సారాంశం

ప్రసవం అనేది ఒక స్త్రీ తన జీవితంలో అత్యంత శ్రమతో కూడిన మరియు సంతోషకరమైన అనుభవాలలో ఒకటి. ఏదేమైనా, సహజ కాన్పును ఎంచుకోవాలా లేదా సిజేరియన్ కాన్పును ఎంచుకోవాలా అనే విషయం అంత సంతోషాన్ని కలిగించదు. మీరు ప్రసవించడానికి సిద్ధంగా ఉన్నప్పుడు మీ బిడ్డను ప్రపంచానికి స్వాగతించడానికి మీరు ఎంచుకున్న పద్ధతితో సంబంధం లేకుండా, మీలో ప్రసవ  నొప్పుల ప్రారంభాన్ని సూచించే ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంకేతాలు కలుగుతాయి అవి ఈ క్రింది ఇవ్వబడ్డాయి:

  • మొండిగా ఉండే నడుము నొప్పి.
  • ఉదర తిమ్మిర్లు.
  • యోని నుండి స్రావాలు (తరచుగా దీనిని వాటర్ బ్రేకేజ్ అని అంటారు).
  • క్రమమైన సంకోచాలు సమాయంతో పాటు అధికమవుతాయి మరియు మధ్య మధ్యలో చిన్న విరామాలు కలుగుతాయి.

సహజమైన కాన్పు లేదా యోని ప్రసవం ఏ కారణం చేతనైనా సాధ్యం కానట్లయితే, వైద్యులు సిజేరియన్ డెలివరీని సలహా ఇస్తారు.

  1. సహజ కాన్పు/ప్రసవం అంటే ఏమిటి - What is a normal delivery in Telugu
  2. సిజేరియన్ అంటే ఏమిటి - What is a C-section in Telugu
  3. తల్లికి సహజ డెలివరీ యొక్క ప్రయోజనాలు - Benefits of normal delivery for the mother in Telugu
  4. యోని ప్రసవం వలన తల్లికి కలిగే దుష్ప్రభావాలు - Side effects of vaginal birth for the mother in Telugu
  5. సహజ ప్రసవంలో శిశువుకు కలిగే లాభాలు మరియు నష్టాలు - Pros and Cons of a normal delivery for the baby in Telugu
  6. తల్లికి సి సెక్షన్ డెలివరీ యొక్క ప్రయోజనాలు - Advantages of C section delivery for the mother in Telugu
  7. తల్లికి సిజేరియన్ డెలివరీ వలన కలిగే ప్రతికూలతలు - Disadvantages of cesarean delivery for the mother in Telugu
  8. శిశువుకు సిజేరియన్ డెలివరీ వలన ఉండే లాభాలు మరియు నష్టాలు - Pros and cons of cesarean delivery for the baby in Telugu
సహజ ప్రసవం లేదా సిజేరియన్ ద్వారా ప్రసవం వీటిలో ఏది ఉత్తమైనది? వైద్యులు

సహజ ప్రసవం మూడు దశలను కలిగి ఉంటుంది. ప్రతి దశ భిన్నమైన వ్యవధితో ఉంటుంది మరియు శిశువు జన్మించిన తరువాత మాయ (ప్లాసెంటా) బయటకి రావడంతో చివరి దశ ముగుస్తుంది. మాయ అనేది పెరుగుతున్న శిశువుకు పోషక సహాయాన్ని అందించడానికి తల్లి కడుపు లోపల ఏర్పడే ఒకరకమైన కణజాలం. సహజ డెలివరీ విషయంలో కింది చర్యలు తీసుకుంటారు:

  • నొప్పుల యొక్క మొదటి దశకు చేరిన తరువాత, ఎపిడ్యూరల్ అనస్థీషియా వంటి నొప్పిని తగ్గించే మందుల అవసరం లేకుండా శిశువు ప్రసవించబడుతుంది.
  • ఎపిసియోటోమీ (శిశువు యోని నుండి బయటకు రావడానికి చోటు కల్పించడానికి పెరినియం, అంటే యోని మరియు పాయువు మధ్య ఉండే ప్రాంతం, పెరినియంను  కొద్దిగా కత్తిరించి శిశువు బయటకు వచ్చిన తర్వాత తిరిగి దానికి కుట్లు వేస్తారు) వంటి కృత్రిమ వైద్య పద్ధతులు ఉపయోగించడం మరియు శిశువును పర్యవేక్షించడం జరుగుతుంది.
  • తల్లిని మరియు బిడ్డను స్థిరమైన స్థితికి తీసుకువస్తారు.

యోని డెలివరీకి క్రింద పేర్కొన్నటువంటి వైద్య విధానాల జోక్యం అవసరం కావచ్చు. ప్రతి పద్దతితో కొన్ని సమస్యలు ముడిపడి ఉంటాయి.

  • అమ్నియోటోమి (Amniotomy)
    ఈ విధానంలో, శిశువు చుట్టూ సంరక్షిత అమ్నియోటిక్ ద్రవాన్ని కలిగి ఉండే అమ్నియోటిక్ శాక్ ను ప్రసవానికి ముందు కృత్రిమంగా చీల్చుతారు. అంటువ్యాధులు రాకుండా నివారించడానికి అమ్నియోటోమీ నిర్వహించిన తర్వాత ఒక రోజులోపు శిశువు ప్రసవించబడుతుంది.
  • ప్రేరేపిత నొప్పులు (Induced labour) 
    సింథటిక్ ఆక్సిటోసిన్ హార్మోన్ను ఇంజెక్ట్ చేయడం ద్వారా నొప్పులను కృత్రిమంగా కలిగిస్తారు. సాధారణంగా ఉండవలసిన దానికంటే చిన్నగా ఉన్న శిశువు మరియు తల్లిలో అధిక రక్తపోటు వంటి ఆరోగ్య కారణాల వల్ల నొప్పులను కృత్రిమంగా ప్రేరేపించవచ్చు. నొప్పుల ప్రేరణ వలన  కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి:
    • పిండం హృదయ స్పందన రేటులో మార్పులు.
    • బొడ్డు తాడులో సమస్యలు.
    • గర్భాశయం యొక్క చీలిక.
    • కొన్నిసార్లు పిండానికి ప్రాణాంతకం కావచ్చు.
    • సిజేరియన్ డెలివరీ అవసరమయ్యే ప్రమాదం పెరుగుతుంది .
    • తల్లి లేదా బిడ్డలో అంటువ్యాధులు.
  • పిండం పర్యవేక్షణ (Foetal monitoring)
    శిశువు యొక్క హృదయ స్పందన రేటు మరియు వాటితో ముడిపడి ఉండే అంతర్గతంగా లేదా బాహ్యమైన అసాధారణతలు గమనించడానికి పిండాన్ని పర్యవేక్షించడం జరుగుతుంది. శిశువును పర్యవేక్షించడానికి ఉపయోగించే స్కాల్ప్ ఎలక్ట్రోడ్ (scalp electrode) శిశువు తలపై కొన్నిసార్లు గాయానికి కారణమవ్వవచ్చు, ఇది సాధారణంగా త్వరగా నయమైపోతుంది. అయితే, అంతర్గత పిండం పర్యవేక్షణలో సంక్రమణకు స్వల్ప అవకాశం ఉంటుంది.
  • వాక్యూమ్ ఎక్సట్రాక్షన్ (Vacuum extraction)
    ప్రసవ సమయంలో తల్లి శిశువును తగినంతగా నెట్టలేనప్పుడు శిశువు తలపై ఒక చిన్న సక్షన్ కప్ (పేల్చే పరికరం) ఉంచబడుతుంది. గర్భాశయ సంకోచాలతో పాటు వాక్యూమ్ ఫోర్స్ ను సృష్టించి శిశువును బయటకు తీస్తారు. సక్షన్ పంపు కారణంగా శిశువు తలపై కమిలిన గాయం ఏర్పడడం సాధ్యమే కాని సాధారణంగా పుట్టిన మొదటి 48 గంటల్లోనే అది తగ్గిపోతుంది.
  • ఫోర్సెప్స్ డెలివరీ (Forceps delivery)
    దీనిలో వైద్యులు ఫోర్సెప్స్‌ను (పటకారు) ఉపయోగిస్తారు, రెండు పెద్ద చెంచా లాంటి వస్తువులతో చేసిన పరికరం దానితో శిశువు యొక్క తలని పట్టుకుని శిశువును బయటకు తీస్తారు. ఫోర్సెప్ లు శిశువు ముఖం మీద కొన్ని మరకలను కలిగించవచ్చు. ఫోర్సెప్స్ ఉపయోగించి ప్రసవం చేయబడిన 10 మంది శిశువులలో ఒకరికి వారి నెత్తిమీద లేదా ముఖం మీద చిన్న కోతలు ఏర్పడతాయి. అరుదైన సందర్భాల్లో, ఫోర్సెప్లు శిశువు యొక్క మెదడుకు శాశ్వత నష్టాన్ని కూడా కలిగించవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

సిజేరియన్ డెలివరీ అంటే శిశువును తల్లి గర్భం నుండి శస్త్రచికిత్సా విధానం ఉపయోగించి బయటకు తీయడం.దీనిని సి-సెక్షన్ అని కూడా పిలుస్తారు, ఈ శస్త్రచికిత్సా విధానం నయం కావడానికి యోని ప్రసవం కంటే ఎక్కువ సమయం తీసుకుంటుంది మరియు అనేక ప్రమాదాల సంభావ్యతను కూడా కలిగి ఉంటుంది.

కొన్ని సిజేరియన్లు ముందుగా ప్రణాళిక చేయబడతాయి, కాని కొన్నిసార్లు సహజ డెలివరీ సమయంలో సంభవించే ఊహించని సమస్యల కారణంగా వీటిని నిర్వహిస్తారు:

  • శిశువు యొక్క స్థానంలో సమస్యలు.
  • ప్రసవ సమయంలో తల్లికి లేదా బిడ్డకు గాయాలయ్యే అవకాశం ఉండడం.
  • బొడ్డు తాడులో సమస్యలు.
  • అకాలంగా నొప్పులు ఏర్పడడం (గర్భధారణ యొక్క 37 వారాల ముందు నొప్పులు ప్రారంభమైనప్పుడు).

సహజంగా బిడ్డను ప్రసవించినప్పుడు తల్లులు అనుభవించే ప్రయోజనాల జాబితా ఈ కింద ఇవ్వబడింది:

  • శిశువును యోని ద్వారా ప్రసవించిన తల్లులు శారీరకంగా మరియు మానసికంగా వేగంగా కోలుకుంటారు.
  • రాయల్ కాలేజ్ ఆఫ్ అబ్స్టెట్రిషియన్స్ మరియు గైనకాలజిస్ట్స్ ప్రకారం, యోని ద్వారా ప్రసవించిన తరువాత తల్లులు విజయవంతంగా చనుబాలు ఇచ్చే అవకాశం ఉంటుంది.
  • సహజ ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ అనే ప్రత్యేక హార్మోన్ ఉత్పత్తి అవుతుంది. ఇది డెలివరీకి సహాయపడుతుంది అలాగే తల్లి మరియు బిడ్డల మధ్య బంధానికి సహకారం అందిస్తుంది.
  • సహజ ప్రసవంలో అలసిపోతారు మరియు గజిబిజిగా ఉంటుంది. శిశువు ప్రసవించిన తర్వాత అమ్నియోటిక్ ద్రవాలు, మూత్రం మరియు ఇతర శరీర ద్రవాలు బయటకు వస్తాయి. కొంతమంది మహిళలు కఠినమైన నొప్పులను అనుభవిస్తారు, దీనివల్ల వారికి  విపరీతమైన చెమట పడుతుంది.
  • యోని ప్రసవం సాధారణంగా చాలా బాధాకరముగా ఉంటుంది.
  • కొంతమంది మహిళలకు, తెలియని కొత్త పరిసరాల్లో ఒక రసహ్య మరియు సన్నిహిత ఆంతరంగిక ప్రక్రియ జరగడమనేది ఇబ్బందికరంగా ఉంటుంది.
  • ఎపిసియోటోమీతో సంబంధం కలిగి ఉండే ప్రమాదాలు, అది నిర్వహిస్తే కనుక (ఉదా., అధిక రక్తస్రావం, సంక్రమణ, మచ్చ ఏర్పడటం మరియు మచ్చ చీలిక).
  • మూత్రాన్ని ఆపుకొనలేకపోవడం, నవ్వడం, మాట్లాడటం, దగ్గువంటి కార్యకలాపాలు చేసేటప్పుడు మూత్ర విసర్జనపై నియంత్రణ లేని పరిస్థితి. పొత్తికడుపులో ఒత్తిడి పెరుగుతుంది, ఇది మూత్రం యొక్క అనియంత్రిత విసర్జనకు దారితీస్తుంది.
  • చుట్టుపక్కల ప్రాంతానికి లేదా యోనిలోనే గాయాలు ఏర్పడడం.
  • ప్రసవం తర్వాత భారీ రక్తస్రావం.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

పిల్లలు సహజంగా ప్రసవించినప్పుడు వారుకి ఉండే  ప్రయోజనాలు:

  • శిశువు సహజ ప్రసవం ద్వారా గర్భం నుండి బయటకు వచ్చినప్పుడు తర్వాత సంభవించే మార్పులను బాగా ఎదుర్కోగలదు. అయితే కొన్ని నియంత్రించాల్సిన మార్పులు:
    • ఉష్ణోగ్రత.
    • రక్త చక్కెర.
    • శ్వాస.
    • మెదడుకు రక్త ప్రసరణ.
    • అన్వేషణాత్మక ప్రవర్తన (Exploratory behaviour), కొత్త పరిసరాలను అన్వేషించే లేదా పరిశోధించే ధోరణి.
  • సిజేరియన్ జననంతో పోలిస్తే, సహజ జననం శిశువు యొక్క దీర్ఘకాలిక ఆరోగ్యం, పెరుగుదల మరియు అభివృద్ధికి తోడ్పడుతుంది.
  • సాధారణంగా అంగీకరించబడిన వాస్తవం ఏమిటంటే, నొప్పుల సమయంలో ఉండే సంకోచాలు శిశువు యొక్క ఊపిరితిత్తులు గాలిని బాగా పీల్చుకోవడానికి సహాయపడతాయి.
  • డెలివరీ ప్రక్రియను సులభతరం చేయడానికి ఉపయోగించే ఫోర్సెప్స్ లేదా వాక్యూమ్ వలన శిశివులు మానసిక ఆందోళనకు గురవుతారు.
  • సమర్థవంతమైన మరియు తక్కువ గందరగోళంగా ఉండే పద్ధతి.
  • సహజ యోని ప్రసవం కంటే వేగవంతమైనది.
  • మహిళలు తమ ప్రైవేట్ భాగాలను ఇతరులు తాకకుండా ఉండడం వల్ల సౌకర్యవంతంగా ఉంటారు.
  • సహజ ప్రసవ సమయంలో నొప్పుల కలిగే విధంగా కాకుండా, సిజేరియన్ సమయంలో తల్లికి అనస్థీషియా ఇవ్వబడుతుంది, ఇది నొప్పి లేని ప్రక్రియగా ఉంటుంది.
  • సిజేరియన్ అనేది యోని డెలివరీ కంటే శుభ్రమైన ప్రక్రియ. ఆపరేషన్ థియేటర్‌లో రక్తం, మలం మరకలు మరియు అమ్నియోటిక్ ద్రవం కారణంగా ఎటువంటి మురికి ఏర్పడదు.
  • సిజేరియన్ జననాలను షెడ్యూల్ చేయవచ్చు, అంటే తల్లులు శిశువు పుట్టే తేదీని ఎంచుకోవడానికి సహాయపడుతుంది.
  • సి-సెక్షన్ యోని డెలివరీ లాగా భౌతికంగా అధిక శ్రమను కలిగించదు.
  • సిజేరియన్ తల్లులు ఎక్కువగా ఆపానవాయువును వదులుతారు. వారు గ్యాస్ పాస్ చేసేటప్పుడు పొత్తి కడుపు లేదా కడుపు నొప్పి మరియు అసౌకర్యాన్ని అనుభవిస్తారు.
  • ఆసుపత్రిలో ఎక్కువ సమయం ఉండాలి.
  • ఆపరేషన్ తర్వాత సంక్రమణ ప్రమాదం ఉండవచ్చు. అంటువ్యాధుల చికిత్స కొంచెం  ఆందోళన కలిగించే విధంగా ఉంటుంది మరియు కోలుకునే సమయాన్ని పెంచుతుంది.
  • యోని ప్రసవంతో పోలిస్తే దీనిలో తల్లి మరణం ప్రమాదం ఎక్కువ
  • శస్త్రచికిత్స సమయంలో ఏర్పడిన మచ్చ కణజాలం భవిష్యత్తులో ప్రేగు అవరోధం, దీర్ఘకాలిక నొప్పి, గర్భస్రావం లేదా సంతానలేమి వంటి వాటికి కారణమవచ్చు. ఇవన్నీ పునరావృత శస్త్రచికిత్సను కష్టతరం చేస్తాయి.
  • తదుపరి గర్భధారణలలో ఈ కింది వాటి యొక్క ప్రమాదాలు ఉండవచ్చు:
    • ఎక్టోపిక్ గర్భం
      ఫలదీకరణ గుడ్డు గర్భాశయం వెలుపల ఇంప్లాంట్లు.
    • ప్లాసెంటా ప్రెవియా  (Placenta previa)
      మాయ (ప్లాసెంటా) గర్భాశయంలో కింద ఉంటుంది మరియు జనన మార్గం తెరచుకోవడాన్ని అడ్డుకుంటుంది.
    • మావి అక్రెటా (Placenta accreta)
      మాయ గర్భాశయ గోడలో చాలా లోతుగా అంటుకుంటుంది.
  • గుండెపోటు.
  • ప్రసవించిన తరువాత లోపల రక్తస్రావం జరుగవచ్చు, దీనికి గర్భాశయం తొలగించాల్సిన అవసరం ఉండవచ్చు (హిస్టెరెక్టోమీ).
  • శస్త్రచికిత్స సమయంలో అనస్థీషియా (మత్తు) ఇచ్చిన మహిళలు అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వాంతి చేసుకోవచ్చు. వాంతి ఊపిరితిత్తులలోకి ప్రవేశించే  ప్రమాదం కూడా ఉంది. ఇది చాలా అరుదైన సందర్భాల్లో జరుగుతుంది కాని ప్రాణాంతకమైనది.
  • స్పైనల్ బ్లాక్ (దీనినే వెన్నెముక అనస్థీషియా అంటారు)లేదా ఎపిడ్యూరల్ (నడుము క్రింద శరీరాన్ని తిమ్మిరి చేసే అనస్థీషియా) తీసుకున్న మహిళలు, రక్తపోటులో గణనీయమైన తగ్గుదలని అనుభవిస్తారు.
  • ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ల తర్వాత కొంతమంది మహిళలు ఒక నిర్దిష్ట రకమైన తలనొప్పిని కూడా అనుభవిస్తారు.
  • శిశువును తొలగించడానికి శస్త్రచికిత్స సమయంలో పొత్తి కడుపు క్రింద చేసిన కాటు (కత్తిరింపు) మచ్చ జీవితాంతం ఉంటుంది.
  • సిజేరియన్ తరువాత, గాయపు కాయ (కెలాయిడ్) ఏర్పడే అవకాశాలు ఉన్నాయి (మచ్చ ఉన్న ప్రదేశంలో అదనపు మచ్చ కణజాలం పెరుగుతుంది).
  • సిజేరియన్ శస్త్రచికిత్సలు చేసినప్పుడు కొన్ని సందర్భాల్లో, గర్భాశయం చీలిపోతుంది. అడ్డు కోత సిజేరియన్ శస్త్రచికిత్సల కంటే నిలువు కోత శస్త్రచికిత్సలలో గర్భాశయ చీలిక ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మునుపటి సిజేరియన్ ఫలితంగా గర్భాశయ చీలికలు ఎక్కువగా జరుగుతాయి.
  • జఘన జుట్టు (pubic hair) యొక్క పైభాగం శస్త్రచికిత్సకు ముందు తొలగించబడుతుంది. ఈ జుట్టు తిరిగి పెరగడం ప్రారంభించిన తర్వాత మహిళలు దురదను అనుభవించవచ్చు. మచ్చ దగ్గర ప్రాంతం సున్నితముగా ఉన్నకారణంగా గోకడం కష్టం అవుతుంది.
  • శస్త్రచికిత్స తర్వాత వాహనాలను నడపడం మరియు ఇంటి పనులను నిర్వహించడంలో మహిళలు మునుపటిలా శక్తివంతంగా ఉన్నట్లు అనిపించరు.
  • 100 మంది గర్భిణీ స్త్రీలలో ఇద్దరికి, మూత్రాశయం లేదా ప్రేగు గాయాలు సాధ్యమే.
  • కట్ చేసిన కటి ప్రాంతంలో అంతర్గత మచ్చ కణజాలం ఏర్పడవచ్చు, ఇది నొప్పి మరియు ప్రేగు అడ్డంకికి కారణమవుతుంది.
  • సి-సెక్షన్ సమయంలో తల్లికి అనస్థీషియా ఇస్తారు. అనస్థీషియాకు తల్లి శరీరం ప్రతికూల స్పందన వచ్చే అవకాశం ఉంది. శస్త్రచికిత్స తర్వాత ఇచ్చే నొప్పి నివారణలకు (పెయిన్ కిల్లర్స్) కూడా ప్రతికూల ప్రతిచర్య కలుగడం కూడా సాధ్యమే.
  • గర్భాశయంలో, మూత్రాశయం వంటి ఇతర కటి భాగపు అవయవాలలో లేదా కోత జరిగిన ప్రదేశంలో అంటువ్యాధులు సంభవించవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW
  • శిశువుకు జనన మార్గం గుండా ప్రయాణించాల్సిన అవసరం ఉండదు, ఇది గాయం ప్రమాదాన్ని పెంచుతుంది.
  • సిజేరియన్ ద్వారా పుట్టిన పిల్లలు, పుట్టినప్పుడు మరియు కొద్దిగా పెద్దయిన తర్వాత కూడా శ్వాసకోశ సమస్యలను ఎక్కువగా ఎదుర్కుంటారు.
  • కొన్నిసార్లు సిజేరియన్ శస్త్రచికిత్స ద్వారా పుట్టిన పిల్లలు వైద్యుల కత్తుల చేత గాయపడవచ్చు.
  • సిజేరియన్ విషయంలో కొన్నిసార్లు శిశువులను ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చేర్చవలసిన అవసరం ఎక్కువగా ఉంటుంది.
  • గర్భధారణ వయస్సును ఖచ్చితంగా లెక్కించకపోతే, సిజేరియన్ ద్వారా బిడ్డ సమయానికంటే ముందే ప్రసవించబడవచ్చు, దీనివల్ల తక్కువ బరువున్న శిశువు పుడుతుంది.
  • ఏపిజిఏఆర్ (APGAR) స్కోరింగ్ (పుట్టిన తరువాత శిశువు యొక్క శ్రేయస్సును నిర్ణయించే స్కోరింగ్ విధానం) సాధారణ ప్రసవాల ద్వారా పుట్టిన శిశువుల కంటే సిజేరియన్ శిశువులలో (50%) తక్కువగా ఉంటాయి.
Siddhartha Vatsa

Siddhartha Vatsa

General Physician
3 Years of Experience

Dr. Harshvardhan Deshpande

Dr. Harshvardhan Deshpande

General Physician
13 Years of Experience

Dr. Supriya Shirish

Dr. Supriya Shirish

General Physician
20 Years of Experience

Dr. Priyanka Rana

Dr. Priyanka Rana

General Physician
2 Years of Experience

వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Childbirth
  2. Larissa Hirsch. Natural Childbirth. The Nemours Foundation. [Internet]
  3. American College of Obstetricians and Gynecologists [Internet] Washington, DC; Labor Induction
  4. Stanford Health Care [Internet]. Stanford Medicine, Stanford University; Fetal Monitoring
  5. National Health Service [Internet]. UK; Forceps or vacuum delivery.
  6. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Labor and birth.
  7. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cesarean Section
  8. Larissa Hirsch. Ectopic Pregnancy. The Nemours Foundation. [Internet]
  9. American Pregnancy Association. [Internet]; Placenta Previa.
  10. American Pregnancy Association. [Internet]; Placenta Accreta.
  11. National Institute for Health and Care Excellence. Caesarean section. [Internet]
  12. InformedHealth.org [Internet]. Cologne, Germany: Institute for Quality and Efficiency in Health Care (IQWiG); 2006-. Pregnancy and birth: Cesarean sections: What are the pros and cons of regional and general anesthetics? 2008 Mar 19 [Updated 2018 Mar 22].
  13. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Keloids
  14. Firoozeh Ahmadi, Shiva Siahbazi, Farnaz Akhbari. Incomplete Cesarean Scar Rupture . J Reprod Infertil. 2013 Jan-Mar; 14(1): 43–45. PMID: 23926561
  15. American Pregnancy Association. [Internet]; Risks Of A Cesarean Procedure.
  16. American Pregnancy Association. [Internet]; Your Child’s First Test: The APGAR.
Read on app