సూడోమోనాస్ సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు) - Pseudomonas Infections in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 24, 2018

March 06, 2020

సూడోమోనాస్ సంక్రమణలు
సూడోమోనాస్ సంక్రమణలు

సూడోమోనాస్ సంక్రమణలు (ఇన్ఫెక్షన్లు)  అంటే ఏమిటి?

సూడోమోనాస్ (Pseudomonas) జాతికి చెందిన బాక్టీరియా వల్ల కలిగే సంక్రమణలను సూడోమోనాస్ సంక్రమణలు/ఇన్ఫెక్షన్లు అని పిలుస్తారు. ఈ బ్యాక్టీరియా మన చుట్టూ ఉండే వాతావరణంలో విస్తృతంగా వ్యాపించి ఉంటుంది అందువల్ల ఇది సంక్రమణలు/అంటువ్యాధులు కలిగించే ఒక సాధారణ జీవిగా మారింది. సుమారు 200 రకాల సూడోమోనాస్ జాతులు ఉన్నాయి. కానీ కేవలం మూడు జాతులు మాత్రమే మానవులలో వ్యాధులకు కారణమవుతున్నాయి, అవి పి. ఎరుజినోస (P. aeruginosa), పి. మాలై (P.mallei), మరియు పి. సూడోమాలై ( P. pseudomallei). సూడోమోనాస్ యొక్క అన్ని జాతుల్లో, పి. ఎరుజినోస అనేది మానవులలో అంటురోగాలకు అత్యంత ముఖ్యమైన కారణం.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

సూడోమోనాస్ సంక్రమణ యొక్క లక్షణాలు ప్రభావితం అయిన శరీర వ్యవస్థపై ఆధారపడి ఉంటాయి, అది:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ క్రింది కారణాలు ఒక వ్యక్తికి సూడోమోనాస్ సంక్రమణను కలిగించవచ్చు:

  • శస్త్రచికిత్స లేదా కాలిన గాయాల వలన గాయాలు/పుండ్లు ఏర్పడడం.
  • యూరినరీ కాథెటర్లు (urinary catheters) వంటి పరికరాల ఉపయోగం.
  • శ్వాస యంత్రం (breathing machine) మీద ఉన్న వ్యక్తులు.
  • అంతర్లీన వ్యాధి లేదా ఇమ్మ్యూనోసప్రెసెంట్ (immunosuppressant) చికిత్స కారణంగా రోగనిరోధక వ్యవస్థ బలహీనపడడం.

దీని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఒక వివరణాత్మక ఆరోగ్య చరిత్రను తీసుకోవడం మరియు శారీరక పరీక్ష తరువాత, ఒక కణజాల జీవాణుపరీక్ష (బయాప్సీ), పూర్తి రక్త గణన (complete blood count), ఛాతీ ఎక్స్-రే, యూరిన్ మైక్రోస్కోపీ మరియు సూక్ష్మజీవుల కోసం మూత్ర సాగు వంటివి అంటువ్యాధిని నిర్ధారించడానికి నిర్వహిస్తారు. ఈ బాక్టీరియా సంక్రమణను/ఇన్ఫెక్షన్ను గుర్తించడం కోసం ఈ క్రింది విశ్లేషణ చర్యలు ఉపయోగపడతాయి:

  • ఫ్లోరోసిన్ పరీక్ష (Fluorescein test)
    వుడ్స్ అల్ట్రావయొలెట్ లైట్ (Wood’s ultraviolet light) ద్వారా వ్యాధి సోకిన ప్రాంతం ఫ్లోరోసెంట్గా (స్వయం వెలుగుతో) కనిపిస్తుంది
  • పయోసియానిన్ ఏర్పాటు (Pyocyanin formation)
    చాలా సందర్బరాలో, పైసోయాన్నిన్ ఏర్పడుతుంది, ఇది నీలం-ఆకుపచ్చ రంగులో ఉంటుంది అది చీమును సూచిస్తుంది.

సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ల చికిత్సలో ఇవి ఉంటాయి:

  • గాయాన్ని శుభ్రపరచడం (మరణించిన కణజాల తొలగింపు).
  • టీకా (vaccination) ను కలిగి ఉండే ఇమ్యునోథెరపీ.
  • యాంటీబయాటిక్స్ వంటి మందులు. క్రింది యాంటీబయాటిక్స్ సాధారణంగా సూచించబడతాయి:
    • కార్బెనిసిల్లిన్ (Carbenicillin)
    • టోబ్రమైసిన్ (Tobramycin)
    • జంటమైసిన్ (gentamicin)
    • సిల్వర్ సల్ఫోడియాజైన్ (Silver sulfadiazine)
    • సిప్రోఫ్లోక్సాసిన్ (Ciprofloxacin)

సూడోమోనాస్ సంక్రమణలను ఈ విధంగా నివారించవచ్చు:

  • సరైన అసెప్టిక్ (సూక్ష్మజీవ రహిత) పద్ధతులను నిర్వహించడం.
  • సరైన ఐసోలేషన్ (isolation) విధానాలు.
  • కాథెటర్స్ మరియు ఇతర పరికరాలను తగినంత విధంగా శుభ్రంచేయడం.
  • సమయోచిత యాంటీ బాక్టీరియల్ క్రీమ్లు మరియు లోషన్లతో  గాయాలకు చికిత్స చేయడం.



వనరులు

  1. Iglewski BH. Pseudomonas. In: Baron S, editor. Medical Microbiology. 4th edition. Galveston (TX): University of Texas Medical Branch at Galveston; 1996. Chapter 27.
  2. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Pseudomonas aeruginosa in Healthcare Settings
  3. Matteo Bassetti et al. How to manage Pseudomonas aeruginosa infections Drugs Context. 2018; 7: 212527. PMID: 29872449
  4. National Health Service [Internet]. UK; Urinary tract infections (UTIs).
  5. National Health Service [Internet]. UK; Ear infections.