జ్ఞాపకశక్తి కోల్పోవడం - Memory Loss in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

December 08, 2018

March 06, 2020

జ్ఞాపకశక్తి కోల్పోవడం
జ్ఞాపకశక్తి కోల్పోవడం

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత అంటే ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడం అనే రుగ్మతనే “మతి మెరుపు” అని కూడా అంటారు. ‘మర్చిపోవడమ’నే దానికి ‘మతి మరుపు’ లేక ‘జ్ఞాపకశక్తి కోల్పోవడమ’నేది ఓ అసాధారణమైన రూపం. మతిమరుపు కల్గిన వ్యక్తి కొత్తగా రాబోయే సంఘటనలను మర్చిపోవచ్చు లేదా గతంలో కొన్ని జ్ఞాపకాలనూ మర్చిపోవచ్చు, లేదా కొన్నిసార్లు ఈ రెండింటినీ-అంటే రాబోయేవాట్ని, గత జ్ఞాపకాల్ని కూడా మర్చిపోవచ్చు. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత సాధారణం మరియు సాధారణంగా తీవ్రమైనది కాదు. “వృద్ధాప్య చిత్తవైకల్యం” అని దీన్ని పిలుస్తారు. మీ తాళంచెవుల్ని (keys) లేదా గొడుగు లేదా గడియారాన్ని చివరిగా ఎక్కడ ఉంచారో మర్చిపోవడమనే దాన్ని మామూలుగా అనుకున్నట్టు “జ్ఞాపకశకి కోల్పోవడం”  అనరు. మీ తర్కం, తీర్పు, భాష మరియు ఇతర ఆలోచనా నైపుణ్యాలతో మీ జ్ఞాపకశక్తి నష్టం జోక్యం చేసుకుంటే, ఇది “చిత్తవైకల్యం” (dementia) అని పిలవబడుతుంది మరియు దీనికి వైద్యునిచే ఒక వివరణాత్మక పరిశోధన అవసరం.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెమరీ నష్టంతో సంబంధం ఉన్న అత్యంత సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు:

  • పాత సంఘటనలు లేదా మరీ ఇటీవలి సంఘటనలను మరచిపోవటం
  • తగ్గిన ఆలోచనా సామర్థ్యం
  • నిర్ణయాలు తీసుకోవడంలో సమస్య
  • ఒక సంక్లిష్ట విధిలో దశల క్రమాన్ని గుర్తుచేసుకోవడంలో సమస్య

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మరచిపోవడమనేదాన్లో కొంత మొత్తం వృద్ధాప్యంతో సంబంధం కలిగి ఉన్న ఒక సహజ దృగ్విషయం. వయసు-సంబంధ జ్ఞాపకశక్తి నష్టానికి కారణాలు:

  • మెదడు యొక్క ఏ భాగానికైనా దెబ్బ తగలడంవల్ల నష్టం, ఇది కిందివాటివల్ల  కావచ్చు:
  • కింది మానసిక రుగ్మతల వంటివాటి కారణంగా జ్ఞాపకశక్తి నష్టం
  • జ్ఞాపకశక్తి నష్టం చిత్తవైకల్యం యొక్క చిహ్నంగా కనిపించవచ్చు:
  • ఫ్రంటోటెంపరల్ డిమెన్షియా
  • లెవీ బాడీ చిత్తవైకల్యం (మెదడులో ఆల్ఫా-సైనూక్లిన్ అనే ప్రోటీన్ అసాధారణంగా జమవడంవల్ల వచ్చే రుగ్మత)  
  • ఇతర కారణాలు:
    • మద్యపానం లేదా మాదకద్రవ్య వ్యసనం
    • మూర్ఛ
    • థయామిన్ పోషక పదార్ధం లోపం వలన కొర్సాకోఫ్ రుగ్మత

దీనిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మత నిర్ధారణకు, డాక్టర్ మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలకు మీ సమాధానాలు మీ ఆలోచనా సామర్థ్యాన్ని, జ్ఞాపకశక్తిని నిర్ణయిస్తాయి. జ్ఞాపకశక్తి నష్టం రుగ్మతను సరి చేయగల కారణాలను గుర్తించడంలో సహాయపడే ఇతర పరీక్షల్లో కొన్ని ఇలా ఉన్నాయి:

  • ప్రత్యేక అంటువ్యాధులు లేదా పోషక స్థాయిలు గుర్తించడం కోసం రక్త పరీక్షలు
  • CT స్కాన్ మరియు MRI వంటి మెదడు ఇమేజింగ్ పద్ధతులు
  • అభిజ్ఞాత్మక (కాగ్నిటివ్) పరీక్షలు
  • కటి రంధ్ర పరీక్ష (లేక లుంబార్ పంక్చర్)
  • సెరిబ్రల్ ఆంజియోగ్రఫీ

జ్ఞాపకశక్తి కోల్పోవడమనే రుగ్మతకు చికిత్స ఆ పరిస్థితి కారణంపై ఆధారపడి ఉంటుంది. పోషకాహార లోపం విషయంలో, అనుబంధకాహారాల సేవనం జ్ఞాపకశక్తి నష్టాన్ని సులభంగా సరి చేస్తుంది. వయసు సంబంధిత జ్ఞాపకశక్తి నష్టం మరియు అల్జీమర్స్ వ్యాధి వంటి కొన్ని పరిస్థితులు పూర్తిగా నయం చేయబడవు. అంటువ్యాధులకు సంబంధిత సూక్ష్మజీవనాశక మందులతో (యాంటీమైక్రోబియల్స్తో) చికిత్స చేయవచ్చు. కొన్ని వ్యసనాల్ని అధిగమించడానికి కుటుంబం మద్దతు, వృత్తిపరమైన సలహాలు మరియు వ్యక్తియొక్క ఒక బలమైన దృఢ నిశ్చయం అవసరం.



వనరులు

  1. National Health Service [Internet]. UK; Memory loss (amnesia).
  2. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Memory loss.
  3. Alzheimer's Association [Internet]: Chicago (IL); Mild Cognitive Impairment (MCI).
  4. Small GW. What we need to know about age related memory loss. BMJ. 2002 Jun 22;324(7352):1502-5. PMID: 12077041
  5. U. S Food and Drug Association. [Internet]. Coping With Memory Loss.

జ్ఞాపకశక్తి కోల్పోవడం వైద్యులు

Dr. Vinayak Jatale Dr. Vinayak Jatale Neurology
3 Years of Experience
Dr. Sameer Arora Dr. Sameer Arora Neurology
10 Years of Experience
Dr. Khursheed Kazmi Dr. Khursheed Kazmi Neurology
10 Years of Experience
Dr. Muthukani S Dr. Muthukani S Neurology
4 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

జ్ఞాపకశక్తి కోల్పోవడం కొరకు మందులు

Medicines listed below are available for జ్ఞాపకశక్తి కోల్పోవడం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.