పురుషాంగ ఈస్ట్ సంక్రమణ - Penile Yeast Infection in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 23, 2018

March 06, 2020

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ
పురుషాంగ ఈస్ట్ సంక్రమణ

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం సంక్రమణం అంటే ఏమిటి?

ఈస్ట్ అనేది ఒక బూజు (ఫంగస్) రకం లేక మధుశిలీంధ్రం, ఇది జీర్ణ వాహిక, నోరు, చర్మంపై, మరియు జననేంద్రియాల వంటి శరీర అవయవాలలో నివసిస్తుంది. పురుషాంగంపై సాధారణ ఆవశ్యకత కంటే  ఎక్కువగా మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదల కల్గినప్పుడు పురుషాంగ ఈస్ట్ సంక్రమణలు సంభవిస్తాయి. ఈ వ్యాధిని 'కాండిడియాసిస్' అని కూడా పిలుస్తారు, ఎందుకంటే 'కాండిడా అల్బికాన్స్' అనే సూక్ష్మజీవి దీనికి కారణమవుతుంది. కాండిడా సంక్రమణలు సున్నతి చేసిన శిశ్నము కల్గిన పురుషుల్లో కంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన పురుషులకే ఎక్కువగా సంభవిస్తాయి. ఎందుకంటే సున్నతి చేయని శిశ్నము కల్గిన  శిశ్నాగ్రచర్మము (foreskin) కింద తేమ మరియు వెచ్చదనం ఉండడంవల్ల ఈ మధుశిలీంధ్రం (ఈస్ట్) యొక్క పెరుగుదలను సులభతరం చేస్తాయి. 40 ఏళ్లు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల పురుషులలో కాండిడా సూక్ష్మజీవి ఎక్కువగా స్థానమేరచుకుని ఉంటుంది.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణం పురుషాంగం యొక్క కింద పక్కన (foreskin-side)  క్రింది లక్షణాలను కలుగజేస్తుంది:

  • బాధాకరమైన దద్దుర్లు.
  • చర్మం పొలుసులుదేలడం (స్కేలింగ్).
  • ఎర్రగా మారుతుంది.

పురుషాంగం యొక్క తలపై (అంటే శిశ్నఅగ్రం) దురద పుట్టడమనేది పురుషులు అనుభవించే అత్యంత సాధారణ లక్షణం.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పురుషాంగ ఈస్ట్ సంక్రమణాలకు దారితీసే శిలీంధ్రాలు పెచ్చుపెరిగి పోవడానికి కింది కారణాలను పేర్కొనవచ్చు:

  • తేమ లేదా వెచ్చని పరిస్థితులు.
  • బలహీన రోగనిరోధక వ్యవస్థ.
  • యాంటీబయాటిక్స్ (ఈ యాంటిబయోటిక్స్ ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను చంపినప్పుడు, మధుశిలీంధ్రాల యొక్క పెరుగుదల అవుతుంది).
  • హెచ్ఐవి (HIV) సంక్రమణ మరియు మధుమేహం వంటి కొన్ని వ్యాధులతో ఉన్న వ్యక్తులు ఈస్ట్ ఇన్ఫెక్షన్ అభివృద్ధికి మరింతగా లోనవుతారు.
  • సువాసనాభరిత (scented) సబ్బులు మరియు స్నానానికి ఉపయోగించే షవర్ జెల్స్ తో పురుషాంగాన్ని శుభ్రం చేయడంవల్ల శిశ్నము చర్మం మంట కలగడం మరియు కాండిడా సూక్ష్మజీవులు పెరిగిపోయే ప్రమాదాన్ని పెంచుతుంది.
  • యోని ఈస్ట్ సంక్రమణ కలిగిన స్త్రీతో అసురక్షితమైన (unprotected)  లైంగిక సంబంధం పెట్టుకోవడంవల్ల.

దీనిని ఎలా నిర్ధారణ చేసేది మరియు దీనికి చికిత్స ఏమిటి?

మీ డాక్టర్ కింది చర్యల ద్వారా  పురుషాంగ ఈస్ట్ సంక్రమణం వ్యాధిని నిర్ధారణ చేస్తారు:

  • మీ వైద్య చరిత్ర మరియు వ్యాధి లక్షణాలు గమనించడం.
  • భౌతిక పరీక్షను నిర్వహిస్తారు .
  • పురుషాంగం యొక్క ద్రవం లేదా కణజాలం నమూనా పరిశీలన.

పురుషాంగ ఈస్ట్  సంక్రమణలకు అందుబాటులో ఉన్న చికిత్సలు క్రిందివిధంగా ఉన్నాయి:

  • యాంటీ ఫంగల్ క్రీములు లేదా లోషన్లు  .
  • ఔషధ ఫలవర్తులు (medicated suppositories)
  • బలహీన రోగనిరోధక శక్తి కారణంగా ఈ సంక్రమణకు గురైన వ్యక్తులకు మౌఖికంగా తీసుకునే ‘ఓరల్ యాంటీ ఫంగల్ మందులు’.

చాలామటుకు ఈ ఔషధాలు మందుల షాపుల్లో” ఓవర్-ది-కౌంటర్” ప్రాతిపదికన అందుబాటులో ఉన్నాయి, అంటే వీటికి వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందుల షాపులో లభిస్తాయి. ఈ ఔషధాలను ఉపయోగించిన తర్వాత కూడా అంటువ్యాధి కొనసాగితే, మీ వైద్యుడు యాంటీ ఫంగల్ మందుల యొక్క దీర్ఘకాల కోర్సును తరుణోపాయంగా సూచించవచ్చు.



వనరులు

  1. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Yeast Infection Tests.
  2. Department of Health and Mental Hygiene [Internet]. New York; Yeast Infection.
  3. University of Rochester Medical Center Rochester, NY; Yeast Infection.
  4. Am Fam Physician. [Internet] American Academy of Family Physicians; Yeast Infections.
  5. Nyirjesy P,Sobel JD. Genital mycotic infections in patients with diabetes. Postgrad Med. 2013 May;125(3):33-46. PMID: 23748505
  6. C Lisboa et al. Candida balanitis: risk factors. The Journal of European Academy of Dermatology and Venereology Volume24, Issue7 July 2010 Pages 820-826

పురుషాంగ ఈస్ట్ సంక్రమణ వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు