గనెరియా - Gonorrhea in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

November 29, 2018

March 06, 2020

గనెరియా
గనెరియా

గనెరియా అంటే ఏమిటి?

గనెరియా అనేది లైంగిక సంక్రమణ వ్యాధి, ఇది నిస్సిరియా గనెరియా అనే బాక్టీరియా వలన సంభవిస్తుంది. ఈ అంటువ్యాధి ఉన్నవారితో అసురక్షితమైన లైంగిక సంబంధం కలిగి ఉన్నపుడు ఇది సంభవిస్తుంది.

దాని ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు ఏమిటి?

గనెరియా ఉన్న వ్యక్తులు ఎటువంటి సంకేతాలు మరియు లక్షణాలను చూపించరు , లక్షణాలు ఉంటే, అవి తేలికపాటివిగా ఉంటాయి. మూత్రవిసర్జన సమయంలో నొప్పి మరియు మంటగా ఉంటుంది, అదే గనెరియా యొక్క సాధారణ లక్షణం

పురుషుల్లో ఉండే లక్షణాలు:

  • పురుషాంగం నుండి తెల్లని, పసుపు లేదా ఆకుపచ్చ రంగులో స్రావాలు
  • వృషణాల నొప్పి లేదా వాపు (ఇది అరుదుగా కనిపిస్తుంది)

మహిళలలో ఉండే సాధారణ లక్షణాలు:

పురుషులు మరియు స్త్రీలు ఇద్దరిలో కనిపించే సాధారణ లక్షణాలు:

  • పుండ్లు పడడం
  • రక్తస్రావం లేదా డిచ్ఛార్జ్ (స్రావాలు)
  • మలద్వార దురద (Anal itching)
  • బాధాకరమైన మలవిసర్జన

ప్రధాన కారణాలు ఏమిటి?

ఈ బ్యాక్టీరియా వ్యాధి సోకిన వ్యక్తుల వీర్యం, వీర్యం ముందు స్రవించే ద్రవాలు మరియు యోని ద్రవాలలో కనిపిస్తుంది (ఉంటుంది), అందువల్ల అది ప్రధానంగా అసురక్షిత యోని, యానల్ లేదా ఓరల్ సెక్స్ ద్వారా వ్యాపిస్తుంది. కలుషిత ద్రవాలను (ఫ్లూయిడ్స్) తాకిన చేతులతో కళ్ళును తాకడం వలన కళ్ళలో కూడా సంక్రమణం (ఇన్ఫెక్షన్) కలుగుతుంది. ఇది ప్రసవ సమయంలో సంక్రమిత తల్లి నుండి శిశువుకి కూడా  వ్యాపిస్తుంది/సంక్రమిస్తుంది.

దీనిని ఎలా నిర్ధారించాలి మరియు చికిత్స ఏమిటి?

ముందుగా, వైదులు వివరణాత్మక చరిత్రను తీసుకుంటారు, దాని తరువాత సంపూర్ణ భౌతిక పరీక్ష ఉంటుంది. వీటి ఆధారంగా, వైద్యులు ఈ క్రింది పరీక్షలను ఆదేశిస్తారు:

  • ప్రభావిత ప్రదేశం నుండి నమూనాను సేకరించి పరిక్షించడం
  • గనెరియా పరీక్ష - సేకరించిన నమూనాల సాగు, నమూనాల మైక్రోస్కోపిక్ పరీక్ష, మరియు న్యూక్లిక్ యాసిడ్ యాంప్లిఫికేషన్ పరీక్ష (NAAT, nucleic acid amplification test)
  • పరీక్ష కోసం మూత్రం నమూనాను సేకరించడం

చికిత్స పద్ధతులు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • డ్యూయల్ థెరపీ యాంటీబయాటిక్స్, ఇవి ఒక మోతాదుగా నోటి ద్వారా తీసుకునేవి మరియు మరొక మోతాదుగా ఇంట్రామస్కులర్ (intramuscular) ఇంజెక్షన్గా  ఇవ్వబడేవి.
  • వ్యాధి సంక్రమిత వ్యక్తికి సంబంధించి లైంగిక భాగస్వాములు (రోగ నిర్ధారణకు 60 రోజుల ముందు వరకు) తప్పనిసరి పరీక్షలు మరియు చికిత్స చేయించుకోవాలని సలహా ఇస్తారు.
  • గోనేరియాకు చికిత్స తీసుకునే వ్యక్తులకు తదుపరి పరీక్షలు.
  • గోనేరియాకు చికిత్స పొందుతున్న వ్యక్తులు క్లామిడియాకు చికిత్సను కూడా అందించాలి.
  • చికిత్స ముగిసేంత వరకు సెక్స్ను నివారించాలి (ఒక మోతాదు చికిత్స తర్వాత, సెక్స్కు 7 రోజులు వేచి ఉండాలి).



వనరులు

  1. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Gonorrhea
  2. Office on Women's Health [Internet] U.S. Department of Health and Human Services; Gonorrhea.
  3. National Health Service [Internet] NHS inform; Scottish Government; Gonorrhoea
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Gonorrhea
  5. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Gonorrhea Test

గనెరియా కొరకు మందులు

Medicines listed below are available for గనెరియా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.