చిరాకు (ఇరిటబిలిటీ) - Irritability in Telugu

Dr. Nadheer K M (AIIMS)MBBS

December 14, 2018

July 31, 2020

చిరాకు
చిరాకు

చిరాకు అంటే ఏమిటి?

వ్యక్తి యొక్క అన్యాయకరమైన ప్రతిచర్య చిరాకును సూచిస్తుంది. లేక సమర్థించలేని (unjustified) ప్రతిచర్యను “చిరాకు”గా చెప్పవచ్చు. చిరాకనేది కోపంపై నియంత్రణ తగ్గిపోవటంతో వస్తూ ఉంటుంది, ఇది సాధారణంగా చటుక్కున అనేసే మాటలతో వ్యక్తమవ్వచ్చు లేదా ప్రవర్తనాపరమైన ప్రేరేపణల్లోనూ వ్యక్తం అవడం జరుగుతుంది. అయినప్పటికీ మానసిక స్థితి ఎరుకలోనే ఉండొచ్చు కానీ తాను వ్యక్తీకరించిన మాటలను గమనించిఉండక పోవచ్చు. చిరాకనేది సుదీర్ఘమైనది కావచ్చు, సాధారణమైనది కావచ్చు లేదా క్లుప్తమైన దశల్లోనూ సంభవించవచ్చు. చిరాకు అనేది సాధారణ చిరాకును కానీ లేదా సతాయింపును కానీ వ్యక్తీకరించడమే కావచ్చు లేదా కొన్ని అంతర్లీన రుగ్మత ఫలితంగానూ చిరాకు మనిషిలో  సంభవించవచ్చు.

దీని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

చిరాకు యొక్క సాధారణ లక్షణాలు:

  • నిగ్రహము లేని కోపం
  • అధిక నిరాశ (excessive frustration) వ్యక్తీకరణ

దీర్ఘకాలిక మరియు అధిక చిరాకు లక్షణాలు:

  • సంబంధం లేని వ్యక్తుల మీద తీవ్రమైన ప్రతిచర్యలు వ్యక్తం చేయడం
  • కుంగుబాటు, ఒత్తిడి మరియు ఆందోళన వల్ల ఏర్పడిన అన్యాయపరమైన ప్రతిచర్యలు
  • దీర్ఘకాలిక చిరాకు ఫలితంగా ఒత్తిడి సంభవిస్తుంది
  • కార్యాలయంలో సహచరులకు మరియు ఇంట్లో రోగి బంధువులవల్ల వ్యాకులతకు లోనవడం  

చిరాకు ప్రధాన కారణాలు ఏమిటి?

చిరాకు ఎల్లప్పుడూ ఒక అంతర్లీన పరిస్థితి ఫలితంగా ఉండకపోవచ్చు. ఇది సాధారణ సతాయింపులవల్ల, మళ్ళీ మళ్ళీ రెచ్చగొట్టే చర్యలవల్ల లేదా దీర్ఘకాలిక ఒత్తిడి వలన సంభవించవచ్చు.

చిరాకు యొక్క సాధారణ కారణాలు:

  • పాలిసిస్టిక్ ఓవరి సిండ్రోమ్, రుతువిరతి, హైపర్ థైరాయిడిజం, పంటినొప్పులు (toothaches), ఫ్లూ మరియు చెవి ఇన్ఫెక్షన్ వంటి వ్యాధులు.
  • మానసిక రుగ్మతలైన ఒత్తిడి, ఆందోళన, నిరాశ, బైపోలార్ డిజార్డర్, స్కిజోఫ్రెనియాశ్రద్ధ లోని హైపర్ యాక్టివిటీ (attention deficit hyperactivity) మరియు  ఆటిజం వంటివి. ఇది యువకులలో మరియు కౌమారదశలో సాధారణంగా గమనించబడుతుంది.
  • పిల్లలు కూడా తాము ప్రవర్తించే ప్రవర్తనతో చిరాకు యొక్క లక్షణాలను చూపించవచ్చు.
  • మహిళల్లో ఋతుక్రమానికి (ముట్లకు) ముందు రుతువిరతి తర్వాత కాలాల్లో చిరాకు ప్రధానంగా రావడాన్ని గమనించడం జరిగింది.
  • శ్రమపడి పనిచేసే తత్త్వం కల్గినవారిలోనూ చిరాకు ఉంటుంది.
  • దీర్ఘకాలిక ఒత్తిడి
  • ఒత్తిడి నిర్వహణ నైపుణ్యాలు బొత్తిగా లేకపోవడం
  • మద్యం దుర్వినియోగం

చిరాకును ఎలా నిర్ధారణ చేస్తారు మరియు దీనికి చికిత్స ఏమిటి?

రోగ నిర్ధారణ జాగ్రత్తగా సేకరించే రోగ చరిత్ర మరియు రోగం యొక్క మూల్యాంకనం మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తి రోగనిర్ధారణకు అవసరమైన లక్షణాల చరిత్రను ఇవ్వాలని ఆ వ్యక్తి కుటుంబ సభ్యులను కూడా కోరడం జరుగుతుంది.

మీ డాక్టర్ అంతర్లీన పరిస్థితిని నిర్ణయించడానికి వైద్యపరిశోధనలు చేయించమని సలహా ఇస్తారు.

చిరాకు చికిత్స అంతర్లీన ఆరోగ్య పరిస్థితిని అంచనా వేయడం మరియు నిర్వహించడాన్ని కల్గి ఉంటుంది.

చిరాకు చికిత్సకు అభిజ్ఞాప్రవర్తన చికిత్స మరియు ఒత్తిడి నిర్వహణ పద్ధతులైన ధ్యానం మరియు జాగరూకతతో కూడిన ఆలోచనాపరత్వం సిఫారసు చేయబడ్డాయి.

మీ వైద్యుడు కుంగుబాటునివారణా మందులు (యాంటీడిప్రజంట్స్) మరియు మానసిక స్థిరీకరణ ఏజెంట్ మందులను సూచించవచ్చు.

రిలాక్సేషన్ పద్ధతులు చికాకును అధిగమించడంలో ఉపయోగపడతాయి, వీటిలో ఇవి ఉన్నాయి:

  • వాకింగ్ మరియు ఈత వంటి శారీరక కార్యక్రమాలలో నిమగ్నమవడం
  • పుస్తకాలు చదవడం, సంగీతం వినడం
  • శ్వాస వ్యాయామం



వనరులు

  1. American Academy of Pediatrics. [Internet]. Washington, D.C., United States; Irritability and Problem Behavior in Autism Spectrum Disorder: A Practice Pathway for Pediatric Primary Care.
  2. Leslie Born. et al. A new, female-specific irritability rating scale. J Psychiatry Neurosci. 2008 Jul; 33(4): 344–354. PMID: 18592028.
  3. Snaith RP, Taylor CM. Irritability: definition, assessment and associated factors.. Br J Psychiatry. 1985 Aug;147:127-36. DOI: 10.1192/bjp.147.2.127
  4. Daniel J Safer. Irritable mood and the Diagnostic and Statistical Manual of Mental Disorders. Child Adolesc Psychiatry Ment Health. 2009; 3: 35. PMID: 19852843.
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fussy or irritable child.

చిరాకు (ఇరిటబిలిటీ) కొరకు మందులు

Medicines listed below are available for చిరాకు (ఇరిటబిలిటీ). Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.