మద్యపాన వ్యసనం - Alcoholism in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

November 27, 2018

September 11, 2020

మద్యపాన వ్యసనం
మద్యపాన వ్యసనం

మద్యపాన వ్యసనం అంటే ఏమిటి?

ఒక వ్యక్తి మద్యపానానికి లోబడినప్పుడు లేదా మద్యం మీద ఆధార పడిపోయినప్పుడు దానిని మద్యపాన రుగ్మత లేదా మద్య వ్యసనం అని పిలుస్తారు. అలాంటి వాళ్ళు ఆనందం కోసం తక్కువ మరియు అవసరం కోసం లేదా బలంగా ఆధారపడడం వలన ఎక్కువగా తాగుతారు. మద్యపాన వ్యసనంతో బాధపడుతున్న చాలామంది దాని ప్రతికూల ప్రభావాలు తెలుసుకుంటారు, కాని తాగకుండా వారు ఉండలేరు. మద్యపాన వ్యసనం పని మరియు భవిష్యత్తు, ఆర్థిక స్థిరత్వం మరియు బాంధవ్యాలను ప్రభావితం చేస్తుంది అంటారు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మద్యపాన వ్యసనపరులు వివిధ రకాల శారీరక మరియు ప్రవర్తనా లక్షణాలను చూపిస్తారు, వాటిలో కొన్ని:

  • మత్తులో లేనప్పుడు మద్యం కోసం తీవ్రమైన కోరికను కలిగి ఉంటారు   
  • మద్యానికి  శరీర సహనం (tolerence) పెరిగిపోతుంది
  • వికారం, తిమ్మిరి మరియు అసమర్థత వంటి లక్షణాలు
  • మత్తులో లేనప్పుడు వణుకు
  • మద్యపానం తరువాత జ్ఞాపకశక్తి తగ్గిపోవడం
  • సాంఘిక పద్దతులకి మరియు కలుసుకోవడానికి దూరంగా ఉంటుంది
  • పాడైన ఆహార విధానం మరియు వ్యక్తిగత పరిశుభ్రత
  • పని ప్రదేశం వద్ద నిశ్చలత మరియు నిర్లక్ష్యం
  • సమస్య గురించి మాట్లాడటానికి విరుద్ధత, ఎదుర్కొన్నప్పుడు విపరీత ధోరణి
  • పని, బంధాల్లో సమస్యలు మరియు ఆర్ధిక సమస్యలు ఎదురైనప్పటికీ, త్రాగటం కొనసాగించడం
  • డిహైడ్రాషన్ మరియు కాలేయ సంబంధ వ్యాధులు

ప్రధాన కారణాలు ఏమిటి?

సమస్యను ప్రేరేపించే కొన్ని పరిస్థితులుతెలిసినప్పటికీ, మద్యపాన వ్యసనం యొక్క ఖచ్చితమైన కారణాన్ని నిర్వచించటం కష్టం. ఒక వారంలో 12 సార్లు కంటే ఎక్కువగా తాగే స్త్రీలు, వారానికి 15సార్లు కంటే ఎక్కువ తాగే పురుషులు లేదా రోజులకు 5 సార్లు పైగా తాగే వారు మద్యపాన వ్యసనపరులుగా పిలవబడతారు. మద్య వ్యసనం యొక్క కారణాలు:

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్సఏమిటి?

నిర్ధారణ ప్రధానంగా భౌతిక పరీక్ష మరియు వివరణాత్మక చరిత్రపై ఆధారపడి ఉంటుంది. వైద్యులు సాధారణంగా రోగి ఎంత తరచుగా మరియు ఎంత మోతాదులో తీసుకుంటాడో తెలుసుకుంటారు, తాగుడు మానడానికి ఏమైనా చర్యలు తీసున్నారా, తాత్కాలికంగా స్పృహ కోల్పోవడం జరిగిందా , హింసాత్మక సంఘటనలు లేదా పనికి సంబందించిన సమస్యలు ఉన్నాయా ,రోగి మద్యం సేవించి వాహనాలు నడిపేటప్పుడు ప్రమాదాలు సంభవించాయ అనే ప్రశ్నలను ప్రశ్నిస్తారు. కొన్ని స్పందనలు కూడా అంచనా వేయడానికి ఒక ప్రశ్నాపత్రాన్ని ఇవ్వవచ్చు. సుదీర్ఘ మద్యపాన దుర్వినియోగం మరియు ఆరోగ్య సమస్యలను వైద్యులు అనుమానించినట్లయితే, కాలేయ పనితీరు పరీక్షించడానికి రక్త నమూనాలను సేకరిస్తారు.

చికిత్స యొక్క అన్ని పద్ధతులు మద్యంపై ఆధారపడడాన్ని తగ్గించడం మరియు వినియోగాన్ని నివారించడం పై ఉంటాయి. మద్య వ్యసనం నుండి బయటపడటానికి సహాయంగా, వైద్యులు ఈ క్రింది వాటిని సూచించవచ్చు:

  • ఈ సమస్యతో ముడిపడి ఉన్న ఆరోగ్య సమస్యలను నివారించడానికి వైద్య చికిత్స
  • యాంటాబ్యూజ్ (antabuse )అని పిలిచే వ్యసనాన్ని నిరోధించే మందులు ఇవ్వడం
  • మద్దతు బృందాలు - AA లేదా ఆల్కహాలిక్స్ అనానమస్ (Alcoholics Anonymous) అనేది బాగా తెలిసిన మద్యపాన నిరోధ మద్దతు బృందం అది, మద్యపాన నియంత్రణను పొందడం మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి సహాయపడే ఒక బృందం
  • శరీరం నుండి విషాలని మరియు మద్యమును తొలగించటానికి శరీరం యొక్క డేటాక్సిఫికేషన్ (Detoxification)
  • భావోద్వేగ రుగ్మతలకు కౌన్సెలింగ్
  • సానుకూల దృక్పథాన్ని మరియు నైపుణ్యాలను పొందేందుకు అనుకూల బలము కోసం సహాయం చేయడం మరియు పునరావాసం



వనరులు

  1. National institute of alcohol abuse and alcoholism. Alcohol Use Disorder. U.S. Department of Health and Human Services. [internet].
  2. National institute of alcohol abuse and alcoholism. Alcohol & Your Health. U.S. Department of Health and Human Services. [internet].
  3. National institute of alcohol abuse and alcoholism. Alcohol Facts and Statistics. U.S. Department of Health and Human Services. [internet].
  4. National Health Service [Internet]. UK; National Institute on Alcohol Abuse and Alcoholism (NIAAA)
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Alcoholism and Alcohol Abuse

మద్యపాన వ్యసనం కొరకు మందులు

Medicines listed below are available for మద్యపాన వ్యసనం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.