ఫ్యాటీ లివర్‌ - Fatty Liver in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 01, 2019

March 06, 2020

ఫ్యాటీ లివర్‌
ఫ్యాటీ లివర్‌

సారాంశం

కాలేయంలో ఎక్కువ కొవ్వు (fat) పేరుకుపోవడం వల్ల వచ్చే వ్యాధే కాలేయ వాపు (swelling of liver). కాలేయ వాపు (fatty liver) రెండు రకాలు. 1. మద్యపానపు కాలేయ వ్యాధి-ఇది అధిక మద్యపానం వల్ల వస్తుంది. 2. మద్యపానేతర కాలేయ వాపు (NAFLD)- కాలేయంలో క్రొవ్వు నిక్షేపాలు పేరుకునిపోవడం వల్ల ఏర్పడే “నాన్-ఆల్కహాలిక్ కొవ్వు కాలేయ వ్యాధి (non-alcoholic fatty liver disease-NAFLD).” ఈ రెండో రకం కాలేయ వ్యాధికి ఖచ్చితమైన కారణాలు తెలియవు, అయితే, ఇది ఇన్సులిన్ నిరోధకత మరియు జీవక్రియ లక్షణాలతో ముడిపడి ఉంటుంది. ఈ రెండో రకం కాలేయ వాపు వ్యాధికుండే కాలేయ పరిస్థితులు పాశ్చాత్య దేశాల్లో ఉండే ప్రజల్ని ఎక్కువగా ప్రభావితం చేసే సామాన్య (కాలేయ) లక్షణాల్లో ఒకటి. పరిమాణంలో కాలేయం పెరగడమనే ఒక్క లక్షణం తప్పితే ఏ లక్షణాలు లేకుండా “కాలేయ వాపు వ్యాధి” మనిషిలో నిగూఢంగా ఉండవచ్చు. లేదా పూర్తి కాలేయ వైఫల్యాన్ని సూచించే తీవ్రమైన లక్షణాలతో అకస్మాత్తుగా స్పష్టాతి స్పష్టంగా అగుపడనూవచ్చు. దీనికి వెంటనే వైద్య జోక్యం చాలా అవసరం. కాలేయ వ్యాధిని  నిర్ధారణ చేయడం, వెనువెంటనే తగిన వైద్యం చేయడమే ఈ వ్యాధి నివారణకు మరియు వ్యాధి యొక్క పురోగతిని నివారించడానికి లేదా అదుపు చేయడానికి కీలకం. స్థూలకాయం బరువు తగ్గించడం మరియు వ్యాయామాల ద్వారా కాలేయ ఆరోగ్య నిర్వహణ ప్రస్తుతం రూఢీలో ఉన్న చికిత్స లక్ష్యంగా ఉంది. కాలేయవ్యాధిని ఖచ్చితంగా నయం చేయగల మరియు ప్రభుత్వం అనుమతించిన మందులు లేవు కానీ రోగి పరిస్థితిని బాగు చేసేందుకు ఉపకరించే పలు ఆశావహ మందులు రానున్నాయి. మరింత తీవ్రమైన పరిస్థితులకు శస్త్రచికిత్స అవసరం.

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రకాలు - Fatty Liver Types in Telugu

ఫ్యాటీ లివర్‌ వ్యాధి రెండు ప్రధాన రకాలు:

  • మద్యపానేతర (నాన్ ఆల్కహాలిక్) కాలేయ వ్యాధి (NAFLD)
    మద్యపానేతర కాలేయ వ్యాధి-NAFLD, కాలేయంలో కొవ్వు పెరిగిపోవడం వల్ల వస్తుంది గాని దీనికీ, మద్యం అధికంగా తీసుకోవడానికి సంబంధం లేని జబ్బు ఇది. మద్యపానేతర కాలేయవ్యాధి రెండు రకాలుగా ఉంటుంది:

    • సాధారణ కాలేయ వాపు
      ఈ సాధారణ కాలేయ వాపు రకంలో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి ఉండే పరిస్థితి ఉంటుంది, కానీ, కాలేయ కణాలకు ఎలాంటి హాని ఉండదు. ఇలా కొవ్వు చేరడం వలన ఎటువంటి వాపు గాని, మంట గాని ఉండదు. ఈ పరిస్థితి సాధారణంగా కాలేయానికి ఎటువంటి హాని కలిగించదు మరియు ఎలాంటి సమస్యలను తెచ్చి పెట్టదు.  

    • నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్ (NASH)
      ఈ రకం కాలేయ వాపు స్థితిలో, కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది, ఇంకా వాపు, కాలేయ కణాలకు నష్టం వాటిల్లుతుంది. వాపు, నొప్పితో కూడిన మంట మరియు కాలేయ కణ నష్టం అనేక ఇతర సమస్యలను కలిగిస్తాయి. ఆ ఇతర ఆరోగ్య సమస్యలేవంటే కాలేయంలో వ్యాప్తి చెందే తంతీకరణం (fibrosis), మచ్చలు, ప్రాణాంతక కాలేయ వ్యాధి (cirrhosis) మరియు కాలేయ క్యాన్సర్ వంటివి. (మరింత సమాచారం: సీస్టిక్ ఫైబ్రోసిస్ చికిత్స)

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధి
    మద్యపాన కాలేయ వాపు వ్యాధి (Alcoholic fatty liver disease) మద్యం అధికంగా తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. మద్యం కాలేయంలో విచ్ఛిన్నం అవుతుంది మరియు కొన్ని హానికరమైన పదార్థాలను  విడుదల చేస్తుంది. ఇలా విడుదలైన హానికారక పదార్థాలు కాలేయ కణాలను దెబ్బ తీస్తాయి మరియు వాపును ఎక్కువ చేస్తాయి. ఫలితంగా, శరీరం యొక్క సహజ రక్షణ వ్యవస్థ నెమ్మదిగా బలహీనపడుతుంది. ఒక వ్యక్తి మితానికి మించి మరింత మద్యం సేవించడం కొనసాగినప్పుడు, కాలేయనష్టం పెరుగుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Yakritas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for liver-related problems (fatty liver, weakness in the digestive system) with good results.
Liver Detox Tablets
₹899  ₹999  10% OFF
BUY NOW

కాలేయ వాపు వ్యాధి లక్షణాలు - Fatty Liver Symptoms in Telugu

కాలేయ వాపు వ్యాధి ఒక నిశ్శబ్ద వ్యాధి మరియు ఏ ముఖ్యమైన లక్షణాలను బయటికి కనిపించనీయదు.  సాధారణ అలసట మరియు పొత్తికడుపు ఎగువ కుడి భాగంలో కొంచెం అసౌకర్యం కలుగజేసే స్థితి ఈ వ్యాధి ఉన్న వ్యక్తిలో ఉండవచ్చు. ఈ వ్యాధి వచ్చిందని గుర్తించేందుకు ఎక్కువమందిలో ఈ వ్యాధి లక్షణాలు గమనించదగ్గవిగా  కానరావు.

అయితే దీన్ని ఎపుడు గుర్తించవచ్చు అంటే వాపుతో కూడిన మంట మరియు కాలేయానికి నష్టం సంభవించినపుడు వాచిన కాలేయం సంకేతాలను చూపుతుంది, అప్పుడు మాత్రమే వ్యాధి పరిస్థితి లక్షణాలతో స్పష్టంగా కనబడుతుంది. అప్పటికే, ఈ లక్షణాలు “సిర్రోసిస్” పరిస్థితికి దారి తీసి ఉంటుంది. సిర్రోసిస్ అంటే కాలేయం యొక్క కణాల క్షీణత ఏర్పడి చెరిపేయలేని మచ్చలతో నష్టం కలగడమే. ఇది కామెర్లను పోలి ఉంటుంది. ఇది ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి.   చర్మం మరియు కన్నుల్లోని తెల్ల కనుగుడ్లు వ్యాధి ఉనికిని సూచించే పసుపు రంగులోకి మారవచ్చు. రోగిలో కాలేయం దెబ్బతిన్నదన్న దానికి  మరొక సంకేతం “జలోదరం ” మరియు “ఎడెమా”, అనే లక్షణాలు. ఈ లక్షణాలు కనిపిస్తే కాలేయం దెబ్బ తినడంతో పాటు శరీరం యొక్క కణజాలంలో అసాధారణంగా ద్రవాలు చేరడం సంభవించిందన్నమాట.

భౌతిక పరీక్ష సమయంలో మీ డాక్టర్ కాలేయం బిర్ర బిగుసుకుపోయి ఉండడాన్ని గమనించవచ్చు. కాలేయం ఇలా బిర్రబిగుసుకు పోవడమనేది కాలేయం యొక్క “ఫైబ్రోసిస్” స్థితిని సూచిస్తుంది. ఈ స్థితిలో కాలేయంపై  మచ్చలు కనబడవచ్చు.
కాలేయం దెబ్బతిన్న వ్యక్తికి కాలేయంలోనే కమిలిన గాయాలు ఎక్కువవడం జరిగి మానసిక గందరగోళాన్ని పెంచవచ్చు.

కాలేయ వాపు వ్యాధికి కారణాలు మరియు ప్రమాద కారకాలు - Fatty Liver Causes & Risk Factors in Telugu

కారణాలు

మితం మించి మద్యపానం చేయడమే “మద్యపాన కాలేయ వాపు వ్యాధి” కి గల ప్రధాన కారణాలలో ఒకటి. మద్యం శరీరంలోనికి ప్రవేశించాక ‘శరీరజన్య విషం’గా మారి కాలేయం వాపుకు, మంటకు కారణమవుతుంది. కాని మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు (Non-alcoholic fatty liver disease-NAFLD)కు  ఖచ్చితమైన కారణం ఇంకా తెలియదు. కాలేయంలో కొవ్వు కణాలు పోగటానికి ఎన్నో కారణాలు. ఈ కారణాల్లో ఎదో ఒక కారణం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) మరియు మద్యపానేతర కామెర్ల జబ్బు-NASH దాపురించవచ్చు.

  • ఆహారం 
    అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల కాలేయంలో కొవ్వు చేరడం జరుగుతుంది. కనుక, అనారోగ్య ఆహారం కాలేయ వాపు వ్యాధికి ప్రధాన కారణాలలో ఒకటి. అధికమైన కేలరీలు గల ఆహారం  తీసుకోవడం మూలంగా కాలేయం కొవ్వు కణాలపై చయాపచయ క్రియను నిర్వహించడంలో విఫలమై కాలేయంలో కొవ్వు పేరుకుపోవడానికి దారితీస్తుంది.
  • ముందుగానే ఉన్న వ్యాధులు
    రెండో రకం డయాబెటిస్ (Type 2 diabetes), ఊబకాయం లేదా అధిక బరువు వంటి కొన్ని వ్యాధులు, కాలేయ వాపు పరిస్థితికి ఒక వ్యక్తిని మరింత ప్రభావితం చేస్తుంది. ట్రైగ్లిజరైడ్స్ యొక్క అధిక స్థాయి, కొవ్వు కణాల్లోనే ఒక నిర్దిష్ట రకమైన కొవ్వు కణాలు ఎక్కువవడం కూడా కాలేయ వాపు వ్యాధికి గురి చేస్తాయి.  
  • మందులు
    టామోక్సిఫెన్, అమోడియోరోన్ మరియు మెతోట్రెక్సేట్ వంటి కొన్ని ఔషధాలు ఈ వ్యాధి పరిస్థితికి దారితీసే దుష్ప్రభావాలకు కారణమవుతాయి.
  • ఇన్సులిన్ నిరోధకత
    ఇన్సులిన్ నిరోధకత మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి అనుసంధానం కావచ్చనే  సూచనలు ఉన్నాయి. కాలేయంలో గ్లూకోజ్ను చయాపచయం (metabolise) చేయడంలో అందులోని కణాలు ఉత్పత్తి అయిన ఇన్సులిన్ను తగినంతగా ఉపయోగించుకోలేక పోవడం మూలంగా కూడా కాలేయంలో కొవ్వు పేరుకుపోతుంది.

ప్రమాద కారకాలు

మద్యపానేతర కాలేయ వ్యాధి (NAFLD)కి ఖచ్చితమైన కారణం తెలియదు. కొన్ని వైద్య పరిస్థితులు మరియు నిర్దిష్ట జాతి నేపథ్యాలతో ఉన్నవారు కాలేయ వాపుకు ఎక్కువగా గురయ్యే పరిస్థితి ఉంది, అంతే గాక ఈ వ్యాధి వారికి మరింత ఎక్కువగా దాపురించే ప్రమాదముంది.  రెండో రకం మధుమేహం (Type 2 diabetes) లేదా ప్రీ-డయాబెటీస్ స్థితి, ఊబకాయం, వయసు మళ్లినవారు, రక్తంలో ట్రైగ్లిజెరైడ్స్ మరియు కొలెస్ట్రాల్ వంటి అధిక స్థాయి కొవ్వు, అధిక రక్తపోటు, కొన్ని క్యాన్సర్ మందులు, హెపటైటిస్-సి వంటి అంటురోగాలు మరియు శరీరజన్య విషపదార్థాలకు గురికావడం వంటి పరిస్థితులు కాలేయవాపు వ్యాధికి దగ్గరయ్యే అవకాశాలను పెంచుతుంది.

కాలేయవాపు వ్యాధి నివారణ - Prevention of Fatty Liver in Telugu

కాలేయ వాపు  వ్యాధికి ఒక నిర్దిష్టమైన వైద్య చికిత్స లేదా శస్త్రచికిత్స అంటూ లేదు. కానీ, ఈ కాలేయ వాపు వ్యాధికి గురైన వ్యక్తి తగిన నివారణా  చికిత్స తీసుకుంటే వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించి కొంత వరకు వాపును బాగు చేసుకోవచ్చు. మద్యపానేతర కాలేయ వ్యాధికి చెందిన నాన్-ఆల్కహాలిక్ స్టీటోహెపటైటిస్-NASH (కామెర్లు) తో బాధపడుతున్నవారు ఈ నివారణా చికిత్స తీసుకుంటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది.

కాలేయ వాపు వ్యాధిని ఆపడానికి, ఇంకనూ వ్యాధి తీవ్రతను తిరోగమనం పట్టించడానికి సహాయపడే చర్యలు కింది విధంగా ఉన్నాయి:

  • బరువు తగ్గడం
    సురక్షితంగా బరువు తగ్గడమనేది కాలేయ వాపు ను  నిర్వహించుకోవడంలో తోడ్పడుతుంది. సురక్షితంగా బరువును కోల్పోవడమంటే ఒక వారంలో అర్ద కిలోగ్రామ్ లేదా ఒక కిలోగ్రాము కంటే ఎక్కువ బరువును కోల్పోకుండా ఉండడం.  
  • మద్యపానానికి దూరంగా ఉండటం
    మద్యం సేవించడం కాలేయానికి హానికరం. మద్యం కాలేయంలో విరిగిపోయినప్పుడు కాలేయానికి హాని కలిగించే పదార్థాలను ఉత్పత్తి చేసి విడుదల చేస్తుంది. మాద్యపానాన్ని ఆపేయడం మూలంగా కాలేయం తనలో పేరుకుపోయిన శరీరజన్య విషాన్ని తొలగించడానికి మరియు స్వయంగా నయం చేసుకునే అవకాశాన్నీ కాలేయానికి కల్పించినట్లవుతుంది.  
  • మధుమేహం నియంత్రించటం
    మధుమేహం (చక్కెరవ్యాధి) వ్యాధిని సవ్యంగా నిర్వహించుకుంటూ వెళ్తే మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) ని మెరుగ్గా నయం చేసుకోవడానికి సహాయపడుతుంది.
  • ఆహారసేవనం లో మార్పులు
    మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) రోగుల విషయంలో-వారి వ్యాధి చికిత్స మరియు నిర్వహణలో ఆహారం కీలక పాత్ర పోషిస్తుంది. తాజా పండ్లు, కూరగాయలు మరియు తృణధాన్యాలు వారి ఆహారంలో చేర్చండి మరియు అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం నివారించండి.
  • మీ శారీరక శ్రమపెంచేందుకు వ్యాయామం  
    మద్యపానేతర కాలేయ వ్యాధి రోగులు వారి శారీరక శ్రమ (వ్యాయామాలు మొదలైనవి)ను  కొద్దిపాటిగా పెంచినా అది వారికి చికిత్సాపరమైన మేలును కలుగజేసి ఉపయోగకరమైందిగా కనిపిస్తుంది.
  • మీ వైద్యుడితో నిరంతరంగా పరీక్షలు చేయించుకోవడం
    మీ కాలేయ ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి లివర్ స్పెషలిస్ట్ ద్వారా రెగ్యులర్ గా పరీక్షలు చేయించుకుని చికిత్స పొందడం చాలా ముఖ్యమైంది  
Milk Thistle Capsule
₹749  ₹899  16% OFF
BUY NOW

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ - Diagnosis of Fatty Liver in Telugu

కాలేయ వాపు వ్యాధి నిర్ధారణకు ఎలాంటి నిర్దిష్ట లక్షణాలు లేనందున వైద్యుడు మీ రక్తపరీక్ష పరిశీలనలో ఏదైనా  విలక్షణమైనదాన్ని గమనించినట్లయితే గాని లేక పరిమాణం పెరిగిన కాలేయమును గమనిస్తే గాని ఈ వ్యాధి రోగికున్నట్లు యాదృశ్చికంగానే బయట పడుతుంది. అటువంటి సందర్భాల్లో డాక్టర్ కాలేయ వాపు వ్యాధి యొక్క ఉనికిని పసిగట్టినపుడు కొన్ని రక్త పరీక్షలు, కాలేయ పనితీరు పరీక్షలు, అల్ట్రాసౌండ్, ఒక CT స్కాన్ లేదా ఒక MRI ను మీ కాలేయ స్థితిని నిర్ధారించడానికి గాను సూచించవచ్చు.

మీకు చేసిన అనేక పరీక్షలు మీకు ఎలాంటి ఇతర కాలేయ వ్యాధులు లేవని సూచిస్తూ ఉండగా మీరు మద్యపానేతర స్టీటోహెపటైటిస్ (NASH) లేక కామెర్లతో బాధపడుతున్నారని మరో పరీక్ష తేల్చవచ్చు. ఒక్క కాలేయ జీవాణుపరీక్ష మాత్రమే వ్యాధిని నిర్ధారించగలదు. కాలేయం జీవాణుపరీక్షలో, కాలేయ కణజాలం యొక్క ఒక చిన్న నమూనా తొలగించబడుతుంది మరియు దాన్ని సూక్ష్మదర్శిని క్రింద వైద్యుడు పరిశీలిస్తాడు. డాక్టర్ కాలేయ వాపు వ్యాధి అని  అనుమానిస్తే, మీనుండి ఒక వివరణాత్మక వైద్య చరిత్రను అడిగి తెలుసుకుంటాడు. మరియు మీకు మద్యంపానం అలవాటుంటే దాని గురించి మరియు ఏవైనా మందులసేవనం వల్ల సమస్యను కల్గించి ఉంటె దాన్ని గుర్తించడానికి మీరు తీసుకున్న మందులు గురించి డాక్టర్ మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతారు.

కాలేయ వాపు వ్యాధి చికిత్స - Fatty Liver Treatment in Telugu

రోగికి దాపురించిన కాలేయ వాపు వ్యాధి యొక్క రకాన్ని బట్టి ఆ వ్యాధి నిర్వహణ క్రింది విధంగా ఉంటుంది:

మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (Non-alcoholic Fatty Liver Disease ,NAFLD)

మద్యపానేతర కామెర్ల జబ్బు (NASH)కు గాని లేదా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD)కి గాని  ఎటువంటి స్థిరమైన మందులు లేవు.

  • ఈ కాలేయ వాపు వ్యాధి నిర్ధారణ చేయబడిన వారికి బరువు తగ్గమని వైద్యులు సిఫారసు చేస్తారు. బరువు తగ్గడం మూలంగా  కాలేయంలో పేరుకుపోయిన కొవ్వు, మంట మరియు కాలేయం పై ఏర్పడిన మచ్చలు ( ఫైబ్రోసిస్) తగ్గుతాయి.
  • శారీరక శ్రమ (వ్యాయామాలతో కూడినది కావచ్చు)ను  పెంచడమనేది మొత్తం శరీరంలోని కొవ్వును తగ్గించుకోవడానికే కాక కాలేయంలోని కొవ్వునూ తగ్గించుకోవడానికి సహాయపడుతుంది. శారీరక శ్రమ కార్యకలాపాలు సిఫార్సు చేసిన స్థాయి కంటే తక్కువ అయినప్పటికీ, కేవలం క్రియాశీలకంగా ఉండటం వల్ల మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి NALFD లో ప్రయోజనకరమైన ప్రభావాన్ని చూపిస్తుంది.  
  • వైద్యులు మీరు తీసుకున్న మందులను మూల్యాంకనం చేయవచ్చు మరియు కొన్ని ఔషధాలను మార్చమని లేదా మరి కొన్ని మందుల్ని నిలిపివేయమని మిమ్మల్ని అడగొచ్చు. మీ వైద్యుని ఆమోదం లేకుండా మీరు చికిత్సలో భాగంగా తీసుకుంటున్న మందుల్ని   ఆపకండి , అలా చేస్తే అది ఇతర సమస్యలకు దారి తీస్తుంది మరియు మీ ఆరోగ్యానికి ప్రమాదకరమైనదిగా మారే ప్రమాదం ఉందని నిరూపించగలదు.
  • మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) చికిత్సకు ఎటువంటి ఆమోదిత ఔషధాలు లేవని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కానీ మధుమేహం (చక్కెరవ్యాధి) జబ్బు చికిత్సకు వాడే కొన్ని మందులు మరియు విటమిన్లు కాలేయ వాపు వ్యాధి చికిత్సకు కూడా సహాయపడతాయని సూచించిన ఆధారాలు ఉన్నాయి. ఏదేమైనా ఈ విషయంలో ఎటువంటి నిర్ధారణకు రావడానికి ముందుగా పరిశోధన అవసరం.

మద్యపాన కాలేయ వాపు వ్యాధి

  • మద్యపాన కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్న వారికి చేసే చికిత్సలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒకటేమిటంటే వారు మద్యపానాన్ని పూర్తిగా మానెయ్యాలి. మద్యపానాన్ని మానేయడానికి కష్టంగా ఉండేవారికి సహాయకారిగా ఉండే వేరే చికిత్స సిఫారసు చేయబడుతుంది, ఆ చికిత్స ద్వారా మద్యపానాన్ని మానుకోవచ్చు.  
  • మద్యం సేవించడాన్ని మానుకోవడానికి కొన్ని మందులు సహాయం చేస్తాయి. ఎలాగంటే ఈ మందులు తీసుకోవడం ద్వారా మద్యం పుచ్చుకోవాలన్న కోరిక తగ్గిపోతుంది. మద్యం త్రాగితే ఎదో జబ్బుపడినట్లుండే భావనను ఈ మండలి కల్గిస్తాయి.  

జీవనశైలి నిర్వహణ

మీరు కాలేయ వాపు వ్యాధితో బాధపడుతున్నట్లు పరీక్షల ద్వారా నిర్ధారణ అయితే, మీరు మీ దిననిత్యచర్యల్లో కొన్ని జీవనశైలి మార్పులను చేసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల మీ పరిస్థితి మెరుగై  మరింత ప్రభావవంతంగా జీవితాన్ని నిర్వహించడానికి వీలుంటుంది. అలాంటి జీవనశైలి మార్పులు కొన్ని ఏవంటే:

  • మీ ఆహారంలో 3-4 భాగాల తాజా పండ్లు మరియు కూరగాయలను చేర్చండి. అధిక చక్కెర మరియు ఉప్పు తీసుకోవడం మానుకోండి మరియు ప్రాసెస్ చేసిన ఆహారాలకు బదులుగా తృణధాన్యాలను మీ ఆహారంలోకి తీసుకోండి.
  • సంతృప్త కొవ్వులు మరియు క్రొవ్వు ఆమ్లాలు కలిగిన ఆహార పదార్ధాలను తగ్గించి వాటి స్థానంలో ఆలివ్ ఆయిల్ వంటి ఏక అసంతృప్త కొవ్వులు మరియు బహుళఅసంతృప్త కొవ్వులు, ముఖ్యంగా ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలను తీసుకోండి, దీనివల్ల కాలేయ వాపు వ్యాధితో సంబంధం ఉన్న గుండె వ్యాధులు తగ్గే  అవకాశాలు ఉన్నాయి.
  • మీ బరువును అదుపులో ఉంచడానికి మరియు కాలేయంలో పేరుకుపోయిన కొవ్వును తగ్గించడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి.
  • మీరు విటమిన్లు, లేదా ప్రత్యామ్నాయ మూలికా మందులు వంటివి ఆహార పదార్ధాలుగా తీసుకుంటుం టే, దాని గురించి మీ డాక్టర్తో మాట్లాడటం మరియు అతని/ఆమె సలహా తీసుకోవడం చాలా ముఖ్యం. కొన్ని మూలికా ఔషధాలు మీ కాలేయానికి హానిని కలిగిస్తాయి.
  • కాలేయం దెబ్బతిన్న వ్యక్తులు కొన్ని రకాల అంటువ్యాధులు మరియు “న్యుమోకోకల్” అనే ఒక విధమైన బాక్టీరియా వ్యాధులకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులు కామెర్ల జబ్బు (హెపటైటిస్ A మరియు B), ఫ్లూ మరియు న్యుమోకోకల్ వ్యాధులకు నిర్దేశింపబడిన టీకామందులు వేసుకోవడం ముఖ్యం. కాలేయ వాపు వ్యాధి ఉన్న వ్యక్తులకు హెపటైటిస్ లేదా కామెర్ల వ్యాధి  చాలా ప్రమాదకరమైనది కావచ్చు మరియు ఇది కాలేయ వైఫల్యానికి కూడా దారితీయవచ్చు.

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ - Fatty Liver Complications and Prognosis in Telugu

కాలేయ వాపు వ్యాధి ఉపద్రవాలు మరియు రోగ నిరూపణ

రోగనిరూపణ

ఆరోగ్యకరమైన కాలేయానికి తనకు తానుగా (స్వయంగా) నయం చేసుకోగల గొప్ప సామర్ధ్యం ఉంటుంది, ఒకవేళ గాయపడినట్లయితే తిరిగి కోలుకుంటుంది, మరియు పునరుత్పత్తి కూడా చేసుకోగలదు. కాలేయ వాపు వ్యాధికి సకాలంలో రోగనిర్ధారణ జరిపి వెనువెంటనే చికిత్స చేసినట్లయితే కాలేయానికి అయిన హాని రూపుమాపబడి, రోగం మాయమైపోయి మళ్ళీ కనిపించకుండా పోతుంది. ఇది అనేకమంది రోగుల విషయంలో నిరూపితమైంది. మనిషిలో కాలేయం దెబ్బ తినిందనడానికి మంట మరియు తంతీకరణం (ఫైబ్రోసిస్) అనేవి తొలి లక్షణాలు. ఈ ప్రారంభ దశలోనే కాలేయ వాపు వ్యాధి రోగ నిర్ధారణ అయినట్లయితే, మీ కాలేయం కొంతకాలంలోనే తనకు తానుగా నయం చేసుకోగలదు. ఇలా మన కాలేయం తనకు తానుగా రోగనయం చేసుకోవాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు ఆహార మార్పులను చేసుకోవాల్సి  ఉంటుంది. కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం తక్కువగా ఉన్నట్లైతే తంతీకరణం (Fibrosis) తీవ్రంగా పెరిగిపోయి ప్రాణాంతక కాలేయ వ్యాధి  (cirrhosis)గా   రూపాంతరం చెందుతుంది. కాలేయ వ్యాధి సిర్రోసిస్ దశలోకొచ్చినపుడు కాలేయంలో ఆరోగ్యకరమైన కణజాలం  చాలా తక్కువగా ఉంటుంది. ఈ దశలో వ్యాధికి చేపట్టే చికిత్స యొక్క లక్ష్యమంతా కొద్దిగా మిగిలున్న ఈ ఆరోగ్యకరమైన కాలేయకణజాలాన్ని రక్షించి వ్యాధి పురోగతిని నిలిపివేయడం పైన్నే ఉంటుంది.  

ఉపద్రవాలు

కాలేయ వాపు వ్యాధి యొక్క ముగింపు దశ కాలేయ వైఫల్యం (liver failure). కాలేయ వైఫల్యం ప్రాణాంతకమైన కాలేయ వ్యాధి లేదా సిర్రోసిస్ కారణంగా లేదా పోషకాహారలోపం కారణంగా సంభవిస్తుంది. కాలేయ వైఫల్యం సిర్రోసిస్ వల్ల సంభవించినట్లయితే, కాలేయ వైఫల్యం నెమ్మదిగా ఉంటుందని వైద్యులంటారు. ఈ దశలో కాలేయపు పనితీరు నెమ్మదిగా, అంటే సంవత్సరాల తరబడి, క్షీణిస్తుంది. పోషకాహార లోపము వలన సంభవించే కాలేయ వైఫల్యం అకస్మాత్తుగా ఉంటుంది, అంటే కేవలం 48 గంల్లోపలే సంభవించవచ్చు. ఇటువంటి దశలో రోగికి కాలేయ మార్పిడి ఒక్కటే చికిత్స.

Wheatgrass Juice
₹449  ₹499  10% OFF
BUY NOW

కాలేయ వాపు వ్యాధి అంటే ఏమిటి - What is Fatty Liver in Telugu

నేటి రోజుల్లో ఊబకాయం మరియు మధుమేహం అనేవి మనుషుల్లో పెరుగుతున్న కారణంగా మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి (NAFLD) అనేది సామాన్యమైపోతోంది. ఈ వ్యాధి భారతీయ జనాభాలో 9% నుండి 32% మందిని బాధిస్తోంది. ముఖ్యంగా ఊబకాయులు మరియు చక్కెరవ్యాధి (డయాబెటిక్) రోగులైన జనాభాకు మద్యపానేతర కాలేయ వాపు దాపురిస్తోంది. ఈ వ్యాధి వయసుపైబడ్డ వారిలో సాధారణం. భారతీయ జనాభాపై నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలిందేమంటే, 61.8% మంది మద్యపానేతర కాలేయ వాపుబారిన పడ్డారని, ఈ రోగులందరూ 61 నుండి 70 సంవత్సరాల మధ్య ఉన్నారని.  మద్యపానేతర కాలేయ వాపు వ్యాధి యొక్క నిర్వహణ ప్రత్యేకంగా ఉంటుంది. ఎందుకంటే ఈ వ్యాధి ఉన్న ఊబకాయులకైతే బరువు తగ్గించమని, శారీరక వ్యాయామాలను చేపట్టమని మరియు ఆహార మార్పులను అలవర్చుకొమ్మని, ఇంకా పలు జీవనశైలి మార్పులను  వైద్యులు సాధారణంగా సిఫార్సు చేస్తారు. ఈ పరిస్థితికి సిఫార్సు చేసిన మందులు ఏవీ లేవు. అంతవరకూ వ్యాయామం జోలికెళ్లని ఈ వ్యాధి రోగులు ఏమాత్రం శారీరక వ్యాయామం చేసినా వారి పరిస్థితిలో ప్రయోజనకరమైన ప్రభావం రావడం కనబడింది. ఇంకా, ఏరోబిక్ వ్యాయామాలు, మరియు వ్యాధినిరోధకతలో శిక్షణ లేక ‘శక్తి శిక్షణ’ కూడా మద్యపానేతర కాలేయ వాపు రోగులకు సహాయకారిగా ఉంటాయి.

కాలేయవాపు వ్యాధి (లేక Fatty Liver Disease) అంటే ఏమిటి?

మానవుడి శరీరంలో కాలేయం అనేది చాలా పెద్ద అంతర్గత అవయవాల్లోఒకటి. కాలేయం మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసేందుకు, శరీరం నుండి శరీరజన్యవిషాన్ని మరియు ఇతర విషాల్ని తీసివేసి, మన శరీరంలో శక్తిని నిల్వ చేయడానికి మనకు సహాయపడుతుంది. కాలేయంలో కొవ్వు క్రమంగా నిర్మాణమవడమే “కాలేయ వాపుకు దారి తీస్తుంది. మన కాలేయంలో సాధారణంగానే  కొంత కొవ్వు ఉంటుంది అయితే ఇది ఎటువంటి వ్యాధి లక్షణాలను ఉద్భవించనీయదు. అయితే, కాలేయంలో ఉండే కొవ్వుకు తోడు అధికంగా కొవ్వు పేరుకుంటూ పోవడం కాలేయ వాపుకు దారితీస్తుంది. ఈ పరిస్థితినే “కాలేయ వాపు వ్యాధి” గాను, “ఫాటీ లివర్ వ్యాధి” అని పిలువ బడుతుంది.



వనరులు

  1. Leon A. Adams, Paul Angulo, and Keith D. Lindor. Nonalcoholic fatty liver disease. CMAJ. 2005 Mar 29; 172(7): 899–905. PMID: 15795412.
  2. Kalra S, Vithalani M, Gulati G, Kulkarni CM, Kadam Y, Pallivathukkal J, Das B, Sahay R, Modi KD. Study of prevalence of nonalcoholic fatty liver disease (NAFLD) in type 2 diabetes patients in India (SPRINT). J Assoc Physicians India. 2013 Jul;61(7):448-53. PMID: 24772746.
  3. Min-Sun Kwak, Donghee Kim. Non-alcoholic fatty liver disease and lifestyle modifications, focusing on physical activity. Korean J Intern Med. 2018 Jan; 33(1): 64–74. Published online 2017 Dec 6. PMID: 29202557.
  4. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Fatty Liver Disease
  5. Better health channel. Department of Health and Human Services [internet]. State government of Victoria; Liver - fatty liver disease
  6. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Eating, Diet, & Nutrition for NAFLD & NASH
  7. American Liver Foundation [Internet]. New York: American Association for the Study of Liver Diseases; The Progression of Liver Disease.

ఫ్యాటీ లివర్‌ కొరకు మందులు

Medicines listed below are available for ఫ్యాటీ లివర్‌. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for ఫ్యాటీ లివర్‌

Number of tests are available for ఫ్యాటీ లివర్‌. We have listed commonly prescribed tests below: