న్యూమోథొరాక్స్ - Pneumothorax in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 14, 2018

March 06, 2020

న్యూమోథొరాక్స్
న్యూమోథొరాక్స్

న్యూమోథొరాక్స్ అంటే ఏమిటి?

ఊపిరితిత్తులకు వెలుపల పొర మరియు లోపల పొర ఉంటాయి. ఆ పొరలను ప్ల్యూరా (pleura, శ్లేష్మపటలం) అని పిలుస్తారు. ఈ రెండు పొరల మధ్యన ఉండే ఖాళీ ప్రదేశాన్ని ప్ల్యూరల్ క్యావిటీ (pleural cavity) అని అంటారు అది గాలి లేదా ద్రవంతో నిండి ఉంటుంది అయితే ఇది సాధారణంగా ఎండిపోయి ఉంటుంది మరియు దానిలో చిన్న మొత్తంలో ప్లూరల్ ద్రవం ఉంటుంది.

ఈ క్యావిటీలోకి అనగా రెండు ప్ల్యూరాల మధ్యలోకి, గాలి ప్రవేశించినప్పుడు, న్యూమోథొరాక్స్ సంభవిస్తుంది. సెకండరీ (ద్వితీయ) న్యూమోథొరాక్స్ ఊపిరితిత్తుల అంతర్లీన వ్యాధి లక్షణం యొక్క ఫలితం. ప్రైమరీ (ప్రాధమిక) న్యుమోథొరాక్స్ ఏ వ్యాధితో ముడిపడి ఉండదు మరియు ఆకస్మికమైనదిగా ఉంటుంది.

కొన్నిసార్లు, ఈ చిక్కుకుపోయిన గాలి గుండె మరియు ఆహార గొట్టం (food pipe) వంటి ఇతర అవయవాల స్థానం మారిపోయేలా చెస్తుంది మరియు రక్త ప్రసరణను కూడా ప్రభావితం చేస్తుంది. టెన్షన్ న్యుమోథొరాక్స్ (tension pneumothorax) గా పిలువబడే ఈ పరిస్థితి, ఒక వైద్య అత్యవసర స్థితి మరియు ప్రాణానికి కూడా ముప్పును కలిగిస్తుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

న్యుమోథొరాక్స్ యొక్క రకం ఆధారంగా లక్షణాలు మారుతూ ఉంటాయి. టెన్షన్ న్యుమోథొరాక్స్ లో తప్ప, ఇతర రకాలలో రోగి చాలా తక్కువ అసౌకర్యానికి గురవుతాడు మరియు వ్యక్తికీ న్యుమోథొరాక్స్ ఉందని కూడా గుర్తించలేకపోవచ్చు. శ్వాస అందకపోవడం మరియు ఛాతీ నొప్పి న్యుమోథొరాక్స్కు  అత్యంత సాధారణ లక్షణాలు. రోగి వైద్య సంరక్షణను తీసుకోవడానికి కొన్ని రోజుల ముందు నుండి ఇది ఉండవచ్చు. వైద్యపరమైన సంకేతాలు ఆక్సిజన్ సరిపోకపోవడం, శ్వాస రేటు పెరిగిపోవడం, మరియు రక్తపోటు తగ్గిపోవడం వంటి వాటిని కలిగి ఉంటాయి.

టెన్షన్ న్యూమోథొరాక్స్ స్పష్టంగా తెలుస్తుంది. ఇది తీవ్ర గాయం కలిగినప్పుడు, పునరుజ్జీవనంలోకి తీసుకువచ్చే సమయంలో (resuscitation), గాలి తగిలేలా చేసే సమయం (వెంటిలేషన్) మొదలైన సందర్భాలతో ముడిపడి సంభవించడం జరుగుతుంది. తక్కువ ఆక్సిజన్ ఫలితంగా రోగి శ్వాస అందకపోవడంతో బాధపడతాడు. ప్రారంభంలో, టాఖీకార్డియ (tachycardia) మరియు టాఖీఅప్నియా (tachypnoea) మరియు తర్వాత హైపోక్సియా (hypoxia), సైనోసిస్ (cyanosis), మరియు హైపోవెన్టిలేషన్ (hypoventilation)  సంభవిస్తాయి. ట్రాఖియా ఒక వైపుకు జరిగిపోతుంది. అరుదుగా, రోగి ఉదర నొప్పిని కూడా ఫిర్యాదు చేయవచ్చు.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

బ్లేబ్(bleb) అని పిలువబడే నీటిబుడగ యొక్క చీలిక కారణంగా లేదా గాయం వలన ప్లూరల్ క్యావిటీలోకి గాలి ప్రవేశించవచ్చు. దీని వలన ఊపిరితిత్తులు లోపలికి వాలిపోతాయి, ఫలితంగా శ్వాస తీసుకునే సామర్ధ్యం తగ్గిపోతుంది. ప్లూరల్ క్యావిటీలోకి గాలిలోకి ప్రవేశించేలా చేసి, దానిని బయటకు రాకుండా నిరోధించేటువంటి కణజాల గాయం ఏర్పడితే కనుక అది టెన్షన్ న్యూమోథొరాక్స్కు దారితీస్తుంది. అందువల్ల, ప్రతీ శ్వాస కూడా ఊపిరితిత్తులను మరింత వాలిపోయేలా చేస్తుంది.

ధూమపానం, ఉబ్బసం, పొడవుగా-సన్న ఉన్న ఉన్నవారు, సిఓపిడి (COPD), సిస్టిక్ ఫైబ్రోసిస్ మొదలైన వాటి వలన న్యుమోథొరాక్స్ సంభావ్యత ప్రమాదం పెరుగుతుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ వైద్య పరీక్ష, ఎక్స్- రే, లేదా సిటి (CT) స్కాన్ ద్వారా ధృవీకరించబడుతుంది. చికిత్స న్యూమోథొరాక్స్ యొక్క స్వభావం మరియు పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. చిన్న పరిమాణ న్యూమోథొరాక్స్ విషయంలో, త్వరిత చికిత్స (quick treatment) అనంతరం అదే రోజున రోగిని డిశ్చార్జ్ చేయవచ్చు మరియు తదుపరి వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి.

తీవ్రమైన సందర్భాల్లో లేదా టెన్షన్ న్యూమోథొరాక్స్ కేసుల్లో, ఛాతీ నుండి గాలిని తీసివేయడం కోసం వెంటనే సూది చొప్పించడం (needle insertion) అవసరమవుతుంది. తర్వాత, ఛాతీ ట్యూబ్ (chest tube) ప్రవేశపెట్టబడుతుంది. పునరావృతమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది; అందువలన, తప్పక జాగ్రత్తలు వహించాలి.



వనరులు

  1. Steven A. Sahn,John E. Heffner. Spontaneous Pneumothorax. The New England Journal of Medicine,Massachusetts Medical Society N Engl J Med 2000; 342:868-874.
  2. Science Direct (Elsevier) [Internet]; Pneumothorax: Experience With 1,199 Patients.
  3. McKnight CL, Burns B. Pneumothorax. [Updated 2019 Feb 28]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Collapsed lung (pneumothorax).
  5. Healthdirect Australia. Pneumothorax. Australian government: Department of Health

న్యూమోథొరాక్స్ కొరకు మందులు

Medicines listed below are available for న్యూమోథొరాక్స్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.