లివర్ (కాలేయ) సిర్రోసిస్ - Liver Cirrhosis in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

January 03, 2019

March 06, 2020

లివర్ సిర్రోసిస్
లివర్ సిర్రోసిస్

లివర్ (కాలేయ) సిర్రోసిస్ అంటే ఏమిటి?

లివర్ (కాలేయ) సిర్రోసిస్ అనేది దీర్ఘకాలం పాటు కాలేయానికి హాని కలుగడం/దెబ్బతినడం వలన కాలేయం పాడై ప్రాణాంతకం అయ్యే ఒక పరిస్థితి. కాలేయం ముడుకుపోతుంది మరియు గట్టిబడిపోతుంది. అందువల్ల, కాలేయం సరిగా పనిచేయలేదు  మరియు చివరికి కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. ఈ పరిస్థితి కాలేయ రక్త సరఫరాను ప్రభావితం చేస్తుంది ఆ స్థితిని పోర్టల్ హైపర్ టెన్షన్ అని పిలుస్తారు.

సిర్రోసిస్ ఒక పురోగమించే (వేగంగా అభివృద్ధి చెందే) వ్యాధి ఇది ఆరోగ్యకరమైన కణజాలాన్ని పీచుగా  మారుస్తుంది. కాలేయం యొక్క సహజ రక్షణ చర్యలు, హానికర ప్రేరేపకాలతో (trigger) పోరాడతాయి మరియు కాలేయ కణజాలం ముడుకుపోయి మచ్చలుగా ఏర్పడుతుంది, అది (ఆ మచ్చలు) కాలేయం యొక్క మొత్తం క్రమాంతర (peripheral) ఉపరితలాన్ని కప్పి ఉంచుతుంది. ఈ మచ్చలు ఏర్పడిన  కణజాలాలు కాలేయానికి జరిగే రక్త సరఫరాను నిరోధిస్తాయి మరియు పూర్తి కాలేయ వైఫల్యం లేదా మరణానికి కూడా దారితీయవచ్చు.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

ఈ పరిస్థితి యొక్క ప్రారంభ దశలక్షణాలు:

తరువాతి దశలలో, సమస్య ఈ లక్షణాలను కలిగి ఉంటుంది:

 దీని ప్రధాన కారణాలు ఏమిటి?

లివర్ (కాలేయ) సిర్రోసిస్కు సాధారణ ప్రేరేపకాలు (ట్రిగ్గర్లు):

  • హెపటైటిస్ బి, లేదా సి వంటి వైరల్ ఇన్ఫెక్షన్లు
  • దీర్ఘకాలం పాటు మద్యం సేవించడం
  • ఫ్యాటీ లివర్ వ్యాధి (మద్యపానం వలన కానిది)
  • ఊబకాయం
  • సిస్టిక్ ఫైబ్రోసిస్ (Cystic fibrosis)
  • దీర్ఘకాలిక రక్తపోటు
  • ఆటోఇమ్యూన్ హెపటైటిస్ వంటి ఆటోఇమ్యూన్ వ్యాధులు
  • పిత్త వాహికలలో నిరోధం (Blockage in bile ducts)
  • కాలేయానికి హాని కలిగించే మూలికా (హెర్బల్) పదార్దాలు
  • రసాయనాలకు గురికావడం/బహిర్గతం కావడం
  • గుండె వైఫల్యం
  • కాలేయపు ఫంగల్ ఇన్ఫెక్షన్లు
  • జన్యుపరమైన కాలేయ వ్యాధులు
  • శరీరంలో కాపర్ (రాగి) లేదా ఐరన్ (ఇనుము) అధికంగా ఉండడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ఈ కింది విధానాల ద్వారా వైద్యులు వ్యాధిని నిర్ధారిస్తారు:

  • కాలేయ పనితీరును తెలుసుకోవడానికి రక్త పరీక్షలు
  • కాలేయ జీవాణుపరీక్ష (లివర్ బయాప్సీ)
  • ఎంఆర్ఐ (MRI) స్కాన్
  • ఎగువ జీర్ణవ్యవస్థ యొక్క ఎండోస్కోపీ
  • సిటి (CT) స్కాన్
  • అల్ట్రాసౌండ్

పైన ఉన్న పరీక్షలు ఈ పరిస్థితితో ముడిపడి ఉన్న సమస్యలను గుర్తించటానికి సహాయపడతాయి. చైల్డ్స్-పగ్ టెస్ట్ స్కోర్ (Childs-Pugh test score) అని పిలువబడే ఒక స్కేల్ (కొలిచేది) ఈ పరిస్థితిని వర్గీకరిస్తుంది:

  • తీవ్రమైన
  • మోస్తరు
  • తేలికపాటి

నష్టం యొక్క తీవ్రతను అంచనా వేయడానికి  సిర్రోసిస్ను కంపెన్సేటెడ్ (compensated, పనిచేయగల) లేదా డికంపెన్సేటెడ్ (decompensated,పని చేయలేని) గా కూడా వర్గీకరించవచ్చు. కంపెన్సేటెడ్ సిర్రోసిస్ అంటే కాలేయం సమస్య ఉన్నప్పటికీ పని చేస్తుంది. డికంపెన్సేటెడ్ సిర్రోసిస్ను కాలేయ వ్యాధి యొక్క చివరి దశగా వర్గీకరించవచ్చు.

మద్యపానాన్ని ఆపడం/నిరోధించడం లేదా అంతర్లీన వైరస్ యొక్క చికిత్స ద్వారా సిర్రోసిస్ను మెరుగుపరచవచ్చు. సాధారణంగా, ఈ సమస్య యొక్క చికిత్స మచ్చల కణజాలం యొక్క పురోగతిని నెమ్మదించడంపై దృష్టి పెడుతుంది. ఈ పరిస్థితి చికిత్స వీటి పాటు కలిపి ఉంటుంది:

  • సమతుల్య ఆహారం యొక్క వినియోగం
  • అధికంగా సోడియం తీసుకోవడాన్ని నివారించడం
  • హెపటైటిస్ వైరస్ యొక్క చికిత్స
  • ఐరన్ (ఇనుము) మరియు కాపర్ (రాగి) స్థాయిలు అణిచివేయడం/తగ్గించడం

తీవ్రమైన సందర్భాలలో, కాలేయ మార్పిడి అనేది చికిత్స యొక్క ఆఖరి ఎంపిక. అయితే, చికిత్స చేయకుండా విడిచిపెడితే, సమస్య ఈ క్రింది సంక్లిష్టతలకు దారితీస్తుంది:



వనరులు

  1. National Health Service [Internet]. UK; Overview - Cirrhosis
  2. American liver Foundation. The Progression of Liver Disease. [Internet]
  3. Detlef Schuppan, Nezam H. Afdhal. Liver Cirrhosis. Lancet. Author manuscript; available in PMC 2009 Mar 8. PMID: 18328931
  4. The Johns Hopkins University. Chronic Liver Disease/Cirrhosis. [Internet]
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Cirrhosis

లివర్ (కాలేయ) సిర్రోసిస్ వైద్యులు

Dr. Paramjeet Singh Dr. Paramjeet Singh Gastroenterology
10 Years of Experience
Dr. Nikhil Bhangale Dr. Nikhil Bhangale Gastroenterology
10 Years of Experience
Dr Jagdish Singh Dr Jagdish Singh Gastroenterology
12 Years of Experience
Dr. Deepak Sharma Dr. Deepak Sharma Gastroenterology
12 Years of Experience
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

లివర్ (కాలేయ) సిర్రోసిస్ కొరకు మందులు

Medicines listed below are available for లివర్ (కాలేయ) సిర్రోసిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.