కోరింత దగ్గు - Whooping Cough (Pertussis) in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

April 24, 2019

July 31, 2020

కోరింత దగ్గు
కోరింత దగ్గు

కోరింత దగ్గు అంటే ఏమిటి?

కోరింత దగ్గు అన్ని వయస్సులవారిని దెబ్బ తీసే ఓ సూక్ష్మజీవికారక అంటువ్యాధి. దీన్నే“పెర్టుస్సిస్” అని కూడా పిలుస్తారు. కోరింతదగ్గు బోర్డెటెల్లా పెర్టుసిస్ అనే సూక్ష్మజీవి వల్ల సంభవిస్తుంది. టీకా మందులు వేయని (unimmunized) శిశువులు వంటి దుర్బల సమూహాల్లో కోరింతదగ్గు చాలా సాధారణం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కోరింత దగ్గు యొక్క లక్షణాలు ఆరు నుండి ఇరవై రోజుల కాల వ్యవధిలో కనబడుతాయి, ఈ కాల వ్యవధినే వ్యాధి పొదుగుదల కాలం అని పిలుస్తారు, అంటే అంటువ్యాధి సోకినప్పటి నుండి వ్యాధి లక్షణాలు కనబడడానికి మధ్యలో ఉన్న కాలవ్యవధి. కోరింతదగ్గు లక్షణాలకు మూడు దశలున్నాయి:

  • కోరింత దగ్గు మొదటి దశ (catarrhal phase) విపరీత పడిశంతో కూడినది, ఈ దశ సుమారు ఒక వారం పాటు కొనసాగుతుంది. కారుతున్న ముక్కు, కళ్ళు నీళ్ళు కారడం, కండ్లకలక, గొంతునొప్పి, తుమ్ములు, మరియు ఒంట్లో కొద్దిగా పెరిగిన ఉష్ణోగ్రత.
  • కోరింతదగ్గు లక్షణాలు హఠాత్తుగా దాడి చేసింతర్వాత (పెరోక్సిస్మాల్ దశ) వ్యాధి లక్షణాలు ఒక వారం పాటు కొనసాగుతాయి మరియు తీవ్రమైన దగ్గుకోవటం వంటి లక్షణాలతో పాటు దగ్గినప్పుడు కఫం పడడం, వాంతులు, తీవ్రమైన వైద్య కేసుల్లో చర్మం నీలంరంగులోకి మారడం.
  • కోరింత దగ్గు నుండి కోలుకునే దశ 3 నెలల వరకు ఉంటుంది మరియు లక్షణాలు వాటి తీవ్రత మరియు పౌనఃపున్యంలో (తరచుదనం లేక ఫ్రీక్వెన్సీ) క్రమంగా తగ్గుతుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

కోరింత దగ్గు అనేది ఓ బాక్టీరియల్ సంక్రమణ వ్యాధి. బోర్డెటెల్లా సూక్ష్మజీవి (Bordetella pertussis) కారణంగా కోరింతదగ్గు సంభవిస్తుంది. బాక్టీరియా ఊపిరితిత్తుల లోకి ప్రవేశిస్తుంది మరియు వాయునాళాల్లో వాపు మరియు మంట, ప్రధానంగా గొంతుపీఁక (శ్వాసనాళము) వాపు, మంటకు గురవుతాయి, తద్వారా వివిధ శ్వాస-సంబంధమైన రుగ్మతలకు  దారితీస్తుంది. కోరింతదగ్గు అత్యంత తీవ్రమైన అంటువ్యాధి మరియు వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది. వ్యాధి సోకిన వ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు లేక నేరుగా మరో ఆరోగ్యవంతుడైన వ్యక్తితో ప్రత్యక్ష సంబంధంలోకి వచ్చినప్పుడు ముక్కు, నోరు లేదా కళ్ళ ద్వారా కోరింత దగ్గు వ్యక్తి నుండి వ్యక్తికి వ్యాపిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కోరింత దగ్గు యొక్క నిర్ధారణలో ఇవి ఉంటాయి:

  • రోగి చరిత్ర తీసుకోవడం
  • క్లినికల్ పరీక్ష
  • పాలిమరెస్ చైన్ రియాక్షన్ (పిసిఆర్) పరీక్ష కోసం నాసికాస్రావ (తేమ) నమూనా సేకరణ.
  • సంస్కృతి పరీక్ష (culture test)
  • పెర్టుసిస్ సెరోలాజికల్ పరీక్షలు

వైద్యుడి యొక్క నిర్ణయం (క్లినికల్ తీర్పు) ఆధారంగా కోరింత దగ్గు యొక్క చికిత్స ప్రారంభ నిర్వహణలో యాంటీబయాటిక్స్ సేవనం ఉంటుంది.

జాతీయ ఇమ్యునైజేషన్ పథకం కింద శిశువులు మరియు పెద్దవారికి కోరింత దగ్గుకుగాను  టీకా నివారణ చర్యలు తీసుకోవడం జరుగుతోంది. పూర్తి మోతాదులో డిఫెట్రియా, టటానాస్, మరియు పెర్టుస్సిస్ టీకా మందులు పిల్లలకు ఇవ్వబడతాయి. ప్రాథమిక టీకా షెడ్యూల్ పూర్తి అయిన పెద్దలకు, ఒక బూస్టర్ (booster) మోతాదును నిర్వహించడం జరుగుతుంది.



వనరులు

  1. National Health Portal [Internet] India; Whooping Cough/Pertussis
  2. Colin S Brown, Emma Guthrie, Gayatri Amirthalingam. Whooping cough: public health management and guidance. The Pharmaceutical Journal, 22 MAY 2017
  3. Paul E. Kilgore et al. Pertussis: Microbiology, Disease, Treatment, and Prevention. Clin Microbiol Rev. 2016 Jul; 29(3): 449–486. PMID: 27029594
  4. Guidelines for vaccination in normal adults in India. Indian J Nephrol. 2016 Apr;26(Suppl 1):S7–S14. PubMed Central PMCID: PMC4928530.
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pertussis (Whooping Cough)
  6. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Whooping cough

కోరింత దగ్గు కొరకు మందులు

Medicines listed below are available for కోరింత దగ్గు. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.