పెల్లాగ్రా - Pellagra in Telugu

Dr. Anurag Shahi (AIIMS)MBBS,MD

January 15, 2019

March 06, 2020

పెల్లాగ్రా
పెల్లాగ్రా

పెల్లాగ్రా అంటే ఏమిటి?

పెల్లాగ్రా అనేది విటమిన్ బి-కాంప్లెక్స్ వర్గంలోని నియాసిన్ అనే విటమిన్ యొక్క లోపం వలన ఏర్పడే ఒక పోషకపదార్థ రుగ్మత. ఈ లోపము పోషకాలను తక్కువగా తీసుకోవడం వలన లేదా జీర్ణవ్యవస్థ యొక్క అపశోషణం (malabsorption, పోషకపదార్దాలను శరీరంలోకి సరిగ్గా గ్రహించలేకపోవడం) ఫలితంగా ఈ లోపం సంభవించవచ్చు. ఇది చర్మం, జీర్ణాశయం మరియు నాడీ వ్యవస్థను ప్రభావితం చేసే దైహిక (సిస్టమిక్) రుగ్మత. ఈ కణజాలాలకు ఎక్కువ సెల్ టర్నోవర్ (అధిక పరిమాణంలో కణాలు ఉండడం) ఉన్నందున, మార్పులను/లోపములను వీటిలో ప్రధానంగా గమనించవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

పెల్లాగ్రా యొక్క అత్యంత సాధారణ లక్షణాలు తరచూ 3 డి లుగా చెప్తారు (3D's), అవి అతిసారం (Diarrhoea), చిత్తవైకల్యం (dementia) మరియు చర్మవాపు (dermataitis). చర్మవాపు చెమటపొక్కుల/ఎండ వేడికి చర్మం కమిలినట్టుగా కనిపిస్తుంది మరియు సూర్యరశ్మి వలన తీవ్రతరం కూడా అవుతుంది. చర్మం ఎరుపుగా కనిపిస్తుంది మరియు దురదగా ఉంటుంది. ఈ ప్రభావాలు శరీరంలో రెండు వైపులా కనిపిస్తాయి. గ్యాస్ట్రిక్ లక్షణాలు కడుపులో అసౌకర్యం, వికారం మరియు నీటి విరేచనాలతో మరియు అరుదుగా రక్తంతో కూడిన అతిసారం. నాడీ వ్యవస్థ లక్షణాలు గందరగోళం, జ్ఞాపకశక్తి నష్టం, నిరాశ మరియు కొన్నిసార్లు భ్రాంతులు ఉంటాయి. పరిస్థితి పురోగతి చెందుతున్నకొద్దీ, వ్యక్తికి స్థితిభ్రాంతులు, ప్రేలాపనలు (పిచ్చి పిచ్చిగా మాట్లాడం) సంభవిస్తాయి మరియు చికిత్స చేయకుండా వదిలేస్తే మరణం కూడా సంభవిస్తుంది.

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

పెల్లాగ్రా ప్రధానంగా ఆహారం లో నియాసిన్ యొక్క లోపం కారణంగా సంభవిస్తుంది. ఇది సాధారణంగా  హైద్రాబాద్ పరిసర ప్రాంతాలలో నివసించే పేద ప్రజలలో గుర్తించబడుతుంది, వారి ఆహారంలో ప్రధానంగా జొన్న (జోవర్) ఉంటుంది. జొన్న లేదా ఒక నిర్దిష్టమైన మొక్కజొన్న ఆధారిత ఆహారం నియాసిన్ యొక్క శోషణను నిరోధిస్తుంది. సెకండరీ (ద్వితీయ) కారణాలు కొన్ని గ్యాస్ట్రిక్ సమస్యల వలన కలుగుతాయి, ఇందులో నియాసిన్ ను తగినంత తీసుకున్నప్పటికీ అది శరీరంలోకి శోషించబడదు/గ్రహించబడదు. అదేవిధంగా, మద్యపాన వ్యసనం, కొన్ని మందులు మరియు కాలేయ క్యాన్సర్ కూడా ఈ పరిస్థితికి దోహదం చేస్తాయి.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

పెల్లాగ్రా కోసం ఒక నిర్దిష్ట/ప్రత్యేక ప్రయోగశాల ఆధారిత పరిశోధన అందుబాటులో లేదు. అందువలన రోగనిర్ధారణ, ఆరోగ్య చరిత్ర, భౌగోళిక స్థానాన్ని మరియు వ్యక్తి నేపథ్యంపై ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు, మూత్ర పరీక్ష కూడా సహాయపడవచ్చు అది నియాసిన్ డీగ్రడేషన్ (degradation) యొక్క విసర్జక ఉత్పత్తులను (excretory products) చూపిస్తుంది.

పెల్లాగ్రా చికిత్స కారణం మీద ఆధారపడి ఉంటుంది. పెల్లాగ్రా  ఆహార తీసుకునే నియాసిన్ సరిపోకపోవడం వలన సంభవిస్తుంది అందుకోసం నియాసిన్ సప్లిమెంట్లను తీసుకంటే సులభంగా పెల్లాగ్రాను తగ్గించవచ్చు. రోగులు కొద్ది రోజుల నుండి కొద్దీ వారల వ్యవధిలోపునే ఉపశమనం పొందిన అనుభూతిని చెందుతారు. అయితే, చర్మ సమస్యలు నయం కావడానికి కొన్ని నెలల సమయం పడుతుంది. రోగులకు స్వీయ సంరక్షణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం, వారి చర్మాన్ని నిరంతరం తేమగా ఉంచుకోవడం మరియు బయటకు వెళ్ళేటప్పుడు ఎల్లప్పుడూ సన్స్క్రీన్ను (sunscreen) ఉపయోగించడం వంటివి చెయ్యాలి. వేరే అంతర్లీన కారణాలు ఉన్న వ్యక్తులకు కారణానికి అనుగుణంగా చికిత్స అందించాలి, అయితే ఇంట్రావీనస్గా (నరములలోకి)  నియాసిన్ను ఎక్కించడం వలన కూడా కొన్ని ప్రయోజనాలను గమనించవచ్చు. పరిస్థితికి 4-5 సంవత్సరాలు వరకు చికిత్స చేయకపోతే మరణం సంభవిస్తుంది.



వనరులు

  1. Isaac S. The "gauntlet" of pellagra. Int. J. Dermatol. 1998 Aug;37(8):599. PMID: 9732006
  2. Park YK et al. Effectiveness of food fortification in the United States: the case of pellagra. Am J Public Health. 2000 May;90(5):727-38. PMID: 10800421
  3. Pownall HJ et al. Influence of an atherogenic diet on the structure of swine low density lipoproteins. J. Lipid Res. 1980 Nov;21(8):1108-15. PMID: 7462806
  4. Hegyi J, Schwartz RA, Hegyi V. Pellagra: dermatitis, dementia, and diarrhea. Int. J. Dermatol. 2004 Jan;43(1):1-5. PMID: 14693013
  5. Savvidou S. Pellagra: A Non-Eradicated Old Disease. Clin Pract. 2014 Apr 28;4(1):637. PMID: 24847436

పెల్లాగ్రా కొరకు మందులు

Medicines listed below are available for పెల్లాగ్రా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.