అంగస్తంభన లోపం - Erectile Dysfunction in Telugu

Dr. Rajalakshmi VK (AIIMS)MBBS

February 01, 2019

March 06, 2020

అంగస్తంభన లోపం
అంగస్తంభన లోపం

సారాంశం

రతి క్రీడలో పురుషుడి అంగం (శిశ్నము) గట్టిపడకపోవడమనే సమస్యనే “అంగస్తంభన వైఫల్యం” గా పరిగణిస్తారు. దీన్నే నపుంసకత్వము అని కూడా వ్యవహరిస్తారు. అంగస్తంభన (organ erection) అనేది నరాలు మరియు రక్తనాళాలకు సంబంధించి (మనిషిలో) జరిగే సంఘటన. ఆలోచనల ద్వారా గాని లేదా స్పర్శ ద్వారా గాని లైంగిక ప్రేరణ ఏర్పడి జరిగేదే ‘అంగస్తంభన’. మందుల సేవనం, మద్య వ్యసనం, శారీరక బలహీనత, చక్కెరవ్యాధి/మధుమేహం వంటి అనేక కారణాల వలన అంగస్తంభన వైఫల్యం సంభవిస్తుంది. అంగం గట్టిపడకపోవడమనేది మగాళ్ళలో ఒక సాధారణ రుగ్మత, కానీ ఇది జనబాహుళ్యంలో చాలామటుకు చర్చింపబడలేదు. ఈ ఆరోగ్య సమస్య యొక్క సున్నితమైన స్వభావం కారణంగా అంగస్తంభన వైఫల్యము కల్గిన పురుషులు డాక్టర్ను సంప్రదించడానికి కూడా విముఖంగా ఉంటారు.  చికిత్స చేయని అంగస్తంభన వైఫల్యం జీవితభాగస్వామితో మానసిక-సామాజిక సమస్యలకు దారితీస్తుంది.

నపుంసకత్వ రకాలు - Types of Impotence in Telugu

అంగస్తంభన వైఫల్యంతో బాధపడే వివిధ పురుషులలో ఈ బాధ యొక్క తీవ్రత విభిన్నంగా ఉంటుంది. వివిధ రకాలైన అంగస్తంభన వైఫల్యాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • ప్రాథమిక నపుంసకత్వము
    ప్రాధమిక నపుంసకత్వంలో, పురుషుడు నిరంతరమైన అంగ దారుఢ్యాన్ని కలిగి ఉండడు మరియు ఇంకెప్పటికీ కూడా కల్గి ఉండడు. ఇది పురుషాంగం యొక్క నిర్మాణం లేదా దెబ్బతిన్న శిశ్న నరాలు లేదా చిక్కుపడిన  శిశ్ననరాల యొక్క భౌతిక అసాధారణత వల్ల కావచ్చు.
  • ద్వితీయ నపుంసకత్వము
    ఈ రెండో రకం నపుంసకత్వంలో ఓ మగాడు గతంలోనెమో విజయవంతమైన అంగస్తంభనను కల్గి ఉండేవాడే కానీ తెలియని కారణాల వలన ప్రస్తుతం మాత్రం విజయవంతమైన అంగస్తంభనను పొందలేకపోతుంటాడు.  
  • పరిస్థితుల నపుంసకత్వము
    పరిస్థితుల నపుంసకత్వము అంటే మగాడు హస్తప్రయోగం/ముష్ఠిమైథునం వంటి ఒక ప్రత్యేక పరిస్థితిలో మాత్రమే తన అంగాన్ని గట్టిపరుచుకోగల్గుతాడు కానీ భాగస్వామితో లైంగిక క్రీడలో పాల్గొన్నప్పుడు అంగస్తంభనను పొందలేక విఫలమైపోతాడు.  
  • పాక్షిక నపుంసకత్వము
    పురుషాంగ నరాలకు చాలినంతగా రక్త సరఫరా జరగకపోవడం వల్ల పురుషుడు పాక్షిక అంగస్తంభనను సాధిస్తాడు కానీ తర్వాత ఆ పాక్షికమైన అంగ-గట్టిదనాన్ని  కూడా కోల్పోతాడు.
  • పూర్ణ నపుంసకత్వము
    పూర్ణ నపుంసకత్వము కలిగిన మగాడు ఎప్పుడూ, ఎన్నటికి, ఇక ఎప్పటికీ గట్టిపడిన అంగాన్ని పొందలేక పోవచ్చు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

అంగస్తంభన వైఫల్యం (నపుంసకత్వము) లక్షణాలు - Erectile Dysfunction (Impotence) symptoms in Telugu

అంగస్తంభన వైఫల్యానికి సంబంధించిన లక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయి, అలాంటి లక్షణాల్లోనివి ఏవంటే:

  • సంపూర్ణమైన అంగస్తంభనను పొందడానికి అసమర్థత.
  • కొన్ని నిర్దిష్టమైన పరిస్థితులపై లేదా నిర్దిష్ట స్థానావస్థలపై  ఆధారపడిన పాక్షికమైన లైంగిక అసమర్థత.
  • సంతృప్తికరమైన లైంగిక సంభోగం సాధించడానికి ప్రారంభంలో సాధించిన అంగస్తంభనను గణనీయమైన కాలం వరకు పురుషుడు కొనసాగించలేకపోతాడు..
  • తగ్గిన లైంగిక వాంఛ.

అంగస్తంభనవైఫల్య కారణాలు మరియు ప్రమాద కారకాలు - Erectile Dysfunction causes & risk factors in Telugu

కారణాలు (Causes) 

జీవశాస్త్రపరంగా, ఒక మగవాడిలో, లైంగిక ప్రేరేపణ మరియు లింగదార్ఢ్యము పొందడానికి దారి తీసే ప్రక్రియ అనేది ఓ క్లిష్టమైన పధ్ధతి. నాడీ వ్యవస్థ (మెదడు మరియు వెన్నుపాము సంబంధంమైనవి, సంబంధిత నరములతో కలిపి), ఎండోక్రైన్ (హార్మోన్) వ్యవస్థ మరియు కార్డియోవాస్కులర్ వ్యవస్థ (గుండె) ఈ క్లిష్టమైన పధ్ధతిని  కల్గి ఉంది. పేర్కొన్న ఈ శరీర వ్యవస్థల్లో దేనినైనా భంగం కలిగించడం వలన అంగస్తంభన వైఫల్యం సంభవించవచ్చు. పురుషాంగం లేదా వృషణాలలో భౌతిక లేదా నిర్మాణపరమైన అసాధారణత కూడా అంగస్తంభన వైఫల్యానికి దారి తీస్తుంది. అంగస్తంభన వైఫల్యానికి కొన్ని కారణాలు క్రింద ఇవ్వబడ్డాయి:

లైంగిక ప్రేరేపణ పరిమాణంపై ఆధారపడిన మరో అంగస్తంభన వైఫల్య కారణాల వర్గీకరణ:  

తగ్గిన లైంగిక ప్రేరేపణతో

  • జననగ్రంథి మాంద్యం (హైపోగోనాడిజం) (తగ్గిన టెస్టోస్టెరాన్ స్థాయి).
  • డిప్రెషన్/దుఃఖం .

అధిక లైంగిక ప్రేరేపణతో

  • ఆందోళనతో సహా మానసిక సమస్యలు.
  • మెదడుకు తగ్గిన రక్తప్రసరణ (నాడీవ్రణం/అథెరోమా).
  • న్యూరోపతి కారణాలు (ఉదా. డయాబెటిస్, అధిక మద్యపానం, పలుచోట్ల రక్తనాళాలు గట్టిపడే వ్యాధి (మల్టిపుల్ స్క్లేరోసిస్).
  • డ్రగ్స్ (ఉదా: బీటా బ్లాకర్స్, థయాజైడ్ డ్యూరైటిక్స్, యాంటీడిప్రజంట్స్ మొదలైనవి).

ప్రమాద కారకాలు  

ఒక వ్యక్తి యొక్క వయస్సు పెరగటం వలన, సంతృప్తికరమైన అంగస్తంభనను సాధించడానికి సాధారణం కంటే ఎక్కువ సమయం పడుతుంది మరియు ఖచ్చితమైన అంగస్తంభన  కాకపోవచ్చు (అంగస్తంభన పట్టులో స్థాయి తగ్గిండొచ్చు) . ఒక వ్యక్తి అంగస్తంభనను నిర్వహించటానికి ప్రత్యక్ష స్పర్శ అవసరం కావచ్చు. అయితే, అంగస్తంభనతో సంబంధం ఉన్న కొన్ని ప్రమాద కారకాలు ఉన్నాయి. అవి:

  • మధుమేహం లేదా గుండె సమస్యలు వంటి వైద్య పరిస్థితులు.
  • ప్రోస్టేట్ శస్త్రచికిత్స (ప్రోస్టేట్ వ్యాకోచం లేదా ప్రోస్టేట్ క్యాన్సర్తో ఉన్న వ్యక్తుల్లో తీవ్రమైన ప్రోస్టేక్టమీ) సహా కటి ఉదరవాదం లేదా శస్త్రచికిత్స చరిత్ర.
  • ధూమపానం. పొగాకు వాడకం రక్త నాళాలకు రక్త ప్రవాహాన్ని నిరోధిస్తుంది, ఇవి దీర్ఘకాలంలో అంగస్తంభన వైఫల్యానికి దారి తీస్తాయి.
  • ఊబకాయం.
  • అధిక రక్త పోటు.
  • హార్మోన్ల లోపాలు (హైపోగోనాడిజం, హైపోథైరాయిడిజం వంటివి).
  • మాదక ద్రవ్యాల/డ్రగ్ దుర్వినియోగం (కొకైన్, మేథంఫేటమిన్ వంటివి).
  • యాంటీడిప్రజంట్స్, యాంటిహిస్టామైన్లు మరియు రక్తపోటు కోసం తీసుకునే మందులు.
  • ఒత్తిడి, ఆందోళన లేదా నిరాశ వంటి మానసిక పరిస్థితులు.
  • దీర్ఘకాలిక మరియు భారీగా మద్యపానం చేయడం.

అంగస్తంభన వైఫల్య నివారణ (నపుంసకత్వ నివారణ ) - Prevention of Erectile Dysfunction/Impotence in Telugu

అంగస్తంభన వైఫల్య నివారణకు ఉత్తమమైన మార్గం ఏదంటే ఇప్పటికే మీకున్న ఉత్తమ ఆరోగ్య పరిస్థితులను ఓ వైపు నిర్వహించుకుంటూనే, దానితో పాటుగా ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులను కొత్తగా అలవర్చుకోవడం. అంగస్తంభన వైఫల్యాన్ని నిరోధించడానికి మీరు చేపట్టదగ్గ చర్యలు కొన్ని ఇవిగో:

  • ధూమపానం గుండె జబ్బులతో ముడిపడి ఉండటం వలన దాన్ని పూర్తిగా విడిచిపెట్టండి, ఎందుకంటే గుండెజబ్బులు అంగస్తంభనకూ ప్రమాద కారకంగా ఉంటుంది కాబట్టి.
  • ఒక నియమం ప్రకారం వ్యాయామాన్ని చేయడం ద్వారా మీ బరువును నిర్వహించండి. మీరు రోజంతా చురుకుగా ఉండేటట్టుగా చూసుకోండి. మీరు ఫుట్ బాల్ లేదా టెన్నిస్ వంటి క్రీడలను చేపట్టవచ్చు.
  • అంగస్తంభనకు సంబంధమున్న వ్యాధుల నివారణలో ఆహారం కీలక పాత్రను పోషిస్తున్నందున, మీరు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే విధంగా చూసుకోండి. ధాన్యపు ఆహారాలు, తక్కువ కొవ్వు పదార్ధాలు, పండ్లు మరియు కూరగాయలు తీసుకోవడాన్ని పెంచండి. శుద్ధి చేయబడిన మరియు కొవ్వు పదార్ధాలను అలాగే అధిక సోడియం-సంబంధ పదార్థాలుండే ఆహారాలను తీసుకోకండి.
  • మీ బ్లడ్, షుగర్ మరియు రక్త పీడన స్థాయిలను నిర్వహించండి. ​
  • మీకున్న అంగస్తంభన వైఫల్య సమస్యను నిరోధించటానికి మద్యపానం మానండి. లేదా మీ నపుంసకత్వ సమస్యనివారణకు కనీసం మీరు తీసుకునే మద్యం ప్రమాణాన్ని కనీస మొత్తానికి తగ్గించి తీసుకోండి.
  • అంగస్తంభన వైఫల్య సమస్యను ఒత్తిడి (stress) మరింత తీవ్రతరం చేస్తుంది గనుక ఒత్తిడిని నిర్వహించండి. ధ్యానం, లోతైన శ్వాస ప్రక్రియలు,  లేదా యోగవ్యాయామాలు వంటి సేదదీరే కార్యకలాపాలను చేపట్టండి.
  • వినోద ఔషధాలసేవన చేయకండి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Oil by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic oil is recommended by our doctors to lakhs of people for sex problems (premature ejaculation, lack of erection in the penis, lack of libido in men) with good results.
Men Massage Oil
₹399  ₹449  11% OFF
BUY NOW

అంగస్తంభనవైఫల్య రోగనిర్ధారణ - Diagnosis of Erectile Dysfunction in Telugu

అంగస్తంభనవైఫల్య రోగ నిర్ధారణకు ఐచ్చికమైన లేదా ప్రథమపంక్తి రోగనిర్ధారణా పద్ధతులు లేవు. అంతే కాకుండా, ఇతర వైద్యపరిస్థితులకు భిన్నంగా, అంగస్తంభనవైఫల్య సమస్య దిననిత్యం జరిగే సాధారణ ఆరోగ్యసమస్యల తనిఖీలో భాగంగా తనిఖీ చేయబడదు. సాధారణంగా, రోగానికి సంబంధించిన ఖచ్చితమైన చరిత్ర మరియు శారీరక పరీక్షలే ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయడానికి సరిపోతాయి. రోగి యొక్క రోగనిర్ధారణ కోసం, వైద్యుడు కొన్ని విషయాలను రోగిని అడిగి తెలుసుకుంటాడు. ఈ అంగస్తంభన వైఫల్య సమస్య రోగికి ఎపుడు ప్రారంభమైంది, వ్యాధి ఉధృతిని తీవ్రతరం చేసే వైద్యసంబంధమైన మానసిక జబ్బువల్ల రోగి గతంలో గాని లేక ప్రస్తుతం గాని బాధపడుతున్నాడా, ఏదైనా గాయం గాని, శ్రమతో కూడిన  శారీరకచర్య ఏమైనా అంగస్తంభవైఫల్యానికి దారి తీసిందా అని వైద్యుడు రోగిని విచారిస్తాడు. ఇంకా, ఇతరమైన జబ్బులకుగాను రోగి తీసుకుంటున్న మందుల గురించి కూడా వైద్యుడు రోగిని అడిగి తెలుసుకుని రోగనిర్ధారణ చేస్తాడు.

అంగస్తంభన వైఫల్యం సమస్యకు కారణాన్ని గుర్తించడానికి రోగియొక్క వివరణాత్మక లైంగిక చరిత్ర ఓ ఉత్తమ సాధనం. అంగస్తంభన ఎంతసేపు ఉంటుంది, అంగస్తంభన పరిమాణం పరిపూర్ణముగా, చాలినంతగా ఉంటోందా, లైంగిక వాంఛ, వీర్యం నాణ్యత, ప్రతి వీర్య స్ఖలనానికి (భావప్రాప్తికి) ప్రదర్శన, తదనుగుణంగా వచ్చే అంగసంబంధమైన నొప్పి, అంగం వంకర తిరిగుంటే ఆ వివరాలను వైద్యుడు సేకరించే రోగి చరిత్రకు సంబంధించినవి. ఈ అన్ని వివరాలపై రోగి చరిత్ర దృష్టి పెడుతుంది. అంగస్తంభనవైఫల్యానికి అంతర్లీనంగా దారితీసే చక్కెరవ్యాధి (లేదా డయాబెటీస్), అధిక కొలెస్ట్రాల్ సమస్యలు రోగికి ఉన్నాయేమోనన్న సంగతిని తెలుసుకోవడానికి రక్త పరీక్షలు కూడా సహాయపడతాయి. (మరింత సమాచారం: తక్కువ వీర్యకణాల సంఖ్య చికిత్స)

అంగస్తంభనవైఫల్యానికి గల కారణాలను కనుక్కోవడానికి అనేక ఇతర పరిశోధనలు ఉన్నాయి. రోగి నిద్రలో ఉన్నప్పుడు నిద్రలో అంగానికి సంభవించే స్తంభనను పర్యవేక్షించడమనేది ఆ ఇతర పరిశోధనల్లో ఒకటి. ఇందులో ప్లీథైస్మోగ్రాఫ్ను ఉపయోగిస్తారు. ఒక రాత్రిపూట రోగి అంగం చుట్టూ ప్లీథైస్మోగ్రాఫ్ను అమర్చి ఆ రోగికి నిద్రలో అంగస్తంభన రావడానికి తగినంత రక్త సరఫరా మరియు అతని నరాల పనితీరు సరిపోతుందా అని పరీక్ష చేస్తారు. పాపర్విన్ లేదా ప్రోస్టాగ్లాండిన్ E1 యొక్క ఇంట్రకేవెర్నోసల్ (intracavernosal) ఇంజెక్షన్ ను రోగి అంగానికి చేసి, అంగానికి తగినంతగా రక్తం సరఫరా అవుతోందా  లేదా అని వైద్యుడు తెలుసుకుంటాడు. శిశ్నసంబంధ అంతర్గత ధమని ఆంజియోగ్రఫీ (internal pudendal artery angiography), మరియు స్వయంప్రతిపత్త మరియు పరిధీయ జ్ఞాననరాల పరీక్షలు ఇతర పరిశోధనాపరమైన పరీక్షలు వైద్యులు చేస్తారు.

 

అంగస్తంభనవైఫల్యానికి (నపుంసకత్వానికి) చికిత్స - Erectile Dysfunction (Impotence) treatment in Telugu

రోగికి చేపట్టాల్సిన చికిత్స ఎంపికలు ముఖ్యంగా డాక్టర్ మదింపు చేసిన రోగి యొక్క వైద్య మరియు వ్యక్తిగత చరిత్రపై ఆధారపడి ఉంటుంది. ప్రతి వ్యక్తి (రోగి) విషయంలో, చికిత్స ఎంపికలు మారుతుంటాయి, ఎందుకంటే చికిత్స అనేది వ్యాధి కారకం మీద ఆధారపడి ఉంతుంది గనుక. అంగస్తంభనవైఫల్యానికి మధుమేహం లేదా అధిక రక్తపోటు వంటి ఏవైనా అంతర్లీన వైద్య పరిస్థితులు రోగికి ఉంటే, వాటికి సరైన ఔషధాలతో చికిత్స చేయవలసి ఉంటుంది.

సిల్డెనాఫిల్ (వయాగ్రా, 50-100 ఎం.జి), తడలఫిల్, వడదనాఫిల్ మరియు అవనాఫిల్ వంటి మందులను కొన్ని ఎంపిక చేసిన చికిత్సల్లో (వైద్యులు) ఉపయోగిస్తున్నారు. ఈ మందులన్నీ పురుషాంగం యొక్క కండరాలకు ఉపశమనాన్ని కలిగించి సేదదీరుస్తాయి.  మరియు ఈ మందులు అంగానికి రక్త ప్రవాహాన్ని పెంచుతాయి, మరియు సరైన మరియు సంతృప్తికరమైన అంగస్తంభనను సాధించటానికి సహాయపడుతాయి. పురుషాంగానికి రక్తప్రసరణను పెంచేందుకు ఈ మందులు పని చేయకపోతే, పురుషాంగానికి లేదా మూత్రమార్గంలో చేసే ఇంజక్షన్ మందుల్ని వాడవచ్చు.  

  • అంగస్తంభనవైఫల్య సమస్య ఉన్నవారికి టెస్టిస్టెరోన్ భర్తీ చికిత్సను డాక్టర్ సూచించవచ్చు. ఇది బోలు ఎముకల వ్యాధిని నిరోధించడానికి మరియు కండరాల శక్తిని పుంజుకోవడానికి మరియు విశేషమైన లైంగిక వాంఛను రోగిలో పునరుద్ధరించడానికి సహాయపడుతుంది. టెస్టోస్టెరోన్ను నిర్వహించడానికి ఉపయోగించే వివిధ పద్ధతులు ఇంట్రాముస్కులర్ ఇంజెక్షన్లు, సబ్కటానియస్ సూది మందులు, ట్రాన్స్డెర్మల్ సూది మందులు లేదా లోనికి తీసుకునే మందులు.(మరింత సమాచారం: టెస్టోస్టెరోన్ ను పెంచడానికి సహజ చిట్కాలు)
  • అంగస్తంభనవైఫల్య సమస్యకు సంబంధించి కొన్ని తీవ్రమైన సందర్భాలలో ఒక వాక్యూమ్ పరికరం ఉపయోగించబడుతుంది. ఇది ఒక బాహ్య ప్లాస్టిక్ సిలిండర్ మరియు ఒక వాక్యూమ్ పంప్ ను కలిగి ఉంటుంది. ఇది రక్తాన్ని పురుషాంగంలోకి లాగబడుతుంది, తద్వారా అంగస్తంభనను కలుగజేస్తుంది. కొన్నిసార్లు, ఒక సాగుదల కల్గిన రింగ్ ను పురుషాంగం యొక్క కుదురుకు అమర్చబడుతుంది, దీన్ని అలా అమర్చడం వల్ల  శరీరము నుండి (అంగానికి) అయిన రక్త ప్రవాహాన్ని ఆగిపోకుండా నివారించవచ్చు.
  • అంగస్తంభన సాధించడం కోసం శిశ్న-సంబంధమైన  ఇంప్లాంట్లను (పరికరాలు) అరుదుగా ఉపయోగించబడతాయి (స్థిర రాడ్ లేదా గాలితో నిండిన రిజర్వాయర్ రకాలు).
  • పురుషాంగం లోకి తగ్గిన రక్త ప్రవాహం సమస్య ఉన్న యువకులకు నాళాల పునర్నిర్మాణ శస్త్రచికిత్స (Vascular reconstructive surgery) చేయడం జరుగుతుంది. ​
  • రోగి మరియు అతని భాగస్వామి భావోద్వేగపరమైన లేదా సంబంధపరమైన సంక్షోభంతో బాధపడుతుంటే వారికి మానసిక చికిత్స నిర్వహిస్తారు.
  • ప్రత్యామ్నాయ చికిత్సల్లో కొరియా ఎరుపు జింజెంగ్-Korean red ginseng-
  • పానాక్స్ జిన్సెంగ్ 900 mg (రోజుకు మూడు సార్లు తీసుకునేది) ఉన్నాయి. ఈ మందులు అంగస్తంభనను మెరుగుపరుస్తాయి.

జీవనశైలి నిర్వహణ

మానసిక చికిత్సలో భాగంగా రోగి మరియు అతడి/ఆమె జీవిత భాగస్వామితో మానసిక సమస్యల గురించి చర్చించడం. ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. జంటకు తగిన   సలహాలను ఇవ్వచ్చు. నరాలవ్యాధి మరియు అంతర-నాళవ్యాధి మెరుగుపరచడానికి అవకాశం లేదు, కానీ అనేక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. లోనికి తీసుకునే ఔషధాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రోగి పరిస్థితిని మెరుగుపర్చడానికి, రోగాన్ని నయం చేయడానికి శస్త్రచికిత్సను కూడా ప్రయత్నించవచ్చు.

రోగి చేపట్టదగిన జీవనశైలి మార్పులు:

  • కార్డియో వ్యాయామాలు ప్రారంభించండి. ఊబకాయం వదిలించుకోవటంకోసం, మితం మించిన బరువును తగ్గించుకోవడానికిగాను నడక, పరుగు వ్యాయామాలను  ప్రారంభించండి.  
  • ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం అలవాటు చేసుకోండి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు మరియు చేపల వంటి ఆరోగ్యకరమైన ఆహారాలు అంగస్తంభన వైఫల్యం దాపురించే అవకాశాలను తగ్గిస్తాయి.
  • అంతర్లీన వ్యాధికి చికిత్స తీసుకోండి. అంగస్తంభన వైఫల్యం సమస్యకు చక్కెరవ్యాధి (డయాబెటిస్) మరియు అధిక రక్తపోటు (హైపర్ టెన్షన్) రెండు ప్రధాన కారణాలు. కాబట్టి, మందులు మరియు ఆహార మార్పులతో, సరైన చికిత్స, అలాగే, వ్యాయామాలు చేపట్టి అంగస్తంభన వైఫల్యం నుండి బయట పదండి.
  • శరీరపు కింది భాగానికి అంటే పొత్తికడుపును సంబంధించిన Kegel వ్యాయామాలు వంటి వ్యాయామాలను చేయండి. ఈ వ్యాయామాలు నడుము (పెల్విస్) మరియు శరీరపు కింది భాగాల్లో తగినంత కండరాల స్థాయిని సరిగ్గా నిర్వహించడంలో సహాయపడతాయి.
  • . ఒత్తిడిని నిర్వహించండి మరియు తగినంతగా  బాగా నిద్రపోండి.
  • ధూమపానం మరియు మద్యం సేవించడాన్ని పరిమితం చేయండి.

అంగస్తంభనవైఫల్య ప్రమాదాలు మరియు ఉపద్రవాలు - Erectile Dysfunction Risks & Complications in Telugu

అంగస్తంభనవైఫల్య రోగ నిరూపణ ప్రధానంగా రెండు కారకాలపై ఆధారపడి ఉంటుంది. మొదటిది, సమస్యను గుర్తించి, దానిని నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తపడడం, రెండవది, మీ వైద్యుడిని సంప్రదించి, మీ ఆరోగ్య సమస్యలను వివరించడం, ఇది సరైన చికిత్సను  పొందడంలో సహాయపడుతుంది. దైహికసంబంధమైన పరిస్థితులు అంగస్తంభనవైఫల్య రోగానికి ప్రధాన కారణాల్లో ఒకటి. కనక, మధుమేహం లేదా రక్తపోటు చికిత్స కోసం ఒక ఆరోగ్యకరమైన చికిత్సాప్రణాళికను అలవర్చుకుని ఆ ప్రకారం చికిత్సనందుకోవడం మరియు దైహిక లోపాలను నియంత్రణలో ఉంచడం అంగస్తంభనవైఫల్య రుగ్మతకు తీసుకునే చికిత్సకు  సహాయపడతాయి. అనారోగ్యకరమైన ఆహారపుటలవాట్లు మరియు ధూమపానం మరియు మద్యపాన వ్యసనం వంటి ఇతర అర్రోగ్యప్రతికూలమైన అలవాట్లు కలిగిన వ్యక్తుల విషయానికొస్తే వారు చాలా తక్కువ రోగనిర్ధారణను కలిగి ఉంటారు. శస్త్రచికిత్సానంతర రోగ నిరూపణ సాధారణంగా మంచిది. మానసికచికిత్స మరియు వైద్య సలహా-సంప్రదింపుల సమావేశాల ద్వారా ఉత్తమమైన రోగనిర్ధారణలను పొందొచ్చు.

ఉపద్రవాలు
అంగస్తంభన వైఫల్యానికి సంబంధించిన క్లిష్టతలు ఎక్కువగా మానసిక సంబంధమైనవి. ఇలాంటి క్లిష్టతలు నిరాశకు దారితీస్థాయి. ఇంకా,  న్యూనతాభావం, భావోద్వేగ అవాంతరాలు, సామాజికవికారం, జీవిత భాగస్వామితో సంబంధపరమైన సమస్యలకు అంగస్తంభన వైఫల్యం దారి తీస్తుంది. ఇది వంధ్యత్వానికీ ((పిల్లలను కనే సామర్థ్యం లేకపోవడం) దారితీస్తుంది. పురుషాంగం లేదా స్క్రోటుంకు ఏదైనా గాయం సంభవించినప్పుడు రక్తపు సరఫరా లేకపోవడంతో పురుషాంగం క్షీణత (పురుషాంగం కండరాల క్షీణత) కూడా కలుగుతుంది.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas T-Boost Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like low sperm count, muscle weakness, and low testosterone, with excellent results.
Testosterone Booster
₹719  ₹799  10% OFF
BUY NOW

అంగస్తంభన వైఫల్యం అంటే ఏమిటి? - What is Erectile Dysfunction? In Telugu

పురుషుడు తన భాగస్వామితో సంతృప్తికరమైన లైంగిక సంపర్కము పొందేటందుకు ప్రయత్నించినపుడు తన అంగస్థితిలో గట్టిదనాన్ని (erectness) పొందలేక పోయే స్థితినే “అంగస్తంభన వైఫల్యం” అంటారు. జీవశాస్త్రపరంగా, పురుషాంగం గట్టిదనాన్ని   కొనసాగించేందుకు తగినంత స్థిరమైన రక్త సరఫరాను కలిగి ఉండాలి. అలాగే, నరములు నిరంతరం ప్రేరణలను పంపించగలగాలి. గట్టిపడేందుకుగాను పురుషాంగానికి ఎముక లేదా ఏ ఇతర సహాయక నిర్మాణం గాని లేదు. నరాల వ్యవస్థతో రక్త నాళాలు సంసర్గసంబంధం కలిగినపుడు శిశ్నము గట్టిపడుతుంది. ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితం కలిగి ఉండాలి అంటే ఆరోగ్యకరమైన లైంగిక జీవితాన్ని కలిగి ఉండాలి. అంగస్తంభన వైఫల్యానికి పలు కారణాలున్నాయి. వయస్సు కారణంగా రక్తనాళాలు బిరుసెక్కిపోవడం (atherosclerosis), డయాబెటిస్, ఊబకాయం, మితం మించిన ధూమపానం మరియు మద్యపానం మొదలైన వాటికారణంగా శిశ్న నరాలకు తగినంతగా రక్త సరఫరా లేకపోవడం వల్ల అంగస్తంభన వైఫల్యం సంభవిస్తుంది. ఔషధసేవనం, హార్మోన్ థెరపీ, పురుషాంగాన్ని నిక్కించే (ఇంప్లాంట్లు) పరికరాలు, మరియు సలహాలు అంగస్తంభన వైఫల్యానికి చికిత్సలో భాగమే.



వనరులు

  1. Urology Care Foundation [Internet]. American Urological Association; Erectile Dysfunction.
  2. Hormone Health Network [Internet]. The Endocrine Society; Washington, DC: Erectile Dysfunction.
  3. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Erectile Dysfunction (ED).
  4. Stuart H. Ralston, Ian D Penman, Mark W J Strachan, Richard Hobson. Davidson's Principles and Practice of Medicine E-Book.. 23rd Edition; Elsevier, 23-Apr-2018 - Medical - 1440 pages.
  5. Joel J. Heidelbaugh, University of Michigan, Ann Arbor, Michigan. Management of Erectile Dysfunction.. American Family Physician. 2010 Feb 1;81(3):305-312.
  6. National Institute of Diabetes and Digestive and Kidney Diseases [internet]: US Department of Health and Human Services; Preventing Erectile Dysfunction..
  7. Health Harvard Publishing. Harvard Medical School [Internet]. 5 natural ways to overcome erectile dysfunction.. Harvard University, Cambridge, Massachusetts.

అంగస్తంభన లోపం వైద్యులు

అంగస్తంభన లోపం కొరకు మందులు

Medicines listed below are available for అంగస్తంభన లోపం. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.

Lab Tests recommended for అంగస్తంభన లోపం

Number of tests are available for అంగస్తంభన లోపం. We have listed commonly prescribed tests below: