వెంట్రుకల కుదుళ్లకు (హెయిర్ ఫోలికల్స్ కు) వచ్చే అంటురోగం లేదా సంక్రమణ వల్ల సంభవించే చర్మ రుగ్మతే “కురుపులు” లేదా “బొబ్బలు” (boils). చర్మం ఎరుపుదేలి, వాపు మరియు మంటను కల్గి ఉండే కురుపునే ఆంగ్లంలో “బాయిల్” అని కూడా అంటారు, కురుపు రూపంలోని ఈ చర్మరోగం దాని చుట్టుపక్కల ప్రాంతాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. బొబ్బలు సాధారణంగా “స్టెఫిలోకాకస్ ఆరియస్” అనే సూక్ష్మజీవి (బ్యాక్టీరియా) వల్ల సంభవిస్తాయి, కానీ ఈ బొబ్బలు ఇతర బ్యాక్టీరియా సమూహాలవల్ల లేదా శిలీంధ్రాల వల్ల కూడా సంభవించవచ్చు.

బొబ్బలు  తరచుగా బాధాకరంగా ఉంటాయి, తాకడానికి మృదువుగా ఉంటాయి మరియు చీము లేదా ద్రవంతో నిండి ఉంటాయి. వెంట్రుకల కుదుళ్ళు దెబ్బతినడం వల్ల బొబ్బలు చర్మం యొక్క లోతైన పొరలలోకి సంక్రమణ మరింత వ్యాపిస్తుంది. కాబట్టి, మీకు ఒక కురుపు వచ్చిందంటే దానికి  వెంటనే చికిత్స చేయడం చాలా అవసరం, ఆ విధంగా దాని వ్యాప్తిని అరికట్టొచ్చు. వేప ఆకులు మరియు పసుపు వంటి గృహ చిట్కాల సహాయంతో ఇంట్లోనే  చిన్న చిన్న కురుపులకు సులభంగా చికిత్సను నిర్వహించవచ్చు, బొబ్బలు ఇలాంటి చికాలను ఈ వ్యాసంలో మా పాఠకులకు అందిస్తున్నాం. మీకొచ్చిన కురుపు యొక్క పరిమాణం చాలా పెద్దది లేదా చాలా బాధాకరమైనదిగా ఉంటే, ఇతర లక్షణాలు కూడా ప్రదర్శిస్తే మీరు తప్పనిసరిగా చికిత్స కోసం వైద్యుడిని సందర్శించాలి. లక్షణాలు. బొబ్బలు రాకుండా నిరోధించడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఈ వ్యాసంలో రానున్న విభాగాలలో కురుపుల్ని నోరోధించే ఆ మార్గాలేంటో మీరు తెలుసుకుంటారు.

  1. కురుపుల లక్షణాలు - Symptoms of boils in Telugu
  2. బొబ్బల యొక్క కారణాలు మరియు ప్రమాద కారకాలు - Causes and Risk factors of boils in Telugu
  3. కురుపుల నివారణ - Prevention of carbuncle in Telugu
  4. బొబ్బల చికిత్స - Treatment of boils in Telugu
  5. బొబ్బలకు గృహ చిట్కాలు - Home remedies for boils in Telugu

చర్మంపై మృదువైన, వాపుదేలిన దద్దుర్లుగా బొబ్బలు  మొదలవుతాయి, ఇవి గులాబీ రంగు నుండి ఎరుపు రంగు వరకు ఉంటాయి, చర్మంపై గట్టిగా ఉండే భాగంలో ఈ బొబ్బలు సంభవిస్తుంటాయి. క్రమేపీ చీము లేదా ద్రవాలతో నిండిన తిత్తి లాంటి వాపుకు ఇవి విస్తరిస్తాయి. ఈ సమయంలో, కురుపు నుండి  ద్రవం లేదా చీము పారుదల కారణంగా నొప్పి క్రమంగా తగ్గి ఆ తార్వాత ఇది చాలా బాధాకరంగా మారుతుంది. తీవ్రత మరియు పరిమాణాన్ని బట్టి, బొబ్బలు వాటంతటవే పగిలి ద్రవం లేదా చీము వెలుపలికి ప్రవహిస్తుంది. లేదా చిన్నగా కోత పెట్టాల్సిన అవసరం రావచ్చు. బొబ్బలు సంబంధించి క్రింది లక్షణాలను గమనించవచ్చు:

  • చర్మం యొక్క కొద్దిభాగం పైన ఎర్రబడటం జరుగుతుంది, సాధారణంగా వెంట్రుకల కుదుళ్ళలో, తొడలు, పిరుదులు, మెడ, చంకలు లేదా ముఖం వంటి భాగాల్లో, అంటే ఒకదానికొకటి రాపిడి కలిగే భాగాల్లో సంభవిస్తాయివి.
  • బఠానీగింజ-పరిమాణంలో వాపు రావచ్చు, కొన్నిసార్లు పెద్దదిగా కూడా రావచ్చు
  • తాకితే కే సున్నితత్వం
  • నొప్పి
  • మధ్యలో తెలుపు లేదా పసుపు రంగు తల కలిగి ఉంటుంది
  • కురుపులో చీము లేదా ద్రవాల ఉనికి
  • త్వరగా వాపు వ్యాప్తి
  • చుట్టుపక్కల ప్రాంతం యొక్క ఎరుపు
  • అరుదుగా, దురద
  • కురుపు పరిమాణం పెద్దగా ఉంటే, మీరు జ్వరం, అలసట మరియు అనారోగ్యం వంటి అదనపు లక్షణాలను అనుభవించవచ్చు
  • బొబ్బలు చుట్టుపక్కల ప్రాంతానికి వ్యాపించి ఎక్కువ బొబ్బలు  అభివృద్ధి చెందుతాయి మరియు వ్యక్తి నుండి వ్యక్తికి కూడా వ్యాప్తి చెందుతాయి.

ఒకే ఒక్క వెంట్రుక కుదురుకు సోకిన కురుపువల్ల గాని  లేదా అనేక కుదుళ్లకు సోకిన కురుపుల వల్ల కూడా వాపు సంభవిస్తుందని మీరు గమనించవచ్చు. ఒక వెంట్రుక కుదురు (follicle) కు సోకిన కురుపును సెగగడ్డ (furuncle) అంటారు, అనేక కుదుళ్లకు బొబ్బలు సోకితే దానిని రాచకురుపు లేదా కార్బంకిల్ (carbuncle) అంటారు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

చర్మంలో సాధారణంగా నివాసముండే ‘S. ఆరియస్’ సూక్ష్మజీవి (bacteria) కారణంగా చర్మంపై వెంట్రుకల కుదుళ్ళలో సాధారణంగా కురుపు సంభవిస్తుంది. పైన పేర్కొన్న ప్రదేశాలలో అధిక ఘర్షణ కారణంగా దెబ్బతిన్న చర్మం లేదా చిరిగిన  చర్మం ద్వారా బ్యాక్టీరియా అంటువ్యాధులను కలిగిస్తుంది.

పేలవమైన పరిశుభ్రతను పాటించడమే బొబ్బలు రావడానికి ముఖ్యమైన ప్రమాద కారకం, ఇలా తగినంతగా చర్మ శుభ్రత పాటించనపుడు S. ఆరియస్ సూక్ష్మజీవి మన శరీరంలోకి ప్రవేశించడానికి తగిన మాధ్యమాన్ని మనమే అందించినందునవారమవుతాం. శరీరంపై చెమట మరియు చనిపోయిన చర్మ కణాల ఉనికి ఈ సూక్ష్మక్రిములకు మరింత ఆతిథ్య వాతావరణాన్ని అందిస్తుంది.

పేలవమైన పోషణవల్ల శరీరంలో సహజంగా క్షీణించిన రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా రోగాలకు గురయ్యే సంభావ్యతను మరింత పెంచుతుంది.

రోగనిరోధక శక్తి క్షీణత కారణంగా చక్కెరవ్యాధి (డయాబెటిస్) మరొక ప్రమాద కారకం.

తామర వంటి కొన్ని చర్మ రుగ్మతలు కూడా కురుపుల ప్రమాదాన్ని పెంచుతాయి ఎందుకంటే తామర రుగ్మత చర్మాన్ని దెబ్బతీస్తుంది.

కింది చర్యలు తీసుకోవడం ద్వారా కురుపుల్ని, రాచపుండ్లను నివారించవచ్చు:

  • సరైన పరిశుభ్రత పాటించడం
  • సమతుల్య ఆహారం తీసుకోవడం ద్వారా పోషక లోపాలను నివారించడం
  • చనిపోయిన చర్మ కణాలు పేరుకుపోకుండా ఉండటానికి ప్రతి రోజు స్నానం చేయడం మరియు చర్మాన్ని రుద్దుకుని శుభ్రంగా స్నానం చేయడం, 
  • దుస్తులు, పరుపులు, లోదుస్తులు లేదా నార దుస్తులు (linen clothes) మరియు ఇతర వస్తువులను శుభ్రంగా ఉంచండి
  • రేజర్, టవల్, బట్టలు మొదలైన వ్యక్తిగత వస్తువులను మరొకరు ఉపయోగించడానికి పంచుకోకుండా ఉండడం.

​మీకు ఇప్పటికే బొబ్బలు ఉంటే, మీరు ఈ క్రింది చర్యలు తీసుకోవడం ద్వారా పరిసర ప్రాంతాలకు వ్యాపించకుండా నిరోధించవచ్చు:

  • కురుపును తాకిన తరువాత యాంటీ-బాక్టీరియల్ సబ్బుతో చేతులు కడుక్కోవడం
  • వెచ్చని నీటిలో బట్టలు, పడక బట్టల్ని ఉతకడం
  • కురుపులతో బాధపడుతున్న ప్రాంతానికి ప్రత్యేక టవల్ ఉపయోగించండి
  • అనవసరంగా తాకడం లేదా కురుపు పిండి వేయడం మానుకోండి
  • కురుపు శుభ్రపరిచేటప్పుడు మరియు డ్రెస్సింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి
  • అది నయమయ్యే వరకు కప్పును కప్పి ఉంచాలి
  • క్రమం తప్పకుండా కురుపు యొక్క డ్రెస్సింగ్ మార్చడం
  • ఉపయోగించిన డ్రెస్సింగ్‌ను చాలా జాగ్రత్తగా పారవేయడం
  • సరైన ఆహారం సేవించడం మరియు తగినంత విశ్రాంతి తీసుకోవడం (ఇది త్వరగా కోలుకోవడానికి సహాయపడుతుంది)

బొబ్బల స్వీయ-నిర్వహణతో కూడిన చికిత్స చేయవచ్చు, అయితే, పెద్దవైన కురుపులకు డాక్టర్ సందర్శన అవసరం. ఎక్కువగా, ఎటువంటి తీవ్రమైన సమస్యలు లేకుండా ఇంట్లోనే కురుపులకు విజయవంతంగా చికిత్స నిర్వహించవచ్చు. మీరే కురుపులకు చికిత్స ఎలా నిర్వహించాలో ఇక్కడ ఉంది:

  • 10 నిమిషాల పాటు కురుపు ఉన్న ప్రదేశానికి వెచ్చని వస్త్రం వేయడం- ఇది వైద్యం చేసే ప్రక్రియను వేగవంతం చేస్తుంది. వెచ్చని వస్త్రం యొక్క అద్దకం (అనువర్తనం) చుట్టుపక్కల ప్రాంతం యొక్క ఉష్ణోగ్రతను పెంచుతుంది, ఇది కురుపు భాగం యొక్క పెర్ఫ్యూజన్ లేదా రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది, ఇది మంచి మరియు వేగంగా నయం చేయడానికి అనుమతిస్తుంది. వెచ్చని, తేమతో కూడిన కంప్రెస్ కురుపు యొక్క పారుదలకి సహాయపడుతుంది.
  • కురుపు ఇప్పటికే పగిలిన తర్వాత, వాపు, నొప్పి మరియు ఎరుపు యొక్క లక్షణాలు క్రమంగా తగ్గుతాయి. సంక్రమణ వ్యాప్తి చెందకుండా ఉండటానికి ఆ ప్రాంతాన్ని డ్రెస్సింగ్ లేదా శుభ్రమైన గాజుగుడ్డతో కప్పడం ఇంకా అవసరం.
  • మీరు తీవ్రమైన నొప్పిని అనుభవిస్తే, ఇబుప్రోఫెన్ వంటి ఓవర్ ది కౌంటర్ మందులు సహాయపడవచ్చు. మీకు జ్వరం ఉంటే, ఉపశమనం కోసం పారాసెటమాల్ కూడా తీసుకోవచ్చు. అయితే, ఈ సందర్భాలలో మీ వైద్యుడిని సందర్శించడం మంచిది.
  • డ్రెస్సింగ్ కోసం యాంటీబయాటిక్ క్రీమ్ వాడటం మంచిది. S. ఆరియస్ సూక్ష్మజీవి సాధారణంగా ఈ భాగంలో నివసిస్తున్నందున ఇది నాసికా పొరలకు కూడా వర్తించవచ్చు. పైపూత  మందుల కోసం ఓవర్ ది కౌంటర్ యాంటీబయాటిక్ క్రీములను ఉపయోగించవచ్చు.
  • మీ కురుపు పరిమాణం పెద్దగా ఉంటే మీరే ఆ ప్రాంతాన్ని తెరిచి ఉంచకూడదని పుండును పగలగొట్టం లేదా  తెరవడం చేయకూడదని గమనించాలి. ద్రవాల పారుదలకి సహాయపడటానికి మీరు పిన్స్ లేదా ఇతర వస్తువులను కూడా ఉపయోగించకూడదు ఎందుకంటే ఇది సంక్రమణను తీవ్రంగా వ్యాప్తి చేస్తుంది. 
  • యాంటీబయాటిక్ కవరేజ్ తరచుగా కురుపుల నిర్వహణకు సూచించబడుతుంది. కానీ, యాంటీబయాటిక్ నిరోధకత మరియు భవిష్యత్తులో అంటువ్యాధుల ప్రమాదాన్ని కలిగి ఉన్నందున మీరు వాటిని మీ స్వంతంగా కూడదు.
  • కురుపు పెద్దదిగా ఉంటే, మీ డాక్టర్ వాపు యొక్క ప్రదేశంలో కోత (కట్) ను పెట్టి లోపలి ద్రవాన్ని కార్చేస్తారు. ఈ ప్రక్రియను అనస్థీషియా (ఇది ఇంజెక్ట్ చేయబడిన ఒక చిన్న ప్రాంతంలో తిమ్మిరి అనుభూతిని కలుగజేస్తుంది) ఇచ్చి చేయచ్చు లేదా ఇవ్వకుండానే కూడా చేయచ్చు. ద్రవాన్ని కార్చేసిన తర్వాత పుండుకు క్రిమిసంహారక మందులను వేసి కట్టు (dressing) కట్టడం జారుతుతుంది.

కింది అంశాల విషయంలో కురుపుల చికిత్స కోసం మీరు వైద్యుడిని సందర్శించాల్సి ఉంటుంది:

  • కురుపు తీవ్రమైన బాధాకరంగా ఉంటుంది
  • కురుపు యొక్క పరిమాణం చాలా పెద్దది
  • బొబ్బలు  పునరావృతమవుతున్నట్లైతే 
  • బొబ్బలు  2 వారాల కన్నా ఎక్కువకాలం కొనసాగుతుంటే
  • జ్వరం మరియు ఇతర అదనపు లక్షణాలు ఉన్నపక్షంలో 
  • కురుపు ముఖంపైన లేదా వెన్నెముక యొక్క ప్రాంతం మీద ఉన్నపక్షంలో
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

వేడి కాపడం (warm compress) కురుపును నయం చేయడంలో విఫలమైతే మీరు ఇంట్లోనే కురుపు చికిత్సను నిర్వహించడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఈ విభాగం ఈ నివారణలలో ఉత్తమమైన వాటిని సూచిస్తుంది.

బొబ్బల కోసం వేడి కాపడం - Hot compress for boils in Telugu

కురుపుల  పారుదల మరియు వైద్యం కోసం వేడి కాపడం యొక్క ప్రయోజనాలు ఇప్పటికే చర్చించబడ్డాయి. వెచ్చని, తేమతో కూడిన డ్రెస్సింగ్ మీకు కావలసిన ఉపశమనాన్ని అందించకపోతే, మీరు వేడి కంప్రెస్‌ను ప్రయత్నించవచ్చు. ఇది డ్రెస్సింగ్‌తో సమానంగా ఉంటుంది. శుభ్రమైన గుడ్డ ముక్క తీసుకొని వేడిచేసిన నీటిలో ముంచండి. ఎక్కువ నానబెట్టవద్దు కానీ వస్త్రం వెచ్చగా మరియు తేమగా ఉండేలా చూసుకోండి. అప్పుడు, దీన్ని కురుపు మీద అద్దండి మరియు సంపీడన శక్తిని ప్రయోగించండి. ఇది చీము మరియు ఇతర అంటువ్యాధుల నుండి బయటపడటానికి సహాయపడుతుంది, వైద్యం ప్రక్రియను సులభతరం చేస్తుంది.

బొబ్బల చికిత్సకు పసుపు - Turmeric for the treatment of boils in Telugu

అందరికీ తెలిసిన క్రిమినాశక మందు మరియు సంభావ్య అనామ్లజని (యాంటీఆక్సిడెంట్) పసుపు. దీనినే హిందీలో హల్ది అంటారు. సంప్రదాయకంగా పసుపును కురుపులమానుడు నిర్వహణకు ఉపయోగిస్తారు. కానీ, పసుపు ఉపయోగం సంప్రదాయ వైద్యానికి మాత్రమే పరిమితం కాదు. పసుపు యొక్క వాపు-మంట (యాంటీ ఇన్ఫలమేటరీ) నివారణ ప్రభావం కారణంగా కురుపుల నిర్వహణలో పసుపు వాడకాన్ని చాలా మంది పరిశోధకులు సూచించారు.

కురుపును మానపడం కోసం ఒక సాధారణ మరియు సులభమైన మార్గం ఏమిటంటే, పసుపు పొడిని నీటితో కలిపి పేస్ట్ గా తయారు చేసి చర్మంపై పూయడం. మీరు దీన్ని గాజుగుడ్డతో కప్పి రాత్రిపూట అలాగే ఉంచాలి. మరుసటి రోజు, గోరువెచ్చని నీటితో కడగాలి.

సెగ గడ్డ నిర్వహణకు వేప - Neem for the management of furuncle in Telugu

వేపలో ముఖ్యమైన యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి, ఇవి కురుపుల చికిత్సకు అనువైనవి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలు’S. ఆరియస్‌’ సూక్ష్మజీవిని నాశనం చేయడానికి సహాయపడతాయి, ఈ సూక్ష్మజీవి కురుపులకు కారణమయ్యే ఏజెంట్ మరియు వేప యొక్క వాపు-మంట నిరోధక లక్షణాలు కురుపుతో  సంబంధం ఉన్న ఎరుపుదేలడం, నొప్పి మరియు వాపును మానపడానికి సహాయపడతాయి. ఈ ప్రయోజనం కోసం వేప ఆకు సారాన్ని ఉపయోగించాలని పరిశోధకులు సిఫార్సు చేస్తున్నారు.

ఈ వేప చిట్కాను ఇంట్లోనే మందుగా వాడటానికి, కొన్ని వేప ఆకులను తీసుకొని కడగాలి. ఇప్పుడు, ఆకులను నీటితో పాటు నూరి ఆ పేస్టును కురుపుపై పూయండి. తర్వాత గాజుగుడ్డ ముక్కతో కప్పండి మరియు కొన్ని గంటల తర్వాత డ్రెస్సింగ్ మార్చండి.

కురుపులకు వేప నూనె - Neem oil for carbuncle in Telugu

వేప చెట్టు సులభంగా అందుబాటులో లేకపోతే లేదా మునుపటి చిట్కా పరిహారం చాలా శ్రమతో కూడుకున్న పని అనిపిస్తే, వీటికి  బదులుగా మీరు వేప నూనెను ఉపయోగించుకోవచ్చు. వేపనూనెలో అలాంటివే  అయిన యాంటీబయాటిక్ లక్షణాలను కలిగి ఉంటుంది మరియు ఉపయోగించడానికి చాలా సులభంగా ఉంటుంది. వేపనూనె వాణిజ్యపరంగా తయారు చేయబడింది మరియు ఆన్‌లైన్‌లో సులభంగా లభిస్తుంది. కురుపుల కోసం వేప నూనె యొక్క ప్రయోజనాలు అనేక అధ్యయనాల ద్వారా నిరూపించబడ్డాయి.

కొంచం దూది (పత్తి) తీసుకుని వేప నూనెలో అద్ది ఓ 20 నిమిషాలపాటు నానబెట్టండి. ఆ తర్వాత కురుపున్నచోట పూయండి మరియు కురుపుపైన వేపనూనెను రాత్రిపూట అలాగే ఉండనివ్వండి. మరుసటి రోజు ఉదయం గోరువెచ్చని నీటితో కడగాలి.

కురుపు మానడం మొదలయ్యే వరకు మీరు ఈ నూనెను రోజుకు 3 నుండి 4 సార్లు సురక్షితంగా కురుపుపైన పూయవచ్చు.

సెగగడ్డకు తోట కూరాకు (గ్రీన్ అమరాంత్) చిట్కా మందు - Green amaranth for furuncle in Telugu

కొయ్య తోటకూరాకు (గ్రీన్ అమరాంత్) లేదా చోలై పేరున భారతదేశంలో సాధారణంగా ఉపయోగించే ఆకుకూర మొక్క, దీని ఆకులను కూరగాయలుగా అంటే కూరాకుగా ‘సాగ్’ రూపంలో తింటారు. కురుపుల చికిత్స కోసం ఆకుపచ్చని తోటకూరను వాడాలని పరిశోధన ఆధారాలు సూచించాయి.

ఈ ఆకుకూర ప్రయోజనాన్ని ఉపయోగించుకోవడానికి, మీరు కోపయ్య తోటకూర (అమరాంత్) యొక్క కొన్ని ఆకులను కడిగి ఉడకబెట్టి పేస్ట్ తయారు చేసుకోవచ్చు. పేస్ట్ చేసిన ఈ ఆకుకూర మందును కురుపు గాయానికి పూసి ఒక గాజుగుడ్డతో కురుపును కప్పాలి.

బొబ్బల కోసం పసుపు పాలు - Turmeric milk for boils in Telugu

పసుపు పాలలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి, దీని కారణంగానే పసుపు పాలను ‘బంగారు పాలు’ అని కూడా పిలుస్తారు (దాని రంగు కారణంగా కూడా). ఇది సంప్రదాయిక ఔషధపరిహారం, పసుపులో అధికంగా నయం చేసే లక్షణాల కారణంగా దీనికి ప్రసిద్ది చెందిన గృహచిట్కా మందుగా పేరొచ్చింది. వాపు-మాన్తా నిరోధక మరియు యాంటీబయాటిక్ లక్షణాల కారణంగా, పసుపు పాలు కూడా కురుపుల నిర్వహణకు విజయవంతంగా ఉపయోగించబడ్డాయి,

మీరు పడుకునే ముందు ఒక గ్లాసు పసుపు పాలు తాగడంవల్ల వైద్యం ప్రక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మీరు ఈ పసుపాల చిట్కా మందును మాత్రమే పూయొచ్చు లేదా అదనపు ప్రయోజనాల కోసం నొప్పి ఉన్నచోట రాసే ఇతర చర్మలేపన  మందులతో కలిపి ఉపయోగించొచ్చు. ఈ పసుపు పాలు ఒక గ్లాసు తాగడం వల్ల కురుపు మానడానికి చేసే వైద్యానికి బాగా సహాయపడుతుంది.

కురుపుల నిర్వహణకు తేయాకు చెట్టు నూనె - Tea tree oil for the management of carbuncle in Telugu

టీ చెట్టు నూనె (ట్రీ ఆయిల్) ఒక ముఖ్యమైన నూనె, ఇది చర్మానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది మరియు ఇది ఉత్తమ ఆరోగ్యాన్ని పునరుద్ధరించడంలో సహాయపడుతుంది. ఇది సూక్ష్మజీవి నాశిని (యాంటీమైక్రోబయల్), వాపు-మంటల్ని తగ్గించేది (యాంటీ ఇన్ఫ్లమేటరీ) మరియు బూజునివారిణి (యాంటీ ఫంగల్) గా పనిచేస్తుంది. సాధారణంగా ఇది S. ఆరియస్ (Staphylococcus aureus) కారణంగా సంభవిస్తుంది, అప్పుడప్పుడు బూజు లేక శిలీంధ్రాల ఏజెంట్ల వల్ల కురుపులు వస్తాయి మరియు అందువల్ల, టీ చెట్టు నూనె తన  ద్వంద్వ చర్యల వల్ల ఈ పుండ్లుపై చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది.

వాస్తవానికి, టీ చెట్టు నూనెను తీవ్రమైన కురుపుల నిర్వహణకు కూడా ఉపయోగించవచ్చు, కురుపులకు యాంటీబయాటిక్స్ మందుల సహాయంతో చికిత్స చేయలేము. యాంటీబయాటిక్-రెసిస్టెంట్ స్టెఫిలోకాకల్ జాతుల వల్ల కలిగే కురుపుల నిర్వహణలో టీ ట్రీ ఆయిల్ మరియు సిట్రిసిడస్ ఆయిల్ మరియు జెరేనియం ఆయిల్ వంటి కొన్ని ముఖ్యమైన నూనెలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని పరిశోధన ఆధారాలు సూచించాయి. అంటే టీ ట్రీ ఆయిల్ కురుపుల నిర్వహణకు ఉత్తమమైన గృహచిట్కా నివారణలలో ఒకటి మరియు ఇది ఆన్‌లైన్‌లో సులభంగా లభిస్తుంది. ఎంచుకోవడానికి ఉత్తమమైన బ్రాండ్లలో ఒకటి డోటెర్రా.

అయినప్పటికీ, మీరు దీన్ని చర్మంపై నేరుగా పూయరాదు ఎందుకంటే ఇది తీవ్రమైన మంటను కల్గిస్తుంది. కురుపుల చికిత్సకు టీ చెట్టు నూనెను సరిగ్గా ఉపయోగించుకోవటానికి, ఈ నూనెకు నీటిని కలిపి కురుపుపైన పూయండి. కురుపుపై నీటిని కలిపిన టీ చెట్టు నూనెను పూయడానికి శుభ్రమైన దూదిని అంటే స్టెరిలైజ్ చేసిన దూదిని ఉపయోగించండి. ఇలా ఈ నూనెను కురుపుపై పూసి రాత్రిపూట వదిలివేయవచ్చు. ఉత్తమ ఫలితాల కోసం, మానడం ప్రారంభం అయ్యేంతవరకూ రోజుకు రెండు, మూడు సార్లు కురుపులపై ఈ నూనెను రాయండి. యాంటీబయాటిక్-రెసిస్టెంట్ లేదా పునరావృతమయ్యే కురుపుల విషయంలో, కురుపు మానడమనేది నెమ్మదిగా సంభవిస్తుంది, కాబట్టి, ఓపికపట్టడం అవసరం.

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Boils
  2. healthdirect Australia. Boils. Australian government: Department of Health
  3. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Boils
  4. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Boils and carbuncles: How are boils treated? 2018 Jun 14.
  5. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Boils and carbuncles: Overview. 2018 Jun 14.
  6. Soham P. Chaudhari, DO, Alison Y. Tam, DO, Jason A. Barr. Curcumin. J Clin Aesthet Dermatol. 2015 Nov; 8(11): 43–48. PMID: 26705440
  7. Nahida Tabassum, Mariya Hamdani. Plants used to treat skin diseases. Pharmacogn Rev. 2014 Jan-Jun; 8(15): 52–60. PMID: 24600196
  8. Anjali Singh et al. Effect of Neem oil and Haridra on non-healing wounds. Ayu. 2014 Oct-Dec; 35(4): 398–403. PMID: 26195902
  9. Edwards-Jones V et al. The effect of essential oils on methicillin-resistant Staphylococcus aureus using a dressing model. Burns. 2004 Dec;30(8):772-7. PMID: 15555788
Read on app