అల్ఫాల్ఫా ఒక పశుపంట, ఇది సాంప్రదాయకంగా దాని వైద్య లక్షణాలకు ప్రసిద్ది చెందింది. ఇది పెద్ద చిక్కుళ్లు మరియు కసింద చెట్టు పాటు ఫాబేసి కుటుంబానికి చెందినది మరియు ఇది అన్ని కాయధాన్యాల మాదిరిగా ప్రోటీన్లతో సమృద్ధిగా ఉంటుంది.

ఈ మొక్కపై ఎక్కువ శాస్త్రీయ పరిశోధనలు లేనప్పటికీ, ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలకు ఆసక్తి కలిగించే మూలికగా ఉంది; ప్రధానంగా దాని అధిక పోషక పరిమాణం కారణంగా ఇది మానవ వినియోగానికి సరైన ఆరోగ్య సప్లీమెంట్గా పనిచేస్తుంది. వాణిజ్యపరంగా లాభదాయకమైన పంట కావడంతో దీనిని యూఎస్ఏ లో దీనిని “గ్రీన్ గోల్డ్” అని పిలుస్తారు. అల్ఫాల్ఫా యొక్క నాణ్యత మరియు దిగుబడిని మెరుగుపరచడానికి దాని పెరుగుదల విధానం మరియు పంటకోత సమయాల్లో ఒక నిశిత పరిశీలన అవసరం అవుతుంది.

ఆసక్తికరంగా, ఈ పంట యొక్క చరిత్ర గురించి స్పష్టమైన రికార్డులు లేవు మరియు నాగరికత ప్రారంభానికి ముందు నుండి ఇది అడవులలో పెరుగుతోందని నమ్ముతారు. ఏదేమైనా, అల్ఫాల్ఫా యొక్క మూలం తూర్పు లేదా మధ్య ఆసియాకు, ముఖ్యంగా పర్షియా (ఇప్పుడు ఇరాన్), కాశ్మీర్, సిరియా, ఇరాక్, పాకిస్తాన్ మరియు బలూచిస్తాన్లలో ఉన్నట్లు పేర్కొనే కొన్ని వాదనలు కూడా ఉన్నాయి. వాస్తవానికి, అల్ఫాల్ఫా అనే పేరు పెర్షియన్ పదం నుండి వచ్చింది, దీని అర్థం “ఉత్తమ మేత” [“the best forage”]. నేడు, ఈ మూలిక  ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోంది.

అల్ఫాల్ఫా ఒక శాశ్వత మొక్క, ఇది 3 అడుగుల ఎత్తు వరకు పెరుగుతుంది. ఇది నిటారుగా ఉండే కాండంతో లోతైన మూలాలు మరియు కలప అంచు (వూడి బేస్) ను కలిగి ఉంటుంది. అల్ఫాల్ఫా ఆకులు అండాకారంలో మరియు త్రిదళంగా (ట్రైఫోలియేట్, మూడు ఆకులు కలిసి పెరుగుతాయి) ఉంటాయి మరియు వాటి దిగువ భాగంలో వెంట్రుకలుగా (hairy) ఉంటుందిఉంటాయి. ఇది మే నుండి జూలై నెలలో ఊదా రంగు పువ్వులను కలిగి ఉంటుంది, ఈ పువ్వులు గుత్తులుగా పెరుగుతాయి మరియు కాయలు మెలికెలు తిరిగి ఉంటాయి, ఇవి 2 నుండి 5 పసుపు నుండి ఆకుపచ్చ రంగులో మూత్రపిండాల ఆకారపు విత్తనాలను కలిగి ఉంటాయి.

ఒక అద్భుతమైన పోషక పదార్ధంగా మాత్రమే కాకుండా, అల్ఫాల్ఫాకు అనేక వైద్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆయుర్వేదంలో, అల్ఫాల్ఫా మొలకలు కాలేయ ఆరోగ్యానికి మరియు రక్త శుద్ధికి మంచివిగా పరిగణించబడతాయి, ఇది సమర్థవంతమైన యాంటీ- ఆర్థరైటిక్ మరియు ఊబకాయ నిరోధక ఏజెంట్. ఇది సాధారణంగా దాని హైపోలిపిడెమిక్ (కొవ్వును తగ్గిస్తుంది) మరియు యాంటీ-డయాబెటిక్ లక్షణాల కోసం అధ్యయనం చేయబడుతుంది. సాంప్రదాయ వాదనలను ధృవీకరించడానికి మరియు ఈ మూలిక నుండి గరిష్ట ప్రయోజనాలను పొందటానికి పరిశోధన ఇంకా కొనసాగుతోంది.

అల్ఫాల్ఫా గురించి కొన్ని ప్రాథమిక వాస్తవాలు:

  • శాస్త్రీయ నామం: మెడికాగో సాటివా (Medicago sativa)
  • కుటుంబం: ఫాబేసి (Fabaceae)
  • సాధారణ పేర్లు: అల్ఫాల్ఫా, లూసర్న్ (Lucerne), బాస్టర్డ్ మెడిక్ (Bastard medic), బఫల్ హెర్బ్ (Buffal herb), ఎండుగడ్డి
  • సంస్కృత పేరు: అశ్వబాలా
  • ఉపయోగించే భాగాలు: ఆకులు, విత్తనాలు
  • స్థానిక ప్రాంతం మరియు భౌగోళిక విస్తీర్ణం: ఆగ్నేయాసియాకు చెందిన అల్ఫాల్ఫాను చైనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఆఫ్రికా మరియు ఉత్తర మరియు దక్షిణ అమెరికాలో పండిస్తారు.
  • శక్తిశాస్త్రం: చల్లదనం
  1. అల్ఫాల్ఫా పోషక విలువలు - Alfalfa nutrition facts in Telugu
  2. అల్ఫాల్ఫా ఆరోగ్య ప్రయోజనాలు - Alfalfa health benefits in Telugu
  3. అల్ఫాల్ఫా వినియోగం - Alfalfa use in Telugu
  4. అల్ఫాల్ఫా మోతాదు - Alfalfa dosage in Telugu
  5. అల్ఫాల్ఫా దుష్ప్రభావాలు - Alfalfa side effects in Telugu

అల్ఫాల్ఫా ప్రోటీన్లకు గొప్ప మూలం, ఎండిన అల్ఫాల్ఫా బరువులో (dry weight)  20% ప్రోటీన్లు ఉంటాయి.  ఇది విటమిన్ ఏ, బి మరియు ఇ లతో పాటు అనేక విటమిన్లను కలిగి ఉంటుంది. అదనంగా ఇన్వెర్టేస్ (invertase) మరియు అమైలేజ్ (amylase) వంటి జీర్ణ క్రియకు పనిచేసే ఎంజైమ్లను కూడా కలిగి ఉంటుంది.

యూఎస్ డిఏ (USDA) న్యూట్రిఎంట్ డేటాబేస్ ప్రకారం, 100 గ్రాముల పచ్చి, మొలకలు వచ్చిన అల్ఫాల్ఫా విత్తనాలతో ఈ పోషక విలువలు ఉంటాయి:

పోషకాలు 

100 గ్రాములకు 

శక్తి 

23 కిలోకేలరీలు

ప్రోటీన్ 

3.99 గ్రా

నీరు

93 గ్రా

ఫైబర్

1.9 గ్రా

ఫ్యాట్

0.69 గ్రా

కార్భోహైడ్రేట్

2 గ్రా

మినరల్స్

100 గ్రాములకు

కాల్షియం

32 mg

మెగ్నీషియం

27 mg

ఫాస్ఫరస్

70 mg

ఐరన్

0.96 mg

పొటాషియం

79 mg

విటమిన్లు

100 గ్రాములకు

విటమిన్ ఏ 

8 micro g

విటమిన్ సి 

8.2 micro g

విటమిన్ కె 

30.5 micro g

విటమిన్ ఇ 

0.02 micro g

ఫ్యాట్స్/ఫ్యాటీ యాసిడ్లు

100 గ్రాములకు

సాచురేటెడ్

0. 07 గ్రా 

పోలి అన్సాచురేటెడ్

0. 41 గ్రా 

మోనో అన్సాచురేటెడ్

0. 056 గ్రా 

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

అల్ఫాల్ఫా అధికంగా పశుగ్రాసంగా పిలవబడుతుంది, కానీ దానికి అనేక ఆరోగ్యకరమైన మరియు వైద్య (healing) ప్రయోజనాలు ఉన్నాయి. పాశ్చత్య మూలిక మందులు అల్ఫాల్ఫాను ఒక అద్భుత టానిక్ గా పరిగణిస్తాయి. అలాగే ఇది విస్తృతంగా ఆకలి మరియు మూత్రపిండాల రాళ్లను మెరుగుపరిచే నివారణగా ఉపయోగించబడుతుంది. అల్ఫాల్ఫా యొక్క కొన్ని శాస్త్రీయంగా నిరూపితమైన ఆరోగ్య ప్రయోజనాలను అన్వేషిద్దాం.

  • మధుమేహం కోసం: అల్ఫాల్ఫా ఒక బాగా తెలిసిన హైపోగ్లైసీమిక్ ఏజెంట్, అంటే రక్తంలో చెక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. సాంప్రదాయ మరియు హోమియో ఔషధ విధానాలలో దీనిని మధుమేహ చికిత్స కోసం ఉపయోగిస్తారు.
  • కొలెస్ట్రాల్ కోసం: అల్ఫాల్ఫా సపోనిన్ సారాలు కాలేయం కొలెస్ట్రాల్ జీవక్రియలోని (మెటబాలిజం) జన్యుల వ్యక్తీకరణలో జోక్యం చేసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయని ప్రీ-క్లినికల్ అధ్యయనాలు సూచించాయి.
  • మెనోపాజ్ కోసం: అల్ఫాల్ఫా పారంపర్యంగా మెనోపాజ్ లక్షణాలను తగ్గించడానికి ఉపయోగించబడుతుంది. అల్ఫాల్ఫా  ఈస్ట్రోజెన్ వంటి ప్రభావాన్ని కలిగి ఉంటుందని అధ్యయనాలు సూచించాయి.
  • జీర్ణక్రియకు: అల్ఫాల్ఫా జీర్ణ ఎంజైమ్లకు మంచి మూలం. వాస్తవానికి ఆయుర్వేద మరియు సాంప్రదాయ చైనీస్ ఔషధ విధానాలలో దీనిని ఒక జీర్ణ టానిక్ గా ఉపయోగిస్తారు. ఇది ఆకలిని కూడా పెంచుతుంది.
  • మూత్రపిండాలకు: అల్ఫాల్ఫా కషాయాన్ని మూత్రపిండాలలో రాళ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. అల్ఫాల్ఫాలో పొటాషియం అధిక మొత్తంలో ఉంటుంది, అయితే అధిక పొటాషియం కూడా మూత్రపిండాలకు మంచిది కాదు.
  • యాంటీమైక్రోబియల్గా: అల్ఫాల్ఫా ఒక శక్తివంతమైన యాంటీబాక్టీరియాల్ ఏజెంట్ అని పలు పరిశోధనలు సూచించాయి. ఇవి విస్తృత శ్రేణి అంటే గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగటివ్ రెండు రకాల బాక్టీరియాల పై వ్యతిరేక ప్రభావాలు చూపగలదు.
  • అవాంఛిత రోమాలకు: కొంత మంది మహిళలో అవాంఛిత రోమాలు ఒక పెద్ద సమస్యగా ఏర్పడతాయి. అల్ఫాల్ఫా సారాలు ఈ అవాంఛిత రోమాలను మరియు హార్సుటిజం లక్షణాలను తగ్గిస్తాయని ఒక అధ్యయనం తెలిపింది.
  • ఎముకల ఆరోగ్యం కోసం: అల్ఫాల్ఫా విటమిన్ కె కు అద్భుతమైన వనరు, విటమిన్ కె శరీరం కాల్షియంను సమర్థవంతంగా వినియోగించుకునేలా చేస్తుంది తద్వారా ఎముకల ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ఇది ఆస్టియోపోరోసిస్ చికిత్సకు కూడా ఉపయోగపడుతుంది.

జీర్ణక్రియను మెరుగుపరచడానికి అల్ఫాల్ఫా - Alfalfa for improving digestion in Telugu

జీర్ణ ఎంజైమ్‌లకు మంచి మూలం కావడం వల్ల, జీర్ణ ప్రక్రియకు అల్ఫాల్ఫా సహాయపడుతుంది. వాస్తవానికి, ఆయుర్వేద ఔషధ విధానంలో ఇది ఒక అద్భుతమైన జీర్ణ సహాయకరిగా పరిగణించబడుతుంది మరియు సాంప్రదాయ చైనీస్ ఔషధంలో అల్ఫాల్ఫా ఆకలి పెంపొందించే లక్షణాల కోసం ఉపయోగిస్తారు. అల్ఫాల్ఫా టీని జీర్ణ టానిక్‌గా (digestive tonic) విస్తృతంగా ఉపయోగిస్తారు.

అదనంగా, దీనిలో గణనీయమైన మొత్తంలో ఫైబర్ను ఉంటుంది, ఫైబర్ మలబద్దకం నుండి ఉపశమనం పొందటానికి మరియు ప్రేగులలో మైక్రోఫ్లోరాను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. అందువల్ల ఆహారం యొక్క సరైన జీర్ణక్రియకు సహాయపడుతుంది.

దురదృష్టవశాత్తు, ఈ సాంప్రదాయ ఉపయోగాలకు మద్దతు ఇవ్వడానికి శాస్త్రీయ పరిశోధనలు అందుబాటులో లేవు.

(మరింత చదవండి: జీర్ణక్రియను ఎలా మెరుగుపరచాలి)

క్యాన్సర్ కోసం అల్ఫాల్ఫా - Alfalfa for cancer in Telugu

కణితి (ట్యూమర్)  అనేది శరీర కణాల యొక్క అసాధారణ పెరుగుదల, ఇది ప్రాణాంతకం అయినప్పుడు క్యాన్సర్ అని పిలుస్తారు. ప్రపంచ నలుమూలల వందలాది మంది ఈ భయంకరమైన వ్యాధి బారిన పడుతున్నారు. అల్ఫాల్ఫాను వారి ఆహారంలో చేర్చడం ద్వారా క్యాన్సర్ ప్రమాదాన్ని కొద్దిగా నివారించవచ్చు.

అల్ఫాల్ఫా ఆకుల సారాలు క్యాన్సర్ నివారణ సామర్థ్యాన్ని కలిగి ఉండవచ్చని మరియు కీమోథెరపీ లక్షణాల నుండి ఉపశమనం కలిగించడంలో ఇవి సమర్థవంతంగా పనిచేశాయని ఒక అధ్యయనంలో గమనించబడింది. మరొక అధ్యయనం అల్ఫాల్ఫా విత్తనాలలో అమైనో ఆమ్లాలు ఉన్నాయని, ఇవి కణితి కణాల పెరుగుదలను నివారించడంలో సహాయపడతాయని తెలిపింది.

ఒక జంతు ఆధారిత అధ్యయనం రొమ్ము క్యాన్సర్‌ను అల్ఫాల్ఫా వినియోగంతో కొంతవరకు తగ్గించవచ్చని అల్ఫాల్ఫాలో ఉండే ఎస్ట్రాడియోల్ స్థాయి దానికి కారణమని తెలిపింది. అయితే, ఇది నిశ్చయాత్మకమైనది కాదు మరియు మానవులపై మరిన్ని పరీక్షలు చేపట్టాల్సిన అవసరం ఉంది.

బార్లీ ఆకులు మరియు అల్ఫాల్ఫా యొక్క రసం వాటితో పాటు ఆహారంలో అధికంగా పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడం వలన వాటికీ క్యాన్సర్ నివారించే సామర్ధ్యం కలిగి ఉన్నట్లు కనుగొనబడింది.

ఎముక ఆరోగ్యానికి అల్ఫాల్ఫా - Alfalfa for bone health in Telugu

విటమిన్ కె ఎముక ఆరోగ్యానికి అవసరమైన చాలా ముఖ్య పోషకం. ఇది ఎముకలను నిర్మించడంలో మరియు అలాగే ఆస్టియోపోరోసిస్ ను నివారించడంలో సహాయపడుతుంది మరియు దాని చికిత్సను కూడా సులభతరం చేస్తుంది. అల్ఫాల్ఫా నిస్సందేహంగా ఒక అద్భుత మొక్క, ఎందుకంటే ఇది విటమిన్ కె తో సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ కె శరీరంలోని కాల్షియంను సమర్థవంతంగా ఉపయోగించి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

మెనోపాజ్ లో ఉన్న 24 మంది మహిళలు మరియు మెనోపాజ్ జరిగి చాలా సంవత్సరాలు ఐన 71 మంది మహిళలపై ఒక అధ్యయనం నిర్వహించడం జరిగింది. అల్ఫాల్ఫా నుండి లభించే విటమిన్ కె రుతుక్రమం ఆగిపోయిన మహిళలలో ఎముక నష్టాన్ని నివారించడంలో సహాయపడుతుందని అధ్యయనం సూచించింది.

మహిళల్లో అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించడానికి అల్ఫాల్ఫా - Alfalfa for reducing excess hair growth in women in Telugu

మహిళలు సాధారణంగా వారి శరీరం మీద అవాంఛిత జుట్టు/రోమాల పెరుగుదలను ఇష్టపడరు. ఈ  అవాంఛిత రోమాలను తొలగించడానికి వివిధ విధానాలను అనుసరిస్తారు. కానీ అవాంఛిత రోమాల తొలగింపు విధానాలు చాలా ఇబ్బందికరంగా ఉంటాయి మరియు చాలా ఖర్చుతో కూడినవి. అయితే, దానికోసం సహజమైన చికిత్స ఉన్నప్పుడు అనవసరంగా ఎందుకు ఖర్చు చేయాలి?

హార్మోన్ల అసమతుల్యత, నేపథ్యం, ​​వంశపారంపర్య కారకం మొదలైన వాటి వల్ల అధిక రోమాలపెరుగుదల సంభవిస్తుంది. అల్ఫాల్ఫా సారం అవాంఛిత రోమాల పెరుగుదలను తగ్గించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని మరియు హిర్సుటిజంకు చికిత్స చేయగలదని ఒక అధ్యయనంలో పేర్కొన్నారు. హిర్సుటిజం అనేది ఒక సమస్య దీనిలో స్త్రీకి, మగవారిలాగే జుట్టు పెరుగుదల ఏర్పడుతుంది.

18 నుండి 24 సంవత్సరాల మధ్య వయస్సు గల వ్యక్తులపై చేసిన ఒక క్లినికల్ అధ్యయనం అల్ఫాల్ఫా సారం అవాంఛిత జుట్టు పెరుగుదలను తగ్గించడంలో సహాయపడిందని సూచించింది. ఇందులో అధిక ఈస్ట్రోజెనిక్ సమ్మేళనాలు ఉండడం దీనికి కారణం కావచ్చు.

యాంటీమైక్రోబియల్‌గా అల్ఫాల్ఫా - Alfalfa as antimicrobial in Telugu

అనేక అధ్యయనాలు అల్ఫాల్ఫా యొక్క యాంటీ బాక్టీరియల్ సామర్థ్యాన్ని సూచిస్తున్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కరెంట్ రీసెర్చ్ అండ్ అకాడెమిక్ రివ్యూలో ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం, అల్ఫాల్ఫా సారం విస్తృత శ్రేణి బ్యాక్టీరియాల పై శక్తివంతమైన యాంటీమైక్రోబయాల్ చర్యను (గ్రామ్ పాజిటివ్ మరియు గ్రామ్ నెగటివ్ రెండూ) కలిగి ఉందని తెలుస్తుంది. ఏదేమైనా, ఒక అధ్యయనం అల్ఫాల్ఫా గ్రామ్-నెగటివ్ బ్యాక్టీరియాతో పోలిస్తే గ్రామ్-పాజిటివ్ బ్యాక్టీరియా పెరుగుదలను అధికంగా నిరోధించగలదని సూచించింది.

స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా (Streptococcus pneumoniae) మరియు హేమోఫిలస్ ఇన్ఫ్లుఎంజా (Haemophilus influenzae) పెరుగుదలపై అల్ఫాల్ఫా సారం బలమైన నిరోధక చర్యను కలిగి ఉందని ఇటీవలి ఒక ప్రయోగశాల ఆధారిత అధ్యయనం కనుగొంది, ఈ రెండూ సైనసైటిస్‌కు కారణమవుతాయి.

యాంటీఆక్సిడెంట్‌గా అల్ఫాల్ఫా - Alfalfa as an antioxidant in Telugu

ఫ్రీ రాడికల్స్ అంటే మన శరీరం యొక్క సాధారణ జీవక్రియ ద్వారా ఉత్పత్తి చేయబడిన సింగిల్ట్ ఆక్సిజన్ (ఏక ఆక్సిజన్) అణువులు. అయితే, శరీరంలో ఈ అణువులు అధికంగా పేరుకుపోవడం వల్ల మధుమేహం మరియు కొరోనరీ ఆర్టరీ డిసీజ్ వంటి దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. యాంటీఆక్సిడెంట్లు ఈ రియాక్టివ్ ఆక్సిజన్ జాతులకు వ్యతిరేకంగా ఉత్తమ రక్షణ చర్యలను కలిగి ఉంటాయి మరియు అల్ఫాల్ఫా సహజ యాంటీఆక్సిడెంట్ల యొక్క అద్భుతమైన వనరుగా పిలువబడుతుంది.

జంతు-ఆధారిత అధ్యయనాలు అల్ఫాల్ఫా ఒక సమర్థవంతమైన యాంటీఆక్సిడెంట్ అని మరియు ఆక్సీకరణ ఒత్తిడి వలన ఏర్పడే కాలేయ నష్టాన్ని తగ్గిస్తుందని సూచిస్తున్నాయి. అయితే, అల్ఫాల్ఫా విత్తనాలు మొలకలుగా పెరగడం వలన వాటికి గల యాంటీఆక్సిడెంట్ సామర్థ్యం తగ్గుతుందని ఒక అధ్యయనం తెలిపింది.

(మరింత చదవండి: యాంటీఆక్సిడెంట్ అధికంగా ఉండే ఆహారాలు)

ఆర్థరైటిస్ కోసం అల్ఫాల్ఫా - Alfalfa for arthritis in Telugu

ఆర్థరైటిస్ అంటే ఎర్రబడిన మరియు వాచిన కీళ్ళను సూచిస్తుంది. ఇది సాధారణంగా శరీరంలో ఇన్ఫలమేటరీ సమ్మేళనాల పెరుగుదల వల్ల వస్తుంది. అల్ఫాల్ఫా యొక్క మిథనాల్ సారం ఇన్ఫలమేటరీ సైటోకిన్‌ల ఉత్పత్తికి కారణమయ్యే జన్యువులను తగ్గించడం ద్వారా ఆర్థరైటిస్‌ను నివారించవచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.ఇన్ వివో (జంతు-ఆధారిత) అధ్యయనాలు కూడా అల్ఫాల్ఫా యొక్క ఇథైల్ అసిటేట్ సారాలు వాపు తగ్గుదల చర్యలను తెలిపాయి.

జర్నల్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ ఫుడ్ కెమిస్ట్రీలో ఇటీవల ప్రచురించిన ఒక అధ్యయనంలో రామ్నోగలాక్టురోనన్ I (rhamnogalacturonan I) అని పిలువబడే ఒక రకమైన పెక్టిన్ అల్ఫాల్ఫా యొక్క వాపు నిరోధక లక్షణాలకు కారణమని తెలిపారు.

మూత్రపిండాలకు అల్ఫాల్ఫా ప్రయోజనాలు - Alfalfa benefits for kidneys in Telugu

సాంప్రదాయకంగా, అల్ఫాల్ఫా కషాయాలను మూత్రపిండాల రాళ్ల చికిత్సకు ఉపయోగిస్తారు. అయినప్పటికీ, పరిశోధన ఆధారాలు చాలా విరుద్ధముగా ఉన్నాయి. ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చ్‌ ఇన్ ఆయుర్వేద అండ్ ఫార్మసీలోని ప్రచురించిన సమీక్షా వ్యాసం మూత్రపిండాల పనితీరును మెరుగుపర్చడానికి అల్ఫాల్ఫా ఉత్తమమైన మూలిక  అని సూచిస్తుంది. అయితే, నేషనల్ కిడ్నీ ఫౌండేషన్, హవాయి ప్రకారం, అల్ఫాల్ఫా మూత్రపిండ రోగులకు హానికరం అని తెలుస్తుంది. అల్ఫాల్ఫాలో పొటాషియం పుష్కలంగా ఉండడం దీనికి కారణం కావచ్చు మరియు పొటాషియం అధికంగా ఉండటం వల్ల దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి వస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

కాబట్టి, ఏవైనా అలాంటి సమస్యతో బాధపడుతుంటే, వారి ఆహారంలో అల్ఫాల్ఫాను చేర్చే ముందు వైద్యుడిని ఒకసారి సంప్రదించడం మంచిది.

బరువు పెరగడానికి అల్ఫాల్ఫా - Alfalfa for weight gain in Telugu

మీరు కొద్దిగా అదనపు బరువు పొందాలని అనుకుంటుంటే, అల్ఫాల్ఫా మీకు సరైన ఎంపిక కావచ్చు. ఈ ఆరోగ్య సప్లిమెంట్ పోషకరమైనది మాత్రమే కాదు, దీనిలో కొవ్వు తక్కువగా ఉంటుంది మరియు మంచి ఫైబర్ కంటెంట్ను కలిగి ఉంటుంది. ఇది కణజాలాలలో కొవ్వు నిల్వలను పెంచకుండా ఆరోగ్యకరమైన బరువు పెరగడానికి సహాయపడుతుంది.

ఇన్ వివో (జంతు-ఆధారిత) అధ్యయనంలో, 300 mg / kg అల్ఫాల్ఫా ఫ్లేవనాయిడ్లు ఎటువంటి దుష్ప్రభావాలు కలిగించకుండా శరీర బరువును పెంచడంలో సహాయపడతాయని కనుగొనబడింది.

అలాగే, అల్ఫాల్ఫా ఆకలిని మెరుగుపరుస్తుంది మరియు జీర్ణక్రియలో సహాయపడుతుంది, దాని యొక్క ఆరోగ్యన్ని పెంపొందించే సమ్మేళనాలన్నింటిని  శరీరం గ్రహించే చేస్తుంది. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (హెచ్‌డిఎల్) లేదా మంచి కొలెస్ట్రాల్‌ను పెంచేందుకు మరియు రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించేందుకు అల్ఫాల్ఫా లక్షణాలు అన్ని ఉపయోగపడతాయి. బరువు పెరగడం కోసం ఇంతకన్నా మంచి సప్లిమెంట్‌ వేరేది ఏమి ఉంటుంది?

(మరింత చదవండి: బరువు పెరగడానికి డైట్ చార్ట్)

మెనోపాజ్ లో అల్ఫాల్ఫా ప్రయోజనాలు - Alfalfa benefits in menopause in Telugu

రుతువిరతి (మెనోపాజ్) అనేది స్త్రీ జీవితంలో ఒక ముఖ్యమైన అంశం, ఇది పునరుత్పత్తి దశల ముగింపును సూచిస్తుంది. మెనోపాజ్ సాధారణంగా ఈస్ట్రోజెన్ స్థాయిలలో తగ్గుదలను కలిగి ఉంటుంది, ఇది శరీరం నుండి వేడి ఆవిర్లు, రాత్రి సమయంలో చెమటలు, వికారం మరియు ఆందోళన వంటి లక్షణాలకు దారితీస్తుంది. అల్ఫాల్ఫాను సాంప్రదాయకంగా రుతువిరతి లక్షణాల నుండి ఉపశమనం పొందడం కోసం ఉపయోగిస్తారు. అల్ఫాల్ఫా శరీరంపై ఈస్ట్రోజెన్ లాంటి ప్రభావాన్ని కలిగిస్తుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఒక మూలిక కావడంతో, రుతుక్రమం ఆగిపోయిన మహిళలు దీనిని సహజ ఈస్ట్రోజెన్ సప్లిమెంట్‌గా ఉపయోగించవచ్చు.

క్లినికల్ అధ్యయనంలో, అల్ఫాల్ఫా ఆకులను, సేజ్ మొక్క ఆకులతో పాటు ఇచ్చినప్పుడు రాత్రి సమయ చెమటలు మరియు వేడి ఆవిర్లను తగ్గిస్తుందని తెలిసింది.

అధిక కొలెస్ట్రాల్ కోసం అల్ఫాల్ఫా - Alfalfa for high cholesterol in Telugu

అధిక కొలెస్ట్రాల్ అంటే శరీరంలో అసాధారణ అధిక స్థాయిలో కొవ్వు ఆమ్లాలు (ఫ్యాటీ యాసిడ్లు) ఉండడాన్ని సూచిస్తుంది. హైపర్లిపిడెమియా, అధిక రక్తపోటు, అథెరోస్క్లెరోసిస్ మరియు గుండె జబ్బులతో సహా అనేక సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. అల్ఫాల్ఫా మొక్క యొక్క హైపోకోలెస్టెరోలెమిక్ (కొలెస్ట్రాల్ తగ్గించే) ప్రయోజనాలపై విస్తృతమైన పరిశోధనలు జరిగాయి. కాలేయంలోని కొన్ని కొలెస్ట్రాల్ జీవక్రియ జన్యువుల వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్) లో జోక్యం చేసుకోవడం ద్వారా మరియు శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను బయటకు తొలగించడం ద్వారా అల్ఫాల్ఫా సపోనిన్ సారం కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించగలదని ప్రీక్లినికల్ అధ్యయనాలు తెలిపాయి.

ఒక క్లినికల్ అధ్యయనంలో, హైపర్లిపిడెమియాతో బాధపడుతున్న 15 మందికి ఎనిమిది వారాల పాటు రోజుకు మూడుసార్లు 40 గ్రా అల్ఫాల్ఫా విత్తనాలను ఇచ్చారు. కొలెస్ట్రాల్ స్థాయిని నిర్వహించడానికి అల్ఫాల్ఫాను ఉపయోగించవచ్చని ఈ  అధ్యయనం తేల్చింది.

(మరింత చదవండి: అధిక కొలెస్ట్రాల్ చికిత్స)

మధుమేహం కోసం అల్ఫాల్ఫా - Alfalfa for diabetes in Telugu

మధుమేహం అనేది శరీరంలోని చక్కెర జీవక్రియ పనిచేయకపోవడం వలన రక్తంలో అసాధారణంగా అధిక స్థాయిలలో గ్లూకోజ్ పేరుకుపోయే ఒక ఎండోక్రైన్ రుగ్మత. అల్ఫాల్ఫా సాంప్రదాయ వైద్యంలో ఒక ప్రసిద్ధ హైపోగ్లైసీమిక్ (రక్తంలో చక్కెరను తగ్గిస్తుంది) మందు మరియు హోమియోపతిక్ ఔషధాలలో మధుమేహ చికిత్స కోసం అల్ఫాల్ఫా టానిక్‌ను ఉపయోగిస్తారు. జునిపెర్ బెర్రీ మరియు యూకలిప్టస్‌తో పోల్చడం ద్వారా ప్రిక్లినికల్ అధ్యయనాలు సాంప్రదాయ వాదనలను నిర్ధారించాయి.

రెండు వేర్వేరు జంతు-ఆధారిత అధ్యయనాలలో, 250-500 మి.లీ అల్ఫాల్ఫా సారాన్ని క్రమంగా ఇవ్వడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో మరియు ఇన్సులిన్ పనితీరును మెరుగుపరచడంలో ప్రభావవంతంగా ఉన్నట్లు కనుగొనబడింది.

అయినప్పటికీ, మానవులలో దాని యాంటీ-డయాబెటిక్ ప్రభావాలను నిరూపించడానికి క్లినికల్ అధ్యయనాలు ఏవి లేవు.

  1. అల్ఫాల్ఫా మొలకలను క్రమంగా  తీసుకోవడం అనేది అల్ఫాల్ఫాను మీ ఆహారంలో చేర్చడానికి ఒక మంచి మార్గం. అల్ఫాల్ఫా విత్తనాలను కొని మరియు మొలకలు రప్పించడానికి ఒక రాత్రంతా వాటిని నానబెట్టవచ్చు.
  2. అల్ఫాల్ఫా ఆకుల నుండి కషాయం మరియు టీ ని కూడా తయారు చేయవచ్చు. ఇంకా, దీనిని సలాడ్లు, సూప్‌లు, స్మూతీలు మరియు శాండ్‌విచ్‌లతో కూడా కలిపి తీసుకోవచ్చు.
  3. వాణిజ్యపరంగా అల్ఫాల్ఫా మార్కెట్లలో అల్ఫాల్ఫా టాబ్లెట్లు, క్యాప్సూల్స్ మరియు టానిక్ రూపంలో కూడా లభిస్తుంది.

మూలిక కావడంతో, అల్ఫాల్ఫాకు నిర్దిష్ట మోతాదు ఏది లేదు. వ్యక్తిగత లక్షణాలు మరియు శారీరక కారకాలపై ఆధారపడి ఉంటుంది మోతాదు నిర్దేశించడం జరుగుతుంది. కాబట్టి, మీ ఆహారంలో అల్ఫాల్ఫా సప్లిమెంట్లను చేర్చే ముందు ఒకసారి వైద్యుడిని సంప్రదించడం మంచిది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

అల్ఫాల్ఫా యొక్క సంభావ్య దుష్ప్రభావాలు ఈ క్రింద వివరించబడ్డాయి.

  • అల్ఫాల్ఫా ఒక నిరూపితమైన హైపోగ్లైసీమిక్ ఏజెంట్. కాబట్టి, సహజంగా రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు లేదా మందుల వాడుతున్న మధుమేహ వ్యక్తి అయితే, అల్ఫాల్ఫా తీసుకునే ముందు వైద్యుడిని కనుకోవడం మంచిది.
  • ఒక కేస్ లో, ప్యాక్ చేసిన అల్ఫాల్ఫా మొలకలు సాల్మొనెల్లాతో కలుషితమైనట్లు కనుగొనబడింది. వాణిజ్యపరంగా ప్యాక్ చేసిన అల్ఫాల్ఫా మొలకలను కొనుగోలు చేసేటప్పుడు, లేబుల్‌ను సరిగ్గా తనిఖీ చేయాలి మరియు ఎల్లప్పుడూ మంచి నాణ్యమైన ఉత్పత్తులను కొనుగోలు చేయాలి.
  • అల్ఫాల్ఫా పొటాషియంలో సమృద్ధిగా ఉన్నందున, పొటాషియంలోని అసమతుల్యత మంచి కంటే హాని ఎక్కువ కలిగించవచ్చు కాబట్టి అల్ఫాల్ఫాను మితంగా తీసుకోవాలి.
  • అల్ఫాల్ఫా వినియోగం వలన ఋతుస్రావం పెరుగుతుంది మరియు గర్భస్రావ ప్రమాదాన్ని కలిగించవచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు ఈ మూలికను నివారించాలని గట్టిగా సిఫార్సు చేయబడుతుంది.
  • అల్ఫాల్ఫా విటమిన్ కె కు మంచి మూలం, విటమిన్ కెను యాంటీకోయాగ్యులెంట్ అని పిలుస్తారు. మీరు రక్తతాన్ని పల్చబర్చే మందులను తీసుకుంటుంటే, మీ ఆహారంలో అల్ఫాల్ఫాను చేర్చడం మంచిది కాదు. అదే కారణం వలన, దీనిని శస్త్రచికిత్సకు ముందు లేదా తరువాత కూడా తీసుకోకూడదు.
  • అల్ఫాల్ఫా రోగనిరోధక శక్తిని ఉత్తేజపరుస్తుంది. కాబట్టి ఆటో ఇమ్యూన్ డిజార్డర్‌తో బాధపడుతున్న వారు, దానిని నివారించడం మంచిది.
  • ఏదైనా ఈస్ట్రోజెన్ సప్లిమెంట్ లేదా ఇతర మందులను వాడుతున్నట్లయితే, ఆహారంలో అల్ఫాల్ఫాను చేర్చే ముందు వైద్యుడిని సంప్రదించాలని సిఫార్సు చేయబడుతుంది.

Medicines / Products that contain Alfalfa

వనరులు

  1. Rachel A. Surls. Alfalfa-"Green Gold" in LA County's High Desert. Agriculture and Natural Resources, University of California.
  2. American society of Agronomy. The historical diffusion of alfalfa. [Internet]
  3. United States Department of Agriculture Agricultural Research Service. Basic Report: 11001, Alfalfa seeds, sprouted, raw. National Nutrient Database for Standard Reference Legacy Release [Internet]
  4. Swanston-Flatt SK, Day C, Bailey CJ, Flatt PR. Traditional plant treatments for diabetes. Studies in normal and streptozotocin diabetic mice. Diabetologia. 1990 Aug;33(8):462-4.
  5. Esmaiel Amraie et al. The effects of aqueous extract of alfalfa on blood glucose and lipids in alloxan-induced diabetic rats Interv Med Appl Sci. 2015 Sep; 7(3): 124–128. PMID: 26525173
  6. Masomeh Khosravi Farsani et al. Effects of aqueous extract of alfalfa on hyperglycemia and dyslipidemia in alloxan-induced diabetic Wistar rats . Interv Med Appl Sci. 2016 Sep; 8(3): 103–108. PMID: 28203391
  7. Mölgaard J, von Schenck H, Olsson AG. Alfalfa seeds lower low density lipoprotein cholesterol and apolipoprotein B concentrations in patients with type II hyperlipoproteinemia. Atherosclerosis. 1987 May;65(1-2):173-9. PMID: 3606731
  8. Mahmoud Bahmani et al. Identification of medicinal plants for the treatment of kidney and urinary stones . J Renal Inj Prev. 2016; 5(3): 129–133. PMID: 27689108
  9. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Eating Right for Chronic Kidney Disease.
  10. Choi KC et al. Chloroform extract of alfalfa (Medicago sativa) inhibits lipopolysaccharide-induced inflammation by downregulating ERK/NF-κB signaling and cytokine production. J Med Food. 2013 May;16(5):410-20. PMID: 23631491
  11. Yong-Han Hong et al. Ethyl acetate extracts of alfalfa (Medicago sativa L.) sprouts inhibit lipopolysaccharide-induced inflammation in vitro and in vivo . J Biomed Sci. 2009; 16(1): 64. PMID: 19594948
  12. Chen L et al. Structural, thermal, and anti-inflammatory properties of a novel pectic polysaccharide from alfalfa (Medicago sativa L.) stem. J Agric Food Chem. 2015 Apr 1;63(12):3219-28. PMID: 25756601
  13. Al-Dosari MS. In vitro and in vivo antioxidant activity of alfalfa (Medicago sativa L.) on carbon tetrachloride intoxicated rats. Am J Chin Med. 2012;40(4):779-93. PMID: 22809031
  14. Fan X, Thayer DW, Sokorai KJ. Changes in growth and antioxidant status of alfalfa sprouts during sprouting as affected by gamma irradiation of seeds. J Food Prot. 2004 Mar;67(3):561-6. PMID: 15035374
  15. Weber P . Vitamin K and bone health. Nutrition. 2001 Oct;17(10):880-7. PMID: 11684396
  16. Adams J, Pepping J. Vitamin K in the treatment and prevention of osteoporosis and arterial calcification. Am J Health Syst Pharm. 2005 Aug 1;62(15):1574-81. PMID: 16030366
  17. Gatouillat G et al. Cytotoxicity and apoptosis induced by alfalfa (Medicago sativa) leaf extracts in sensitive and multidrug-resistant tumor cells. Nutr Cancer. 2014;66(3):483-91. PMID: 24628411
  18. Michael S Donaldson. Nutrition and cancer: A review of the evidence for an anti-cancer diet . Nutr J. 2004; 3: 19. PMID: 15496224
  19. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Alfalfa
Read on app