అంటువ్యాధులు - Infections in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

అంటువ్యాధులు
అంటువ్యాధులు

అంటువ్యాధులు అంటే ఏమిటి?

వ్యాధి-కారకమయ్యే సూక్ష్మజీవులు మనపై దాడి చేసి, మన శరీరంలో చోటు చేసుకున్నప్పుడు అవి ఎన్నో రెట్లుగా పెరిగిపోతాయి. ఈ సూక్ష్మజీవులు అనేక వ్యాధి లక్షణాలను మరియు ప్రతిచర్యలను శరీరంలో కలుగజేస్తాయి. అలాంటి సూక్ష్మజీవికారక వ్యాధిలక్షణాల్నే “అంటువ్యాధులు,” సంక్రమణలు లేక “ఇన్ఫెక్షన్లు”గా పిలుస్తారు. అంటువ్యాధులు మన శరీరంలో బాహ్యాంగా కానీ లేదా అంతర్గతంగా కానీ సంభవించడానికి బాక్టీరియాలు, శిలీంధ్రాలు, వైరస్లు మరియు పరాన్నజీవులు కారకాలవుతాయి. చాలా వ్యాధికారక సూక్ష్మజీవులు ఎన్నో వ్యాధులను కలిగిస్తాయి. అంటువ్యాధులు ప్రాధమికంగా ఉండి ప్రస్తుత ఆరోగ్య సమస్యకు కారణమవుతాయి,  లేదా అంటువ్యాధులు ద్వితీయంగా ఉండి వ్యాధి నిరోధక శక్తి తగ్గడంవల్ల అంటువ్యాధులు సంభవిస్తుండవచ్చు. తగ్గిన వ్యాధి నిరోధకత అంతకు ముందు వచ్చిన సంక్రమణ లేదా ఓ రకమైన గాయాల కారణంగా సంభవించవచ్చు.

అంటువ్యాధుల ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

అంటువ్యాధి (సంక్రమణ) లక్షణాలు సాధారణంగా సంక్రమణ ఏ భాగంలో వచ్చిందో ఆ భాగం పైన మరియు అంటువ్యాధికారక సూక్ష్మజీవులపై ఆధారపడి ఉంటాయి. ప్రధాన లక్షణాలు క్రింది విధంగా ఉంటాయి:

ప్రధాన కారణాలు ఏమిటి?

అంటువ్యాధుల కారకాలు రింగ్వార్మ్ , రౌండ్వార్మ్, పేను, ఫ్లులు మరియు పేలు, తుళ్లుపురుగు వంటి బాక్టీరియాలు, ఫంగస్, వైరస్లు మరియు పరాన్నజీవులై ఉంటాయి. క్రింద వివరించిన విధంగా అంటువ్యాధులు అనేక విధాలుగా వ్యాపిస్తాయి:

  • వ్యక్తి నుండి వ్యక్తికి.
  • జంతువుల నుండి మనుషులకు.
  • తల్లి నుండి గర్భస్థ శిశువుకు.
  • కలుషిత ఆహారం మరియు నీరు.
  • కీటక కాటు.
  • అంటువ్యాధి సోకిన వ్యక్తి తాకిన వస్తువులను ఉపయోగించడంవల్ల.
  • ఇయాట్రాజెనిక్ ట్రాన్స్మిషన్ (అంటువ్యాధి సోకిన వైద్య పరికరాల కారణంగా).
  • నోస్కోమియల్ ఇన్ఫెక్షన్ (హాస్పిటల్ లో సోకిన వ్యాధి).

అంటు వ్యాధుల్ని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు వీటికి చికిత్స ఏమిటి?

డాక్టర్ మీ నుండి సేకరించిన మీ వైద్య చరిత్ర తర్వాత రోగనిర్ధారణ పరీక్షలు నిర్వహించబడతాయి. సాధారణంగా ఈ క్రింది విశ్లేషణ పరీక్షలు సూచించబడతాయి:

  • శారీరక పరిక్ష.
  • సూక్ష్మజీవ పరీక్ష.
  • ప్రయోగశాల పరీక్షలు, రక్తం, మూత్రం, మలం, గొంతు స్నాబ్లు మరియు సెరెబ్రోస్పానియల్ ద్రవం యొక్క నమూనాలను పరీక్షించడం.
  • ఎక్స్-రే మరియు MRI వంటి ఇమేజింగ్ స్టడీస్ పరీక్షలు.
  • బయాప్సి.
  • PCR (పాలిమరెస్ చైన్ రియాక్షన్) ఆధారిత పరీక్ష.
  • ఇమ్యునోఅస్సేస్: ELISA (ఎంజైమ్-లింక్డ్ ఇమ్యునోసార్బెంట్ అస్సే) లేదా RIA (రేడియో ఇమ్యునో ఎసో).

మీ సంక్రమణకు కారకమైన సూక్ష్మజీవి ఏది అన్న విషయం తెలిసిన తరువాత, చికిత్స సులభం అవుతుంది. అంటురోగాలకు కింది చికిత్స అందుబాటులో ఉంది:

  • మందులు:
    • యాంటిబయాటిక్స్.
    • యాంటీవైరల్ మందులు.
    • యాంటీప్రోటోజోవల్ మందులు.
    • యాంటీఫంగల్స్.
  • టీకా.
  • ప్రత్యామ్నాయ మందులు (వైద్యం): గ్రీన్ టీ, క్రాన్బెర్రీ జ్యూస్, అల్లం మరియు వెల్లుల్లి వంటి సహజ నివారణలు అంటువ్యాధులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఉపయోగపడతాయని వాదించబడ్డాయి.

సహజ నివారణలు మరియు ప్రత్యామ్నాయ చికిత్స, ప్రత్యేకంగా ఆయుర్వేద సూత్రీకరణ మందులు అంటువ్యాధుల చికిత్సకు అందుబాటులో ఉన్నప్పటికీ, మీరు ఎలాంటి సంక్రమణ లక్షణాలను గమనించినట్లయినా మొదట డాక్టర్ సలహాలను తీసుకోవడం ఉత్తమం. యాంటీబయాటిక్ మందులకు సూక్ష్మజీవుల నిరోధకతను నివారించడానికి యాంటీబయాటిక్స్ మందులను సరిగ్గా (Judicious) ఉపయోగించడం మరియు ఆహార పథ్య నియమాలను పాటించడం ముఖ్యమైనది. కొన్ని అంటువ్యాధులు స్వీయ-పరిమితుల్లోనే నయమైపోతాయ్ గనుక అన్ని రకాల అంటువ్యాధులకు చికిత్స చేసే అవసరం ఉండదు. కానీ తీవ్రమైన అంటువ్యాధులకు వైద్య సలహా మరియు సకాలంలో చికిత్స అవసరం. పరిశుభ్రత పాటించడం, ఆరోగ్యరక్షణ మరియు సరైన పారిశుధ్యం నిర్వహించడంవల్ల అంటువ్యాధులు ఒకరినుంచి మరొకరికి సోకడాన్ని నివారించవచ్చు, తద్వారా అంటురోగ వ్యాధుల వ్యాప్తిని కూడా పరిమితం చేయవచ్చు.



వనరులు

  1. British Medical Journal. The accuracy of clinical symptoms and signs for the diagnosis of serious bacterial infection in young febrile children: prospective cohort study of 15 781 febrile illnesses. BMJ Publishing Group. [internet].
  2. D.H Tambekar, S.B Dahikar. Antibacterial activity of some Indian Ayurvedic preparations against enteric bacterial pathogens. J Adv Pharm Technol Res. 2011 Jan-Mar; 2(1): 24–29. PMID: 22171288
  3. Office of Disease Prevention and Health Promotion. Health Care-Associated Infections. Office of the Assistant Secretary for Health.[internet].
  4. Washington JA. Principles of Diagnosis. In: Baron S, editor. Medical Microbiology. 4th edition. Galveston (TX): University of Texas Medical Branch at Galveston; 1996.
  5. Science Direct (Elsevier) [Internet]; Treatment of infectious disease: Beyond antibiotics

అంటువ్యాధులు కొరకు మందులు

Medicines listed below are available for అంటువ్యాధులు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.