యోని మంట (వుల్వైటిస్) - Vulvitis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)

April 24, 2019

March 06, 2020

యోని మంట
యోని మంట

యోని మంట అంటే ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) అనేది స్త్రీల జననాంగం యోని యొక్క వాపు లేక మంట. స్త్రీ యొక్క జననాంగ భాగంలో యోనిని కప్పిఉండే చిన్న మడతలో ఈ యోని మంట, వాపు సంభవిస్తాయి. ఇది ఒక వ్యాధి కాదు కానీ వివిధ అంతర్లీన కారణాలతో కూడిన ఒక వ్యాధి లక్షణం.

దీని సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) తో పాటు ఉండే వైద్య సంకేతాలు మరియు లక్షణాలు:

  • ఎర్రబడడం, గాయమై ద్రవస్రావం కావడం, మరియు యోని ప్రాంతం యొక్క వాపు
  • తీవ్రమైన దురద
  • ద్రవంతో నిండిన బాధాకరమైన పారదర్శక బొబ్బలు
  • యోని మీద పొలుసులు లేక పొరలు దేలడం మరియు మందమైన తెల్లని మచ్చలు
  • యోని యొక్క సున్నితత్వము
  • మూత్రవిసర్జన సమయంలో నొప్పి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

యోని మంట (వుల్వైటిస్) క్రిందివాటి కారణంగా సంభవించవచ్చు:

  • చాలామంది లైంగిక భాగస్వాములు
  • అసురక్షిత సంభోగం
  • సమూహం A β- హేమోలిటిక్ స్ట్రెప్టోకోకస్, హేమోఫిలస్ ఇన్ఫ్లుఎన్జా, షిగెల్లా, మరియు కాండిడా అల్బికాన్స్ కారణంగా బ్యాక్టీరియా సంక్రమణ
  • సుగంధ ద్రవ్యాలద్దిన లేదా రంగులద్దిన టాయిలెట్ పేపర్ల ఉపయోగం
  • బలమైన సువాసన లేదా బలమైన రసాయనాలు కలిగిన సబ్బులను ఉపయోగించడం
  • లోదుస్తుల మీద ఉతుకుడు సబ్బుల అవశేషాలు మిగిలిపోవడంవల్ల అవి యోనికి అంటుకోవడంవల్ల
  • యోని స్ప్రేలు / స్పెర్మిసైడ్లు
  • రాపిడిని కల్గించే కొన్ని దుస్తులు
  • క్లోరిన్ కలిగిన నీటిలో ఈత వంటి క్రీడల కార్యకలాపాలు
  • తామర లేదా సోరియాసిస్ వంటి చర్మ వ్యాధుల వైద్య చరిత్ర

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

యోని మంట యొక్క విశ్లేషనాత్మక అంచనాలో వివరణాత్మక వైద్య చరిత్ర, పొత్తికడుపు యొక్క భౌతికపరీక్ష, మరియు జఘన ప్రాంతం భౌతికపరీక్ష ఉంటాయి. ప్రయోగశాల పరీక్షల్లో పూర్తి రక్త గణన (CBC), మూత్ర పరీక్ష, మరియు పాప్ స్మియర్ టెస్ట్ (గర్భాశయ కణాల కోసం పరీక్ష) మార్పులు లేదా వాపు / అంటువ్యాధులు ఉండటాన్ని గుర్తించేందుకు చేసే పరీక్షలుంటాయి.

యోని మంట యొక్క చికిత్స వ్యక్తి  వయస్సు, వ్యాధి యొక్క కారణం, వ్యాధి తీవ్రత మరియు కొన్ని ఔషధాలకు వ్యక్తి సహనం వంటి వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. చికిత్సలో కోర్టిసోన్ మరియు పైపూతగా ఉపయోగించే యాంటీ-ఫంగల్ ఎజెంట్తో సహా సమయోచిత శోథ నిరోధక ఏజెంట్లను కలిగి ఉంటుంది. యోనిమంట (ఉల్విటిస్) ఒకటే ఏకైక రోగనిర్ధారణ అయినందున అట్రోఫిక్ వాగ్నిటిస్ విషయంలో కూడా ఈస్ట్రోజెన్ మందులు ఉపయోగించబడతాయి.

స్వీయరక్షణ చర్యల్లో మంటను కల్గించే వస్తువుల వాడకాన్ని నివారించడం, వ్యక్తిగత పరిశుభ్రతను తప్పకుండా పాటించడం, రోజులో జననేంద్రియాలను అనేకసార్లు కడగడం, పత్తితో తయారైన లోదుస్తుల్ని ధరించడం మరియు జననేంద్రియ భాగాన్ని పొడిగా ఉంచడం వంటివి ఉన్నాయి.

నివారణ చర్యలు :

  • తేలికపాటి సబ్బును ఉపయోగించండి
  • సుగంధ ద్రవ్యాలతో నిండిన టాయిలెట్ టిష్యూ పేపర్లను ఉపయోగించడం నివారించండి మరియు శుభ్రపర్చుకునేటపుడు జననేంద్రియ ప్రాంతాన్ని ముందు నుండి వెనుకకు తుడిచివేయడం మంచిది
  • రసాయనిక పదార్ధాలతో తయారైనవి, చర్మంపై మంటను పుట్టించేవి అయిన  నురగనిచ్చే ఫోము సబ్బులు , జెల్లీలు, మొదలైనవ వాటి వాడకాన్ని నివారించండి.
  • పత్తితోతయారైన దుస్తుల్ని మరియు లోదుస్తుల ధరించాలి
  • క్లోరినేటెడ్ స్విమ్మింగ్ పూల్లతో సుదీర్ఘమైన కాలంపాటు గడపటాన్ని నివారించండి.



వనరులు

  1. The Johns Hopkins Health System Corporation [Internet]; Vulvitis.
  2. Australasian Journal of Dermatology [Internet]. Gayle Fischer. Chronic vulvitis in pre‐pubertal girls. Volume51, Issue2 May 2010 Pages 118-123
  3. Manohara Joishy et al. Do we need to treat vulvovaginitis in prepubertal girls?. BMJ. 2005 Jan 22; 330(7484): 186–188. PMID: 15661783
  4. Scurry J et al. Vulvitis circumscripta plasmacellularis. A clinicopathologic entity?. J Reprod Med. 1993 Jan;38(1):14-8. PMID: 8441125
  5. Stanford Children's Health [Internet]. Stanford Medicine, Stanford University; Vulvitis.