మొలలు - Piles in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 14, 2018

March 06, 2020

మొలలు
మొలలు

సారాంశం

పైల్స్ అని కూడా పిలువబడే మూలవ్యాధులు, క్రింది పురీషనాళంలో మరియు పాయువులో వాపు మరియు ఉబికిన సిరలు. సాధారణంగా, అవి ' పాయువు మరియు పురీషనాళం యొక్క అనారోగ్య సిరలు' గా ఉంటాయి. పైల్స్ అనేవి అంతర్గతoగా (పురీషనాళం లోపల ఏర్పడడం) లేదా బాహ్యoగా  (పాయువు చుట్టూ చర్మం క్రింద) ఏర్పడవచ్చు.

అనేక కారణాల వలన మూలవ్యాధులు సంభవించవచ్చు, అయితే ఖచ్చితమైన కారణం తరచుగా తెలియకపోవచ్చు. ప్రేగు కదలికల సమయంలో అధిక ఒత్తిడికి గురవడం లేదా గర్భధారణ సమయంలో మలద్వారపు సిరలపై ఒత్తిడి పెరగడం వలన కావచ్చు. స్వల్ప దురద మరియు అసౌకర్యం నుండి రక్తస్రావం మరియు అంగం జారుట వరకు పైల్స్ యొక్క తీవ్రతను బట్టి ఈ లక్షణాలు మారుతూ ఉంటాయి. పైల్స్ యొక్క లక్షణాలు మరియు తీవ్రత మీద ఆధారపడి చికిత్స ఉంటుంది. చికిత్సా అనేది నొప్పి నివారణగా లేదా శస్త్రచికిత్సగా ఉపయోగించబడే పీచు పదార్థాల వినియోగం వంటి కొన్ని జీవనశైలి మార్పులతో చికిత్సను సరళీకరించవచ్చు. పైల్స్ యొక్క సమస్యలు సాధారణంగా అరుదుగా ఉండవచ్చు. చికిత్స చేయకుండా వదిలేస్తే, పైల్స్ లేదా మూలవ్యాధులు దీర్ఘకాలికంగా మరియు ఎర్రబడి మరియు రక్తం గడ్డకట్టడం (క్లాట్ నిర్మాణం) మరియు పుండ్లుగా మారటం జరుగుతుంది.

మూలవ్యాదులు సాధారణంగా ప్రమాదకరమైనవి కావు మరియు అవి ఇబ్బందిగా ఉంటే మాత్రమే చికిత్స చేయాలి. గర్భధారణ సమయంలో సంభవించేవి సాధారణంగా డెలివరీ తర్వాత అవి వాటియంతటగా మెరుగుపడతాయి. మలబద్దకం వల్ల సంభవించే మూలవ్యాధులకు, ఆహారం మరియు జీవనశైలిలో ముఖ్యమైన మార్పులు అనేవి మంచి రోగ నివారణకు హామీ ఇస్తాయి. పైల్స్ యొక్క శస్త్రచికిత్స ద్వారా బాగుచేయడం కూడా సంతృప్తికరమైన ఫలితాలను అందిస్తుంది.

మొలలు (పైల్స్) అంటే ఏమిటి? - What is Piles in Telugu

మూలవ్యాధులు అనేవి ఒక చాలా సాధారణ ఆరోగ్య సమస్య. అవి సాధారణంగా తీవ్రమైనవి కాదు కానీ చాలా అసహ్యకరమైన మరియు అసౌకర్యానికి పరిస్థితికి కారణం అవుతాయి, తద్వారా జీవితo యొక్క నాణ్యత ప్రభావితం అవుతుంది. పైల్స్ యొక్క ప్రభావం వయసు లేదా లింగo బట్టి ఉండదు. అయితే, వృద్ధాప్యంలో పైల్స్ అనేది ఒక ప్రమాద కారకంగా చెప్పవచ్చు. అభివృద్ధి చెందని దేశాలలో పైల్స్ తక్కువగా ఉన్నాయి. పాశ్చాత్య దేశాల్లో తీసుకొనే సాధారణమైన తక్కువ-ఫైబర్, అధిక-కొవ్వు గల ఆహారాలు సాధారణంగా ఒత్తిడి మరియు మలబద్ధకంతో ముడిపడివుంటాయి, తత్ఫలితంగా ఇవి మూలవ్యాధులకు దారితీస్తాయి.

పైల్స్ అనగా దిగువ పురీషనాళం మరియు పాయువు యొక్క వాపు మరియు ఉబికిన సిరలు అని అర్థం. మూలవ్యాదులు సాధారణ మానవ శరీర భాగంలో భాగంగా ఉన్నాయని అర్థం చేసుకోవడం చాలా అవసరం. మూలవ్యాధులు అనేవి శ్లేష్మ పొర క్రింద పాయువు నరముల వాపుతో ఒక కుషన్ వలే ఏర్పరచును, ఇది పురీషనాళం మరియు పాయువు యొక్క కింది భాగంలో ఉంటుంది. ఈ సిరలు వాపు మరియు ఉబికినపుడు ఈ లక్షణాలకి కారణం కావచ్చు, ఇది ఒక వ్యక్తి పైల్స్ లేదా మూలవ్యాధి బారిన పడినట్లు మనం చెబుతుంటాము. సంబంధిత రక్త నాళాలు నిరంతరంగా గుండెకు తిరిగి రక్తం పొందడానికి గురుత్వాకర్షణతో పోరాడాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

మొలలు (పైల్స్) యొక్క లక్షణాలు - Symptoms of Piles in Telugu

మూలవ్యాధుల యొక్క లక్షణాలు:

 • మరుగుదొడ్డిలో స్ప్లాష్ చేసిన తర్వాత రక్తపు మరకలు లేదా టాయిలెట్ పేపర్ మీద బాగా ఎర్రని రక్తస్రావం మరకలు కనిపించడం. ఈ రక్తస్రావం సాధారణంగా నొప్పిగా ఉంటుంది మరియు మల విసర్జన చాలా కష్టం లేదా చాలా పెద్ద పరిమాణంలో ఉంటే ఇలా కొన్ని సార్లు సంభవిస్తుంది.
 • పాయువు ప్రారంభము నుండి శ్లేష్మం తొలగింపు.
 • పాయువు చుట్టూ దురద, ఎర్రగా లేదా నొప్పిగా ఉండడం
 • మల విసర్జన తర్వాత కూడా ప్రేగు నిండినట్లుగా ఉండేలా అనిపించడం
 • మల విసర్జన చేయునపుడు నొప్పిగా ఉండడం
 • మూలవ్యాధిగ్రస్తులకు పాయువు విచ్ఛిన్నం కావడం వలన, మృదువైన, ద్రాక్ష సారాయి ముద్ద వలే పాయువు నుండి పొడుచుకుపోవచ్చినట్లు అనిపిస్తుంది.
 • బాహ్య మూలవ్యాధి సంక్రమణ కూడా ముఖ్యంగా విరేచనాలు లేదా మలబద్ధకం తర్వాత, అడపాదడపా వాపు, చికాకు, మరియు అసౌకర్యానికి కారణం కావచ్చు.
 • బాహ్య మూలవ్యాది గడ్డలు కలిగి ఉంటే, ముద్ద ఒక నీలం లేదా ఊదా రంగు మరియు ఒక బాధాకరమైన ముద్దగా కావచ్చు, ఇది రక్తం కారుతూ మరియు హఠాత్తుగా పాయువు యొక్క అంచు వద్ద కనిపిస్తుంది.
 • తీవ్రమైన సందర్భాల్లో అధిక రక్తపోటు, రోగ సంక్రమణం, రక్తస్రావం యొక్క గాయం, పాయువు ఫిస్టులా ఏర్పడుట మరియు మలాన్ని ఆపుకోలేకపోవుట జరుగవచ్చు.

బాధాకరమైన మూలవ్యాధి కలవారు అనగా పాయువు పగులుట, క్రోన్ వ్యాధి, పెద్దప్రేగులో పుండ్లు, పాయువు నందు ఫిస్టులా మరియు కొలొరెక్టల్ క్యాన్సర్ వంటి ఇతర బాధాకరమైన రక్తస్రావ పరిస్థితుల నుండి వేరుచేయబడాలి.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

మొలలు (పైల్స్) యొక్క చికిత్స - Treatment of Piles in Telugu

హానికరం కాని చికిత్సా విధానాలు
మీరు మూలవ్యాధుల వలన తేలికపాటి అసౌకర్యం మాత్రమే కలిగివుంటే, మీ వైద్యుడు కౌంటర్­లో లభించే క్రీమ్­లు, మందులు, ఆయింట్­మెంటులు,  ఫలవర్తీ లేదా మెత్తలను సూచించవచ్చు. ఈ ఉత్పత్తులు హైడ్రోకార్టిసోన్ మరియు లిడోకాయిన్ వంటి పదార్థాలను కలిగి ఉంటాయి, వీటితో తాత్కాలికంగా నొప్పి మరియు దురద నుండి ఉపశమనం పొందవచ్చు.

కనీస హానికర చికిత్సా విధానాలు
నిరంతర రక్తస్రావం లేదా బాధాకరమైన మూలవ్యాదుల కోసం, మీ వైద్యుడు కింది కనీస హానికర విధానాల్లో ఒకదానిని సిఫారసు చేయవచ్చు. ఈ విధానాలలో సాధారణంగా అనస్థీషియా అవసరం లేదు మరియు వైద్యుని కార్యాలయంలో మాత్రమే చేయవచ్చు.

 • రబ్బరు బ్యాండ్­ని ముడి వేయుట
  రబ్బరు బ్యాండ్లు అతిగా ఉబికిన మూలవ్యాధి యొక్క ప్రసరణను తగ్గించటానికి ఒకటి లేదా రెండు చిన్న రబ్బరు బ్యాండ్లను అంతర్గత మూలవ్యాధి చుట్టూ ముడి వేయాలి. అప్పుడు మూలవ్యాధి ఒక వారం లోపల లేదా అంత కంటే ముందు ఎండిపోతుంది మరియు రాలిపోతుంది. ఈ విధానం సాధారణంగా చాలా మందికి బాగానే పనిచేస్తుంది. అయినప్పటికీ, మూలవ్యాధిని ఉన్న చోట కట్టు వేయుట అసౌకర్యంగా ఉంటుంది మరియు రక్తస్రావానికి కారణం కావచ్చు, ప్రక్రియ చేసిన తరువాత ఇది వాస్తవానికి 2-4 రోజుల తరువాత ఇలా జరుగుతుంది. అరుదుగా ఇది తీవ్రతరంగా ఉంటుంది, కానీ అప్పుడప్పుడు తీవ్రమైన సమస్యలు సంభవించవచ్చు. 
 • ఇంజెక్షన్ (స్క్లేరోథెరపీ)
  ఈ ప్రక్రియలో, మీ వైద్యుడు ప్రభావితమైన మూలవ్యాదిపై రసాయన ద్రావణాన్ని ఇంజెక్ట్ చేస్తారు. ఇది మూలవ్యాధి కణజాలం సంకోచించేలా చేస్తుంది. ఈ విధానం తక్కువ లేదా నొప్పిలేకుండా చేస్తుంది కానీ రబ్బరు బ్యాండ్ ముడి వేయుట కంటే తక్కువ ప్రభావవంతంగా ఉంటుంది.
 • రక్తం గడ్డకట్టుట (పరారుణ, లేజర్, లేదా బైపోలార్)
  ఈ ప్రక్రియ లేజర్ లేదా పరారుణ కాంతి లేదా వేడిని ఉపయోగిస్తుంది. ఇది చిన్న, రక్తస్రావం, అంతర్గత మూలవ్యాదులు గట్టిపడటానికి మరియు ముడుతలు పడడానికి కారణమవుతుంది. రక్తం గడ్డకట్టుట వలన కొన్ని దుష్ప్రభావాలు ఉన్నాయి కానీ రబ్బరు బ్యాండ్ చికిత్సతో పోల్చితే మూలవ్యాధుల పునరావృత రేటు ఎక్కువగా ఉంటుంది.

శస్త్ర చికిత్సా విధానాలు

మూలవ్యాదుల కోసం శస్త్రచికిత్సను హెమోరోడెక్టమి అని అంటారు. హేమోరోడెక్టమి కోసం సూచనలు:

 • మూడవ- మరియు నాల్గవ రకపు మూలవ్యాధులు.
 • రెండో రకపు మూలవ్యాధులు నాన్ ఆపరేటివ్ పద్ధతులు ద్వారా నయo కావటం లేదు.
 • ఫిబ్రోసెధిమోరాయిడ్లు.
 • బాహ్య మూలవ్యాధులు బాగా నిర్వచించినప్పుడు అంతర-బాహ్య మూలవ్యాధులు.

శస్త్రచికిత్స స్థానికంగా (మత్తు కలిగినది), వెన్నెముక సంబంధిత లేదా సాధారణ అనస్తీసియాతో నిర్వహించబడుతుంది. తీవ్రమైన లేదా పునరావృతమయిన మూలవ్యాధుల చికిత్స చేయడానికి శస్త్రచికిత్స అత్యంత ప్రభావవంతమైన చికిత్సా పద్ధతి. రోగి అదే రోజు ఇంటికి వెళ్లిపోవచ్చు మరియు 7-10 రోజుల్లో అతని సాధారణ పరిస్థితిని తిరిగి పొందవచ్చు.
శస్త్రచికిత్స నుండి కలిగే సమస్యలు మీ మూత్రాశయాన్ని ఖాళీ చేయడంలో తాత్కాలిక ఇబ్బంది కలిగి ఉండవచ్చు మరియు తద్వారా మూత్ర మార్గము సంక్రమణకు దారి తీయవచ్చు.

 • హెమోరోయిడ్ స్టాప్లింగ్ (స్టాపిల్డ్ హెమోరోడెక్టమీ లేదా స్టాపిల్డ్ హెమోరోడపెక్సీ)
  హెమోరోడెక్టమీకి ఒక ప్రత్యామ్నాయం, ఈ ప్రక్రియ రక్తస్రావ కణజాలానికి రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది మరియు అంతరిక మూలవ్యాధులకు మాత్రమే చేయబడుతుంది. ఇది సాధారణంగా హెమోరోడెక్టమీ కంటే తక్కువ నొప్పిని కలిగి ఉంటుంది, అయితే ఇది హెమోరోడెక్టమీతో పోలిస్తే పునరావృత మరియు పురీశనాళo జారుట వంటి ఎక్కువ ప్రమాదానికి కారణమవుతుంది. రక్తస్రావం, మూత్ర విసర్జన మరియు నొప్పి మరియు అరుదుగా ప్రాణాంతకమైన రక్త సంబంధిత అంటువ్యాధులు (సెప్సిస్) వంటి సంక్లిష్టతలు కూడా ఉంటాయి. మీ ఉత్తమ వైద్య సలహా కోసం మీ డాక్టరుతో మాట్లాడండి.

స్వీయ రక్షణ

 • సిట్జ్ బాత్­ను ప్రయత్నించుట
  ఒక సిట్జ్ (జర్మన్­లో "సిట్జ­న్" అంటే "కూర్చొనుట" అని అర్థం) బాత్ అనేది పిరుదులు మరియు తుంట్లు కోసం ఒక వెచ్చని నీటి స్నానం, ఇది ఆసన ప్రాంతంలో చికాకు మరియు దురద నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు ఆసన స్ఫింకర్ కండరాలను విశ్రాంతి పొందేలా చేస్తుంది. మీరు టాయిలెట్ సీటు మీద సరిపోయే ఒక చిన్న ప్లాస్టిక్ టబ్­ను ఉపయోగించవచ్చు లేదా మీరు వెచ్చని నీటిలో కొన్ని అంగుళాలు నింపిన సాధారణ స్నానాల తొట్టిలో కూర్చోవచ్చు. ప్రతి ప్రేగు కదలిక తర్వాత 20 నిమిషాల పాటు సిట్జ్ బాత్, ఒక రోజుకు 2-3 సార్లు చేయడం వలన సహాయకారి అవుతుంది. తరువాత, శాంతముగా పాయువును పొడిగా తుడవాలి; గట్టిగా తుడవడం లేదా రుద్దడానికి ప్రయత్నించవద్దు. 
 • ఐస్ ప్యాక్ ఉపయోగించడం
  పాయువు ప్రాంతంలో ఒక ఐస్ ప్యాక్ ఉంచడం వల్ల వాపు మరియు నొప్పి తగ్గుతుంది. 
 • ఒక కుషన్/ మృదువైన ఉపరితలం ఉపయోగించడం
  గట్టి ఉపరితలం కంటే మెత్తటి కుషన్ లేదా మృదువైన ఉపరితలంపై కూర్చొన్నచో ఉన్న పైల్స్ యొక్క వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇది కొత్తగా మూలవ్యాదుల సంక్రమించకుండా నిరోధిస్తుంది.
 • సమయోచిత ఔషధాలను ప్రయత్నించడం
  ఒక స్థానిక మత్తుమందు ఉన్న కౌంటర్ వద్ద లభించే మూలవ్యాధి మందులు తాత్కాలికంగా నొప్పికి ఉపశమనం కలిగిస్తాయి మరియు ఎలాంటి హానికరమైన ప్రభావాలను కలిగించవు.
 • మీ పాదమును పైకి ఎత్తుట
  మీరు పాశ్చాత్య కమోడ్­లో కూర్చున్నప్పుడు, ఒక అడుగు స్టూల్­ని ఉంచడం ద్వారా మీ పాదాలను కొంచెం ఎత్తులో ఉంచడానికి ప్రయత్నించాలి. ఇది పురీషనాళం యొక్క స్థానం మారుస్తుంది మరియు అది మలం యొక్క విసర్జన సులభంగా అయ్యేలా అనుకూలిస్తుంది.


వనరులు

 1. American Society of Colon and Rectal Surgeons [internet]; Diseases & Conditions
 2. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. Hemorrhoids and what to do about them. February 6, 2019. Harvard University, Cambridge, Massachusetts.
 3. Shrivastava L, Borges GDS, Shrivastava R (2018). Clinical Efficacy of a Dual Action, Topical Anti-edematous and Antiinflammatory Device for the Treatment of External Hemorrhoids. Clin Exp Pharmacol 8: 246. doi:10.4172/2161-1459.1000246
 4. Hamilton Bailey, Christopher J. K. Bulstrode, Robert John McNeill Love, P. Ronan O'Connell. Bailey & Love's Short Practice of Surgery. 25th edition Taylor and fransis group, USA.
 5. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. 6 self-help tips for hemorrhoid flare-ups. OCTOBER 26, 2018. Harvard University, Cambridge, Massachusetts.

మొలలు కొరకు మందులు

Medicines listed below are available for మొలలు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for మొలలు

Number of tests are available for మొలలు. We have listed commonly prescribed tests below: