న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ - Neuroendocrine Tumour in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

January 04, 2019

July 31, 2020

న్యూరోఎండోక్రైన్ ట్యూమర్
న్యూరోఎండోక్రైన్ ట్యూమర్

న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ అంటే ఏమిటి?

న్యూరోఎండోక్రైన్ ట్యూమర్లని  కూడా కార్సినోయిడ్స్ (carcinoids) అని కూడా పిలుస్తారు, ఇవి హార్మోనులను విడుదల చేసే కణాల అలాగే నరాల యొక్క లక్షణాలను కలిగి ఉండే న్యూరోఎండోక్రైన్ కణాల యొక్క కణితులు/ట్యూమర్లు. సాధారణంగా ఈ కణితుల పెరుగుదల నెమ్మదిగా ఉంటుంది. ఇవి శరీరంలో ఏ అవయవంలోనైనా అభివృద్ధి చెందగలవు. ఇవి ప్రాణాంతమైనవి [malignant ] (క్యాన్సరస్) లేదా నిరపాయమైనవి [benign] (క్యాన్సర్ కానివి).

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

కణితి/ట్యూమర్ యొక్క స్థానాన్ని బట్టి, లక్షణాలు మారుతూ ఉండవచ్చు. కణితి యొక్క స్థానంతో సంబంధం లేకుండా సంభవించే కొన్ని సాధారణ లక్షణాలు ఈ క్రింద ఇవ్వబడ్డాయి:

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

న్యూరోఎండోక్రైన్ కణితుల/ట్యూమర్ల యొక్క ఖచ్చితమైన కారణం ఇంకా తెలియలేదు. క్రింద ఇవ్వబడిన  వారసత్వంగా సంక్రమించే సమస్యలు ఏదోఒకటి వ్యక్తికి ఉంటే కనుక, న్యూరోఎండోక్రైన్ కణితి/ట్యూమర్ యొక్క ప్రమాదం పెరుగుతుంది.

  • ముల్టీపుల్ ఎండోక్రైన్ నియోప్లాసియా టైప్ 1 (Multiple endocrine neoplasia type 1)
  • న్యూరోఫైబ్రోమెటోసిస్ టైప్ 1 (Neurofibromatosis type 1)
  • వాన్ హిప్పెల్-లిండౌ సిండ్రోమ్ (Von Hippel-Lindau syndrome)

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

న్యూరోఎండోక్రిన్ వ్యాధి నిర్ధారణను ఈ క్రింది పరీక్షల ద్వారా చేయవచ్చు:

  • రక్త పరీక్షలు
  • కణజాలపు జీవాణుపరీక్ష (Biopsy of tissue)
  • జన్యు పరీక్ష (Genetic testing) మరియు కౌన్సెలింగ్
  • స్కాన్లు వీటిని కలిగి ఉంటాయి:
    • అల్ట్రాసౌండ్
    • కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ (CT)
    • మేగ్నెటిక్ రెసోనెన్స్ ఇమేజింగ్ (MRI)
    • పాసిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ (PET)
    • అక్ట్రియోటైడ్ స్కాన్స్ (Octreotide scans) - ఈ స్కాన్ లో ఒక తేలికపాటి రేడియో ఆక్టివ్ ద్రవాన్ని నరాలలోకి ఎక్కించి తర్వాత కెమెరాను ఉపయోగించి క్యాన్సర్ కణాల ఉనికిని గుర్తిస్తారు
    • లాప్రోస్కోపీ (Laparoscopy)
    • న్యూక్లియర్ మెడిసిన్ ఇమేజింగ్ (Nuclear medicine imaging)

న్యూరోఎండోక్రైన్ వ్యాధి యొక్క చికిత్స కణితి స్థానం, తీవ్రత మరియు రోగి యొక్క పూర్తి ఆరోగ్య పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. ఈ వ్యాధికి అందుబాటులో ఉన్న చికిత్సలు క్రింది విధంగా ఉంటాయి:

  • శస్త్రచికిత్స: ఒకే స్థానంలో ఉన్న కణితులను శస్త్రచికిత్స ద్వారా తొలగించవచ్చు, ఇది చికిత్స యొక్క మొదటి మార్గంగా పరిగణించబడుతుంది.
  • కీమోథెరపీ, హార్మోన్ థెరపీ మరియు / లేదా టార్గెటెడ్ థెరపీలను  క్లిష్టమైన లేదా తీవ్రమైన న్యూరోఎండోక్రిన్ ట్యూమర్ల చికిత్సకు ఉపయోగిస్తారు.
  • మందులు: సోమాటోస్టాటిన్ అనలాగ్లు [Somatostatin analogues] (అక్ట్రియోటైడ్ [octreotide] లేదా లెన్రియోటైడ్ [lanreotide]) అనేక హార్మోన్లను పెరుగుదలను ఆపుతాయి మరియు లక్షణాల తీవ్రతను తగ్గించి వ్యాధి పురోగతిని నివారిస్తాయి.
  • రేడియోథెరపీ: ఎక్స్- రేలను లేదా గామా రేలను (gamma rays) ఉపయోగించి కణితికి రక్తం సరఫరాను అడ్డుకోవడం ద్వారా దాని పరిమాణాన్ని తగ్గించడం లేదా పెరుగుదలను ఆపడంలో సహాయపడుతుంది.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Neuroendocrine tumours.
  2. Canadian Cancer Society [Internet]: Toronto,Canada; Neuroendocrine tumours.
  3. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Neuroendocrine tumor.
  4. National Organization for Rare Disorders [Internet]; Neuroendocrine tumor.
  5. Oronsky B, Ma PC, Morgensztern D, Carter CA. Nothing But NET: A Review of Neuroendocrine Tumors and Carcinomas. Neoplasia. 19(12):991-1002. doi: 10.1016/j.neo.2017.09.002. Epub 2017 Nov 5. PubMed PMID: 29091800; PubMed Central PMCID: PMC5678742.

న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ వైద్యులు

Dr. Anil Heroor Dr. Anil Heroor Oncology
22 Years of Experience
Dr. Kumar Gubbala Dr. Kumar Gubbala Oncology
7 Years of Experience
Dr. Patil C N Dr. Patil C N Oncology
11 Years of Experience
Dr. Vinod Kumar Mudgal Dr. Vinod Kumar Mudgal Oncology
10 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

న్యూరోఎండోక్రైన్ ట్యూమర్ కొరకు మందులు

Medicines listed below are available for న్యూరోఎండోక్రైన్ ట్యూమర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.