వినికిడి లోపం - Hearing Loss in Telugu

Dr. Abhishek GuptaMBBS

December 05, 2018

March 06, 2020

వినికిడి లోపం
వినికిడి లోపం

వినికిడి లోపం అంటే ఏమిటి?

వినికిడి లోపం అంటే శబ్దాలను వినడంలో సామర్ధ్యం తగ్గిపోవడం ఇది ఎదో ఒక చెవిని లేదా రెండు చెవులను ప్రభావితం చేయవచ్చు. వినికిడిలోని అసమర్థత పై ఆధారపడి, వినికిడి లోపాన్ని తేలికపాటిది, మధ్యస్థమైనది మరియు తీవ్రమైనదిగా వర్గీకరించవచ్చు. అసలు వినపడకపోవడం లేదా చాలా తక్కువగా వినపడడాన్ని చెవుడు (deafness) అని పిలుస్తారు. కారణాన్ని బట్టి ఈ పరిస్థితి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా ఉంటుంది.

WHO ప్రకారం, 2050 నాటికి, ప్రపంచవ్యాప్తంగా 90 మిలియన్లకు పైగా ప్రజలు వినికిడి లోపంతో ఉండవచ్చు. వినికిడి సమస్య ప్రాబల్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భారతదేశం ఒకటి.

దాని ప్రధాన సంబంధిత సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

వినికిడి లోపం ఉండడమే ఒక లక్షణం. వినికిడి లోపాన్ని సూచించే ఇతర సంకేతాలు:

  • సందడిగా/గోలగా ఉన్నపుడు వినడానికి చాలా శ్రమపడడం
  • మాట్లాడుకుంటున్నపుడు (సంభాషిస్తున్నపుడు) సరిగ్గా స్పందించకపోవడం
  • అధిక శబ్దాలతో (వాల్యూమ్తో) సంగీతం వినడం లేదా టివి చూడడం
  • ఇతరులను మరలా మరలా ఒకే విషయాన్ని అడుగుతూ ఉండడం

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

సహజ వృద్ధాప్య లక్షణాలలో భాగంగా, వయసు పెరిగిన వారిలో వినికిడి లోపాన్ని సాధారణంగా చూడవచ్చు, వృద్దాప్యంకణాల క్షీణతకు దారితీస్తుంది. 40 ఏళ్ల వయస్సు నుండి వినికిడిలో ఇబ్బందులను పడవచ్చు.

పిల్లలలో వినికిడి లోపం వివిధ కారణాల వల్ల కలుగుతుంది, అవి వీటిని కలిగి ఉండవచ్చు:

  • జన్యుపరంగా (జెనెటిక్స్)
  • గర్భధారణ సమయంలో సంక్రమణ వలన
  • గర్భధారణ సమయంలో తీసుకున్న కొన్ని రకాల మందులు
  • పుట్టిన 1 నెల లోపు కామెర్లు రావడం వలన
  • తక్కువ బరువుతో పుట్టడం
  • పుట్టినప్పుడు (జన్మించే సమయంలో) ఆక్సిజన్ అందకపోవడం/తగ్గిపోవడం

వినికిడిని ప్రభావితం చేసే ఇతర కారణాలు:

  • మెనింజైటిస్,మీసల్స్ (measles), గవదబిళ్ళలు వంటి వ్యాధులు
  • చెవి యొక్క అంటువ్యాధులు/సంక్రమణలు
  • కొన్ని రకాల మందులు
  • తల లేదా చెవికి గాయం కావడం
  • చెవి గులిమి
  • కార్యాలయాలలో లేదా వినోద కార్యక్రమాలలో (కచేరీలు, నైట్క్లబ్బులు, పార్టీలు) అధిక  శబ్దాలకు గురికావడం అలాగే హెడ్ఫోన్స్ లేదా ఇయర్ఫోన్లను అధిక శబ్దంతో వినడం

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

వ్యక్తి తనకి వినికిడి సమస్య ఉందని అనుకుంటే, వైద్యుడిని (ఒక ఆడియాలజిస్ట్[audiologist]) ని సంప్రదించాలి. వైద్యులు వినికిడి లోపానికి గల కారణాన్ని కనుగొని, చికిత్సా ప్రణాళికను నిర్ణయిస్తారు. చెవిలో గులిమి వినికిడి లోపానికి కారణం అని తెలిస్తే, ఆ గులిమిని తొలగించడం ద్వారా వినికిడి లోపాన్ని సరిదిద్దవచ్చు.

అవసరమైతే వైద్యులు వినికిడి సహాయాలు (hearing aids) లేదా ఇంప్లాంట్ల ఉపయోగాన్ని కూడా కూడా సూచిస్తారు. వినికిడి నష్టం చికిత్స చేయకపోతే, లిప్ రీడింగ్ మరియు సైగల భాషను నేర్చుకోవడం వంటివి ఇతరులతో సంభాషణకు సహాయపడతాయి.

పిల్లలలో వినికిడి లోపాన్ని ఈ క్రింది విధంగా నివారించవచ్చు:

  • మీసల్స్ (measles) మరియు గవదబిళ్ళకు వ్యతిరేకంగా టీకాలు వేయించడం
  • ఓటైటిస్ మీడియా (otitis media) వంటి అంటువ్యాధుల పరీక్షలు
  • పెద్ద శబ్దాలు / సంగీతాన్ని వింటూ ఉండరాదు
  • పిల్లలు వారి చెవులలో ఏవైనా వస్తువులను చొప్పించుకోకుండా (పెట్టుకోకుండా) జాగ్రత్త పడాలి

శబ్దాలు ఎక్కువగా ఉండే ప్రదేశాలలో పనిచేసేవారు (పెద్దలు) చెవి సంరక్షణను ఉపయోగించాలి/పాటించాలి.



వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Deafness and hearing loss
  2. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; WHO global estimates on prevalence of hearing loss
  3. National Research Council (US) Basics of Sound, the Ear, and Hearing. Committee on Disability Determination for Individuals with Hearing Impairments; Dobie RA, Van Hemel S. Washington (DC): National Academies Press (US); 2004. 2
  4. Thomas Zahnert et al. The Differential Diagnosis of Hearing Loss. Dtsch Arztebl Int. 2011 Jun; 108(25): 433–444. PMID: 21776317
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Hearing loss

వినికిడి లోపం కొరకు మందులు

Medicines listed below are available for వినికిడి లోపం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.