ఉన్మాదం(సైకోసిస్) - Psychosis in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 21, 2018

March 06, 2020

ఉన్మాదం
ఉన్మాదం

ఉన్మాదం (సైకోసిస్) అంటే ఏమిటి?

ఉన్మాదం అనేది ఒక తీవ్రమైన మానసిక రుగ్మత. ఈ రుగ్మతతో వ్యక్తి  భ్రాంతులు లేదా భ్రమల్ని ఎదుర్కొని బాధపడుతుంటాడు మరియు వాస్తవికతతో బలహీనమైన సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఉన్మాదం అనేది తీవ్రమైన రుగ్మత, దీనికి అత్యవసర వైద్య సహాయం అవసరం, ఎందుకంటే దీనితో బాధపడుతున్న వ్యక్తులు తమను తాము గాయపర్చుకుంటారు లేదా ఇతరులను కూడా గాయపరచవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఉన్మాదం అనేక నిశ్చయాత్మక సంకేతాలు మరియు లక్షణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని:

  • నిద్ర లేకపోవడం లేదా సాధారణంగా కంటే ఎక్కువగా నిద్రపోవటం (ఆటంకం చెందిన నిద్ర).
  • కుంగుబాటు (డిప్రెషన్).
  • ఆందోళన.
  • భ్రమలు (హాలూసినేషన్స్).
  • భ్రాంతులు (డెల్యూషన్స్).
  • మనసు కేంద్రీకరించడంలో కష్టం.
  • కుటుంబం మరియు స్నేహితుల నుండి వ్యక్తి దూరమవడం.
  • ఆత్మహత్య ఆలోచనలు లేదా చర్యలు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మానసిక జబ్బు ఉన్న కుటుంబ చరిత్ర కలిగిన వ్యక్తిలో ఉన్మాదంఎక్కువగా సంభవిస్తుంది. కొన్ని క్రోమోజోమ్ రుగ్మతలు కూడా ఉన్మాద స్థితికి (సైకోసిస్కు) దారితీయవచ్చు. ఇతర కారణాలు:

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఎలాంటి మానసిక రుగ్మత యొక్క రోగ నిర్ధారణ అయినా రోగబాధిత వ్యక్తిని గమనించడంపైన మరియు ప్రేరేపణకు ఆ వ్యక్తి ఎలా స్పందిస్తారో అన్నదాన్ని ఊహించడం మీద ఆధారపడి ఉంటుంది. ఒక వైద్యుడు ఉన్మాదరోగిని మనోరోగ వైద్యుడివద్దకు తీసుకెళ్లమని సూచించవచ్చు. ఉన్మాద పరిస్థితిని అంచనా వేయడం మరియు మరింత సహాయం చేయడమనేది మనోరోగవైద్యుడివల్లనే సాధ్యం కాగలదు.

యాంటిసైకోటిక్స్ వంటి ఔషధాల్ని వ్యక్తిలో భ్రాంతులు మరియు భ్రమలు తగ్గించటానికి ఇవ్వొచ్చు. ఇంకా ఈ మందులు ఏది నిజం మరియు ఏది నిజం కాదన్న విషయాల మధ్య స్పష్టమైన వ్యత్యాసాన్ని వ్యక్తి తెలుసుకోవడానికి దోహదపడతాయి.

కౌన్సెలింగ్ మరియు మానసికవైద్యం (సైకోథెరపీ) ఉన్మాద రుగ్మతకు సహాయపడవచ్చు. ప్రత్యేకంగా బైపోలార్ లేదా మానసిక పరిస్థితులను కల్గిఉన్న వ్యక్తిని మానసిక ఆరోగ్య సలహాదారుతో క్రమబద్ధమైన సంప్రదింపుల సమావేశాలు జరపడంవల్ల వ్యక్తి సౌకర్యవంతమైన అనుభూతి చెంది వాస్తవంతో (రియాలిటీతో) ఏకీభవించగలరు.

ఉన్మాదం రుగ్మతపై పోరాటం చేసి నయం చేసుకోవడమనేది ఒక సవాలుగా ఉంటుంది. వ్యాధి బాధితుడికి వ్యాధిని నయం చేసుకోవాలన్న పట్టుదల ఉండాలి. దానికి తోడు వ్యాధిబాధిత వ్యక్తికి కుటుంబ సభ్యుల నుండి నిరంతర సహాయం మరియు సహకారం లభించాలి. సాధారణంగా ఉన్మాద రుగ్మతకు గురైన వ్యక్తి తన కుటుంబం మరియు స్నేహితులకు దూరమైపోతుంటారు, కాబట్టి అలాంటి ఉన్మాదపీడితుడికి కుటుంబసభ్యుల మరియు ముత్రుల సహాయ సహకారాలు చాలా అవసరం.



వనరులు

  1. American Academy of Child and Adolescent Psychiatry [Internet] Washington, D.C; Psychosis
  2. national ins
  3. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Psychosis
  4. Mental Health. Psychotic Disorders. U.S. Department of Health & Human Services, Washington, D.C. [Internet]
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Psychosis
  6. healthdirect Australia. Psychosis. Australian government: Department of Health

ఉన్మాదం(సైకోసిస్) కొరకు మందులు

Medicines listed below are available for ఉన్మాదం(సైకోసిస్). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.