పక్కతడుపుట - Bedwetting in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

November 27, 2018

March 06, 2020

పక్కతడుపుట
పక్కతడుపుట

పక్క తడపడం అంటే ఏమిటి?

పక్క తడపడం, దానినే రాత్రి సమయ నిగ్రహరాహిత్యం (night-time incontinence) లేదా నిద్రలో మూత్ర విసర్జన (nocturnal enuresis) అని కూడా పిలుస్తారు, ఇది నిద్రలో పునరావృత్తమైయ్యే అసంకల్పిత మూత్ర విసర్జన వ్యాధి. ఇది సాధారణంగా 5 నుండి 7 ఏళ్ళ వయస్సు తర్వాత జరుగదు. ఇది ప్రపంచవ్యాప్తంగా పాఠశాల వయస్కులైన పిల్లల్లో కనిపించే ఒక సాధారణ పరిస్థితి. పిల్లలు మరియు యుక్తవయస్కులలో పక్క తడపడం సాధారణం అయినప్పటికీ, ఇది భారతదేశంలో తగినంతగా నివేదించబడలేదు. ప్రపంచవ్యాప్తంగా దీని వ్యాప్తి 1.4% -28% గా ఉంది. భారతదేశంలో దీని ప్రాబల్యం 7.61% -16.3% గా ఉంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిల్లలు సాధారణంగా 5 ఏళ్ళ నాటికి మూత్ర విసర్జన ఎలా చెయ్యాలో నేర్చుకుంటారు, కానీ పూర్తిగా మూత్రాశయ నియంత్రణ పొందడానికి ఏ విధమైన స్థిర వయస్సు లేదు. కొంతమంది పిల్లలు 5 మరియు 7 సంవత్సరాల మధ్య ఈ సమస్యను ఎదుర్కొంటారు. వైద్యుల దృష్టికి తీసుకు వెళ్ళవలసిన సంకేతాలు మరియు లక్షణాలు:

  • పిల్లలు 7 సంవత్సరాల తర్వాత కూడా మంచం తడుపుతుంటే.
  • పక్క తడపడం మానివేసిన కొన్ని నెలలు తర్వాత మళ్ళి మొదలుపెడితే.
  • బాధాకరమైన మూత్రవిసర్జన, గులాబి లేదా ఎరుపు రంగులో మూత్రం, అధిక దాహం, గట్టి మలం లేదా గురక పెడుతుంటే.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కారణాలు స్పష్టంగా తెలియలేదు కానీ వాటిలో కొన్ని ఈ కింది కారణాలు కావచ్చు:

  • చిన్నమూత్రాశయం: మూత్రాశయం పూర్తిగా అభివృద్ధి చెందకపోవచ్చు.
  • మూత్రాశయం నిండిందని అని తెలుసుకోలేకపోవటం: మూత్రాశయాన్ని నియంత్రించే నరములు నెమ్మదిగా అభివృద్ధి చెందుతుంటే, నిండిన మూత్రాశయం పిల్లవాడిని నిద్ర నుండి మేల్కొనేలా చెయ్యదు.
  • హార్మోన్ల అసమతుల్యత: రాత్రుళ్లు మూత్రం ఆలస్యంగా ఏర్పడెలా చేసే యాంటి డైయ్యూరెటిక్ హార్మోన్( antidiuretic hormone ) (ADH) తగినంత లేనప్పుడు.
  • మూత్రాశయ సంక్రమణ (infection): సంక్రమణ (infection) వలన మూత్రాన్ని నియంత్రించడంలో పిల్లవాడికి కష్టంగా ఉండవచ్చు. (మరింత సమాచారం: యూటిఐస్ చికిత్స (UTIs treatment))  
  • స్లీప్ అప్నియా(Sleep apnoea): పెద్ద టాన్సిల్స్ లేదా అడెనాయిడ్ల కారణంగా నిద్రపోయినప్పుడు శ్వాస నిరోధించబడుతుంది.
  • మధుమేహం: బిడ్డ సాధారణంగా రాత్రి పక్క తడపనప్పుడు, మధుమేహం ఒక మొదటి కారకం కావచ్చు.
  • దీర్ఘకాలిక మలబద్ధకం: దీర్ఘకాల మలబద్ధకం మూత్రపిండాల పనితీరును తగ్గించగలదు.
  • ఒత్తిడి: భయాన్ని ప్రేరేపించే ఒత్తిడి కూడా పక్క తడపడాన్ని ఉత్తేజపరచవచ్చు.

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

మీ బిడ్డ యొక్క మూత్రవిసర్జన క్రమాన్ని తెలుసుకొనమనవచ్చు, మరియు డైరీని నిర్వహించమని అడగవచ్చు.

గమనించదగ్గ అంశాలు:

  • మూత్ర విసర్జన తరచుదనం
  • మల విసర్జన తరచుదనం మరియు చిక్కదనం
  • నిద్రపోయే సమయంలో ద్రవం తీసుకోవడం

ఈ పరీక్షలు ఉండవచ్చు:

  • మూత్ర సూక్ష్మజీవుల సాగు మరియు విశ్లేషణ: సంక్రమణ (infection), మధుమేహం, రక్తం యొక్క జాడలు లేదా ఏ ఇతర పదార్ధాల యొక్క తనిఖీ కోసం.
  • రక్త పరీక్షలు: రక్తహీనత, మధుమేహం, మూత్రపిండ సమస్యలు మరియు ఇతర పరిస్థితుల తనిఖీ కోసం.
  • మూత్రాశయ అల్ట్రాసౌండ్: మూత్ర విసర్జన తర్వాత మూత్రంలో ఎంత మూత్రం మిగిలివుందో తెలుసుకోవడానికి.
  • మూత్రపిండ పరీక్ష(Urodynamic testing): మూత్రం యొక్క నిల్వ మరియు ఎలా ప్రవహిస్తుందో పరిశీలించడానికి.
  • సిస్టోస్కోపీ (Cystoscopy): మూత్రాశయంలోని కెమెరాను పెట్టడం ద్వారా మూత్రాశయ పరిస్థితులను తనిఖీ చెయ్యడం కోసం.

పక్క తడపడం ఒక ప్రధాన సమస్య కాదు అది పిల్లల అభివృధ్ధి దశను సూచిస్తుంది, కానీ పిల్లలు అసహనంతో మరియు తక్కువ స్వీయ-గౌరవంతో బాధపడతారు. ఈ పరిస్థితిని సరిదిద్దడంలో తల్లిదండ్రులూ నిస్సహాయతను ఎదుర్కుంటారు.

నిర్వహణ అనేది ఈ క్రింది వాటిని కలిగి:

  • తల్లిదండ్రులు మరియు పిల్లలకు మరియు పక్క తడపడాన్ని నయం చేయవచ్చని సలహా ఇవ్వడం.
  • ADH కు సమానమైన ఒక ఔషధాన్ని వైద్యులు సూచించవచ్చు, ఇది ADH వంటి ప్రభావాలను అందిస్తుంది మరియు యాంటీడిప్రేంట్, మూత్రాశయాన్ని విశ్రాంతపరచేది సూచించవచ్చు.

మందులు లేని పద్ధతులు: ఈ ఉత్పత్తులను కొనుగోలు చేయవచ్చు

  • వాడిపడేసే లేదా పునర్వినియోగపరచదగిన పీల్చుకునే లోదుస్తులు.
  • పక్క తడపడాన్ని సూచించే మొయిస్టుర్ అలరాలు (Moisture alarms).

స్వీయ రక్షణ చిట్కాలు:

  • రోజులో ఉదయం పూట పిల్లలు ద్రవం ఎక్కువ తీసుకునేలా చేసి సాయంత్రం ద్రవం పరిమితిగా తీసుకునేలా ప్రయత్నించాలి.
  • నిద్రపోయే ముందు పిల్లవాడితో మూత్ర విసర్జన చేయించాలి.
  • బిడ్డను ప్రోత్సహించండి, తద్వారా అతను / ఆమె సౌకర్యవంతంగా మరియు నమ్మకంగా ధైర్యంగా ఉంటారు.
  • మీ బిడ్డ మూత్రవిసర్జన చేసినా, తిట్టడం లేదా శిక్షించకూడదు లేదా అది ప్రయోజనం ఇవ్వదు.
  • షీట్లను శుభ్రపరిచేటప్పుడు మీ బిడ్డను సహాయం చేయమని ప్రోత్సహించండి, అందువలన అతను / ఆమె సౌకర్యంగా ఉంటారు.



వనరులు

  1. Reddy NM, Malve H, Nerli R, Venkatesh P, Agarwal I, Rege V. Nocturnal Enuresis in India: Are We Diagnosing and Managing Correctly?. 2017 Nov-Dec;27(6):417-426. PMID: 29217876
  2. Urology Care Foundation [Internet]. USA: American urological association; What Is Nocturnal Enuresis (Bedwetting)?
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Bedwetting
  4. National sleep foundation. Bedwetting and Sleep. Washington, D.C., United States
  5. KidsHealth. Bedwetting. The Nemours Foundation. [internet].

పక్కతడుపుట కొరకు మందులు

Medicines listed below are available for పక్కతడుపుట. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.