మత్తు మందివ్వడం - Sedation in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

April 26, 2019

March 06, 2020

మత్తు మందివ్వడం
మత్తు మందివ్వడం

మత్తుమందివ్వడం అంటే ఏమిటి?

మత్తు మందివ్వడం (sedation) అనేది అదిమిపెట్టి ఉంచిన ఓ చేతనా స్థితికి (suppressed conscious state) దారితీసే ఒక వైద్య ప్రక్రియ. దానివల్ల రోగికి కొన్ని బాధను కల్గించే  రోగనిర్ధారక పరీక్షలు లేదా నొప్పిని కల్గించే వైద్యయుక్తుల్ని ( manoeuvres) వైద్యులు ఒకింత సులువుగా నిర్వహించడం జరుగుతుంది. మత్తుమందివ్వకుండా వీటిని నిర్వహిస్తే రోగికి అనానుకూలమైన లేదా ఆందోళనతో కూడుకున్న ఆదుర్దా కలగొచ్చు, అందుకే నొప్పి తెలియకుండా  ఉండడంకోసం మత్తుమందిస్తారు.

మత్తు మందివ్వడం ఎందుకు జరుగుతుంది?

అతను లేదా ఆమె కొన్ని వైద్య లేదా డయాగ్నస్టిక్ విధానాలకు గురయ్యే ముందు ఆ వ్యక్తిని శాంతపరచడానికి మత్తుమందివ్వడం (సెడేషన్) జరుగుతుంది. ఈ మత్తుమందు ఇవ్వడంవల్ల వైద్యప్రక్రియల సమయంలో వ్యక్తి విశ్రాంతిగా ఉండేందుకు సహాయపడి, నిద్రిస్తున్న స్థితికి ప్రేరేపిస్తుంది. మత్తుమందివ్వడమనేది రెండు రకాలు, చేతనమైన మత్తు మరియు లోతైన మత్తు. చేతనమైన మత్తు మందు ప్రక్రియ అనేది మితమైన ఔషధాల కలయికను ఉపయోగిస్తుంది మరియు ప్రధానంగా ఏదైనా ఎండోస్కోపిక్ విధానానికి ముందు జరుగుతుంది. శస్త్రచికిత్సా విధానాలకు ముందు లోతైన మత్తును ఉపయోగిస్తారు. వెంటిలేషన్ లేదా ఎండోట్రాషియల్ టబ్ సహనాన్ని సులభతరం చేయడానికి తీవ్రమైన సంరక్షణ విభాగంలో (critical care unit) భారీ మత్తు అవసరం.

ఇది ఎవరికి అవసరం?

కింద తెలిపినటువంటి వైద్య విధానాలు చేయించుకుంటున్నపుడు మత్తుమందివ్వడం  అవసరమవుతుంది.

  • దంత ఇంప్లాంట్లు లేదా డెంటల్ ఫిల్లింగుల కోసం
  • రొమ్ముల వంటి అవయవాల జీవాణుపరీక్షలకు  
  • ఫుట్ ఫ్రాక్చర్ రిపేర్ లేదా చర్మ ఇంప్లాంట్లు వంటి చిన్న శస్త్రచికిత్సలకు
  • ఎండోస్కోపీ లేదా టి స్కాన్ వంటి విశ్లేషణ విధానాలకు
  • వృద్ధ వయస్సు సముదాయానికి

ఇది ఎలా జరుగుతుంది?

వ్యక్తి గర్భవతి అయినా, ప్రస్తుతం చనుబాలివ్వడం జరుగుతుంటే లేదా ఏవైనా మందులు లేదా అనుబంధక మందులు తీసుకుంటుంటే ఆరోగ్య సంరక్షణ ప్రదాతకు (health care provider) తప్పక తెలియజేయాలి. మత్తుమందివ్వడమనే (సెడేషన్) పద్ధతిలో డాక్టర్ సూచించిన ఔషధాలను తీసుకోవడం లేదా వాటిని ఇంజెక్షన్ ద్వారా ఇంట్రావెనస్నుగా నిర్వహించడం జరుగుతుంది.

ఇప్పుడు, విధానంపై ఆధారపడి మత్తుమందు మోడరేట్ కావచ్చు, దానివల్ల రోగి నిద్రమత్తుకు గురవచ్చు అయితే మాట్లాడగల్గుతారు. లోతైన మత్తుమందు విషయంలో రోగిని నిద్రకు గురిచేస్తుంది, శ్వాసను తగ్గిస్తుంది, కానీ రోగి శస్త్రచికిత్స అంతటా స్పృహ కోల్పోకుండా ఉంటాడు, అయితే శస్త్రచికిత్స యొక్క జ్ఞాపకశక్తిని మాత్రం కలిగిఉండడు.

మత్తు మందును మితం మించి ఇవ్వడంవల్ల కాలేయం లేదా మూత్రపిండాలు దెబ్బతింటాయి. ఈ విధానం తర్వాత, సెడెటివ్ ఏజెంట్ నెమ్మదిగా పునఃపంపిణీ చేయబడుతుంది లేదా తొలగించబడుతుంది మరియు రోగి నెమ్మదిగా స్పృహను తిరిగి పొందుతాడు. మత్తుమందివ్వడమనేది (Sedation) చాలా సురక్షితమైన పద్ధతి; అయినప్పటికీ, సాధ్యంగా కానవచ్చే దుష్ప్రభావాలు ఏవంటే హృదయ స్పందన రేటులో మార్పు, శ్వాస నెమ్మదించడం, తలనొప్పి లేదా వికారం. డిశ్చార్జ్ చేయబడిన తర్వాత వ్యక్తి తిరిగి తన సాధారణ కార్యకలాపాలకు తిరిగి వెళ్లిపోవచ్చు.



వనరులు

  1. Liu H, Waxman DA, Main R, Mattke S. Utilization of anesthesia services during outpatient endoscopies and colonoscopies and associated spending in 2003-2009. JAMA. 2012 Mar 21;307(11):1178-84. PMID: 22436958
  2. Predmore Z et al. Anesthesia Service Use During Outpatient Gastroenterology Procedures Continued to Increase From 2010 to 2013 and Potentially Discretionary Spending Remained High. Am J Gastroenterol. 2017 Feb;112(2):297-302. PMID: 27349340
  3. Otto S. Lin. Sedation for routine gastrointestinal endoscopic procedures: a review on efficacy, safety, efficiency, cost and satisfaction . Intest Res. 2017 Oct; 15(4): 456–466. PMID: 29142513
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Conscious sedation for surgical procedures
  5. U. S Food and Drug Association. [Internet]. FDA Drug Safety Communication: FDA review results in new warnings about using general anesthetics and sedation drugs in young children and pregnant women

మత్తు మందివ్వడం కొరకు మందులు

Medicines listed below are available for మత్తు మందివ్వడం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.