ఊపిరితిత్తుల వ్యాధి - Lung Disease in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 23, 2018

July 31, 2020

ఊపిరితిత్తుల వ్యాధి
ఊపిరితిత్తుల వ్యాధి

ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఏమిటి?

ఊపిరితిత్తుల పనితీరుకు అడ్డు తగిలే ఏదైనా రుగ్మత లేదా సమస్యనే “ఊపిరితిత్తుల వ్యాధి”గా సూచిస్తారు. ఊపిరితిత్తుల వ్యాధులు శ్వాసనాళాలు (airways), ఊపిరి తిత్తులు,  ఊపిరితిత్తుల మధ్య ఉండే పొరలు లేక అస్తిరులు,  ఊపిరితిత్తిపై నుండే పొర (pleura), ఛాతీ గోడ మరియు ఊపిరితిత్తుల రక్త నాళాలను బాధిస్తాయి. అత్యంత సాధారణ ఊపిరితిత్తుల వ్యాధులు ఏవంటే ఆస్తమా, క్షయ వ్యాధి, బ్రాంకైటిస్, ముదిరిన ఊపిరితిత్తుల వ్యాధి (క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్), న్యుమోనియా, పల్మొనరీ ఫైబ్రోసిస్, పల్మనరీ ఎడెమా, ఊపిరితిత్తుల ధమనుల్లో నిరోధం (blocked artery of lungs),  ఊపిరితిత్తుల క్యాన్సర్.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఊపిరితిత్తులకు సంబంధించిన అతి తేలికైన లక్షణాల పట్ల కూడా దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. కింద పేర్కొన్నవి ఊపిరితిత్తుల వ్యాధి యొక్క హెచ్చరిక సంకేతాలు:

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

వివిధ ఊపిరితిత్తుల వ్యాధులకు వివిధ కారణాలు ఉన్నాయి. అవి క్రింది విధంగా ఉన్నాయి:

  • బాక్టీరియల్, వైరల్ లేదా ఫంగల్ అంటువ్యాధులు .
  • వాయు కాలుష్యం.
  • ధూమపానం లేదా పొగకు బహిర్గతంగా గురి కావడం
  • దుమ్ము మరియు పుప్పొడి వంటి అలెర్జీ కారకాలు.
  • రోగనిరోధక (ఆటో ఇమ్యూన్) వ్యాధులున్న కుటుంబ చరిత్ర.
  • వృత్తిపరంగా రసాయనిక పొగలకు లేదా రాతినార (ఆస్బెస్టాస్) వంటి మంట పుట్టించే పదార్థాలకు బహిర్గతం కావడం.
  • పుట్టుకతో వచ్చే గుండె వ్యాధి లేదా జన్యు పరివర్తన.
  • ఊపిరితిత్తుల క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర.
  • శరీరం యొక్క ఇతర భాగాలలో క్యాన్సర్ ఉండుట.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఊపిరితిత్తుల వ్యాధి నిర్ధారణ వ్యాధి యొక్క అంతర్లీన కారణం కనుక్కోవడానికి వ్యక్తి యొక్క వివరణాత్మక వైద్య మరియు కుటుంబ చరిత్రతో ప్రారంభమవుతుంది. దీని తరువాత కింద పేర్కొన్న వ్యాధి నిర్ధారణ (డయాగ్నొస్టిక్) పరీక్షలు జరుగుతాయి:

  • ఛాతీ పరీక్ష.
  • శ్లేష్మం పరీక్ష (కఫము పరీక్ష) .
  • ప్రోటీన్లు, ప్రతిరక్షకాలు మరియు స్వీయ రోగనిరోధక వ్యాధుల గుర్తుల్ని గుర్తించడం కోసం రక్త పరిశోధన.
  • X- రే, CT స్కాన్ మరియు ఛాతీ MRI ల ద్వారా ఊపిరితిత్తుల ఇమేజింగ్.
  • ECG.
  • బ్రాంఖోస్కోపీ (Bronchoscopy.
  • ఊపిరితిత్తుల పనితీరు పరీక్షలైన స్పిరోమెట్రీ మరియు పల్స్ ఆక్సిమెట్రి వంటి పరీక్షలు.
  • కణజాల బయాప్సీ లేదా శ్వాసకోశ లావజ్ (ఊపిరి తిత్తులను శుభ్రపరిచే ఓ రకమైన ప్రక్రియ) పరీక్ష.

మీ ఛాతీ స్పెషలిస్ట్ (chest specialist) మీరు కలిగి ఉన్న ఊపిరితిత్తుల వ్యాధి రకాన్ని బట్టి చికిత్సను నిర్ణయిస్తారు. చికిత్స పద్ధతులు క్రింది విధంగా ఉంటాయి:

  • మందులు:
    • అంటువ్యాధులు లేదా సంక్రమణ వ్యాధుల చికిత్సకు యాంటిబయోటిక్స్, యాంటీ వైరల్ మరియు యాంటి ఫంగల్ మందులు మరియు యాంటీపైరెక్టిక్స్ (జ్వరానికిచ్చే మందులు).
    • ఊపిరితిత్తులలో మంట, వాపు (పల్మోనరీ మంట) నియంత్రణకు మంటనివారణా మందులు (యాంటీఇన్ఫ్లమేటరీ డ్రగ్స్).
    • ఉబ్బసం వ్యాధికి కార్టికోస్టెరాయిడ్స్ మందుల్ని పీల్చదగినవిగా, శరీరంలోనికి సిరంజి ద్వారా ఇచ్చే ఇన్ఫ్యూషన్ మందులు మరియు లేదా నోటిద్వారా కడుపుకిచ్చే మందులు.
    • క్షయవ్యాధి చికిత్సకు యాంటిటుబెర్క్యులర్ మందులు.
    • ఊపిరితిత్తులలో ఫైబ్రోసిస్ వ్యాధిని తగ్గించడానికి యాంటీ ఫైబ్రోటిక్ మందులు.
    • ఊపిరితిత్తుల వ్యాధికి కారణమయ్యే ఆమ్లత (యాసిడ్ రిఫ్లక్స్) ను నియంత్రించడానికి ‘H2-రిసెప్టర్ అంతగానిస్ట్’ ను తీసుకోవడం.
  • శ్వాసప్రక్రియను సులభతరం చేసుకునేందుకు ఆక్సిజన్ థెరపీ.
  • ఊపిరితిత్తుల పునరావాసం.
  • ఊపిరితిత్తులకు దెబ్బ తగిలిన తీవ్రమైన సందర్భాలలో ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స (lung tranplant surgery)

పొగ మరియు కాలుష్యాన్ని మనం మింగకుండా నివారించడానికి రక్షణ ముసుగులు ఉపయోగించడం, ధూమపానం మానివేయడం, సాధారణ యోగా మరియు ప్రాణాయామ (శ్వాస వ్యాయామాలు) ను సాధన చేయడం వంటి చర్యలు ఊపిరితిత్తుల సమస్యలను నివారించడానికి సహాయం చేస్తాయి. ఊపిరితిత్తుల వ్యాధిని నియంత్రించడానికి మరియు నయం చేసుకోవడానికి మీ ప్రత్యేక వైద్యుడి సహాయంతో క్రమమైన మందులు, క్రమంగా  ఎప్పటికప్పుడు వైద్య ,సంప్రదింపులు, సలహాలు మరియు అనుసరణలు తీసుకోవడం.



వనరులు

  1. American Lung Association. [Internet]. Chicago, IL‎, United States; Breathe Easy.
  2. Canestaro WJ, et al. Drug Treatment of Idiopathic Pulmonary Fibrosis: Systematic Review and Network Meta-Analysis.. Chest. 2016;149:756.
  3. Wielpütz MO. et al. Radiological diagnosis in lung disease: factoring treatment options into the choice of diagnostic modality.. Dtsch Arztebl Int. 2014 Mar 14;111(11):181-7. PMID: 24698073.
  4. Keith C Meyer. Diagnosis and management of interstitial lung disease. Transl Respir Med. 2014; 2: 4. PMID: 25505696.
  5. Anupama Gupta. Pranayam for Treatment of Chronic Obstructive Pulmonary Disease: Results From a Randomized, Controlled Trial. Integr Med (Encinitas). 2014 Feb; 13(1): 26–31.

ఊపిరితిత్తుల వ్యాధి కొరకు మందులు

Medicines listed below are available for ఊపిరితిత్తుల వ్యాధి. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.