బ్రాహ్మి ఒక పురాతన భారతీయ మూలిక (హెర్బ్), ఇది నాడీ వ్యవస్థను నయం చేయడంలో మరియు మెదడు పనితీరును మెరుగుపరిచే ప్రయోజనాలకు ప్రసిద్ధి చెందింది. ఆయుర్వేద వైద్య  శాస్త్రం దీనిని ‘మేధ్యరసాయణ’ అనే పేరుతో పిలిచింది,, అనగా ఇది నరాల టానిక్ మరియు పునరుజ్జీవనం కల్పించే ఏజెంట్‌గా పనిచేస్తుంది. ఒత్తిడి నుండి ఉపశమనం కల్గించే అడాప్టోజెనిక్ ఏజెంట్‌గా ఇది త్వరగా ప్రధాన స్రవంతిలోకి వచ్చినప్పటికీ, ఇది భారతీయ సంప్రదాయ ఔషధంగా సుమారు 3000 సంవత్సరాలుగా వాడుకలో ఉంది. ఈ మూలిక ప్రస్తావనలు చరక్ సంహిత మరియు సుశ్రుత సంహిత అనే రెండు పురాతన భారతీయ గ్రంథాలలో కనుగొనబడ్డాయి. సుశ్రుత సంహిత బ్రాహ్మి ఘృత మరియు బ్రాహ్మిని అనే వాటిని గురించి కొత్తబలాన్నిచ్చి పునరుజ్జీవనం కల్పించేవిగా తెలిపింది.

‘బ్రాహ్మి’ అనే పదం ‘బ్రాహ్మణ’ పదం నుండి లేదా హిందూ దేవుడు ‘బ్రహ్మ’ పేరు నుండి వచ్చిందని తెలుసుకోవడంతో మీకు ఆసక్తిని  రేకెత్తించవచ్చు, ఈ రెండు పదాలు విశ్వ మనస్సు లేదా చైతన్యాన్ని (consciousness) సూచిస్తాయి. కాబట్టి, బ్రాహ్మి అంటే బ్రహ్మ శక్తి అని అర్ధం. ఆసక్తికరంగా, బ్రాహ్మి నాడీ వ్యవస్థపై తన యొక్క టానిక్ ప్రభావాలను చూపిస్తుంది.

రసంతో కూడిన దళసరి ఆకులతో కూడిన బ్రాహ్మి మొక్క తీగ జాతికి చెందినది. ఇది ప్రధానంగా భూమిపైనే అల్లుకుని వ్యాపిస్తుంది మరియు ఇది నీటిని దండిగా తనలో నిలుపుకునే తత్వాన్ని కలిగి ఉంటుంది. ఇది సంవత్సరం పొడుగునా ఉండే మూలిక.  (దీన్ని మళ్ళీ మళ్ళీ నాటే అవసరం లేదు) మరియు తేమతో కూడిన నేలలు మరియు చిత్తడి ప్రాంతాలలో బాగా పెరుగుతుంది. బ్రాహ్మి మొక్కల యొక్క దళసరి ఆకులు దానికొమ్మలపై ఒకదానికొకటి ఎదురెదురుగా ఉంటాయి. బ్రాహ్మి తెలుపు, నీలం మరియు ఊదారంగు రంగు పూలను మొక్క కొమ్మల చివర్లలో ఒక్కోక్కటి మాత్రమే పూస్తాయి.

బ్రాహ్మి గురించిన కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • వృక్షశాస్త్రం (బొటానికల్) పేరు: బాకోపా మొన్నేరి (Bacopa monnieri)
  • కుటుంబం:  ప్లాంటజినాసియే (Plantaginaceae)
  • సాధారణ పేరు: బ్రాహ్మి , జల్బుటి , వాటర్ హిసోప్, మనీవోర్ట్, ఇండియన్ పెన్నీవోర్ట్
  • సంస్కృత నామం: బ్రాహ్మి
  • ఉపయోగించే భాగాలు:  బ్రాహ్మి ఆకులు, కాండం
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: బ్రాహ్మి ప్రధానంగా ప్రపంచంలోని ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల ప్రాంతాలలో కనిపిస్తుంది. ఇది భారతదేశం, నేపాల్, పాకిస్తాన్, చైనా మరియు శ్రీలంకలలో బాగా పెరుగుతుంది. భారతదేశంలోని పంజాబ్, రాజస్థాన్, బీహార్, ఢిల్లీ, గోవా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ మరియు కేరళ రాష్ట్రాల్లో బ్రాహ్మి మొక్కను మనం చూడవచ్చు. యెమెన్, సౌదీ అరేబియా, కువైట్ సహా అనేక అరేబియా దేశాలలో కూడా బ్రాహ్మి పెరుగుతున్నట్లు నివేదించబడింది.
  • శక్తి శాస్త్రం (ఎనర్జిటిక్స్): శీతలీకరణ
  1. బ్రాహ్మి ఆరోగ్య ప్రయోజనాలు - Brahmi health benefits in Telugu
  2. బ్రాహ్మిని ఉపయోగించే పద్ధతులు - Ways to use brahmi in Telugu
  3. బ్రాహ్మి మోతాదు - Brahmi dosage in Telugu
  4. బ్రాహ్మి దుష్ప్రభావాలు - Brahmi side effects in Telugu

బ్రాహ్మి శరీరానికి చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది, కానీ వాటిలో ఎక్కువ భాగం నాడీ వ్యవస్థకు ప్రత్యక్ష లేదా పరోక్ష చర్యకు సంబంధించినవి. నిజానికి, బ్రాహ్మి యొక్క అతి ముఖ్యమైన ఉపయోగం నరాల టానిక్ రూపంలో ఉంటుంది. బ్రాహ్మి యొక్క కొన్ని వైద్యం ప్రయోజనాలను అన్వేషిద్దాం:

  • మెదడు కోసం: బ్రాహ్మి యొక్క ముఖ్యమైన ప్రయోజనం మెదడుకు కల్గించనున్నట్లు కనుగొనబడింది. ఇది జ్ఞాపకశక్తి మరియు జ్ఞానాన్ని పెంచడానికి సహాయపడుతుంది మరియు అందువల్ల విద్యార్థులు దీన్ని ఉపయోగించవచ్చు. చిత్తవైకల్యం (స్కిజోఫ్రెనియా) వంటి రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులలో మెదడు పనితీరును మెరుగుపరచడంలో కూడా ఇది సహాయపడుతుంది. అల్జీమర్స్ వ్యాధి నిర్వహణకు దీన్నీ వాడవచ్చని అత్యంత స్పష్టమైన విధంగా చెప్పబడింది. దీనిలో అల్జీమర్స్ లక్షణాలను తగ్గించడానికి గణనీయంగా సహాయపడుతుంది. ఇంకా, ఇది ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడానికి సహాయపడుతుంది మరియు నిరాశతో బాధపడుతున్న వ్యక్తులకు ఉపయోగపడుతుంది.
  • మూర్ఛకు బ్రాహ్మి: మెదడుపై దాని ప్రయోకూడా జనాలకు పొడిగింపు, ప్రతిస్కంధక చర్య తీసుకోవడం ద్వారా మూర్ఛ చికిత్సకు బ్రాహ్మి కూడా సహాయపడుతుంది.
  • జుట్టు కోసం: జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి మరియు నెత్తిమీద అంటువ్యాధులను నివారించడంలో బ్రాహ్మి సహాయపడుతుంది.
  • మధుమేహం కోసం: డయాబెటిక్ సమస్యలను తగ్గించడంలో బ్రాహ్మి వాడకం హైపోగ్లైసీమిక్ (బ్లడ్ షుగర్ తగ్గించడం) ప్రభావాన్ని కలిగి ఉంటుంది.
  • ఇతర ప్రయోజనాలు: బ్రాహ్మి ప్రతిక్షకారిని (యాంటీఆక్సిడెంట్) ప్రభావాన్ని కలిగి ఉంటుంది, ఇది దాని నరాల రక్షణ (న్యూరోప్రొటెక్టివ్) చర్యలకు బాధ్యత వహిస్తుంది. ఇది వాపు-మంటకు మందుగా (యాంటీ ఇన్ఫ్లమేటరీ) పని  చేస్తాది గనుక దీని ఉపయోగాన్ని నొప్పినివారిణి (పెయిన్ కిల్లర్‌)గా సూచించబడింది. ఈ మూలిక యొక్క కొన్ని క్రియాశీల సమ్మేళనాలు దాన్ని ఓ సూక్ష్మజీవనాశిని (యాంటీమైక్రోబయల్) గా కూడా స్థాపించాయి, ఇది గ్యాస్ట్రిక్ అల్సర్లకు కారణమయ్యే హెచ్. పైలోరీకి వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది.

జ్ఞానం మరియు జ్ఞాపకశక్తికి బ్రాహ్మి - Brahmi for cognition and memory in Telugu

జ్ఞానం (జ్ఞానం మరియు అవగాహన) మరియు జ్ఞాపకశక్తి  పనితీరును మెరుగుపరచగల సామర్థ్యం బ్రాహ్మి యొక్క అత్యంత ప్రసిద్ధ ఆరోగ్య ప్రయోజనాల్లో ఒకటి. గత కొన్ని దశాబ్దాల నుండి, బ్రాహ్మి యొక్క ఈ సంప్రదాయ ఉపయోగం అనేక క్లినికల్ మరియు ప్రి-క్లినికల్ అధ్యయనాల ద్వారా పదేపదే విచారణకు వచ్చింది.

జర్నల్ ఆఫ్ ఆల్టర్నేటివ్ అండ్ కాంప్లిమెంటరీ మెడిసిన్ లో ప్రచురితమైన ఒక సమీక్షా వ్యాసం కనీసం 6 రాండమ్ క్లినికల్ ట్రయల్స్ (ఆర్.సి.టి) ను నమోదు చేసింది. దీని  ప్రకారం, 300-400 మి.గ్రా బ్రాహ్మి రసాన్ని క్రమం తప్పకుండా సేవించడంవల్ల ఆరోగ్యవంతులైనవారి జ్ఞానం మరియు జ్ఞాపకశక్తిని మరింత మెరుగుపరుస్తుందని పేర్కొంది.

మరో అధ్యయనం ప్రకారం, ఆలస్యంగా జ్ఞాపకం వచ్చే సమస్యను మెరుగుపరచడానికి లేదా సమాచారాన్ని మీ జ్ఞాపకం (మెమరీ)లో ఎక్కువసేపు ఉంచడానికి బ్రాహ్మి ఒక అద్భుతమైన ఏజెంట్. బ్రాహ్మి మరియు జిన్సెంగ్ వంటి ఆయుర్వేద మూలికలు మేల్కొలుపు స్థితిని మెరుగుపరచడానికి ఉపయోగించే మందు మొడాఫినిల్ వలె సమర్థవంతంగా పనిచేస్తాయని కూడా నివేదించబడింది.

వెసిక్యులర్ గ్లూటామేట్ టైప్ 1 (VGLUT1), ఇది న్యూరోట్రాన్స్మిటర్ (బ్రెయిన్ సిగ్నలింగ్) ప్రోటీన్. మెదడు అంతటా సంకేతాలు మరియు సమాచారం యొక్క సమర్థవంతమైన ప్రవాహానికి ఇది బాధ్యత వహిస్తుంది మరియు VGLUT1 లో తగ్గుదల ప్రధానంగా చిత్తవైకల్యం మరియు స్కిజోఫ్రెనియావంటి పరిస్థితులతో ముడిపడి ఉంటుంది. ఒక వివో (జంతు ఆధారితమైంది) అధ్యయనం ప్రకారం బ్రాహ్మి సేవనంవల్ల గ్లుటామాటే రకం 1 (VGLUT1) పరిమాణాన్నిపెంచుతుంది. దానివల్ల, మనోవైకల్యానికి (స్కిజోఫ్రెనియాకు) జ్ఞానాన్ని పెంచే ఔషధంగా పని చేసే శక్తి దీనికి కొంతవరకూ ఉండే అవకాశం ఉండవచ్చు.

మునుపటి అధ్యయనంలో, బ్రాహ్మికి బాకోపిన్ ఎ మరియు బి అని పిలువబడే రెండు జ్ఞాపకశక్తిని పెంచే రసాయనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ రెండు రసాయనాలు దెబ్బతిన్న మెదడు కణాలను బాగు చేయడానికి మరియు మెదడు పనితీరును మెరుగుపరచడానికి కారణమవుతాయి.

ఇటీవల, భారతదేశంలో బ్రాహ్మి యొక్క జ్ఞానాన్ని పెంచే లక్షణాలను పరీక్షించడానికి ఓ వైద్య పరీక్ష (క్లినికల్ ట్రయల్) జరిగింది. 60 మంది ఆరోగ్యకరమైన విద్యార్థుల బృందానికి రోజుకు ఒకసారి చొప్పున, ఆరు వారాల పాటు ప్లేసిబో లేదా 150 మి.గ్రా బ్రాహ్మి సారం (రసం) ఇవ్వబడింది. క్రమం తప్పకుండా బ్రాహ్మిని తీసుకున్న ఆ సమూహం, వారి జ్ఞానం మరియు జ్ఞాపకశక్తి పనితీరులో గణనీయమైన మెరుగుదల చూపించింది.

అయినప్పటికీ, దీర్ఘకాలిక మానవ వినియోగం విషయంలో బ్రాహ్మి యొక్క ఉపయోగాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ పరిశోధనలు అవసరం.

Vitamin E Capsules
₹449  ₹499  10% OFF
BUY NOW

ఒత్తిడి మరియు ఆందోళనకు బ్రాహ్మి - Brahmi for stress and anxiety in Telugu

నిరాశ, ఆందోళన, గుండె సమస్యలు , మధుమేహం మరియు కడుపు సమస్యలు వంటి అనేక వ్యాధులకు గల ప్రధాన కారణాలలో ఒత్తిడి ఒకటి. యాంటీ-యాంగ్జైటీ మందులు పలు  మోతాదులలో సురక్షితమైనవిగా పరిగణించబడుతున్నప్పటికీ, వాటి అధిక సేవనం అధిక మోతాదు మరియు విషపూరితం వంటి అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుంది.

సంప్రదాయ మరియు జానపద ఔషధం బ్రాహ్మి ని ఒక అద్భుతమైన ఒత్తిడికి వ్యతిరేకంగా  (అడాప్తోజేనిక్) పని చేసే మూలిక (హెర్బ్ గా పరిగణిస్తాయి. బ్రాహ్మి మూలిక జ్ఞానవృద్ధికి  మరియు జ్ఞాపకశక్తి ని మెరుగుపరచడానికి మాత్రమే కాదు,ఒత్తిడి మరియు ఆందోళనను తగ్గించడంలో కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. బ్రాహ్మి యొక్క ఒత్తిడి వ్యతిరేక  (యాంటీ-స్ట్రెస్) మరియు యాంజియోలైటిక్ (ఆందోళనను తగ్గిస్తుంది) ప్రభావాలను అర్థం చేసుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా వివిధ పరిశోధనలు జరిగాయి.

జంతు-ఆధారిత అధ్యయనాలు బ్రాహ్మి సేవనం తీవ్రమైన (ఆకస్మిక మరియు తీవ్రమైన) మరియు దీర్ఘకాలిక ఒత్తిడిని (దీర్ఘకాలిక) గణనీయంగా తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. ఒత్తిడి మరియు ఆందోళనను పారదోలడంలో లారాజీపం (ఆందోళనను తగ్గించే మందు) కంటే బ్రాహ్మి మరింత ప్రభావవంతమైనదని మునుపటి అధ్యయనం నివేదించింది. అదనంగా, జ్ఞానాన్ని మెరుగుపరచడం ద్వారా బ్రాహ్మి దాని యొక్క ఒత్తిడి-వినాశన పనితీరును కూడా  మధ్యవర్తిత్వంవల్ల నిర్వర్తిస్తుందని మరియు దానివల్ల స్పష్టమైన దుష్ప్రభావాలు ఉండవని ప్రస్తావించబడింది.

ఇటీవలి ఓ వైద్య అధ్యయనం ప్రకారం, 300-600 గ్రాముల బ్రాహ్మిని క్రమం తప్పకుండా సేవించడం వల్ల వ్యక్తిలోని ఒత్తిడిని గణనీయంగా తగ్గించవచ్చు మరియు ఇది మంచి మానసిక స్థితి ఏర్పాటుకి దారితీస్తుంది. శరీరంలో కార్టిసాల్ అనబడే ఒత్తిడి హార్మోను (స్ట్రెస్ హార్మోన్) స్థాయిలను తగ్గించడం ద్వారా బ్రాహ్మి తన ఒత్తిడి వ్యతిరేక (యాంటిస్ట్రెస్) పనితీరును ప్రదర్శిస్తుందని గమనించబడింది.

కుంగుబాటుకు బ్రాహ్మి - Brahmi for depression in Telugu

కుంగుబాటును తగ్గించే మందు (యాంటిడిప్రెసెంట్) రూపంలో ఆయుర్వేద ఔషధాలలో బ్రాహ్మిని విస్తృతంగా ఉపయోగిస్తారు. ఈ క్షేత్రంలో వైద్యపరిశోధనా పరమైన ఆధారాలు ఇప్పటికీ లేనప్పటికీ, కొన్ని జంతు-ఆధారిత అధ్యయనాలు నిరాశను తగ్గించడంలో బ్రాహ్మి యొక్క సామర్థ్యాన్ని నిర్ధారించాయి. అటువంటి అధ్యయనం బ్రాహ్మిలో ఉన్న బాకోసైడ్లు (సహజంగా సంభవించే రసాయనాలు) దాని నిరాశ నిరోధక చర్యకు ప్రధానంగా కారణమని సూచిస్తున్నాయి.

మూర్ఛకు బ్రాహ్మి - Brahmi for epilepsy in Telugu

గామా-అమినోబ్యూట్రిక్ ఆమ్లం (GABA) మెదడులోని న్యూరోట్రాన్స్మిటర్, ఇది మెదడు కణాల ఉద్దీపన మరియు సడలింపుల్లో సమతుల్యతను నిర్వహిస్తూ ఉంటుంది. GABA పనితీరులో ఏదైనా అసమతుల్యత సంభవించినపుడు సాధారణంగా మూర్ఛలు మరియు మూర్ఛ వంటి పరిస్థితుల సంభవం ఉంటుంది. GABA యొక్క ప్రతిస్కంధక చర్యలను ప్రేరేపించడం ద్వారా బ్రాహ్మి ఒక ప్రతిస్కంధక (ఫిట్స్ లేదా మూర్ఛ యొక్క ప్రమాదాన్ని తగ్గిస్తుంది) ప్రతిస్పందనకు మధ్యవర్తిత్వం వహించారని ప్రీక్లినికల్ అధ్యయనాలు సూచిస్తున్నాయి. మునుపటి అధ్యయనం బ్రాహ్మిలో బాకోసైడ్ ఒక GABA అగోనిస్ట్ (GABA ఫంక్షన్‌ను మెరుగుపరుస్తుంది) అని సూచిస్తుంది.

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మసీ అండ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్‌లో పేర్కొన్న తాజా అధ్యయనం ప్రకారం, బ్రాహ్మి సేవనం సాధారణ యాంటీపైలెప్టిక్ మందు ఫినోబార్బిటోన్‌కు నిరోధకతను తగ్గిస్తుంది.

అయినప్పటికీ, వైద్య అధ్యయనాలు లేకపోవడం వల్ల, ఎలాంటి ఫిట్స్ లేదా మూర్ఛ కోసం బ్రాహ్మీని తీసుకునే ముందు మీ వైద్యుడిని సంప్రదించడం మంచిది.

అల్జీమర్స్ కోసం బ్రాహ్మి - Brahmi for Alzheimer's in Telugu

అల్జీమర్స్ అనేది మన శరీరంలోని నరాల్లో ఉండే నాడీకణాల మరణం వల్ల వచ్చే రుగ్మత (న్యూరోడెజెనరేటివ్ డిజార్డర్).ఈ రుగ్మత జ్ఞానం, జ్ఞాపకశక్తి మరియు ప్రాథమిక అవగాహన వంటి మెదడు పనితీరును నెమ్మదిగా కానీ ప్రగతిశీలంగా గాని నష్టపరుస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) యొక్క తాజా నివేదిక ప్రకారం, అల్జీమర్స్ ప్రపంచవ్యాప్తంగా కనీసం 50% చిత్తవైకల్యం కేసులతో సంబంధం కలిగి ఉంది. ఏదేమైనా, దాని పురోగతి 65 నుండి 85 సంవత్సరాల వయస్సులో ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడింది. దురదృష్టవశాత్తు, అల్జీమర్స్ కోసం నిర్దిష్ట చికిత్స లేదు మరియు ప్రస్తుత చిత్తవైకల్యం చికిత్స చాలా ఖరీదైనది. కాబట్టి, అల్జీమర్స్ యొక్క తీవ్రతను తగ్గించడంలో మూలికా పదార్ధాల వాడకం మరియు ఆందోళన మరియు చిరాకు వంటి అల్జీమర్స్ సంబంధిత సమస్యలపై అధ్యయనాలు నిర్దేశించబడుతున్నాయి .

అరవైమంది అల్జీమర్స్ రోగులపైన నిర్వహించిన ఒక వైద్య అధ్యయనంలో,  బ్రాహ్మిపదార్ధాల సాధారణ వినియోగం జ్ఞాపకశక్తి, మననం, జ్ఞానం, ఆందోళన మరియు చికాకు తగ్గడంతో సానుకూల ప్రభావం చూపుతుందని సూచిస్తుంది.

మరో వైద్య అధ్యయనం బ్రాహ్మీని దాని ప్రాధమిక పదార్ధంగా కలిగి ఉన్న అనేక మూలికల మందు (పాలిహెర్బల్ సూత్రీకరణ) ఆలస్యంగా గుర్తుకు రావడం లక్షణాన్ని, జ్ఞానాన్ని మెరుగుపరచడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని సూచిస్తుంది. అదనంగా, బ్రాహ్మి వాపు-మంటను గణనీయంగా తగ్గించిందని గమనించబడింది.

పరిశోధన ప్రకారం, అల్జీమర్స్వ్యాధి అభివృద్ధికి ‘అమిలాయిడ్ బీటా ప్రోటీన్’ అని పిలువబడే ఒక నిర్దిష్ట ప్రోటీన్ మెదడులో పేరుకుపోవడమే ప్రధాన కారణాలలో ఒకటి.    బ్రాహ్మి యొక్క న్యూరోప్రొటెక్టివ్ (మెదడును రక్షించే) చర్యల యొక్క పునరావృత వాదనలు మెదడు పనితీరుపై బ్రాహ్మి చర్య యొక్క ఖచ్చితమైన యంత్రాంగాన్ని కనుగొనడానికి ఒక కొత్త పరిశోధనను ప్రేరేపించాయి. బ్రాక్మికి చెందిన ఒక రసాయనిక విభాగమైన బాకోపసైడ్-I (bacopaside-I), వాటిపై ప్రత్యేక రోగనిరోధక ప్రతిస్పందనను రాబట్టుకోవడం ద్వారా అమిలోయిడ్ ప్రోటీన్ ను ఖాళీ చేస్తుందని ఇటీవలి ప్రీ-క్లినికల్ అధ్యయనాలు కనుగొన్నాయి.

ఈ రంగంలో ఇంకా ఎక్కువ అధ్యయనాలు అవసరం అయినప్పటికీ, ప్రస్తుత ఫలితాలు అల్జీమర్స్ చికిత్సలో బ్రాహ్మి యొక్క చికిత్సా సామర్థ్యంపై ఖచ్చితంగా ఆశావహ ఫలితాన్నే చాటుతున్నాయి.

ప్రతీక్షకారిణిగా బ్రాహ్మి - Brahmi as an antioxidant in Telugu

ప్రతీక్షకారిణులు (యాంటీఆక్సిడెంట్స్) మన శరీరంలో ఉంటాయి, ఇవి స్వేచ్చారాశుల వ్యతిరేకంగా మన శరీరానికి ప్రాధమిక రక్షణ కల్పిస్తుంటాయి. మరిప్పుడు స్వేచ్చారాశులు   (ఫ్రీ రాడికల్స్) అంటే ఏమిటి? స్వేచ్చారాశులు అనేవి ఒక రకమైన ఆక్సిజన్, ఇది మన శరీరం యొక్క వివిధ జీవక్రియ చర్యల ఫలితంగా ఉత్పత్తి అవుతుంది. మన శరీరం యొక్క సాధారణ పనితీరుకు అవి చాలా అవసరం అయితే, అధిక లేదా అధిక సంఖ్యలో ఫ్రీ రాడికల్స్ ఆక్సీకరణ ఒత్తిడి అని పిలువబడే స్థితికి దారితీస్తాయి. అకాల వృద్ధాప్యం, ఊబకాయం, మధుమేహం మరియు గుండె సమస్యలు వంటి వివిధ శారీరక సమస్యలు ఆక్సీకరణ ఒత్తిడితో సంబంధం కలిగి ఉన్నాయి.

విటమిన్ సి మరియు బిహెచ్ఏ (బ్యూటిలేటెడ్ హైడ్రాక్సియానిసోల్) వంటి ఆహార యాంటీఆక్సిడెంట్లు ఈ స్వేచ్చా రాశులను (ఫ్రీ రాడికల్స్ ను) శరీరానికి దూరం చేయడానికి చాలా ప్రయోజనకరంగా ఉన్నాయని నిరూపించబడింది. ఇటీవలి పరిశోధనలో, బ్రాహ్మి సారం విటమిన్ సి మరియు బిహెచ్ఎ మాదిరిగానే యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

మరొక అధ్యయనం బ్రాహ్మి మొక్కల కాండం కంటే బ్రాహ్మి ఆకులు చాలా ఎక్కువ యాంటీఆక్సిడెంట్ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని పేర్కొంది.

సూక్ష్మ పరిశీలనతో  కూడిన ఓ వైద్య పత్రిక (పీర్ రివ్యూ జర్నల్) ప్రకారం, బ్రాహ్మి మూలిక యొక్క యాంటీఆక్సిడేటివ్ లక్షణాలు ఈ మూలిక యొక్క జ్ఞానం మరియు నరాల రక్షణ (న్యూరోప్రొటెక్టివ్) చర్యలతో సంబంధం కలిగి ఉంటాయి.

(మరింత చదవండి: యాంటీఆక్సిడెంట్ ఆహారం)

యాంటీఇన్ఫలమేటరీ మాన్పే మందుగా బ్రాహ్మి - Brahmi as an anti-inflammatory in Telugu

ఆయుర్వేద వైద్యం మరియు సంప్రదాయ ఔషధ వ్యవస్థల ద్వారా బ్రాహ్మిని చాలా కాలం నుండి నొప్పి నివారణగా మరియు శోథ నిరోధక ఏజెంట్‌గా ఉపయోగిస్తున్నారు. శోథ నిరోధక ఔషధంగా బ్రాహ్మి యొక్క చర్య మరియు సామర్థ్యం యొక్క ఖచ్చితమైన యంత్రాంగాన్ని పరీక్షించడానికి అనేక పరిశోధనలు జరిగాయి. వివో అధ్యయనాలలో, బ్రాహ్మి శక్తివంతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రతిచర్యను చేపడుతుందని సూచించింది, ఇది ఇండోమెథాసిన్ (యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్) మాదిరిగానే ఉంటుంది.

ఇండియన్ జర్నల్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, బ్రాహ్మి ఆకుల సారం, 200-400 మిల్లీగ్రాముల మోతాదులో, ఇన్ విట్రో మరియు వివో ఇన్ఫ్లమేషన్ మోడళ్లలో గణనీయమైన తగ్గింపును ప్రదర్శిస్తుందని తేలింది .

శరీరంలో తాపజనక ప్రతిస్పందనను ప్రారంభించడానికి కారణమైన కొన్ని రసాయనాల విడుదలను నిరోధించడం ద్వారా బ్రాహ్మి తన  శోథ నిరోధక చర్యను నిర్వర్తిస్తుందని మరో అధ్యయనం సూచిస్తోంది. బ్రాహ్మి సేవనం మెరుగైన రోగనిరోధక ప్రతిస్పందనకు దారితీస్తుందని మరియు ఇది మంటను తగ్గిస్తుందని కూడా నివేదించబడింది.

ఒక విట్రో (ప్రయోగశాల-ఆధారిత) అధ్యయనంలోని ఎర్రబడిన మెదడు కణాల నమూనాలో,  బ్రాహ్మి మెదడులో వాపును తగ్గించే సమాన ప్రభావాన్ని కనబరిచింది. అందువల్ల, ఇది మెదడు టానిక్‌గా గొప్ప సామర్థ్యాన్ని కలిగి ఉందని మరోసారి రుజువయింది.

బ్రాహ్మి నొప్పిని తగ్గిస్తుంది - Brahmi relieves pain in Telugu

అనేక అధ్యయనాలు బ్రాహ్మి మొక్క ఒక అద్భుతమైన యాంటినోసైసెప్టివ్ (నొప్పిని అణిచివేసే తత్వం) శక్తిని సూచిస్తున్నాయి. రెండు వేర్వేరు జంతు అధ్యయనాల ప్రకారం, డిక్లోఫెనాక్-నా మరియు ఆస్పిరిన్ వంటి వాణిజ్య మందుల కంటే బ్రాహ్మి మంచి నొప్పి నివారిణి. చర్య యొక్క ఖచ్చితమైన యంత్రాంగం ఇంకా స్పష్టంగా తెలియనప్పటికీ, బ్రాహ్మి సారాల్లోని రసాయన భాగాలు మెదడులోని కొన్ని గ్రాహకాలతో (ఓపియాయిడ్ గ్రాహకాలు) బంధించగలవని మరియు నొప్పి అనుభూతులను అణచివేసే ఉత్సాహాన్ని ఇస్తుందని సూచించబడింది.

మునుపటి అధ్యయనం బ్రాహ్మి యొక్క నొప్పినివారిణి (అనాల్జేసిక్) చర్యకు బాకోసిన్- I కారణమని సూచిస్తుంది. ఇటీవలి వివో అధ్యయనం ప్రకారం, అలోడినియా (నొప్పి లేని ఉద్దీపన ద్వారా బలమైన నొప్పి కలగడం) మరియు హైపరాల్జీసియా (నొప్పికి తీవ్రమైన సున్నితత్వం) తగ్గించడానికి కొన్ని మందులతో పాటు సహాయకుడిగా (సాధారణ మందులతో పాటు అదనపు చికిత్స) బ్రాహ్మి చాలా ఉపయోగపడుతుంది.

అయినప్పటికీ,  బ్రాహ్మియొక్క నొప్పిని తగ్గించే ప్రభావాలను మరియు అనాల్జేసిక్ యంత్రాంగాన్ని నిర్ధారించడానికి ఇంకా చాలా పరిశోధనలు అవసరం.

పొట్టకు బ్రాహ్మి ప్రయోజనాలు - Brahmi benefits for stomach in Telugu

వివో అధ్యయనాలలో బ్రాహ్మి కడుపు ఆరోగ్యానికి కొన్ని ప్రయోజనకరమైన ప్రభావాలను కలిగిస్తుందని సూచిస్తుంది. ఇది కడుపు లోపలి పొరను బలోపేతం చేస్తుందని మరియు అధిక జీర్ణ ఆమ్లాల ద్వారా అది దెబ్బతినకుండా కాపాడుతుందని నివేదించబడింది. అదనంగా, ‘ఇన్ విట్రో ‘ అధ్యయనంలో, బ్రాహ్మి, mL కి 1000 mg మోతాదులో, పుండు కలిగించే బ్యాక్టీరియా హెలికోబాక్టర్ పైలోరీ (Helicobacter pylori)ని సమర్థవంతంగా చంపగలదని కనుగొనబడింది .  

అయినప్పటికీ, పెప్టిక్ అల్సర్ యొక్క మానవ కేసులపై ఇలాంటి ప్రభావాలను నిర్ధారించడానికి ఇంకా క్లినికల్ అధ్యయనాలు నిర్వహించబడలేదు.

యాంటీమైక్రోబియల్ బ్రాహ్మి - Brahmi as an antimicrobial in Telugu

విట్రో అధ్యయనాలు బ్రాహ్మి మూలిక యొక్క ఇథనాలిక్ సారాలు ఒక నిర్దిష్ట రకానికి చెందిన బ్యాక్టీరియా (గ్రామ్ పాజిటివ్) వ్యతిరేకంగా అద్భుతమైన విషనాశక (యాంటీమైక్రోబయాల్) చర్యను కలిగి ఉందని సూచిస్తున్నాయి. తదుపరి అధ్యయనంలో, ఇథనాల్, నీరు, డైథైల్ ఈథర్ మరియు ఇథైల్ అసిటేట్ వంటి వివిధ ద్రావకాలను ఉపయోగించి బ్రాహ్మి సారం తయారు చేయబడింది. డైథైల్ ఈథర్ మరియు ఇథైల్ అసిటేట్ సారాల ద్వారా అవకలన మరియు విస్తృత శ్రేణి యాంటీ-సూక్ష్మజీవుల చర్య నివేదించబడింది, అయితే కాథీడా అల్బికాన్స్ మరియు ఆస్పెర్‌గిల్లస్ నైగర్ వంటి శిలీంధ్రాలను చంపడంలో ఇథనాలిక్ సారాలు మరింత శక్తివంతమైనవిగా గుర్తించబడ్డాయి. ఏదేమైనా, పరీక్షించిన సూక్ష్మజీవులలో దేనినైనా చంపడానికి సజల సారం విఫలమైంది. బ్రాహ్మి మొక్క యొక్క నీటి ఆధారిత సారాలలో కొన్ని రసాయన సమ్మేళనాలు లేకపోవడం వల్ల ఇది జరిగిందని సందేహించబడింది.

బ్రాహ్మి యొక్క చర్య యొక్క యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ ఏజెంట్ వంటి విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకా ఎక్కువ పరిశోధన జరగాల్సిన అవసరముంది.

(మరింత చదవండి: ఫంగల్ ఇన్ఫెక్షన్ చికిత్స)

జుట్టుకు బ్రాహ్మి ప్రయోజనాలు - Brahmi benefits for hair in Telugu

బ్రాహ్మి మరియు బ్రాహ్మి చమురును షాంపూలు మరియు కండీషనర్ల వంటి వివిధ కేశవర్ధిని ఉత్పత్తులు (హెయిర్ కేర్ ప్రొడక్ట్స్) లో ఉపయోగించడం అనేది చాలా కాలం నుండి జరుగుతోంది. మనకు ఇప్పుడు తెలిసినట్లుగా బ్రాహ్మి జ్ఞాపకశక్తి మరియు జ్ఞానపరమైన పనితీరును మెరుగుపర్చే మూలిక (నూట్రోపిక్ హెర్బ్)గా పని చేస్తుంది కానీ జుట్టు నాణ్యతను మెరుగుపర్చే కేశబలవర్ధిని (hair tonic) సామర్థ్యాన్ని కూడా ఇది కల్గి ఉందనడానికి ఏదైనా శాస్త్రీయమైన రుజువు ఉందా?

ఇంటర్నేషనల్ జర్నల్ ఫర్ ఇన్నోవేటివ్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, బ్రాహ్మి నిజానికి ఓ కేశ బలవర్ధిని (హెయిర్ టానిక్). ఇది జుట్టు కుదుళ్లను పోషించడం ద్వారా మరియు నెత్తిమీద రక్త ప్రసరణను మెరుగుపరచడం ద్వారా జుట్టు పెరుగుదలను మెరుగుపరుస్తుంది. అదనంగా, దాని శోథ నిరోధక మరియు యాంటీ బాక్టీరియల్ చర్య మీ తలమీది చర్మం మరియు జుట్టుకుదుళ్ళలో వచ్చే దురద మరియు అంటువ్యాధులను వదిలించుకోవటంలో సహాయపడుతుంది. తద్వారా, పొడవైన మరియు మెరిసే జుట్టు (shinier hairs) మీ సొంతమవుతుంది..

ఒక బహిరంగ వైద్య అధ్యయనం చెప్పేదేమిటంటే, ఓ బాహుమూలిక (పాలిహెర్బల్ సూత్రీకరణ) కేశవర్ధినిని తయారు చేసిన పదార్ధాలలో బ్రాహ్మి కూడా ఒక వస్తువు, మరి ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో చాలా సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. ఇందులో ఎలాంటి దుష్ప్రభావాలు లేవు అని కూడా పేర్కొంది.

కాబట్టి, జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మరియు మెరుగుపరచడంలో బ్రాహ్మికి కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు ఉన్నాయని చెప్పవచ్చు.

చక్కెరవ్యాధికి బ్రాహ్మి - Brahmi for diabetes in Telugu

బ్రాహ్మి యొక్క హైపోగ్లైసీమిక్ (బ్లడ్ షుగర్ తగ్గించడం) ప్రభావాలకు సంబంధించి ఎటువంటి క్లినికల్ అధ్యయనం జరగనప్పటికీ, జంతు-ఆధారిత అధ్యయనాలు బ్రాహ్మిలో కొంత హైపోగ్లైసిమిక్ సామర్థ్యం కలిగి ఉండవచ్చని సూచిస్తున్నాయి. అదనంగా, బ్రాహ్మి వినియోగం చక్కెరవ్యాధి (డయాబెటిస్) సంబంధిత మూత్రపిండాల నష్టం మరియు జ్ఞాపకశక్తి కోల్పోయే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని సూచించబడింది.

ఒక విట్రో అధ్యయనం ప్రకారం, బ్రాహ్మిలో ఉండే ‘బకోసిన్’ (bacosine) అనబడే ఒక రసాయన సమ్మేళనం బ్రాహ్మి యొక్క చక్కెరవ్యాధి వ్యతిరేక (antidiabetic) చర్యకు బాధ్యత వహిస్తూ ఉండవచ్చునని వాదిస్తుంది.

శరీరంలో ఇన్సులిన్ చేపట్టే చర్యలాగానే బ్రాహ్మి కూడా శరీరంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుందని కూడా చెప్పబడింది.

(మరింత చదవండి: డయాబెటిస్ లక్షణాలు)

బ్రాహ్మిని సాధారణంగా పొడి రూపంలో సేవిస్తారు లేదా తలకు అంటుకునే (హెయిర్ ఆయిల్స్) నూనెలో కలిపే పదార్ధంగా కూడా ఉపయోగిస్తారు. బ్రాహ్మి యొక్క జ్ఞాపకశక్తి మరియు జ్ఞానాన్ని పెంచే శక్తిని మనం పొందటానికి, బ్రాహ్మి ఆకులను కాషాయం (ఇన్ఫ్యూషన్) లేదా టీ  గా తయారు చేసుకుని సేవించవచ్చు.

బ్రాహ్మి టాబ్లెట్లు మరియు క్యాప్సూల్స్ రూపంలో వాణిజ్యపరంగా కూడా లభిస్తుంది. బ్రాహ్మి వాటి (Brahmi Vati) అనబడే టాబ్లెట్లు ఆందోళనను తగ్గించే అత్యంత ప్రసిద్ధమైన  మాత్రలతో ఒకటి.

అదనంగా, బ్రాహ్మిని సిరప్ గా కూడా ఉపయోగిస్తారు.

బ్రాహ్మిని పొడి రూపంలో 5 నుండి 10 గ్రాముల మోతాదులో తీసుకోవడం సాధారణంగా సురక్షితంగా భావిస్తారు. బ్రాహ్మి సిరప్‌లు మరియు శరీరంలోకి ద్రవమెక్కించటం పద్ధతిలో (infusion) వరుసగా 25-30 ఎంఎల్ మరియు 8-16 ఎంఎల్ మోతాదులో తీసుకోవచ్చు.

ఏదేమైనా, ఏ మూలికయినా దాని యొక్క ఖచ్చితమైన మోతాదు ఆ వ్యక్తి యొక్క శారీరక రీతి మరియు శారీరక పని తీరు వంటి కారకాలపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల, మీ కోసం బ్రాహ్మి యొక్క సరైన మోతాదును తెలుసుకోవడానికి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం ఎల్లప్పుడూ మంచిది.

  • గ్యాస్ట్రిక్ అల్సర్ల నుండి ఉపశమనం పొందడంలో బ్రాహ్మి వాడకంపై కొంతవరకూ పరిశోధనలు జరిగి ఉన్నప్పటికీ, ఇది వికారం , వాంతులు, విరేచనాలువంటి సమస్యలను కూడా కలిగిస్తుంది . కాబట్టి బ్రాహ్మిని తినేటప్పుడు మితంగా సేవించడం మంచిది.
  • గర్భధారణ సమయంలో మరియు పసిబిడ్డకు పాలిచ్చే తల్లి బ్రాహ్మి భద్రతను నిర్ధారించడానికి శాస్త్రీయ ఆధారాలు లేవు. కాబట్టి, గర్భిణీ మరియు పసిపిల్లల తల్లులైన మహిళలు బ్రాహ్మి తీసుకునే ముందు వారి వైద్యుడిని సంప్రదించమని సూచించారు.
  • బ్రాహ్మి యొక్క మందు చర్యల గురించి పెద్దగా తెలియదు. మీరు ఏవైనా సూచించిన మందుల్ని సేవిస్తూ ఉంటే, మీరు బ్రాహ్మిని తినడం సురక్షితమేనా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి ఆయుర్వేద వైద్యుడిని సంప్రదించడం మంచిది.

Medicines / Products that contain Brahmi

వనరులు

  1. Pase MP et al. The cognitive-enhancing effects of Bacopa monnieri: a systematic review of randomized, controlled human clinical trials. J Altern Complement Med. 2012 Jul;18(7):647-52. PMID: 22747190
  2. Neale C et al. Cognitive effects of two nutraceuticals Ginseng and Bacopa benchmarked against modafinil: a review and comparison of effect sizes. Br J Clin Pharmacol. 2013 Mar;75(3):728-37. PMID: 23043278
  3. Navneet Kumar et al. Efficacy of Standardized Extract of Bacopa monnieri (Bacognize®) on Cognitive Functions of Medical Students: A Six-Week, Randomized Placebo-Controlled Trial. Evid Based Complement Alternat Med. 2016; 2016: 4103423. PMID: 27803728
  4. Edwards JG. Adverse effects of antianxiety drugs. Drugs. 1981 Dec;22(6):495-514. PMID: 6119192
  5. SLDV Ramana Murty Kadali, Das M.C., Srinivasa Rao A.S.R., Karuna Sri G. Antidepressant Activity of Brahmi in Albino Mice. J Clin Diagn Res. 2014 Mar; 8(3): 35–37. PMID: 24783074
  6. Abdul Mannan, Ariful Basher Abir, Rashidur Rahman. Antidepressant-like effects of methanolic extract of Bacopa monniera in mice. BMC Complement Altern Med. 2015; 15: 337. PMID: 26407565
  7. Treiman DM. GABAergic mechanisms in epilepsy. Epilepsia. 2001;42 Suppl 3:8-12. PMID: 11520315
  8. National Institute on Aging [internet]: US Department of Health and Human Services; Alzheimer's Disease Fact Sheet
  9. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Alzheimer Disease and other Dementias.
  10. Sadhu A et al. Management of cognitive determinants in senile dementia of Alzheimer's type: therapeutic potential of a novel polyherbal drug product. Clin Drug Investig. 2014 Dec;34(12):857-69. PMID: 25316430
  11. M. Paul Murphy, Harry LeVine. Alzheimer’s Disease and the β-Amyloid Peptide. J Alzheimers Dis. 2010 Jan; 19(1): 311. PMID: 20061647
  12. Li Y et al. Bacopaside I ameliorates cognitive impairment in APP/PS1 mice via immune-mediated clearance of β-amyloid. Aging (Albany NY). 2016 Mar;8(3):521-33. PMID: 26946062
  13. Jain P et al. Antiinflammatory effects of an Ayurvedic preparation, Brahmi Rasayan, in rodents. Indian J Exp Biol. 1994 Sep;32(9):633-6. PMID: 7814042
  14. Williams R, Münch G, Gyengesi E, Bennett L. Bacopa monnieri (L.) exerts anti-inflammatory effects on cells of the innate immune system in vitro. Food Funct. 2014 Mar;5(3):517-20. PMID: 24452710
  15. Taznin I, Mukti M, Rahmatullah M. Bacopa monnieri: An evaluation of antihyperglycemic and antinociceptive potential of methanolic extract of whole plants. Pak J Pharm Sci. 2015 Nov;28(6):2135-9. PMID: 26639482
  16. Manju Bhaskar, A. G. Jagtap. Exploring the possible mechanisms of action behind the antinociceptive activity of Bacopa monniera. Int J Ayurveda Res. 2011 Jan-Mar; 2(1): 2–7. PMID: 21897636
  17. Sairam K, Rao CV, Babu MD, Goel RK. Prophylactic and curative effects of Bacopa monniera in gastric ulcer models. Phytomedicine. 2001 Nov;8(6):423-30. PMID: 11824516
  18. Ali Esmail Al-Snafi. The pharmacology of Bacopa monniera. A review . International Journal of Pharma Sciences and Research (IJPSR)
Read on app