కొవ్వులో కరిగిపోయే విటమినే ‘విటమిన్ D’. మన శరీరాన్ని ఎండకు తగిలేట్టుగా ఉంచినప్పుడు లేదా ఎండలో పని చేసినపుడు ఆ సూర్యరశ్మికి స్పందనగా శరీర కణాలు ఉత్పత్తి చేసిన ప్రేరకద్రవ్యం (స్టెరాయిడ్) యొక్క పూర్వగామినే ‘విటమిన్ D’ అంటాం. సూర్యరశ్మికి ప్రత్యామ్నాయంగా, మీరు విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. తగినంతగా ఎండకు మీ శరీరాన్ని బహిర్గతం చేయకపోయినా లేదా మీరు తక్కువ సూర్యరశ్మి ఉన్న ప్రాంతంలో నివసిస్తుంటే విటమిన్ డి సప్లిమెంట్లను సేవించొచ్చు. పాలు లేదా గుడ్లు వంటి ఆహార వనరుల నుండి ఉత్పన్నమైన విటమిన్ D మీ ఎముక మరియు మొత్తం ఆరోగ్యానికి ఎన్నటికీ సరిపోదు కనుక విటమిన్ D ని వేరుగా  పొందడాన్ని మీకు సిఫార్సు చేయబడింది. ఇప్పుడు, మీరు తగినంత సూర్యకాంతి/ఎండను పొందుతున్నారని మరియు ఈ ఎండను మీ శరీరం విటమిన్ D గా మార్చుతోందా లేదా అనేది మీకు తెలుసా? దీనికి సమాధానాన్ని తెలుసుకోవడానికి, మరియు అనేక ఇతర, ముఖ్యమైన ప్రశ్నలకు జవాబులు పొందడానికి ముందుకు చదవండి.

  1. సూర్యకాంతి నుండి విటమిన్ డి ని నేను ఎలా పొందగలను? - How do I get Vitamin D from sunlight? In Telugu
  2. విటమిన్ డి వనరులు - Sources of Vitamin D in Telugu
  3. విటమిన్ డి ప్రయోజనాలు - Vitamin D benefits in Telugu
  4. విటమిన్ డి మోతాదు - విటమిన్ డి లోపం - Vitamin D dosage - Vitamin D deficiency in Telugu
  5. విటమిన్ డి దుష్ప్రభావాలు - Vitamin D side effects in Telugu
'డి' విటమిన్ వనరులు, ప్రయోజనాలు, దుష్ప్రభావాలు వైద్యులు

భారతదేశం భూమధ్యరేఖకు చేరువలో ఉన్నందున, భారతీయులకు ఎండ/సూర్యరశ్మి సంవత్సరం పొడుగునా దండిగా లభిస్తుంది. అయితే సూర్యరశ్మిని సరైన పరిమాణంలో పొందడానికి, తద్వారా, మీ చర్మం విటమిన్ D ని ఉత్పత్తి చేయడానికి మీరు కొన్ని వాస్తవాలను జాగ్రత్తగా గమనించాలి.

విటమిన్ D ని పొందదానికి చాలా సహజమైన మార్గం ఏదంటే ఆఛ్చాదన లేని మీ చర్మాన్ని ఎండ వేడికి తగిలేట్టుగా చేయడం. శరీరంపై నిండుగా దుస్తులు ధరించి ఉన్నపుడు ఎండకు తగలని చర్మం విటమిన్ D ని సంశ్లేషణ చేయటానికి సూర్యరశ్మి సరిపోదు. మీ శరీరంలో శోషించిన విటమిన్ D మొత్తం గణన మీరు ఎంతసేపు (అంటే వ్యవధి) ఎండ మీ శరీరానికి తగిలేలా ఎండలో ఉన్నారు, ఎండలో ఏ కోణంలో నిల్చున్నారు (angulation), మీ చర్మం యొక్క రంగు మరియు మీ చర్మం యొక్క ఏ ప్రాంతంపై ఎండ పడేట్టుగా నిల్చున్నారు అనేవాటిపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే మీ శరీరంలో ఎక్కువ భాగాన్ని ఎండ తగిలేట్టుగా చేయడం. అంటే మీ ముఖం మరియు చేతులకు బదులుగా మీ వీపును (శరీరంలో ఎక్కువభాగం) ఎండకు  బహిర్గతం చేయడం వల్ల ఎక్కువ ప్రమాణంలో శరీరం సూర్యరశ్మిని గ్రహించేందుకు వీలవుతుంది, తద్వారా దాన్ని విటమిన్ D గా మార్చగలదు. గంటల తరబడి ఎండలో పడి ఎండాల్సిన పని లేదు, బాధ పడాల్సిన పనిలేదు. పగటిపూట బాగా ఎండ ఉన్న సమయంలో కేవలం 15 నిమిషాల (లేదా అంతకన్నా ఎక్కువ) పాటు మీరు ఎండలో (పని చేయడమో, ఆటలాడడమో చేస్తూ) ఉన్నట్లయితే చాలు. పగిటిపూట సరైన సమయం అంటే ఎండ ఎంత ఎక్కువగా లభిస్తుందనేది ముఖ్యం. ఇది ఆయా సీజన్లను బట్టి, మరియు ప్రాంతాలకు అనుగుణంగా మారుతూ ఉంటుంది.

విటమిన్ Dకి సంబంధించి జరిపిన అనేక పరిశోధనల ప్రకారం, మీరు భారతదేశంలో నివసిస్తుంటే,  విటమిన్ D ని గ్రహించేందుకు అన్ని మాసాల్లోనూ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఎండలో గడపడం ఉత్తమం. కానీ వేసవి రోజులలో, UV కిరణాలు చాలా తీక్షణంగా, తీవ్రంగా ఉన్నప్పుడు, ఎండలో నిలబడకుండా మీ చర్మాన్ని చర్మ క్యాన్సర్ వంటి ప్రమాదం నుండి రక్షించుకోవడం చాలా అవసరం. కాబట్టి, వేసవి సమయాల్లో ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఎండలో గడపొచ్చని, ఇది సురక్షితమని పరిశోధన సూచిస్తోంది. అంతేకాక, మీరు భూమధ్యరేఖకు దగ్గరగా ఉంటారు, భూమధ్యరేఖకు అతి సమీపంలో నివసించేవాళ్ళంతా ఏడాది పొడవునా ఈ D విటమిన్ను పొందడం సులభం.

భారతదేశ ఉత్తరాది ప్రాంతంలో అత్యధికంగా UV (అల్ట్రావైయోలెట్)  కిరణాలు లభిస్తాయని మరియు భారతదేశంలోని ఈశాన్య ప్రాంతంలో అత్యంత కనీసంగా UV కిరణాల లభ్యత ఉంటుందని పరిశోధకులు కనుగొన్నారు. దీనర్థం ఈశాన్య ప్రాంతాల్లో విటమిన్ D యొక్క లభ్యత కోసం ఎండలో ఎక్కువ సమయం గడపాల్సిన అవసరముంటుంది. ఎండలో గడపాల్సిన సమయం కూడా మీ చర్మం రంగుపై ఆధారపడి ఉంటుంది. తెల్లని రంగు గల్గిన (ఫైరర్) చర్మం గల వాళ్ళు నలుపు రంగు లేదా ముదురు రంగున్నవారికంటే ఎక్కువ సూర్యకాంతిని గ్రహిస్టార్. చాలా తెల్లని రంగు గలవాళ్ళు ఎండలో 15 నిమిషాలు గడిపినా చాలు. అదే నల్లని చర్మం, ముదురు రంగు చర్మం ఉన్నవాళ్లు అయితే 45 నిమిషాల నుండి గంట ఎండలో గడిపితే 10,000 నుండి 25,000 IU ల ప్రమాణంలో విటమిన్ D ని పొందగలరని పరిశోధకులు సూచించారు. ఎండలో గడిపేటప్పుడు జాగ్రత్త వహించండి, ఎందుకంటే విటమిన్ D ని పొందేందుకు ఎండలో మీరు గడిపేటప్పుడు ఎండవల్ల బొబ్బలు, మరియు ఇతర చర్మ ప్రమాదాలు రాకుండా చూసుకోవాలి.

Vitamin D3 Capsules
₹729  ₹899  18% OFF
BUY NOW

విటమిన్ D యొక్క అత్యంత సహజమైన మూలం (ఒనరు) ఎండ లేక సూర్యకాంతి, ముఖ్యంగా UV-B కిరణాలు. ఎండలో తగినంతగా (శరీరాన్ని ఎండకు బహిర్గతం చేసినప్పుడు) గడిపినప్పుడు మన చర్మ కణాలు (ఎపిడెర్మిస్) సూర్యరశ్మిని లేదా ఎండను “ఫోటోషియలిసిస్” ద్వారా విటమిన్ D గా మారుస్తాయి. ఈ విటమిన్ D (ప్రీ-విటామిన్ D₃) తర్వాత శరీర కణాలకు బదిలీ అయి, అటుపై నిల్వ కొరకు కాలేయానికి (to liver) రవాణా అవుతుంది.

విటమిన్ డి యొక్క ఇతర మూలాలు:

  • గుడ్డు సొనలు
  • ట్యూనా, హెర్రింగ్ మరియు సాల్మన్ వంటి చేపలు
  • జున్ను/చీజ్
  • గొడ్డు (మాంసంలో) కాలేయం (బీఫ్ కాలేయం)
  • చేప కాలేయపు నూనె (కాడ్ లివర్ ఆయిల్)
  • గుల్లలు/నత్తగుల్లలు - Oysters    
  • రొయ్య చేపలు/ష్రిమ్ప్
  • పాలు, సోయా పాలు, మరియు వారి సోయా ఉత్పత్తులు.
  • తృణధాన్యాలు మరియు వోట్మీల్స్ వంటి కొన్ని ప్యాక్ చేసిన ఆహారాలు.
  • విటమిన్ D అనుబంధాహారాలు (suppliments) మరియు మాత్రలు.

విటమిన్ D మనకు ఎందుకు మరియు మన శరీర విధులు దీనివల్ల ఎలా ప్రభావితం అవుతాయో మనం ఇపుడు చర్చిద్దాం.

  • ఎముకలకు విటమిన్ డి: విటమిన్ డి కాల్షియమ్ మరియు ఫాస్ఫేట్ ల శోషణకు విటమిన్ డి సహాయపడుతుంది తద్వారా ఆరోగ్యకరమైన ఎముకలకు అలాగే ఎముకలను దృఢపరచడంలో సహాయం చేస్తుంది.
  • పిల్లలకు విటమిన్ డి: దృఢమైన ఎముకల కోసం పిల్లలకి విటమిన్ డి అనుబంధకాలను సూచించడం జరుగుతుంది. రికెట్స్ (rickets) వంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శిశువులలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.
  • వృద్దులకు విటమిన్ డి: వృదులలో ఎముకల సాంద్రత వయసు పెరిగేకొద్దీ తగ్గిపోతుంది,అధ్యయనాలలో విటమిన్ డి ను క్రమంగా తీసుకోవడం వలన వృద్దులలో ఎముకల సాంద్రత పెరుగుతుందని తేలింది.
  • ఫ్రాక్చర్లకు విటమిన్ డి: వయసు పెరిగేకొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోతుంది అది సులభంగా ఎముకలు విరిగిపోవడానికి కారణమవుతుంది, విటమిన్ డి ఎముకలో కాల్షియమ్ శోషణను పెంచడం ద్వారా ఎముకలు సులభంగా విరిగిపోవడాన్ని నివారిస్తుంది.
  • మహిళలకు విటమిన్ డి: రుతువిరతి (మెనోపాజ్) లక్షణాలను తగ్గిగించడం లో విటమిన్ డి సహాయం చేస్తుందని అనేక పరిశోధనలలో తేలింది.
  • పంటికి  విటమిన్ డి: దంతక్షయం వంటి పంటి సమస్యలను నివారించడంలో విటమిన్ డి ఉపయోగపడుతుంది. అలాగే పళ్ళను దృఢంగా చేస్తుంది.
  • కండరాల కోసం విటమిన్ డి: శరీరంలో కాల్షియమ్  స్థాయిలను నిర్వహించడం ద్వారా కండరాల శక్తిని మరియు పనితీరును మెరుగుపరుస్తుంది.  దీని లోపం కండరాల తిమ్మిరికి కారణం అవుతుంది.
  • బరువు తగ్గుదలకు విటమిన్ డి: విటమిన్ డి అధికంగా ఉండే ఆహారాలు ఆకలిని తగ్గించడంలో సహాయం చేస్తాయి, అలాగే శక్తిని పెంచి అలసటని తగ్గిస్తాయి.
  • క్యాన్సర్ కు విటమిన్ డి:  సూర్యరశ్మి ఎక్కువగా ఉండే ప్రాంతాలలో ప్రజలకి క్యాన్సర్ ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ విషయంలో ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి.

ఎముకలకు విటమిన్ డి - Vitamin D for bones in Telugu

మన ఎముకల ఆరోగ్యానికి బాగా దోహదపడేది విటమిన్ D యొక్క ప్రభావమే. ఆహారపదార్థాల వనరులు మరియు సప్లిమెంట్ల నుండి మన శరీరానికి లభించే కాల్షియం మరియు ఫాస్ఫేట్ ల శోషణకు విటమిన్ D సహాయపడుతుంది. ఆరోగ్యకరమైన ఎముక నిర్మాణం ఏర్పడటానికి కాల్షియం చాలా అవసరం అన్న సంగతి మనకు తెలిసిన విషయమే. అందువలన విటమిన్ D మన  శరీరంలో ఆరోగ్యకరమైన ఎముక పెరుగుదలను నియంత్రిస్తుంది మరియు ప్రోత్సహిస్తుంది కూడా. మన ఎముకలు బలంగా ఉండేందుకు మరియు వాటికి సరైన రూపమివ్వడంలో కూడా విటమిన్ D సహకరిస్తుంది.

ఎముకలు పెరగడమనే ఈ యాంత్రిక క్రమానికి విటమిన్ డి యొక్క లోపం కారణంగా అంతరాయమేర్పడుతుంది. విటమిన్ D  లోపం కారణంగా ఎముకలు మృదువుగా అయిపోవడం, లేదా ఎముకల తప్పుడు నిర్మాణక్రమానికి దారితీస్తుంది. దీని లోపం వల్ల పిల్లలలో “రికెట్స్” వ్యాధి, పెద్దల్లో ఆస్టియోమలాసియ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది. దీనిని నివారించేందుకు విటమిన్ D  సప్లిమెంట్లను (అనుబంధాహారాలను) శల్య వైద్యులు (orthopedics) సూచించడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా, ఎముకల్లో నొప్పితో బాధపడే వారికి విటమిన్ D సప్లిమెంట్లను సేవింపజేయడం ఎందుకంటే ఎముకల్లో ఖనిజాల్ని మెరుగుపరచటానికే.

పిల్లలకు విటమిన్ డి - Vitamin D for children in Telugu

ఎముకల ఆరోగ్యాన్ని నియంత్రించడంలో విటమిన్ డి కల్గి ఉన్న అద్భుతమైన ప్రభావాల కారణంగా, ఎముకల పెరుగుదల మరియు అవి ఏర్పడే దశలలో విటమిన్ డి చాలా అవసరం-అంటే శిశువులు మరియు చిన్న పిల్లలకు ఈ విటమిన్ చాలా అవసరం. చిన్న పిల్లల్లో బలమైన ఎముకల నిర్మాణాన్ని ప్రోత్సహించడానికి మరియు రికెట్స్ అనే ఎముకలకు సంబంధించిన వ్యాధి వచ్చే సంభావ్యతను తగ్గించేందుకూ విటమిన్ డి సప్లిమెంట్లను శల్యవైద్యులు తరచుగా పిల్లలకు  సూచించడం జరుగుతోంది.

చిన్నపిల్లలకు విటమిన్ డి వల్ల ఊహించని ఇతర ప్రయోజనాలున్నాయి. విటమిన్ D తో శిశువు యొక్క రోగనిరోధక శక్తి మెరుగుపడుతుంది. బాల్యంలో వచ్చే తామర, “అటోపిక్ డెర్మాటిటిస్” మరియు ఆస్తమా వంటి వ్యాధులను ఈ విటమిన్ తగ్గిస్తుంది. ప్రేరకద్రవ్య-నిరోధక (స్టెరాయిడ్-రెసిస్టెంట్) ఆస్త్మా వ్యాధి నిర్వహణకుగాను విటమిన్ D సప్లిమెంట్లను 2000 IU ప్రమాణంలో రోజువారీగా సేవింపజేయడం సహాయకారి అని తెలియబరచబడింది.

(మరింత సమాచారం: ఆస్తమా చికిత్స)

వయస్సు మళ్ళినవారికి విటమిన్ డి - Vitamin D for elderly in Telugu

పోషక పదార్థాలు సేవనం, వంశానుగతి తత్వం, జీవనశైలి మరియు భౌతిక కారకాల ద్వారా జీవితపు మూడో దశాబ్దానికి మనిషిలో గరిష్టమైన ఎముక ద్రవ్యరాశి లభిస్తుందని నమ్ముతారు. దీని తరువాత, నాలుగో దశాబ్దంలో ఎముక ద్రవ్యరాశి సాంద్రతలో ఎముక నష్టం లేదా తగ్గింపు ఏర్పడుతుంది. ఈ దశల్లో విటమిన్ D సేవనం తగినంతగా లేకపోవడం వల్లనే ఎముక ఖనిజీకరణలో నష్టం వేగవంతంగా వాటిల్లగలదని పరిశోధకులు గుర్తించారు. అందువల్ల, విటమిన్ డి సప్లిమెంట్ల సేవనం తరచుగా వయసు పైబడేవారిలో సంభవించే  అధిక ఎముక నష్టాన్ని నివారించడానికి సూచించడం జరుగుతుంది.

విటమిన్ డి ఎముక విరుగుళ్లు తగ్గిస్తుంది - Vitamin D reduces fractures in Telugu

పైన చెప్పినట్లుగా, ఎముక ద్రవ్యరాశి సాంద్రతలో తగ్గింపు అనేది ఒక వయస్సుతో సంభవిస్తుంది.  ఇది ఎముకలు బలహీనంగా తయారయ్యేందుకు మరియు ఎముకల విరుగుళ్లకు దారి తీస్తుంది. విటమిన్ డి యొక్క లోపం కాల్షియం శోషణ తగ్గింపుకు దారితీస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ కాల్షియం శోషణ తగ్గింపు ఎముక నుండి కాల్షియం అయానులను రక్తంలో కాల్షియం యొక్క సాధారణ సాంద్రతలను నిర్వహించడానికి కారణమవుతుంది. ఎముక ద్రవ్యరాశి సాంద్రతలో  తగ్గుదల మరియు ఎముకల విరుగుళ్లు ఎక్కువగా వచ్చే ప్రమాడాల మధ్య ఒక ప్రత్యక్ష సంబంధాన్ని కూడా అధ్యయనాలు ప్రదర్శించాయి. మీ వైద్యుడు సూచించినట్లయితే విటమిన్ ‘డి’ ని ఆహార పదార్ధాల నుంచి లేదా సప్లిమెంట్లను తగినంత పరిమాణంలో సేవించడం ద్వారా పైన పేర్కొన్న రెండు శల్య సమస్యలనూ నివారించవచ్చు.

(మరింత సమాచారం: ఫ్రాక్చర్ చికిత్స)

మహిళలకు విటమిన్ డి - Vitamin D for women in Telugu

వయసు పెరగడంతో పాటు ఎముకల నష్టం కూడా పెరుగుతుంది. అలా పైబడుతున్న వయస్సులో, ముఖ్యంగా మహిళల్లో సంభవించే ముట్లడగడం దశ/రుతువిరతి (మెనోపాజ్) యొక్క ప్రభావాల కారణంగా ఎముకల నష్టం మహిళపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. 45 నుంచి 55 ఏళ్ల వయస్సులో నెలవారీ ఋతు చక్రం నిల్చిపోయినపుడు వచ్చేదే రుతువిరతి లేక ముట్లడగడం దశ. దీన్నే “మెనోపాజ్’ అని వ్యవహరిస్తారు. బోలు ఎముకల వ్యాధి ఎక్కువగా వచ్చే అవకాశం ఉన్న మహిళల్లో మానసిక కల్లోలం, ఆందోళన మరియు హార్మోన్ల అవాంతరాలు తరచుగా ఈ దశలో వస్తూ ఉంటాయి.

వయసుతో ఎముకలు బలహీనపడటాన్ని “బోలు ఎముకల వ్యాధి”గా సూచిస్తుంది. ఈ ఎముకల వ్యాధి వలన ఎముకలు మృదువైపోవడం మరియు ఎముకలు విరుగుళ్లకు లోనవడం ఎక్కువగా సంభవిస్తూ ఉంటుంది. ఈ వ్యాధిలో ఎముక ద్రవ్యరాశి మరియు బలహీనత పెరగడం వలన, ఎముకలు మెత్తబడ్డం జరిగి 'స్పాంజి’ లా తయారై  'స్పాంజి ఎముక' గా పిలువబడతాయి. రుతువిరతిలో అధిక ఎముక నష్టం సంభవిస్తుంది. దీనికి కారణం ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిలలో తగ్గుదల, ఇది ఎముక కణజాలంపై రక్షణ చర్యలను కలిగి ఉంటుంది.

ఎముకల దుర్బలత్వానికి కారణమయ్యే రుతువిరతి తరువాత కాల్షియం శోషణ గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కాల్షియం శోషణ మరియు దాని నియంత్రణ ఈస్ట్రోజెన్ హార్మోన్ నియంత్రణలో ఉంటుంది. రుతువిరతి యొక్క ప్రభావాలు అనివార్యమైనప్పటికీ, విటమిన్ డి స్థాయిలు రుతువిరతి తరువాత హార్మోన్ల స్థాయికి దగ్గరగా ఉంటాయని వివిధ పరిశోధకులు, సూచించారు. ఈ స్థితిలో మహిళలు అనుభవించే మానసిక కలతలు మరియు “మస్క్యులోస్కెలెటల్” రుగ్మతల లక్షణాలతో ఇది ముడిపడి ఉంటుంది.

రుతువిరతి తరువాత ఎముక సాంద్రత మెరుగుపడుతున్నపుడు  విటమిన్ డి యొక్క అధిక మోతాదుల సేవనం కారణంగా రుతుక్రమం ఆగినప్పటి లక్షణాల సంఖ్య తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇందుకు విటమిన్ డి  జీవనాన్ని పరిశోధకులు సిఫార్స్ చేస్తున్నారు. అందువల్ల మీరు 45 నుంచి 60 ఏళ్ల వయస్సు మధ్యలో ఉన్నట్లయితే, పురుషులయినా కావచ్చు, లేదా మహిళలయినా కావచ్చు, మీరు మీ విటమిన్ డి  స్థాయిల్ని తనిఖీ చేయించుకోవాల్సిందిగా సిఫార్సు చేయడమైంది.

పళ్ళు కోసం విటమిన్ డి - Vitamin D for teeth in Telugu

దంత క్షయాలు లేదా “దంత క్షయం” అనేది పంటి నిర్మాణం యొక్క ధ్వంసాన్ని (లేదా నాశనాన్ని) సూచిస్తుంది. ఇలా పాడైన పళ్ళు నొప్పిని కల్గిస్తూ ఉండచ్చు, లేదా ఉండక పోనూ వచ్చు, అది ప్రభావితమైన ఆ పంటి నిర్మాణాలపై ఆధారపడి ఉంటుంది. దంతక్షయం ప్రారంభమయ్యాక దాన్ని పూర్వస్థితికి తేవడానికి వీలు కాదు కానీ దంతపు డ్రిల్స్ మరియు నింపే పదార్థాల (dental fillings) సహాయంతో పాడైపోయిన పండ్లను సరి చేసి రోగికి స్వస్థతను, దంతక్షయం వల్ల కోల్పోయిన సౌకర్యాన్ని తిరిగి చేకూర్చడం జరుగుతుంది.  దంతక్షయం తర్వాత వాటి నిర్మాణాన్ని తిరిగి యథాస్థితికి తేవడం సాధ్యం కాదు కాబట్టి, అసలు దంతక్షయమనేది కలుగకుండా నిరోధించడం చాలా అవసరం.

మీ నోటి పరిశుభ్రత మరియు తక్కువ చక్కెర సేవనాన్ని పాటిచడమనేదే దంతక్షయనివారణకు కీలకం. కాగా, పిల్లలు మరియు పెద్దలకు కూడా విటమిన్ డిని సేవింపజేస్తే దంత క్షయాల ప్రమాదాన్ని తగ్గించొచ్చని పరిశోధన ఆధారాలు సూచిస్తున్నాయి. పంటి నిర్మాణం ప్రధానంగా కాల్షియం అయాన్లు (కాల్షియం ఫాస్ఫేట్) ను కలిగి తయారైనందున ఈ దశలో విటమిన్ డి కల్గిన ఆహారపదార్థాల సేవనం, సప్లిమెంట్ల సేవనం కాల్షియం అయానులను బలపరుస్తుంది. ఫలితంగా బలమైన పళ్ళు ఏర్పడి, దంత క్షయం  కలుగకుండా మరింత నిరోధకతను సేవించిన ఈ విటమిన్ డి పదార్థాలు కలిగిస్తాయి.

కండరాల కొరకు విటమిన్ డి - Vitamin D for muscles in Telugu

విటమిన్ డి కండరాల బలం మరియు కండల సాంద్రత పైన సానుకూల ప్రభావం చూపుతుంది. ఇంకా, వ్యక్తి శారీరక బలం, సామర్ధ్యాలు మరియు వ్యక్తి యొక్క పనితీరుపై కూడా విటమిన్ డి  సానుకూల ప్రభావాన్ని కల్గి ఉంటుంది. విటమిన్ డి శరీరం యొక్క కాల్షియం స్థాయిలను నియంత్రిస్తుంది, ఇది కండరాల బలం మరియు పనితీరును నియంత్రించడానికి సహాయపడుతుంది. విటమిన్ డి  లోపం కండరాల తిమ్మిరికి కారణమవుతుంది. మెరుగైన కండర ద్రవ్యరాశి మరియు సమతుల్యతను విటమిన్ డి సేవనం వల్ల సాధ్యమైందని, తద్వారా వ్యక్తి కండరాల ఆరోగ్యం వృద్ధి చెందిందని అధ్యయనాలు నివేదించాయి. కండరాల పీచుపదార్థాలు (ఫైబర్స్) మరియు దాని రూపనిర్మాణంపై విటమిన్ డి ప్రభావాన్ని ఇంకా అధ్యయనం చేయలేదు.

బరువు కోల్పోవుటలో విటమిన్ డి - Vitamin D weight loss in Telugu

విటమిన్ డిని అధికంగా కల్గిఉండే ఆహారాలు తరచుగా బరువు తగ్గడానికి సహాయ పడేటువంటి ఆకలి అణిచివేత చర్యలను కలిగి ఉంటాయి. బరువు తగ్గేందుకు ఇప్పటికే ఆహార నిర్బంధాన్ని పాటిస్తున్న వ్యక్తులు తరచుగా వారి ఆహారంలో విటమిన్ డి అధికంగా ఉన్న ఆహారాల్ని చేర్చుకుని తినడం వల్ల వారి శక్తి స్థాయిలను పెంచుకోవటానికి సాధ్యమవుతుందని సిఫారసు చేయడమైంది. , విటమిన్ డి అలసట మరియు మైకం కమ్మేదాన్ని నిరోధిస్తుంది మరియు వారి వ్యాయామ సామర్థ్యాన్ని పెంచుతుంది. తద్వారా, బరువు కోల్పోయేందుకు వారు పారంభించిన ఈ ప్రయత్నం ఆరోగ్యకరమైందిగా మరియు తక్కువ ఒత్తిడితో కూడినదై ఉండేలా నిర్ధారిస్తుంది.

విటమిన్ డి మరియు క్యాన్సర్ - Vitamin D and cancer in Telugu

ఎండ ఎక్కువగా కాసే ప్రాంతాలలో నివసించే ప్రజలకు కొన్ని క్యాన్సర్లు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది. విటమిన్ డి ఉన్నత స్థాయిలలో కల్గి ఉండే వీరి స్థితిని పరిశోధకులు తరచుగా పరిశీలన చేసి, దీని యొక్క సంబంధాన్ని ఎక్కువగా చర్చించారు. వాస్తవానికి, విటమిన్ డి తక్కువ స్థాయిల్లో ఉన్నవారు కొన్ని రకాలైన క్యాన్సర్లకు గురయ్యే అవకాశం ఉన్నట్లు సూచించడం జరిగింది. క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడంలో శరీరంలోని విటమిన్ డి యొక్క రక్షణలక్షణ సంబంధాన్ని అధ్యయనాల్లో ఎక్కువగా నిర్ధారించారు, ప్రత్యేకించి పెద్ద పేగులకు సంబంధించిన క్యాన్సర్ (colorectal cancer) విషయంలో. అందుకే, క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని, మరియు మరణ సంభవాన్ని తగ్గించేందుకు విటమిన్ డి (సప్లిమెంట్స్) అనుబంధాహారాల్ని తరచుగా సూచించడం జరుగుతోంది.

విటమిన్ డి యొక్క మోతాదు మీ శరీర అవసరాల మీద ఆధారపడి ఉంటుంది, మరియు వ్యక్తుల లింగం, వయస్సు, వైద్య పరిస్థితులు మరియు ప్రాంతం / భౌగోళిక స్థానాల్ని బట్టి కూడా విటమిన్ డి యొక్క మోతాదు మారుతుంది. మన దేశంలో ఎండ లభ్యత దండిగా ఉన్నప్పటికీ, భారతీయులు తరచూ విటమిన్ డి లోపం సమస్యతో బాధపడుతున్నారు-ఎందుకంటే చర్మం మీద వచ్చే మంగు/వర్ణవిధానం కారణంగా మరియు ఎండపొడ నుండి రక్షణ పొందేందుకు ఉపయోగించే సన్ స్క్రీన్ క్రీముల్ని చర్మానికి రాయడం మూలంగా తగినంతగా ఎండ శరీరంపై పడకపోవడమే.

ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ప్రకారం, ఎండ నుండి విటమిన్ డిని పొందలేని భారతీయులకు 400 IU ప్రమాణంలో విటమిన్ డి రోజువారీ సేవనం సిఫార్సు చేయబడింది. ఆరోగ్యకరమైన వ్యక్తుల రక్తంలో విటమిన్ డి యొక్క సాధారణ స్థాయిలు మిల్లిలీటరుకు 20 నానోగ్రాముల నుండి మిల్లిలీటరుకు 50 ng ఉంటాయి. 12 ng / mL కన్నా తక్కువగా విటమిన్ డి ఉంటే వారికి విటమిన్ డి లోపం ఉన్నట్టే సూచిక.

25 డి హైడ్రాక్సీ విటమిన్ డి రక్త పరీక్షలో ప్రతిబింబించిన రీతిలో, రక్తంలో విటమిన్ డి స్థాయిల్ని  సాధారణంగా నిర్వహించడానికి, రోజువారీగా, నెలవారీగా లేదా త్రైమాసికంగా ఈ విటమిన్ ని సేవింపజేయబడుతుంది.

తీవ్రమైన విటమిన్ డి లోపాల సమస్యలకు చికిత్స చేయడానికి, 300,000 IU ప్రమాణంలో పెద్దమాత్ర ఇవ్వబడుతుంది, తరువాత తరచూ తక్కువ మోతాదుల్లో ఇవ్వడం జరుగుతూ  ఉంటుంది. పిల్లలకైతే, వారానికోపూట చొప్పున 6 నుండి 8 వారాలపాటు 50,000 IU ప్రమాణంలో విటమిన్ డి 3 ని సేవింపజేసి నిర్వహణలో చికిత్స చేయబడుతుంది, తర్వాత రోజుకు 600 నుంచి 1000 IU మోతాదు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒక సంవత్సరం పాటు కొనసాగుతుంది. (1 IU ప్రమాణం = 0.025 MCG)

దీర్ఘకాలిక విటమిన్ డి భర్తీ యొక్క కొన్ని సాధారణ దుష్ప్రభావాలు:

అధిక మొత్తంలో, విటమిన్ డి ఉంటే అది హైపర్ కలేమియాను (కండరాల నొప్పి, స్థితిభ్రాంతి మరియు గందరగోళం, కండరాల బలహీనత మరియు తీవ్రమైన అలసట మరియు దాహం), మూత్రపిండాల వైఫల్యం లేదా మూత్రపిండాలలో రాళ్ళకు కారణమవుతుంది.

Dr. Dhanamjaya D

Dr. Dhanamjaya D

Nutritionist
15 Years of Experience

Dt. Surbhi Upadhyay

Dt. Surbhi Upadhyay

Nutritionist
3 Years of Experience

Dt. Manjari Purwar

Dt. Manjari Purwar

Nutritionist
11 Years of Experience

Dt. Akanksha Mishra

Dt. Akanksha Mishra

Nutritionist
8 Years of Experience

వనరులు

  1. Y. Lhamo, Preeta Kaur Chugh, C. D. Tripathi. Vitamin D Supplements in the Indian Market. Indian J Pharm Sci. 2016 Jan-Feb; 78(1): 41–47. PMID: 27168680
  2. Cedric F. Garland et al. The Role of Vitamin D in Cancer Prevention. Am J Public Health. 2006 February; 96(2): 252–261. PMID: 16380576
  3. Song M et al. Plasma 25-hydroxyvitamin D and colorectal cancer risk according to tumour immunity status. Gut. 2016 Feb;65(2):296-304. PMID: 25591978
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Vitamin D and Cancer Prevention
  5. Lisa Ceglia. Vitamin D and Its Role in Skeletal Muscle. Curr Opin Clin Nutr Metab Care. 2009 Nov; 12(6): 628–633. PMID: 19770647
  6. Lars Rejnmark. Effects of Vitamin D on Muscle Function and Performance: A Review of Evidence from Randomized Controlled Trials. Ther Adv Chronic Dis. 2011 Jan; 2(1): 25–37. PMID: 23251739
  7. Khosravi ZS, Kafeshani M, Tavasoli P, Zadeh AH, Entezari MH. Effect of Vitamin D Supplementation on Weight Loss, Glycemic Indices, and Lipid Profile in Obese and Overweight Women: A Clinical Trial Study. Int J Prev Med. 2018 Jul 20;9:63. PMID: 30123437
  8. Erin S. LeBlanc et al. Vitamin D levels and menopause-related symptoms. Menopause. 2014 Nov; 21(11): 1197–1203. PMID: 24736200
  9. Daniel D. Bikle. Vitamin D and Bone. Curr Osteoporos Rep. 2012 Jun; 10(2): 151–159. PMID: 22544628
  10. Eamon Laird, Mary Ward, Emeir McSorley, J.J. Strain, and Julie Wallace. Vitamin D and Bone Health; Potential Mechanisms. Nutrients. 2010 Jul; 2(7): 693–724. PMID: 22254049
  11. Yoshida T, Stern PH. How vitamin D works on bone. Endocrinol Metab Clin North Am. 2012 Sep;41(3):557-69. PMID: 22877429
  12. Marwaha RK. Regional and seasonal variations in ultraviolet B irradiation and vitamin D synthesis in India.. Osteoporos Int. 2016 Apr;27(4):1611-1617. PMID: 26630977
Read on app