సైటోమెగలోవైరస్ సంక్రమణం (CMV) - Cytomegalovirus Infection (CMV) in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 30, 2018

March 06, 2020

సైటోమెగలోవైరస్ సంక్రమణం
సైటోమెగలోవైరస్ సంక్రమణం

సైటోమెగలోవైరస్ సంక్రమణం (CMV) అంటే ఏమిటి?

సైటోమెగలోవైరస్ (CMV) అంటువ్యాధి హెర్పెస్ గ్రూపు సూక్ష్మజీవుల వలన సంభవిస్తుంది. ఈ సూక్ష్మజీవి పొక్కులతో కూడిన పుండ్ల (కోల్డ్ సోర్స్)కు, మోనాన్యూక్లియోసిస్ సంక్రమణ, చికెన్ ఫాక్స్/షింగెల్స్ లకు కారకమయ్యే సూక్ష్మజీవి వర్గానికి చెందినదే. భారతీయ జనాభాలో CMV ప్రతిరక్షకాల ఉనికి 80% -90% గా గుర్తించారు. ఇది అభివృద్ధి చెందిన మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలలో సాధారణంగా కనిపిస్తుంది. సైటోమెగలోవైరస్ సంక్రమణాన్ని కింది విధంగా ఉపవిభజన చెయ్యవచ్చు:

  • పొందిన లేక సోకినా CMV సంక్రమణ
  • పుట్టుకతో వచ్చిన CMV సంక్రమణం
  • గుండె శస్త్రచికిత్స తర్వాత వచ్చే జబ్బు (Postperfusion syndrome)

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా మంది రోగుల్లో వ్యాధిలక్షణాలు పొడజూపవు. ఒకవేళ లక్షణాలు ఉన్నట్లయితే, వాటి రకం మరియు తీవ్రతతో విభేదిస్తాయి. తీవ్రమైన సందర్భాల్లో, పుట్టిన శిశువులు తక్కువ బరువు, జ్వరం, కామెర్లుతో కూడిన కాలేయశోధ (హెపటైటిస్) తో మరియు ఇతర రక్తస్రావ వ్యక్తీకరణలు. గమనించదగిన వివిధ లక్షణాలు:

  • శిశువుల్లో:
    • అకాల రజస్వల (ప్రిమెట్చురిటి)
    • కళ్ళు మరియు చర్మం పసుపురంగుడేలడం
    • కాలేయం వాపు లేదా విస్తరణ
    • ఊదా రంగు (పర్పుల్) ప్యాచ్లు లేదా దద్దుర్లు
    • అసాధారణంగా చిన్న తల
    • ప్లీహము పెరుగుదల
    • న్యుమోనియా
    • మూర్ఛలు
  • బలహీనమైన రోగనిరోధక శక్తి సమయంలో:
    • కళ్ళు, ఊపిరితిత్తులు, కాలేయం, ఆహారం పైపు, కడుపు, ప్రేగులు మరియు మెదడు వంటి అన్ని భాగాలపై ప్రభావం చూపి బాధిస్తుంది.
  • పెద్దలలో:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సైటోమెగలోవైరస్ అంటువ్యాధి ప్రధానంగా మానవ సైటోమెగలోవ్రేరస్లు (వీటినే లాలాజల గ్రంథి వైరస్లు అని కూడా పిలుస్తారు) కారణంగా వస్తుంది. ఈ సూక్ష్మజీవి ఒకసారి శరీరాన్ని ప్రవేశిస్తే, అది సంవత్సరాల పాటు శరీరంలోనే ఉండిపోతుంది మరియు మళ్లీ మళ్ళీ క్రియాశీలకంగా మారుతుంటుంది. ఈ వైరస్లు సులభంగా తీవ్రమైన ఇబ్బందుల్ని  కలిగిస్తాయి, ముఖ్యంగా రోగనిరోధక శక్తిలోపించిన రోగులకు ఇబ్బందుల్ని కలిగిస్తాయి. ఈ సంక్రమణ యొక్క ప్రారంభస్థాయిలోనూ మరియు పునరావృత సమయాల్లోనూ గర్భస్థ పిండానికి బదిలీ చేయబడవచ్చు. ఈ పిండానికి బదిలీ అయ్యే సంక్రమణ ప్రమాదం సంక్రమణ యొక్క పునరావృత రకం కంటే ప్రారంభస్థాయిరకం సంక్రమణవల్లనే ఎక్కువ ఉంటుంది. ఈ సంక్రమణ యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే ఈ వైరస్ నిద్రావస్థలోనూ ఉంటుంది, మళ్ళీ  పునరావృతమూ అవుతుంది.

కింద పేర్కొన్న మన శరీరంలోని వివిధ ద్రవాలలో ఈ వైరస్ కలవడం మూలంగా ఈ సైటోమెగలోవైరస్ సంక్రమణం సంభవిస్తుంది:

  • లాలాజలం
  • మూత్రం
  • రక్తం
  • కన్నీళ్లు
  • సెమెన్
  • చనుబాలు (breast milk)

సైటోమెగలోవైరస్ సంక్రమణాన్ని నిర్ధారణ చేసేదెలా మరియు దీనికి చికిత్స ఏమిటి?

సాధారణంగా, వంశంలో మునుపటి సంక్రమణ గురించి సమాచారాన్ని పొందడానికి రోగి యొక్క వైద్య చరిత్రను వైద్యుడిచే తీసుకోబడుతుంది. లేదా సంక్రమణ కారణాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇందుకు నిర్వహించే పరీక్షలు:

  • రక్త పరీక్షలు
  • నవజాత శిశువులకు లాలాజల పరీక్ష లేదా మూత్ర పరీక్ష

తక్కువ రోగనిరోధక శక్తి ఉన్నవారికి, హెచ్ఐవి (HIV) సంక్రమణ పరీక్ష నిర్వహించబడవచ్చు.

సాధారణంగా, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి మందులు సూచించబడుతాయి. రోగ లక్షణాలను పట్ల శ్రద్ధ వహించడానికి యాంటీ వైరల్ మందులు ఇవ్వబడవచ్చు. ఈ రోగాన్ని అంటించుకోవడమన్న ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఈ రోగంతో కూడిన  శరీర ద్రవాలను ముట్టుకోవడం లేదా అంటుకోవడాన్ని నివారించుకోవాల్సి ఉంటుంది.

నివారణ చర్యలు:

  • మంచి నాణ్యత కల్గిన సబ్బులు లేదా చేతిని శుభ్రం చేసుకునే ద్రవరూపసబ్బులు (handwashes) వాడటం ద్వారా చేతి పరిశుభ్రత నిర్వహించుకోవడం సాధన చేయండి.
  • శారీరక స్రావాలైన కన్నీరు లేదా లాలాజలం వంటి స్రావాలను అంటుకోకు, ముట్టుకోకు.
  • ఆహార పదార్థాలు మరియు పాత్ర సామానులు పంచుకోవడం లేదా ఇతరులు వాడిన గ్లాసుల్లో త్రాగడం మానుకోండి.
  • శరీర స్రావాలతో కలుషితమైన వ్యర్థాలను మరియు వస్తువులను సరిగ్గా తొలగించండి.
  • పిల్లల బొమ్మలు శుభ్రంగా ఉంచండి. పిల్లల లాలాజలం లేదా మూత్రంతో తడిసిన ఉపరితలాలను శుభ్రం చేయండి.
  • సురక్షితమైన సంభోగాన్ని పాటించండి.



వనరులు

  1. Mahadevan Kumar et al. Seroprevalence of cytomegalovirus infection in antenatal women in a Tertiary Care Center in Western India. Marine Medical Society of India; Year : 2017 Volume : 19 Issue : 1 Page : 51-54
  2. National institute of neurological disorders and stroke [internet]. US Department of Health and Human Services; Neurological Consequences of Cytomegalovirus Infection Information
  3. National Organization for Rare Disorders, Cytomegalovirus Infection. Danbury; [Internet]
  4. U.S. Department of Health & Human Services. About Cytomegalovirus (CMV). Centre for Disease Control and Prevention
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cytomegalovirus Infections

సైటోమెగలోవైరస్ సంక్రమణం (CMV) కొరకు మందులు

Medicines listed below are available for సైటోమెగలోవైరస్ సంక్రమణం (CMV). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.