బలహీనత నిర్ధారణకు ఈ క్రింది విధానాలు ఉపయోగిస్తారు:

  • శారీరక పరీక్ష: మోటార్ ఫంక్షన్ (నరాల పనితీరు), రిఫ్లెక్స్లు (reflexes) మరియు క్రెనియాల్ నెర్వ్ (cranial nerve ) విధులు పరీక్షించబడతాయి
  • బల పరీక్ష (Strength testing): నిరోధకతకు వ్యతిరేకంగా బలహీనత (weakness against resistance), కండరాల యొక్క కనిపించే సంకోచం (visible contraction of the muscles), గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా అవయవాల కదలికలు (limb movement against gravity), రిఫ్లెక్స్లు మరియు సంచలనం (sensation) వంటి పారామితులు పరీక్షించబడతాయి.
  • నడిచే విధానంగమనించబడింది
  • బలహీనతకు కారణాలనూ తనిఖీ చేయడానికి ఆరోగ్య చరిత్రను తెలుసుకోవడం

బలహీనతకు కారణమైన అంతర్లీన కారణానికి చికిత్స అందించడం ద్వారా బలహీనత యొక్క చికిత్స చేస్తారు. తీవ్రమైన బలహీనతతో బాధపడుతున్నవారికి అవసరమైతే ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందించాలి. రోగుల యొక్క కండరాల పనితీరును మెరుగుపరచడానికి వృత్తి చికిత్స (Occupational therapy) మరియు భౌతిక చికిత్స (physical therapy) కూడా సిఫార్సు చేస్తారు.



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Stroke Signs and Symptoms.
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Weakness.
  3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Fatigue.
  4. Merck Manual Professional Version [Internet]. Kenilworth (NJ): Merck & Co. Inc.; c2018. Weakness.
  5. Holbrook JH. Weakness and Fatigue. In: Walker HK, Hall WD, Hurst JW, editors. Clinical Methods: The History, Physical, and Laboratory Examinations. 3rd edition. Boston: Butterworths; 1990. Chapter 213.

బలహీనత కొరకు మందులు

Medicines listed below are available for బలహీనత. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for బలహీనత

Number of tests are available for బలహీనత. We have listed commonly prescribed tests below: