వయసుకు ముందే రజస్వల కావడం - Precocious Puberty in Telugu

Dr. Ayush Pandey

December 24, 2018

March 06, 2020

వయసుకు ముందే రజస్వల కావడం
వయసుకు ముందే రజస్వల కావడం

సెంట్రల్ ప్రీకోసియస్ ప్యూబర్టీ అంటే ఏమిటి?

మధ్యంతర అకాలపక్వ రజస్వల లేక సెంట్రల్ ప్రీకోసియస్ ప్యూబర్టీ అంటే అదో వైద్య పరిస్థితి, యుక్తవయసులో కానరావాల్సిన లక్షణాలు యుక్తవయసు రాకుండానే కనిపిస్తే దాన్నే సెంట్రల్ ప్రీకోసియస్ ప్యూబర్టీ లేక కేంద్రీయ అకాలపక్వ రజస్వల అంటారు. ఎనిమిదేళ్ల వయసు లోపలే బాలికలు రజస్వలలైతే, అదే బాలుర విషయంలో అయితే తొమ్మిదేళ్ల లోపే రజస్వలురైతే, దాన్నే అకాలపక్వ రజస్వల కావడం అంటారు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

యౌవనదశ (pubertal) పెరుగుదలకు సంబంధించి వచ్చే తొలి లక్షణాల్లో  యుక్తవయసు మార్పులు కూడా ఉన్నాయి. ఆ మార్పులే అమ్మాయిల్లో అయితే రొమ్ముల  వ్యాకోచం జరుగుతుంది, రొమ్ము వ్యాకోచం అనేది ఒంటిపక్కనే కూడా ఉండవచ్చు. చంకల కింద జుట్టు మొలవడం అదే సమయంలో కనిపిస్తుంది. యోని విస్తరణ అనేది ఉండవచ్చు లేదా ఉండకపోవచ్చు. రజస్వల (Menarche) కావడమనేది తరువాతి దృగ్విషయం, అంటే రొమ్ము విస్తరణ తర్వాత 2-3 సంవత్సరాల తరువాత సంభవిస్తుంది.యౌవనారంభ సమయానికి ముందు తీవ్రమైన మొటిమలు రావచ్చు. అబ్బాయిలలో, వృషణాల విస్తరణ సంభవిస్తుంది, తర్వాత వృషణంతిత్తి (అండకోశము) మరియు పురుషాంగం పెరుగుతుంది. బాలుడి పెరుగుదలతోపాటు, మొటిమలు, కంఠధ్వనిలో మార్పులు మరియు ఇతర ద్వితీయ లైంగిక లక్షణాలు రావచ్చు. జఘన జుట్టు రావడమనేది  బాలురు మరియు బాలికలు ఇద్దరికీ సాధారణమే, అంటే యుక్తవయసొచ్చేసరికి జఘనజుట్టు ఆడ-మెగా ఇద్దరిలోను మొలుస్తుంది.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

రజస్వల (యవ్వనం సిద్ధించడం) కావడమనేది ఒక సాధారణ దృగ్విషయం, ఇది వయసు పెరుగుదలతోబాటు వచ్చేదే. యుక్త వయస్సు ఆరంభం అనేది వివిధ అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఇది జన్యుపరంగా నిర్ణయించబడుతుంది. తోబుట్టువుల్లో లేదా తల్లిదండ్రుల్లో ఎవరికైనా రజస్వలత్వం వయసుకు ముందే వచ్చి ఉంటే, రెండవ బిడ్డకు కూడా అదే రీతిలో వయసుకు ముందే రజస్వలత్వం వచ్చే సంభావ్యతను పెంచుతుంది. ప్రత్యామ్నాయంగా, హైపోథాలమస్ యొక్క కణితి ఆండ్రోజెన్ యొక్క పెరుగుదలకు కారణమవుతుంది. యుక్తవయస్సు ప్రారంభంలో స్త్రీలు మరియు అబ్బాయిలలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ మరియు టెస్టోస్టెరాన్ వంటి హార్మోన్ల ప్రారంభ ఉత్పత్తి ఫలితంగా ప్రారంభ లైంగిక అభివృద్ధి కల్గుతుంది, ఇది అకాలపక్వ రజస్వలత్వంలో భాగమే.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

శారీరక మార్పుల రూపాన్ని చాలా సూక్ష్మంగా చెప్పవచ్చు, ఇది మొదట్లో గుర్తించబడదు. నిర్ధారణ కోసం, శరీరం లో ఆండ్రోజెన్ యొక్క స్థాయిలను తెలుసుకోవడానికి ఒక జీవరసాయన పరిశోధన అవసరం. X- కిరణాలు మరియు హార్మోన్ ఉద్దీపన పరీక్షలు రోగ నిర్ధారణను నిర్ధారించడానికి నిర్వహించబడతాయి. అబ్బాయిలలో పెరిగిన టెస్టోస్టెరాన్ స్థాయిలను మరియు గర్భాశయ స్థాయిలను అనారోగ్య పరిస్థితులకు మంచి సూచికలుగా చెప్పవచ్చు. అలాగే, థైరాయిడ్ స్థాయిలు కూడా అంచనా వేయాలి.

చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. కణితుల వచ్చిన సందర్భాల్లో శాస్త్రచికిత్సా  జోక్యం అవసరమవుతుంది. లేకపోతే, హార్మోన్ల సంతులనాన్ని పునఃస్థాపించేందుకు గోనడోట్రోపిన్-విడుదల చేసే హార్మోన్ లను కల్గిఉండే అంటగొనిస్ట్లను ఇవ్వడం జరుగుతుంది. సరిహద్దు కేసులు, అంటే, 8-9 ఏళ్ల వయస్సులో వచ్చే ప్రికోసియస్ రజస్వల సంకేతాలను చూపించే పిల్లలను చికిత్స చేయకుండా వదిలేయబడాలి, అయితే వారిపట్ల పర్యవేక్షణ అవసరమవుతుంది.



వనరులు

  1. National Organization for Rare Disorders [Internet], Precocious Puberty
  2. Eunice Kennedy Shriver National Institute of Child Health and Human; National Health Service [Internet]. UK; Puberty and Precocious Puberty: Condition Information
  3. National Institutes of Health; [Internet]. U.S. National Library of Medicine. Central precocious puberty
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Precocious puberty
  5. Boston Children's Hospital. Precocious (Early) Puberty Symptoms & Causes. U. S [Internet]
  6. American Psychological Association [internet] St. NE, Washington, DC. The risks of earlier puberty.

వయసుకు ముందే రజస్వల కావడం వైద్యులు

Dr. Narayanan N K Dr. Narayanan N K Endocrinology
16 Years of Experience
Dr. Tanmay Bharani Dr. Tanmay Bharani Endocrinology
15 Years of Experience
Dr. Sunil Kumar Mishra Dr. Sunil Kumar Mishra Endocrinology
23 Years of Experience
Dr. Parjeet Kaur Dr. Parjeet Kaur Endocrinology
19 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు