శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత - Respiratory Distress Syndrome in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 21, 2018

March 06, 2020

శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత
శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత

శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత లేక రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్-RDS అంటే ఏమిటి?

నవజాత శిశువుల (నియోనాటల్) శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత (రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్-RDS) అనేది ప్రధానంగా నెలలు నిండగానే పుట్టే పిల్లలు మరియు నవజాత శిశువులలో కనిపిస్తుంది, ఇందులో శిశువుకు ఊపిరి తీసుకోవడం కష్టమవుతూ ఉంటుంది. ఈ రుగ్మత పెద్దవారిలో (adults) చాలా అరుదు. తీవ్రమైన శ్వాస పీడన సిండ్రోమ్ (ARDS) గా పిలువబడే ఈ రుగ్మత ప్రధానమైన అనారోగ్యం లేదా గాయం సంభవించిన 24 నుంచి 48 గంటల్లోగా ఉద్భవిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత నవజాత శిశువు పుట్టిన తర్వాత కొన్ని నిమిషాల్లోనే పొడజూపవచ్చు  లేదా పుట్టిన కొన్ని గంటల తర్వాత శిశువులలో రోగ లక్షణాలు కనిపిస్తాయి మరియు కింది లక్షణాల్ని కలిగి ఉండవచ్చు:

  • వేగవంతమైన మరియు లేదా నిస్సార శ్వాస.
  • శ్వాస ఆడకపోవుట లేదా అప్నియా యొక్క శ్వాస (శ్వాసలో క్లుప్త నిలుపుదల).
  • శ్వాసలో శబ్దాలు వినిపించడం.
  • అసాధారణ శ్వాస కదలికలు.
  • నాసికాద్వారాల మంట
  • తగ్గిన మూత్ర ఉత్పత్తి.
  • చర్మం మరియు శ్లేష్మ పొరలు నీలం రంగు (సియోనోసిస్)లోకి మారటం (discolouration).

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత (RDS) అనేది పూర్తిగా అభివృద్ధి చెందిన ఊపిరితిత్తులు కల్గిన నవజాత శిశువుల్లో సంభవిస్తుంది మరియు ప్రధానంగా లోపంతో ఉన్న సర్ఫాక్టంట్ (పరిపక్వం చెందిన మరియు అభివృద్ధి చెందిన ఊపిరితిత్తుల్లో ఉండే ఒక జారుడుగుణం కల్గిన పదార్ధం) కారణంగా సంభవిస్తుంది, ఇది ఊపిరితిత్తులు గాలితో నిండి ఉండేట్టు సహాయం చేయడం ద్వారా ఊపిరితిత్తుల్లోంచి గాలి కోల్పోవడాన్నినిరోధిస్తుంది. ఊపిరితిత్తుల అభివృద్ధి సమయంలో జన్యుపరమైన లోపాలు కూడా శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మతకు (RDS) కు దారి తీయవచ్చు. ఇది నెలలు నిండకనే పుట్టే పిల్లలలో చాలా సాధారణమైనది మరియు పూర్తిగా నెలలు నిండాక పుట్టిన -పిల్లలలో కనిపించదు. మెకానియం ఆస్పిరేషన్, అనగా, శిశువు ఇంకా గర్భంలో ఉన్నప్పుడు శిశువు తన విసర్జితా మలాన్ని (poop) తానే అనుకోకుండా తినడం కూడా శ్వాసకోశ ఇబ్బందులకు (RDS)  దారితీస్తుంది.

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వైద్యుడు పూర్తి పరీక్షను నిర్వహించాక, ఇంకా క్రింది పరీక్షలు చేయించమని సలహా ఇస్తారు:

  • అంటురోగాన్ని తోసిపుచ్చేటందుకు రక్త పరీక్షలు.
  • ఛాతీ ఎక్స్-రే, ఊపిరితిత్తుల గ్రౌండ్ గాజు రూపును కనిపెట్టడానికి, సాధారణంగా, పుట్టిన 6 నుండి 12 గంటలు తరువాత కనిపిస్తుంది.
  • రక్తం- వాయువు విశ్లేషణ, శరీర ద్రవాలలో అసాధారణ ఆక్సిజన్ స్థాయిలు మరియు యాసిడ్ స్థాయిలు గుర్తించడానికి.

ఈ సమస్య నుండి లేదా ప్రమాదానికి గురైన నవజాత శిశువుల పట్ల క్లిష్టమైన జాగ్రత్తలు తీసుకోవాలి మరియు ఒక నిపుణుడిచే పర్యవేక్షణ జరిపించాలి. సరైన శరీర ఉష్ణోగ్రత వద్ద శిశువుల్ని ఉంచడం, ప్రశాంతత కల్గిన వాతావరణంలో సున్నితమైన శుశ్రూషాదులు ఏర్పాటు చేయడం చాలా ముఖ్యం. నవజాత శిశువులకు ద్రవాహారాలు మరియు పోషకాహారం బాగా నిర్వహించబడాలి మరియు అంటువ్యాధులు ఏవైనా ఉంటే, చికిత్స చేయాలి. వివిధ నిర్వహణ పద్ధతులు కిందివిధంగా ఉంటాయి:

  • జాగ్రత్త పర్యవేక్షణ మరియు నిరంతర పర్యవేక్షణలో నవజాత శిశువులకు వెచ్చని, తేమతో కూడిన ఆక్సిజన్ను అందించడం.
  • సాధారణంగా శిశువు యొక్క వాయుమార్గం ద్వారా నేరుగా ఇవ్వబడే అదనపు లేదా కృత్రిమ సర్ఫాక్టంట్ (తలతన్యతను తగ్గించు గుణం గల వస్తువు) ఉపరితలాన్ని నిర్వహించడం.
  • వెంటిలేటర్ వాడకాన్ని ఎపుడు సలహా చేయబడుతుందంటే:
    • రక్తంలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి ఎక్కువగా ఉండి, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉన్నపుడు.
    • తక్కువ రక్తం pH (ఆమ్లత్వం).
    • శ్వాసలో తరచుగా అంతరాయాలు ఉన్నప్పుడు.
  • నిరంతర సానుకూల వాయుమార్గ పీడనం (CPAP) అనేది వెంటిలేటర్ లేదా CPAP పరికరం ద్వారా ఇచ్చే చికిత్స యొక్క మరోరకం, దీనిలో గాలిని ముక్కులోకి పంపబడుతుంది, దీనికి సహాయక వెంటిలేషన్ (assisted ventilation) అవసరం లేదు.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Neonatal respiratory distress syndrome.
  2. National Heart, Lung, and Blood Institute [Internet]: U.S. Department of Health and Human Services; Respiratory Distress Syndrome.
  3. American Thoracic Society [Internet]. New York,United States of America; Respiratory Distress Syndrome of the Newborn.
  4. Victorian Agency for Health: Government of Victoria [Internet]; Respiratory distress syndrome (RDS) in neonates.
  5. Manthous CA. A practical approach to adult acute respiratory distress syndrome. Indian J Crit Care Med. 2010 Oct-Dec;14(4):196-201. PMID: 21572751
  6. National Organization for Rare Disorders [Internet]; Acute Respiratory Distress Syndrome.

శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత కొరకు మందులు

Medicines listed below are available for శ్వాసకోశ ఇబ్బందుల రుగ్మత. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.