ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ - Irritable Bowel Syndrome (IBS) in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 06, 2019

March 06, 2020

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్
ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్

సారాంశం

ఒక సిండ్రోమ్ అనునది వైధ్యశాస్త్ర చిహ్నాలు మరియు లక్షణాల సమూహము, ఇవి ఒకదానితో ఒకటి సంబంధము కలిగియుంటాయి మరియు, ఈ సిండ్రోమ్ తరచుగా ఒక నిర్ధిష్టమైన వ్యాధి లేక రుగ్మతతో సంబంధము కలిగియుంటుంది.  ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ప్రకోప ప్రేగు సిండ్రోమ్)  (IBS) అనునది పెద్ద ప్రేగు యొక్క రుగ్మత, ఇది సాధారణ ప్రేగు ఫంక్షన్ లో మార్పులను కలిగిస్తుంది.  ఖచ్చితమైన కారణము తెలియకపోవచ్చు, అయితే కొంతమంది నిపుణుల యొక్క నమ్మకమేమిటంటే భౌతికముగా కంటే ఇది ప్రధానముగా మానసికమైనది.  రక్తము లేక ఊహాత్మక పరీక్షల గుండా ఏ విధమైన గుర్తించదగిన కారణము ఉండదు, వీటి యొక్క లక్షణాలు  పొత్తికడుపు లో నొప్పితో పాటు మలబధ్ధకం నుండి వదులుగా ఉండే విరేచనాలుగా మారుతూ ఉంటాయి.  లక్షణాలు పైన ఆధారపడి చికిత్స యొక్క ఎంపికలు మారుతాయి మరియు ప్రతీ రోగి విభిన్న లక్షణాలను ప్రదర్శించడం మరియు చికిత్సకు ప్రతిస్పందించడం వంటి వాటి వలన కూడా ఫలితాలలో  తేడాలు ఉంటాయి.

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ అంటే ఏమిటి? - What is Irritable Bowel Syndrome in Telugu

ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ (ప్రకోప ప్రేగు సిండ్రోమ్)  (IBS) అనునది ఎక్కువకాల (దీర్ఘ-కాలిక) రుగ్మత, ఇది జీర్ణకోశ ప్రాంతమును (ఆహార నాళము లేక జీర్ణ నాళము) ప్రభావితం చేస్తుంది, ప్రత్యేకముగా పెద్ద ప్రేగు (పెద్ద ప్రేగు భాగం) ను ప్రభావితం చేస్తుంది.  గ్యాస్ట్రోఇంటెస్టినల్ ట్రాక్ట్ (ఆహార నాళము లేక జీర్ణ నాళము) అను పదము ఆహారము ప్రయాణించే మొత్తం మార్గము (నోరు, ఆహార నాళము, ఉదరము, చిన్న ప్రేగు, మరియు పెద్ద ప్రేగు) ను సూచించడానికి ఉపయోగిస్తారు, మరియు వాటికి సంబంధించిన అవయవాలు అనగా కాలేయం, పిత్తాశయం, మరియు క్లోమమ,  ఇవి జీర్ణ సంబంధ ఎంజైములను స్రవిస్తాయి.  ఐబిఎస్ అనునది పెద్ద ప్రేగు యొక్క మల ఫంక్షన్ (విరేచనం) తో  వచ్చే సమస్యలకు సంబంధించినది. ఇక్కడ అతిసారం (వదులు మోషన్స్) లేక మలబధ్ధకము (మలమును విసర్జించడములో ఇబ్బంది) లేక రెండిటినీ కలిగి ఉంటాయి. ఇది ఉబ్బరం (గ్యాస్ తో పూర్తిగా నిండినట్లు ఉండే భావన) మరియు పొత్తికడుపులో నొప్పికి సంబంధించినది.

Probiotics Capsules
₹599  ₹770  22% OFF
BUY NOW

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ యొక్క లక్షణాలు - Symptoms of Irritable Bowel Syndrome in Telugu

ఐబిఎస్ యొక్క అధిక సాధారణ లక్షణము పొత్తి కడుపులో నొప్పిని కలిగి ఉండడం.  పొత్తి కడుపు క్రింది భాగమున, కడుపులో తిమ్మిరి రూపములో నొప్పి ఉంటుంది.  ఈ నొప్పి నుండి ఉపశమనము సాధారణముగా మలమును బయటకు పంపించడము ద్వారా పొందవచ్చు.  కడుపు ఉబ్బరం (అధికముగా గ్యాస్ ఉత్పత్తి వలన కడుపు నిండినట్లుగా ఉంటుంది) రోజంతా ప్రమాదకరముగా ఉంటుంది, అయితే కారణము తెలియకపోవచ్చు.  (ఎక్కువగా చదవండి - ఉబ్బరానికి కారణాలు మరియు ఇంటి చిట్కాలు)
ఐబిఎస్-సి కలిగిన ప్రజలు (చిన్న గులకరాళ్ల-ఆకారములో మలము- ఇవి తరచుగా గట్టిగా ఉంటాయి) పొత్తికడుపులో నొప్పితో పాటు, గట్టి గుళికల రూపములో మలమును కలిగిఉంటారు మల విసర్జన సమయములో ఎక్కువ ప్రయాస కలుగుతుంది.  ఐబిఎస్-డి కలిగిన ప్రజలు, పలుచని నీళ్లవంటి మరియు తక్కువ పరిమాణములో మల విసర్జన చేస్తారు.  అసంపూర్తిగా ప్రేగు ఖాళీ అయిందనే ఒక నిరంతర భావనను కలిగి ఉంటారు.  శ్లేష్మం ఉత్సర్గం కూడా సాధారణముగా ఉంటుంది అయితే ఇది రక్త స్రావముతో కలిపి బయటకు రాదు.  ఏ విధమైన బరువు కోల్పోవడం (నష్టము) అనునది రిపోర్ట్ చేయబడదు.  పోస్ట్ అల్పకోశ ఐబిఎస్ అనునది జ్వరముతో పాటు ప్రధానముగా ఎడమ వైపున పొత్తి కడుపులో నొప్పిని కలిగిస్తుంది.  ఐబిఎస్-ఎమ్ కలిగిన రోగులు ఐబిఎస్-సి మరియు ఐబిఎస్-డి యొక్క రెండింటి ప్రత్యామ్నాయ లక్షణాలను ప్రదర్శిస్తారు.    (ఎక్కువగా చదవండి - కడుపు నొప్పి కాదణాలు మరియు చికిత్స)

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ యొక్క చికిత్స - Treatment of Irritable Bowel Syndrome in Telugu

రోగికి ఓదార్పునివ్వాలి మరియు లక్షణాల యొక్క వివరణ వారికి తెలిసేటట్లుగా చేయాలి.  ఐబిఎస్ యొక్క చికిత్స అనునది ఐబిఎస్ యొక్క రకము మరియు వ్యక్తి కలిగి ఉన్న ఐబిఎస్ యొక్క వర్గీకరణ పైన ఆధారపడి ఉంటుంది.  

  • నొప్పి
    నొప్పి తనంతట తానుగా ఉపశమనము పొందకుంటే, యాంటికొయాంటికొలినేర్జిక్ ఏజెంట్ యొక్క ఒక కోర్స్ (డైసైక్లోమైన్ 10మిగ్రా) లేక ఒక యాంటిస్పాస్మాయాంటిస్పాస్మాడిక్ (మెబెవెరిన్ 135 మిగ్రా) లను రోజుకు మూడు సార్లు ఇవ్వవచ్చు.
  • ఐబిఎస్-డి
    ఆహారములో ఫైబర్ పధార్థము యొక్క పరిమాణము పెంచుట మరియు సమూహ విరేచనకారులు అనగా చర్మముతో పండ్లు, కూరగాయలు, మిథైల్ సెల్యులోజ్ లేక ఇసాబ్గోల్ పొట్టు అనునవి కలుపబడతాయి. మందులు అనగా లోపెర్అమైడ్ (2-4 మిగ్రా ఒక రోజుకు 4 సార్లు) లేక కొలెస్టైరామిన్ (రోజువారీ 1 సాచెట్) లేక కొడీన్ ఫాస్ఫేట్ (ప్రతీరోజు 30-90 మిగ్రా) ఒకవేళ లక్షణాలు ఉంటే సూచించబడతాయి.  విపరీత సందర్బాలలో ప్రతీ రాత్రి ఒకసారి ఒక సైకోట్రోపిక్ (మనస్తత్వ) మందు అనగా అమిట్రిఫ్టైలిన్ (10-25 మిగ్రా) కూడా సిఫార్సు చేయవచ్చు.
  • ఐబిఎస్-సి
    మలం మృదువుగా రావడానికి నీరు ఎక్కువగా త్రాగడం, మరియు ఓట్స్, పప్పులు (కాయధాన్యాలు), క్యారెట్స్, ఒలిచిన బంగాళాదుంపలు వంటి కరిగే ఫైబర్ ను ఎక్కువగా తీసుకోవడం పెంచాలి.  ఒకవేళ ఫైబర్ మందులు లక్షణాల నుండి ఉపశమనమును ఇవ్వడములో విఫలమయితే, మెగ్నీషియా పాలను చికిత్సా ప్రణాళికలో కలపాలి.
  • పోస్ట్-ఇన్ఫెక్సియస్ ఐబిఎస్
    పోస్ట్-ఇన్ఫెక్సియస్ ఐబిఎస్ లో, ఖచ్చితమైన యాంటిబయాటిక్ రెజిమ్ అను దానిని ఇన్ఫెక్షన్ ను నయం చేయడానికి అనుసరించాలి మరియు తరువాత లక్షణాలు నిర్మూలించబడతాయి.
  • ఐబిఎస్ లో యాంటిడిప్రెస్సంట్స్
    ట్రైసైక్లిక్ యాంటిడిప్రెస్సంట్ థెరపీ అనునది ప్రకోప ప్రేగు రోగుల యొక్క పరిస్థితిని మెరుగుపరుస్తుంది.  ప్రధాన లక్షణాలు కలిగిన రోగులు అనగా, నొప్పి, అతిసారం, మరియు మలబధ్ధకం అనునవి ప్రధానమైన లక్షణముగా అధికముగా మేలు చేస్తుంది.

జీవనశైలి నిర్వహణ

ఐబిఎస్ ను పూర్తిగా నయం చేయడానికి ఏ విధమైన కాంక్రీట్ దశలు లేక మందులు లేవు.  అయితే, రోజువారీ ఆహారం మరియు జీవనశైలిలో సరైన మార్పులను చేయడము ద్వారా లక్షణాలను తొలగించవచ్చు.

  • మంచి నాణ్యత కలిగిన పదార్థాలను ఉపయోగించి వండిన ఇంటి ఆహారమును ఎంచుకోవడం మరియు లక్షణాలను మార్పు చేసుకోవడముతో పాటు లక్షణాలను చెక్ చేసుకోవడానికి సహాయంచేసే విధముగా, వినియోగించే ఆహార వస్తువుల రికార్డుతో ఒక డైరీని తయారుచేసుకోవాలి.
  • ప్రతీరోజూ ఒక వ్యాయామ నియమాన్ని చేపట్టడం కూడా మొత్తం లక్షణాలను మెరుగుపరచడానికి సహాయం చేస్తుంది.  మలబధ్ధకం విషయములో తగినంత నీరు తీసుకోవడం, అతిసారం విషయములో ఆహారమునకు ఫైబర్ ను జతచేయడం, మరియు కొన్ని ఆరోగ్యకరమైన ప్రొబయాటిక్ పానీయాలను ప్రయత్నించడం, ఇవి ఆంత్రములో మంచి బ్యాక్టీరియాను పెంచుతాయి, ఇవి జీర్ణక్రియ బాగుగా జరగడానికి సహాయం చేస్తాయి.
  • ఐబిఎస్ కలిగిన ప్రజలు భోజనమును మానుకోవడమును దూరముగా పెట్టాలని సూచించబడింది, తక్కువగా ఆహారమును తీసుకోవడం, క్రొవ్వు మరియు ప్యాకేజ్ చేయబడిన ఆహారము అనగా చిప్స్ మరియు బిస్కెట్లను తొలగించాలి, ధూమపానము, మద్యము, మరియు కేఫిన్ (టీ మరియు కాఫీలలో) మొదలగు వాటిని దూరముగా ఉంచాలి.
  • ఉల్లాసభరితమైన కార్యక్రమాల ద్వారా ఒత్తిడిని నిర్వహించడం మరియు ఒత్తిడి అనునది లక్షణాలను పెంచుతుంది కాబట్టి రిలాక్సేషన్ చర్యలు అనగా ధ్యానము అనునది అత్యవసరమైనది.  
Digestive Tablets
₹314  ₹349  9% OFF
BUY NOW


వనరులు

  1. Stuart Ralston Ian Penman Mark Strachan Richard Hobson. Davidson's Principles and Practice of Medicine. 23rd Edition: Elsevier; 23rd April 2018. Page Count: 1440
  2. Am Fam Physician. 2005 Feb 1;71(3):547-548 [Internet] American Academy of Family Physicians; Irritable Bowel Syndrome.
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Eating, Diet, & Nutrition for Irritable Bowel Syndrome.
  4. Aggarwal Praveen, George Mathew Medicine: Prep Manual for Undergraduates. 5th Edition: Elsevier India; 28th September 2015. Pages: 1022.
  5. National Health Service [internet]. UK; iet, lifestyle and medicines - Irritable bowel syndrome (IBS) Contents What is IBS?

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ వైద్యులు

Dr. Paramjeet Singh Dr. Paramjeet Singh Gastroenterology
10 Years of Experience
Dr. Nikhil Bhangale Dr. Nikhil Bhangale Gastroenterology
10 Years of Experience
Dr Jagdish Singh Dr Jagdish Singh Gastroenterology
12 Years of Experience
Dr. Deepak Sharma Dr. Deepak Sharma Gastroenterology
12 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ కొరకు మందులు

Medicines listed below are available for ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.