మేనియా - Mania in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 13, 2018

March 06, 2020

మేనియా
మేనియా

మేనియా అంటే ఏమిటి?

మేనియా అనేది ఓ స్థితి. ఆ స్థితిలో మీరు శారీరకంగా మరియు మానసికంగా చాలా శక్తిమంతంగా ఉన్నట్లు అనుభూతి చెందుతయారు. ఉన్మాదం స్థితి వ్యక్తి రోజువారీ జీవిత కార్యకలాపాలను గణనీయంగా దెబ్బ తీస్తుంది. ఉన్మాదాన్నే”మానిక్ ఎపిసోడ్” (ఉన్మాద అధ్యాయం)గా వ్యవహరిస్తారు.ఈ ఉన్మాదస్థితి సాధారణంగా ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ సమయం పాటు కొనసాగుతుంది మరియు తీవ్రమైన హైపోఉన్మాదం యొక్కరూపం ఇది. ఇది సాధారణంగా ఒక ద్విధ్రువీయ రుగ్మత (బైపోలార్ డిజార్డర్). ప్రసవానంతర మానసిక వైకల్యం మరియు అటువంటి ఇతర లోపాలు కలిగిన వ్యక్తులలో కనిపించే ఒక లక్షణం ఇది. ఇక్కడ మనోభావాలు తీవ్రంగా ఉంటాయి (చాలా ఎక్కువగా లేదా తక్కువగా అనుభూతి చెందడం). కుంగుబాటుతనంతో బాటు ఉన్మాదం తరచుగా అలాంటి వ్యక్తులలో మారుతూ ఉంటుంది.

భారతదేశంలో ద్విధ్రువీయ రుగ్మత (బైపోలార్ డిజార్డర్) యొక్క ప్రాబల్యం 0.1%  ఉన్నట్లు కనుగొనబడింది, అయితే పురుషులలో ఇది ఎక్కువగా ఉన్నట్లు గుర్తించబడింది. భారత మానసిక ఆరోగ్య సర్వే 2015-16 ( National Mental Health Survey of India 2015-16) ప్రకారం, 40-49 సంవత్సరాల వయసుల్లోని వ్యక్తులు ద్విధృవీయ రుగ్మత (బైపోలార్ డిజార్డర్) యొక్క అధిక సంభావ్యతను కలిగి ఉన్నారని నివేదించబడింది.

దీని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఉన్మాద స్థితిని (మానిక్ ఎపిసోడ్) కలిగి ఉండగా మీరు కింద పేర్కొన్నవాటిని చేస్తారు లేదా అనుభూతి చెందుతారు:

  • అమితానందాన్ని కలిగి ఉంటారు, ఆ ఆనందఉత్తేజాన్ని తట్టుకోలేకపోతుంటారు
  • అత్యంత శక్తిమంతులై ఉంటారు..
  • చాలా వేగంగా మాట్లాడుతారు, వేగంగా ఆలోచిస్తారు.
  • నిద్రపోరు లేదా తిండి తినరు.
  • సులభంగా పరధ్యానపరులవుతారు.
  • సులభంగా విసుగు చెందుతారు మరియు కోపగించుకుంటారు.
  • ప్రత్యేక అధికారాల్ని కలిగి ఉన్నట్లు భావించడం.
  • అంతర్దృష్టి లేకపోవడం.
  • అర్ధవంతంగా లేని ఆలోచనలు, భావనలు (ఉపాయాలు) కలిగినవారై ఉంటారు.

ఒక ఉన్మాద అధ్యాయం తర్వాత, మీరు ఏం జరిగిందో గుర్తుంచుకోలేరు మరియు ఉన్మాదంలో మీ చర్యలు లేదా మాటలకు అసహనంతో బాధపడతారు. మీరు అలసటతో నిద్రావస్థ అనుభూతిని చెందుతారు.

దీనికి ప్రధాన కారణాలు ఏమిటి?

ఉన్మాదం యొక్క కారణాలు:

  • ద్విధృవ రుగ్మత (బైపోలార్ డిజార్డర్).
  • ఒత్తిడి.
  • జన్యుశాస్త్రం (జెనెటిక్స్)
  • సీజన్లో మార్పు.
  • కొన్ని మందుల వాడకం లేదా మద్యపానం.
  • నరాల పనితీరులో అసాధారణత.
  • కొన్ని వ్యాధి పరిస్థితుల ముగింపు దశ అభివ్యక్తి.
  • ప్రసవం.
  • ప్రియమైన వారిని కోల్పోవడం, విడాకులు, హింస, దుర్భాషభాషణలు లేక దుర్వినియోగం, నిరుద్యోగం, ఆర్థిక ఇబ్బందులు వంటి కష్టాలు.

ఉన్మాద రుగ్మతను ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

ఉన్మాదం చికిత్సలో మీ డాక్టర్ (మనోరోగ వైద్యుడు) మీకో గొప్ప సహాయంగా నిలవ గలడు. అతను / ఆమె ఉన్మాదానికి కారణం కాగల ఇతర పరిస్థితులను తోసిపుచ్చేందుకు మీ వైద్య మరియు వ్యక్తిగత చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. వైద్యుడు మీ చరిత్రను తీసుకోవడంవల్ల ఏదైనా ఇటీవల జరిగిన విషాద సంఘటనలను గుర్తించడానికి మరియు మీ మానసిక ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి కూడా సహాయపడుతుంది.

యాంటి-సైకోటిక్ మందుల్ని సాధారణంగా ఉన్మాదం నిర్వహణలో సూచించబడతాయి. బైపోలార్ డిజార్డర్-సంబంధిత మ్యానియా విషయంలో, మూడ్ స్టెబిలైజర్లు ఇవ్వబడుతాయి. హానికరమైన దుష్ప్రభావాలు నిరోధించడానికి రెగ్యులర్ రక్త పరీక్షలు అవసరం (లేదా కొన్ని మానసిక స్థిరీకరణ మందులు అవసరమవుతాయి). మందులతో పాటు, మానసిక చికిత్స (ఇది నమూనాలను గుర్తించడానికి సహాయపడుతుంది, వర్తమాన (ప్రస్తుత)కాలంలో జీవించేందుకు ప్రోత్సహిస్తుంది లేదా సమస్యలను పరిష్కరిస్తుంది) మరియు కుటుంబం మరియు స్నేహితుల నుండి మద్దతు ఒక గొప్ప సహాయంగా నిలవగలవు.



వనరులు

  1. Prasad G. Rao. An overview of Indian research in bipolar mood disorder. Indian J Psychiatry. 2010 Jan; 52(Suppl1): S173–S177. PMID: 21836675.
  2. Suresh Bada Math and Ravindra Srinivasaraju. Indian Psychiatric epidemiological studies: Learning from the past. Indian J Psychiatry. 2010 Jan; 52(Suppl1): S95–S103. PMID: 21836725.
  3. Queensland Health. [Internet]. The State of Queensland. Caring for a person experiencing Mania.
  4. Mind. [Internet]. National Association for Mental Health. Hypomania and mania.
  5. Dailey MW, Saadabadi A. Mania. [Updated 2019 May 13]. In: StatPearls [Internet]. Treasure Island (FL): StatPearls Publishing; 2019 Jan-.

మేనియా కొరకు మందులు

Medicines listed below are available for మేనియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.