విల్మ్స్ ట్యూమర్ - Wilms Tumor in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

April 24, 2019

July 31, 2020

విల్మ్స్ ట్యూమర్
విల్మ్స్ ట్యూమర్

విల్మ్స్ ట్యూమర్ (మూత్రపిండాల్లో కంతి) అంటే ఏమిటి?

విల్మ్స్ కంతి (మూత్రపిండాల్లో కంతి) అనేది మూత్రపిండాలకు సంబంధించిన పిండంవంటి రుగ్మత లేదా మూత్రపిండాల క్యాన్సర్ రకం రుగ్మత. పిల్లలలో ఇది ఓ ఘనమైన మరియు ప్రాణాంతక కంతి రుగ్మత (క్యాన్సర్ గడ్డ) మరియు ఇది పిల్లల్లో వచ్చే అత్యంత సాధారణ కంతిరకం రుగ్మత. ఈ రుగ్మత మొట్ట మొదటిగా డాక్టర్ మాక్స్ విల్మ్స్ అనే శస్త్రవైద్యునిచే వేరొక పేరుతో వర్ణించబడింది మరియు ప్రారంభంలో ‘పుట్టుకతో వచ్చే మూత్రపిండం యొక్క సార్కోమా’గా (నెత్తురుగడ్డవ్యాధి) పిలువబడింది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పిల్లల వయస్సు 10 సంవత్సరాలు నిండక ముందే మూత్రపిండ కణితి వ్యాధిని దాదాపు ఎల్లప్పుడూ కనుగొనబడింది. విల్మ్స్ కణితి యొక్క సాధారణ లక్షణాలు:

  • పొత్తికడుపులో స్పష్టంగా గోచరించే గడ్డ
  • పొత్తి కడుపు నొప్పి
  • ఆకలి లేకపోవడం
  • వికారం
  • వాంతులు
  • హేమతురియా (మూత్రంలో రక్తం పడుతూ ఉండటం)
  • హెపాటోమెగలీ (పెరిగిన కాలేయం)
  • అసిట్స్ (ఉదరం లో ద్రవం చేరడం)
  • రక్త ప్రసారం స్తంభించి గుండె ఆగిపోవడం
  • రక్తపోటు పెరగడం 
  • డైస్మోర్ఫిజం (అసాధారణ శరీర నిర్మాణం)
  • అనారోగ్యంగా పాలిపోయినట్లు కనబడే పల్లోర్ (pallor) రుగ్మత   

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

విల్మ్స్ కణితి అనేది ఓ అరుదైన వ్యాధి మరియు ఇందులో జన్యు కారకాలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యమైన జన్యుశాస్త్రం మరియు పరమాణు అధ్యయనాలు విల్మ్స్ కణితి యొక్క వ్యాధిజనన వికాసాల్ని అర్థం చేసుకోవడానికి దోహదపడ్డాయి. క్రోమోజోమ్ 11 లో మార్పులు విల్మ్స్ ట్యూమర్తో సంబంధం కలిగి ఉన్నాయి.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

విల్మ్స్ కణితి నిర్ధారణ కింది చర్యల ద్వారా చేయబడుతుంది:

  • ఎగువ ఉదర వాపు ఉనికి
  • వ్యాధి చరిత్ర మరియు కుటుంబ చరిత్ర
  • ఉదరం మరియు పొత్తికడుపు యొక్క అల్ట్రాసోనోగ్రఫీ
  • శిశువుల్లో హైపోగ్లైసేమియా (తక్కువ రక్త చక్కెర)
  • కంప్యూటెడ్ టోమోగ్రఫీ (CT) స్కాన్
  • పూర్తి రక్త గణన (CBC)
  • మూత్రపిండ పనితీరు  పరీక్ష
  • మూత్రవిశ్లేషణ
  • కాలేయ పనితీరు పరీక్షలు

విల్మ్స్ ట్యూమర్ (మూత్రపిండాల్లో కంతి)కు చేసే చికిత్సల్లో శస్త్రచికిత్స, కీమోథెరపీ, మరియు రేడియోథెరపీని కలిగి ఉంటుంది. శస్త్రచికిత్స యొక్క పాత్ర చాలా కష్టంగా ఉంటుంది, ఎందుకంటే కణితి పగిలిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి. ఏకపక్ష మూత్రపిండ కణితివ్యాధికి “ట్రాన్స్పెరిటోనియల్ రాడికల్ తొలగింపు,” పేరిట మూత్రపిండము తొలగింపు శస్త్రచికిత్స చేయడం జరుగుతుంది. ఈ శస్త్ర చికిత్సను పొత్తికడుపును తెరిచి మూత్రపిండాన్ని తొలగిస్తారు. ఈ ఏకపక్ష మూత్రపిండ కణితివ్యాధికి ఎక్కువగా ఇష్టపడే శస్త్ర చికిత్స ప్రక్రియ ఇదే. అనేక సందర్భాల్లో ఇలా కత్తిరింపు (excision) ద్వారా చేసే మూత్రపిండాల పాక్షిక తొలగింపు కూడా పరిగణించబడుతుంది. మూత్రపిండ తొలగింపు జరిగిన తర్వాత రోగి కోలుకోవడమనేది (రికవరీ) వేగంగా జరుగుతుంది. ఒక మూత్రపిండంపై ఎక్కువ ఒత్తిడి (ఓవర్లోడ్కు)కి  సంబంధించిన సమస్యలను నివారించడానికి డయాలసిస్ అవసరమవుతుంది.



వనరులు

  1. Elwira Szychot, John Apps, Kathy Pritchard-Jones. Wilms’ tumor: biology, diagnosis and treatment . Transl Pediatr. 2014 Jan; 3(1): 12–24. PMID: 26835318
  2. Hemant B. Tongaonkar et al. Wilms' tumor: An update . Indian J Urol. 2007 Oct-Dec; 23(4): 458–466. PMID: 19718304
  3. National Institutes of Health; [Internet]. U.S. Department of Health & Human Services; Wilms tumor.
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Wilms Tumor and Other Childhood Kidney Tumors Treatment (PDQ®)–Health Professional Version
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Wilms tumor

విల్మ్స్ ట్యూమర్ కొరకు మందులు

Medicines listed below are available for విల్మ్స్ ట్యూమర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.