కళ్ళ కలక - Conjunctivitis in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

కళ్ళ కలక
కళ్ళ కలక

కండ్లకలక అంటే ఏమిటి?

కండ్లకలక అంటే కంటి పొర యొక్క వాపు, కంటి పోర అనేది ఒక సన్నని పొర, ఇది కంటిలో తెల్ల భాగం మరియు కనురెప్పల లోపల ఉంటుంది. సాధారణంగా పిల్లలలో సంభవిస్తుంది మరియు అది ఒక సంక్రమణ వలన ఐతే ఇతరులకు కూడా వ్యాపిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కండ్లకలకలో గమనించదగిన లక్షణాలు:

 • ప్రభావితమైన కంటిలో తెల్ల గుడ్డు గులాబీ రంగు లేదా ఎర్ర రంగులోకి మారడం.
 • కళ్ళలో నుండి అధికంగా నీరు రావడం.
 • కళ్ళు మంట మరియు దురద.
 • శ్లేష్మం అధికంగా స్రవించడం.
 • కనురెప్పలు వాపు మరియు కంటి పొర యొక్క వాపు.
 • కళ్ళల్లో చికాకు.
 • కంటిలో నలకలు ఉన్నట్టు భావన.
 • దృష్టిలో అంతరాయాలు.
 • కాంతికి సున్నితత్వం.
 • ఉదయం నిద్ర లేచేటప్పటికి కంటి రెప్పల వెంట్రుకల మీద జిగురు లాంటి పదార్థం అంటుకొని ఉండడం.

ప్రధాన కారణాలు ఏమిటి?

కండ్లకలక యొక్క అత్యంత సాధారణ కారణాలు పర్యావరణంలో ఉండే చికాకు కలిగించే పదార్థాలు, అంటువ్యాధులు మరియు అలెర్జీ.

 • ఇన్ఫెక్షన్ (అంటువ్యాధి) సాధారణంగా బ్యాక్టీరియా వలన కలుగుతుంది, స్టెఫిలోకోకస్ (staphylococcus), క్లమిడియా (chlamydia) మరియు గోనోకొకస్ (gonococcus) మరియు వైరస్లు వంటివి. సంక్రమణ కీటకాలు, సోకిన వ్యక్తులను భౌతికంగా తాకడం మరియు కలుషితమైన కంటి సౌందర్య ఉత్పత్తుల ద్వారా వ్యాపిస్తుంది.
 • అలెర్జీ సాధారణంగా పుప్పొడి, దుమ్ము పురుగులు, జంతువుల వెంట్రుకలు/ఈక, చాలాకాలం పాటు గట్టిగా ఉండే లేదా మృదువైన కాంటాక్ట్ లెన్సులను ఉపయోగించడం వలన కూడా  సంభవిస్తుంది.
 • కాలుష్యం (పొగ,మంటలు, మొదలైనవి), కొలనులలో ఉండే క్లోరిన్ మరియు విష రసాయనాలు వంటివి సాధారణంగా  పర్యావరణంలో ఉండే చికాకు కలిగించే పదార్థాలు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మునపటి కంటి ఆరోగ్యం ఆధారంగా, సంకేతాలు మరియు లక్షణాలు, మరియు కంటి పరిశీలన ద్వారా, వైద్యులు (నేత్ర వైద్యులు) కండ్లకలకను నిర్ధారణ చేయగలుగుతారు. కంటి పరీక్ష కండ్ల కలక యొక్క ప్రభావం కంటి చూపు మీద, కంటి పొర మీద, బాహ్య కన్ను కణజాలం మరియు కంటి యొక్క లోపలి భాగాలను ఎంత వరకు ప్రభావితం చేసినదని నిర్దారించడం ద్వారా ఉంటుంది. సాధారణంగా, ఈ కంటి సమస్య నాలుగు వారాల లోపు ఉంటుంది. సుదీర్ఘకాల సంక్రమణం లేదా చికిత్సకు లొంగని సందర్భంలో, ఒక శ్వాబ్ (swab) ను (శ్లేష్మం / స్రావాల యొక్క నమూనా సేకరించడం కోసం) తీసి అది పరీక్ష కోసం పంపబడుతుంది.

కండ్లకలక చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. యాంటీబయాటిక్ కంటి చుక్కలు బ్యాక్టీరియల్ అంటువ్యాధులకు ఇవ్వబడతాయి, కానీ వైరల్ ఇన్ఫెక్షన్లకు అవి పనిచేయవు. వైరల్ సంక్రమణలకు సాధారణంగా మందుల కోర్సును సూచిస్తారు.  చన్నీళ్ళ కాపడం మరియు కృత్రిమ కన్నీళ్లను (artificial tears,కంటి సమస్యను తగ్గించడానికి వాడే ఒక రకమైన నూనె పదార్దాలు, అవి కళ్ళలో వేసుకున్నప్పుడు కన్నీళ్లు వస్తాయి) లక్షణాల ఉపశమనం కోసం ఉపయోగిస్తారు. అలెర్జీ వలన సంభవించిన కండ్లకలక కోసం, యాంటిహిస్టామైన్లు (antihistamines) మరియు కంటి చుక్కలు ఇవ్వబడతాయి. కండ్లకలక సమయంలోకాంటాక్ట్ లెన్సును (contact lenses) వాడకూడదు.

కుటుంబంలోని  ఇతర సభ్యులకి కండ్లకలక సోకకుండా ఈ విధంగా జాగ్రత్త వహించవచ్చు:

 • మీ ప్రభావిత కన్ను / కళ్ళను తాకరాదు.
 • చేతులను శుభ్రంగా కడగాలి.
 • తువ్వాళ్లు మరియు సౌందర్యాల ఉత్పతులను ఒకరివి వేరేవారు ఉపయోగించరాదు.వనరులు

 1. Prashant V Solanke, Preeti Pawde, Valli P. Prevalence of Conjunctivitis among the Population of Kanyakumari District. Volume 4, Issue 7; July 2017. ISSN: 2393-915X.
 2. Indian journal of medical microbiology. Infections of the ocular adnexa, ocular surface, and orbit. Indian Association of Medical Microbiologist. [internet].
 3. American Optometric Association. Conjunctivitis. St. Louis, Missouri. [internet].
 4. Centre for Health Informatics. [Internet]. National Institute of Health and Family Welfare About Conjunctivitis (Pink Eye)
 5. National Health Portal. Seasonal Allergic Conjunctivitis. Centre for Health Informatics; National Institute of Health and Family Welfare

కళ్ళ కలక కొరకు మందులు

Medicines listed below are available for కళ్ళ కలక. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.