ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్) - Varicose Veins in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

January 14, 2019

March 06, 2020

ఉబ్బునరాలు
ఉబ్బునరాలు

ఉబ్బునరాలు అంటే ఏమిటి?

రక్తం (నరాల్లో) గుమిగూడడంవల్ల నరాలు వాచి పరిమాణంలో విస్తరిస్తాయి, దీన్నే "ఉబ్బునరాలు” గా వ్యవహరిస్తారు. ఉబ్బునరాలు కంటికి స్పష్టంగా గోచరిస్తాయి. చర్మం కింద నరాలు ఉబ్బిఉండడాన్ని, పురితిరిగి ఉండడాన్ని మనం చూడవచ్చు; ఇంకా, ఈ నరాలు ఉండలు చుట్టుకుని, ఉబ్బి, నీలం లేదా ముదురు ఊదా రంగులో చర్మం కింద కనిపిస్తాయి. సాధారణంగా, ఉబ్బిన నరాలు కాళ్ళలో కనిపిస్తాయి, కానీ ఇతర శరీర భాగాలలో కూడా ఉబ్బు నరాలు కనిపిస్తాయి .

దీని సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా మంది రోగులలో ఉబ్బిన నరాలు చాలా కాలంవరకూ ఎలాంటి వ్యాధి లక్షణాల్ని పొడజూపకుండా ఉంటాయి. ఈ రుగ్మత యొక్క సాధారణ లక్షణాలు కిందివిధంగా ఉంటాయి

  • కాళ్ళు నొప్పి
  • కాళ్ళు వాపు
  • కాళ్లు లేదా పిక్కల్లో తిమ్మిరి (లేక ఈడ్పులు, పట్టేయడం)
  • పిక్కలు మరియు తొడల మీద సాలెపురుగువంటి ఆకుపచ్చ సిరలు కనిపిస్తాయి
  • ఉబ్బిన నరాలున్నచోట దురద
  • పొడి చర్మం, పొలుసులుదేలిన మరియు మంటతో కూడిన చర్మం
  • అంత త్వరగా నయం కాని పుండ్లు,

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సిరల యొక్క కవాటాలు మరియు గోడల బలహీనత కారణంగా, సిరలు వాపు, వంకర్లు తిరిగి (వక్రీకృతంగా) మరియు చుట్టబడినవిగా ఏర్పడి నరాల్లో రక్తం గుమిగూడి “ఉబ్బునరాల” రుగ్మతగా రూపుదాలుస్తాయి. సాధారణంగా, కవాటాలు గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా రక్తాన్ని పైకి ఎగదోస్తాయి కాని అవి బలహీనంగా ఉన్నప్పుడు, సిరల్లో రక్తం జమగూడి “ఉబ్బు నరాల” రుగ్మతకు  కారణమవుతాయి.

ప్రమాద కారకాలు

  • దీర్ఘకాలంపాటు నిలబడటం ఉదా. చిత్రకారులు, బస్సు / రైలు కండక్టర్లు, ఉపాధ్యాయులు మొదలైనవి.
  • లింగపరంగా మహిళలవడం
  • గర్భం
  • ఊబకాయం
  • ముసలితనం
  • ఉబ్బునరాల కుటుంబ చరిత్ర
  • పొత్తికడుపులో కణితి, సిరల్లో ఉన్న రక్తం గడ్డకట్టడం వంటి అరుదైన పరిస్థితులు.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

కాళ్లలో ఏవైనా మార్పులను చూసేందుకు డాక్టర్ కాళ్ళలో కిందివాటిని పరిశీలిస్తారు

  • కాళ్ళ చర్మం రంగు
  • నయమైన లేదా నయం కాని కాళ్ళ పుండ్లు
  • చర్మం యొక్క వెచ్చదనం
  • చర్మం ఎరుపుదేలడాన్ని

నరాల్లో రక్త ప్రవాహాన్ని మరియు నరాల్లో రక్తం గడ్డకట్టడాన్ని తనిఖీ చేయడానికి డాప్లర్ అల్ట్రాసౌండ్ సిఫారస్ చేయబడుతుంది. ఆంజియోగ్రామ్ చాలా సాధారణం కాదు, కానీ  రోగ నిర్ధారణను ధ్రువపర్చడానికి ఆంజియోగ్రామ్ ను సూచించవచ్చు.

చికిత్సలో క్రింది చర్యలు ఉంటాయి:

  • కంప్రెషన్ మేజోళ్ళు - ఇది వాపును తగ్గిస్తుంది మరియు కాళ్ళను మెత్తగా ఒత్తుతూ రక్తం గుండె వైపు ఎగువకు ప్రసరించేలా సహాయపడుతుంది, తద్వారా రక్తం గడ్డ కట్టడాన్ని మేజోళ్ళు నివారిస్తాయి.
  • అబ్లేషన్ థెరపీ- ఉబ్బెక్కిన నరాల్లో రక్తం ఉబ్బును నివారించేందుకు రేడియో ధృవీకరణ అబ్లేషన్, లేజర్ అబ్లేషన్.
  • స్క్లెరోథెరపీ- సిరలో రక్తసరఫరాను నిలిపేసేందుకు ఒక ఏజెంట్ ను జొప్పిస్తారు.
  • శస్త్రచికిత్స (ఫ్లెబెక్టమీ) - రక్త సరఫరా చేయడానికి సమాంతర సిరలు ఉన్నపుడు ఉబ్బునరాల రుగ్మతకు గురైన సిరను తొలగించడం.
  • తీవ్రమైన కేసుల్లో బాధిత సిరను ముడి వేయుట మరియు తొలగించడం (stripping).

స్వీయ రక్షణచర్యలు కింది వాటిని కలిగి ఉంటుంది:

  • నిరంతరం ఎక్కువసేపు నిలబడకుండా ఉండండి.
  • కాళ్ళను రోజులో కనీసం 3-4 సార్లు 15 నిమిషాలపాటు పైకెత్తి  ఉంచాలి
  • శరీరం దిగువభాగం అంగాలపై ఒత్తిడిని తగ్గించడానికి బరువు తగ్గడం
  • రక్త ప్రసరణను మెరుగుపరిచేందుకు ఎక్కువ శారీరక శ్రమ చేయండి. నడక (వాకింగ్) లేదా ఈత మంచి వ్యాయామ ఎంపికలు.
  • ఏవైనా పుండ్లు, బహిర్గతమైన గాయాలు ఉంటే వాటిని మాన్పడానికి శ్రద్ధ తీసుకోండి.
  • కాళ్ళను తేమగా ఉంచండి మరియు చర్మం పొడిబారడాన్ని, చర్మం పగలకుండా  నివారించండి.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Varicose veins
  2. National Health Service [Internet]. UK; Varicose veins.
  3. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Varicose Veins
  4. Bruce Campbell. Varicose veins and their management. BMJ. 2006 Aug 5; 333(7562): 287–292. PMID: 16888305
  5. Office of Disease Prevention and Health Promotion. Varicose veins and spider veins. [Internet]

ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్) వైద్యులు

Dr. Farhan Shikoh Dr. Farhan Shikoh Cardiology
11 Years of Experience
Dr. Amit Singh Dr. Amit Singh Cardiology
10 Years of Experience
Dr. Shekar M G Dr. Shekar M G Cardiology
18 Years of Experience
Dr. Janardhana Reddy D Dr. Janardhana Reddy D Cardiology
20 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్) కొరకు మందులు

Medicines listed below are available for ఉబ్బునరాలు (వెరికోస్ వెయిన్స్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.