జపాన్ ఎన్సెఫలైటిస్ - Japanese Encephalitis in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

December 03, 2018

July 31, 2020

జపాన్ ఎన్సెఫలైటిస్
జపాన్ ఎన్సెఫలైటిస్

జపాన్ ఎన్సెఫలైటిస్ వ్యాధి అంటే ఏమిటి?

జపాన్ ఎన్సెఫలైటిస్ వ్యాధి అనేది మనుషులకు మరియు జంతువులకు ఒకే విధమైన సూక్ష్మజీవికారక సంక్రమణవల్ల కలిగే వ్యాధి. మెదడువాపు వ్యాధి అంటే మెదడులోని ఒక భాగం లేదా ఎక్కువ భాగాలకు వాపు సంభవించడం. జపాన్ మెదడువాపు ఓ సామాన్య మెదడువాపు వ్యాధి, దీన్ని ఒక టీకా మందు ద్వారా నివారించవచ్చు. ఆసియా ఖండంలో మరియు పసిఫిక్ ఖండం యొక్క పడమటి వైపు దేశాల్లో వచ్చే మెదడువాపు వ్యాధికి ఈ జపాన్ మెదడువాపే ముఖ్య కారణం. 3-6 సంవత్సరాల వయస్సులో ఉన్న పిల్లలు సాధారణంగా జపాన్ మెదడువాపు వ్యాధికి గురవుతుంటారు. భారతదేశంలో ప్రతి సంవత్సరం 1500-4000 జపాన్ మెదడువాపు వ్యాధిరోగుల వైద్యకేసులు నమోదవుతున్నాయి.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చాలా మంది రోగులు ఎలాంటి వ్యాధి లక్షణాలను ప్రదర్శించరు. రోగులలో 1% కన్నా తక్కువ రోగులు క్లినికల్ వ్యాధి లక్షణాలను చూపుతున్నారు. జపాన్ మెదడువాపు వ్యాధి ప్రధాన లక్షణాలు:

తక్కువ సందర్భాల్లో, క్రింది వ్యాధి లక్షణాలను చూడవచ్చు:

  • మూర్ఛలు
  • మోటార్ ఫంక్షన్ వైకల్యాలు (ఓ నిర్దిష్ట పనికి సహకరించని కండరాల రుగ్మత)
  • కండరాల అసాధారణ పెడసరం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

జపాన్ మెదడువాపు వ్యాధి (జపనీస్ ఎన్సెఫాలిటిస్)కి కారణమయ్యే సూక్ష్మజీవి ‘ఫ్లావి వైరుస్’ జాతికి చెందినది. ఈ వ్యాధి సాధారణంగా దోమ కాటు ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఈ ప్రమాద సంక్రమణ కిందివాటిపై ఆధారపడి సంభవిస్తూ ఉంటుంది:

  • మీరు నివసించే ప్రదేశం లేదా సందర్శించే స్థలం (జపాన్ మెదడువాపు వ్యాధి వ్యాపించి ఉన్న ప్రాంతములు)
  • అటువంటి స్థలాలను సంవత్సరంలో మీరు సందర్శించే సమయం
  • మీరు ఆ ప్రాంతంలో చేసే పని (ఎక్కువ సమయం ఇంటి వెలుపల (outdoors) గడపడం)

జపాన్ మెదడువాపు వ్యాధిని ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

వ్యక్తి యొక్క వివరణాత్మక చరిత్ర మరియు భౌతిక పరీక్ష ఆధారంగా రోగనిర్ధారణ చేయబడుతుంది. రోగ నిర్ధారణను ధృవీకరించడానికి వైద్యుడు ఆదేశించే పరీక్షలు కిందివిధంగా ఉంటాయి:

  • రక్త పరీక్షలు: సూక్ష్మజీవులకు విరుద్ధంగా పనిచేసే ప్రతిరక్షకాలను గుర్తించడానికి
  • వంకర పంక్చర్ (Lumbar puncture): సెరెబ్రోస్పైనల్ ద్రవంలో ప్రతిరక్షకాలను తనిఖీ చేయడానికి
  • మెదడు స్కాన్లు: లక్షణ మార్పులను చూపెందుకుగాను మెదడు యొక్క చిత్రాలు, ఈ స్కాన్ వ్యాధిలక్షణ మార్పులను చూపుతుంది

ఈ వ్యాధి చికిత్సకు నిర్దిష్ట మందులు అందుబాటులో లేవు. సహాయక చర్యలు లక్షణాల ఉపశమనం కోసం తీసుకోబడతాయి. భవిష్యత్తులో సంక్రమణ నిరోధించడానికి టీకాలు వేయవచ్చు. ఇది ముఖ్యంగా ఈ పరిస్థితి సాధారణంగా ప్రాంతాల్లో ప్రయాణించే వ్యక్తులకు ఇవ్వబడుతుంది. నివారించడం టీకా 2 నెలల కంటే తక్కువ శిశువులలో ఉంది. ఇది టీకాలో ఏదైనా భాగానికి అలెర్జీ ఉన్నవారికి కూడా సూచించబడలేదు.

స్వీయ-సంరక్షణ చిట్కాలు:

  • దోమల ద్వారా సూక్ష్మజీవుల బదిలీని నివారించడంలో తోడ్పడే దోమల్నిమల్లగొట్టే (repelling) వికర్షకాలు (mosquito repellents) వాడడం.
  • దోమ కాటు నివారించడానికి పొడవు చేతులు కలిగిన సౌకర్యవంతమైన దుస్తులను ధరించండి.
  • మీ పరిసరాలను శుభ్రపరుచుకోండి మరియు మీ పరిసరాల్లో దోమలవృద్ధికి నిలయాలుగా తయారయ్యే నీటి కొలనులను తొలగించండి.



వనరులు

  1. Science Direct (Elsevier) [Internet]; Japanese encephalitis: a review of the Indian perspective.
  2. National Health Portal [Internet] India; Japanese-Encephalitis .
  3. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; A review of Japanese encephalitis in Uttar Pradesh, India.
  4. Office of Infectious Disease and HIV/AIDS Policy. [Internet]. U.S. Department of Health and Human Services. Japanese Encephalitis (JE).
  5. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Japanese Encephalitis.

జపాన్ ఎన్సెఫలైటిస్ వైద్యులు

Dr Rahul Gam Dr Rahul Gam Infectious Disease
8 Years of Experience
Dr. Arun R Dr. Arun R Infectious Disease
5 Years of Experience
Dr. Neha Gupta Dr. Neha Gupta Infectious Disease
16 Years of Experience
Dr. Anupama Kumar Dr. Anupama Kumar Infectious Disease
ఆడియో కొద్దిగా ఆలస్యం కావచ్చు

జపాన్ ఎన్సెఫలైటిస్ కొరకు మందులు

Medicines listed below are available for జపాన్ ఎన్సెఫలైటిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.