తల మరియు మెడ క్యాన్సర్ - Head and neck cancer in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

December 10, 2018

July 31, 2020

తల మరియు మెడ క్యాన్సర్
తల మరియు మెడ క్యాన్సర్

తల మరియు మెడ క్యాన్సర్లు అంటే ఏమిటి?

తల మరియు మెడ భాగంలో నోరు, ముక్కు, మెదడు, లాలాజల గ్రంథులు, సైనసస్, గొంతు మరియు శోషరస కణుపులు (lymph nodes) వంటి అనేక అవయవాలు ఉంటాయి. అందువల్ల, ఈ క్యాన్సర్ ప్రపంచంలో అత్యంత భిన్నమైన క్యాన్సర్లలో  6 వ స్థానంలో ఉంది మరియు మొత్తం క్యాన్సర్ కేసుల్లో 6%గా ఉంది. అధికంగా ప్రభావితమైయ్యే అవయవం నోరు, మరియు ఈ క్యాన్సర్ వృద్ధులలో అభివృద్ధి చెందే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

మెడ మరియు తల భాగంలో అనేక అవయవాలు ఉన్న కారణంగా, ఈ క్యాన్సర్ యొక్క సంకేతాలు మరియు లక్షణాలు ప్రభావితమైన అవయవాలుపై ఆధారపడి ఉంటాయి. ఇంకా, కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

  • మెడలో గడ్డ ఏర్పడం
  • దీర్ఘకాలిక దగ్గు
  • బరువు నష్టం (మొత్తం శరీర బరువులో 10% కంటే ఎక్కువ)
  • డిస్ఫాజియా ( మ్రింగడంలో కష్టం)
  • మెడ ప్రాంతంలో పెరిగిన శోషరస కణుపులు (lymph nodes)
  • తలనొప్పి
  • ముఖపు తిమ్మిరి

దీని ప్రధాన కారణాలు ఏమిటి?

మన శరీరంలోని ఏదైనా కణం మ్యుటేషన్ వల్ల క్యాన్సర్ కలిగించేదిగా మారుతుంది. ఈ మ్యుటేషన్ అనేక కారణాల వల్ల సంభవిస్తుంది అందువల్ల ప్రత్యేక కారణాన్ని  గుర్తించడం కష్టమవుతుంది. కొన్ని ప్రమాద కారకాలు వీటిని కలిగి ఉండవచ్చు:

  • పొగాకు వినియోగం
  • మద్యం సెవించడం
  • (క్యాన్సర్ సంబంధిత) బలమైన కుటుంబ చరిత్ర
  • వృద్ధాప్యం
  • పురుషులు
  • పోషకాహార లోపం
  • దుమ్ము, లోహ కణాలు (metal particles) మరియు రేడియోధార్మిక పదార్ధాల (radioactive substances) కు గురికావడం/బహిర్గతం కావడం
  • హానికరమైన ఎక్స్-రే కిరణాలకు గురికావడం/బహిర్గతం కావడం

ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

సాధారణంగా వివరణాత్మక ఆరోగ్య చరిత్రతో పాటు సరైన వైద్య పరీక్షలు రోగ నిర్ధారణకి సహాయం చేస్తాయి. అయినప్పటికీ, చికిత్సా  ప్రణాళికను నిర్ణయించేందుకు కీలకమైన ట్యూమర్-నోడ్-మెటాస్టాసిస్ (TNM, tumour-node-metastasis) స్టేజింగ్ (staging) ద్వారా ఈ క్యాన్సర్ను వర్గీకరించడానికి కొన్ని ఇన్వాసివ్ (invasive) మరియు నాన్-ఇన్వాసివ్ (non-invasive) పరిశోధనలు అవసరం.

  • రక్త పరిశోధనలు - అంతర్లీన వ్యాధి పరిస్థితుల సంభావ్యతను నిర్ములించడానికి సాధారణ రక్తం పరీక్షలు అవసరం, అవి:
    • పూర్తి రక్త గణన (CBC, Complete blood count)
    • కాలేయ పనితీరు పరీక్ష (Liver function test)
    • మూత్రపిండాల పనితీరు ఫంక్షన్ పరీక్ష (Kidney function test)
  • సిటి (CT) స్కాన్ - తల మరియు మెడ యొక్క సిటి (CT) స్కాన్ క్యాన్సర్ పరిధి గురించి తెలియజేస్తుంది
  • పెట్ (PET) స్కాన్ - (PET) స్కాన్ అవయవాలకు కూడా విస్తరించే స్థాయిని గుర్తించడంలో కీలకమైనది
  • MRI స్కాన్ - క్యాన్సర్ పరిధిని నిర్ణయించడానికి CT స్కాన్ కంటే మరింత ఖచ్చితమైనది
  • ఫైన్ సూది ఆశించిన సైటోలజీ (FNAC) - ఆల్ట్రాసౌండ్డ్ గైడెడ్ లేదా CT గైడెడ్, క్యాన్సర్ కణజాలం నుంచి జీవాణుపదార్ధం తీసుకోవడంలో క్యాన్సర్

ఇతర క్యాన్సర్ల  వలె ఈ క్యాన్సర్ల చికిత్సలో కూడా శస్త్రచికిత్స, కీమోథెరపీ, ఇమ్యునోథెరపీ, లేదా రేడియేషన్ థెరపీ లేదా ఈ చికిత్సల కలయిక ఉంటుంది.

  • శస్త్రచికిత్స - ఈ క్యాన్సర్లకు చికిత్సకు ఇది ప్రధాన మార్గంగా ఉంది, దీనిలో  పూర్తి ప్రభావిత భాగాలు (అవయవాలు) శస్త్రచికిత్స ద్వారా తొలగించబడతాయి లేదా క్యాన్సర్ కణాలు తొలగించబడతాయి.
  • కెమోథెరపీ - ఇమ్యునోథెరపీతో పాటు, కీమోథెరపీ కూడా క్యాన్సర్ కణాలను చంపడంలో సహాయపడుతుంది. కొన్ని సందర్భాల్లో, కొన్ని సందర్భాలలో శస్త్రచికిత్సకు ముందు కీమోథెరపీ ఇవ్వబడుతుంది, తద్వారా క్యాన్సర్ కణాల పరిమాణాన్ని తగ్గించి తరువాత  శస్త్రచికిత్సలో అవి తొలగించబడతాయి.
  • రేడియేషన్ థెరపీ - రేడియేషన్ థెరపీ క్యాన్సర్ కణాలను చంపడానికి ప్రభావిత భాగాన్ని రేడియేట్ చేస్తుంది.



వనరులు

  1. Emory Winship Cancer Institute. [Internet]. Georgia, United States; Head and Neck Cancer.
  2. National Health Service [Internet] NHS inform; Scottish Government; Head and neck cancer.
  3. National Comprehensive Cancer Network. [Internet]. Pennsylvania, United States; NCCN Guidelines for Detection, Prevention, & Risk Reduction..
  4. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Head and Neck Cancer—Patient Version.
  5. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Head and Neck Cancers

తల మరియు మెడ క్యాన్సర్ కొరకు మందులు

Medicines listed below are available for తల మరియు మెడ క్యాన్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.