చికన్‌గన్యా - Chikungunya in Telugu

Dr. Ajay Mohan (AIIMS)MBBS

February 06, 2019

March 06, 2020

చికన్‌గన్యా
చికన్‌గన్యా

సారాంశం

చికెన్ గున్యా అనునది ఒక వైరల్ వ్యాధి, ఇది     ఏడెస్ దోమ వలన వ్యాపిస్తుంది. గత దశాబ్ద కాలములో ఆఫ్రికా, ఆసియా, ఇండియా, కరేబియన్, మరియు మధ్య మరియు దక్షిణ అమెరికాలో చికెన్ గున్యా యొక్క వ్యాప్తి గణనీయముగా పెరిగిందని రిపోర్టులు కలవు.  చికెన్ గున్యా వైరస్ చూపించే లక్షణాల వలన అత్యదికమైన ప్రజలు దోమ కాటుకు గురయ్యారని మనకు తెలుస్తుంది. జ్వరము మరియు కీళ్ల నొప్పి అను లక్షణాలు ఉంటాయి,  ఇవి చాలా తీవ్రముగా ఉంటాయి.   అధిక భాగం ప్రజలు ఈ వ్యాధి నుండి 7-10 రోజులలో కోలుకుంటారు.  శిశువులు మరియు పెద్ద వయస్సు గల దోమలు సమస్యలను అభివృధ్ధి చేయడములో అధిక ప్రమాదకరమైనవి.  ఈ ఏడెస్ దోమ, పరిసరాలలో సేకరించబడిన నిశ్చలముగా ఉన్న నీటిలో వృధ్ధి చెందుతుంది మరియు గుడ్లను పొదుగుతుంది.  అందువలన, వ్యాధి వచ్చే ప్రమాదమును తగ్గించడానికి, పరిసరాలను శుభ్రముగా మరియు పొడిగా ఉంచుకోవడం ప్రాముఖ్యమైన విషయం.  కూలర్లు, పూల కుండీలు, వేజ్ లు, లేక ఆక్వేరియాలు అనువాటిలో దోమలు పెరగకుండా నివారించడం కోసం వాటిని ఒక వారములో కనీసం 3-4 సార్లు ఎండ బెట్టాలి మరియు  తాజా నీటితో వాటిని భర్తీ చేయాలి.  ఇతర నివారణ చర్యలు అనగా దోమ తెరలు, దోమలను అడ్డుకునే మందులు/క్రీములు, మరియు రక్షణ కలిగించే దుస్తులను ధరించడం అను వాటిని చేయాలి   చికెన్ గున్యాను నివారించడానికి  ఏ విధమైన టీకా లేదు మరియు నయం చేయడానికి ఎటువంటి మందులు లేవు.  అందువలన, చికిత్స చేయడం అనునది లక్షణాలను తగ్గించడము పైన దృష్టి పెడుతుంది.  చికెన్ గున్యా మరియు డెంగ్యూ యొక్క లక్షణాలు, రెండిటిలో కొన్ని కామన్ లక్షణాలతో ఒకే విధముగా ఉంటాయి.  కావున, ఒక వ్యాధి మరొక వ్యాధితో గందరగోళము సృష్టించడానికి సాధ్యపడుతుంది. అందువలన, సరియైన రోగ నిర్ధారణ అనునది చికిత్సను ప్రారంభించడానికి కీలకమైనది.  సరియైన చికిత్స కోర్సును మరియు రికవరీని అనుసరించడము వలన, లక్షణాలు సాధారణముగా 2-3 వారాల లోపల నయమవుతాయి.  చికెన్ గున్యా నుండి వచ్చే సమస్యలు అరుదుగా ఉంటాయి మరియు నివారణా వ్యూహాలు అనునవి చికెన్ గున్యా వ్యాప్తిని హానికరమైన కమ్యూనిటీలలో నియంత్రించడానికి చాలా సహాయం చేస్తాయి.

చికన్‌గన్యా అంటే ఏమిటి? - What is Chikungunya in Telugu

చికెన్ గున్యా అనునది దోమల ద్వారా వ్యాప్తిచెందే వైరల్ వ్యాధి.  మొదటగా చికెన్ గున్యా యొక్క వ్యాప్తి అనునది దక్షిణ టాంజానియాలో 1952 లో రిపోర్ట్ చేయబడింది.  చికెన్ గున్యా అనునది తీవ్రమైన కీళ్ల నొప్పులకు మరియు జ్వరానికి.దారితీస్తుంది.    చికెన్ గున్యా యొక్క లక్షణాలు ఒక రకముగా డెంగ్యూ మరియు జికా (దోమల వలన కలిగే వైరల్ వ్యాధి) వ్యాధి లక్షణాలను పోలి ఉంటాయి,  ఈ  లక్షణాలు అనునవి చికెన్ గున్యా యొక్క రోగ నిర్ధారణ తప్పుగా జరగడానికి దారితీస్తుంది. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడానికి ప్రస్తుతానికి ఏ విధమైన టీకా  అందుబాటులో లేదు.  అయితే, మనల్ని మనము స్వంతముగా కాపాడుకోవడానికి ఉత్తమమైన మార్గం ఏమిటంటే దోమల కాటు నుండి రక్షించుకోవడం.   ఏడెస్ దోమ అనునది చికెన్ గున్యాను వ్యాప్తి చేసే ఒక వెక్టార్(ఆరోహకం) లేక (క్యారియర్) (వాహకం), చికెన్ గున్యా వ్యాధి కలిగిన వ్యక్తి యొక్క రక్తమును త్రాగడం వలన ఈ దోమ వ్యాధిని వ్యాప్తి చేస్తుంది.  అదేవిధముగా ఇది డెంగ్యూను వ్యాప్తి చేయగలదు.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

చికన్‌గన్యా యొక్క లక్షణాలు - Symptoms of Chikungunya in Telugu

చికెన్ గున్యా యొక్క లక్షణాలు, వ్యాధికారక దోమ కుట్టిన తరువాత 3-7 రోజుల వ్యవధిలో బయటపడతాయి.  చికెన్ గున్యా లక్షణాలు సాధారణ స్థితి నుండి తీవ్రమైన ఇన్ఫెక్షన్ పరిధి వరకు ఉంటాయి.  తరచుగా, ఈ వ్యాధి, డెంగ్యూ జ్వరముతో గందరగోళమునకు గురిచేయబడుతుంది, ప్రత్యేకముగా కొన్ని ప్రాంతాలలో,  దోమల వలన కలిగే వ్యాధులు సాధారణముగా కామన్ గా ఉంటాయి, లక్షణాలు సాధారణముగా ఒకే విధముగా ఉంటాయి.  కొంతమంది ప్రజలు మొత్తముగా ఏ విధమైన లక్షణాలను కలిగిఉండరని మనకు తెలుపబడింది.  అయితే, అటువంటి సంధర్భాలు చాలా అరుదుగా ఉంటాయి.  చికెన్ గున్యా యొక్క అత్యంత ప్రాముఖ్యమైన రోగ లక్షణాలు వీటిని కలిగిఉంటాయి:

  • హఠాత్తుగా జ్వరం రావడం
    జ్వరం అనునది తక్కువ నుండి అధిక గ్రేడ్ వరకు ఉంటుంది మరియు ఇది రెండు రోజుల వరకు కొనసాగుతుంది.  వ్యక్తి జ్వరముతో పాటు, చలి మరియు వణుకును అదేవిధముగా అనుభవిస్తాడు.
  • కీళ్లలో తీవ్రమైన నొప్పి
    కీళ్ళ నొపి అనునది ఉదయకాల సమయములో తీవ్ర స్థాయికి చేరుకుంటుంది మరియు భౌతికమైన ఆందోళన ద్వారా తీవ్రముగా పెరుగుతుంది.  కొంతమంది ప్రజలు తేలికైన శరీర నొప్పిని అనుభవిస్తారు, అలాగే పెద్ద వయస్సు వారు భరించలేని కీళ్ల నొప్పిని అనుభవిస్తారు.  కొంతమంది ప్రజలలో, కీళ్ల నొప్పి కొన్ని నెలల వరకు ఉంటుంది అయితే దాని తీవ్రత తగ్గుతూ ఉంటుంది.
  • కండరాల నొప్పి
    కండరాల నొప్పి మరియు కీళ్ల నొప్పి అనునవి చికెన్ గున్యా తో ప్రజలు అనుభవించగలిగే అధిక తీవ్రమైన లక్షణాలు.
  • వ్యాధి యొక్క ఇతర లక్షణాలు వీటిని కలిగి ఉంటాయి:

ఒకవేళ లక్షణాలు భరించలేకయుంటే మరియు ఇక్కడ రక్తస్రావం జరుగుతుంటే, వెంటనే డాక్టరును సంప్రదించాలి.

చికన్‌గన్యా యొక్క చికిత్స - Treatment of Chikungunya in Telugu

చికెన్ గున్యాను నయం చేయడానికి ఎలాంటి ప్రత్యేకమైన మందులు లేవు.  చికిత్స యొక్క లక్ష్యం, నొప్పి మరియు జ్వరం యొక్క లక్షణాలను తగ్గించడం మరియు కోలుకోవడం యొక్క వేగమును పెంచడం.  అదే విధముగా చికెన్ గున్యాకు వ్యతిరేకముగా ప్రత్యేక రక్షణ సమకూర్చుకోవడానికి ఎటువంటి టీకా అందుబాటులో లేదు.  అందువలన, చికిత్స అనునది సూచన ప్రాయమైనది.

పారాసెటమాల్ ను జ్వరం మరియు నొప్పి నుండి ఉపశమనం పొందడానికి తీసుకుంటారు.  డాక్టర్ల యొక్క అనుమతి లేకుండా పెయిన్ కిల్లర్స్ అయిన ఆస్పరిన్ మరియు ఇతర నాన్-స్టెరాయిడల్ యాంటి-ఇన్ఫ్లమేటరీ మందులు (NSAIDs)  తీసుకొనకూడదు.  ఎందుకనగా, జ్వరం ఒకవేళ డెంగ్యూ వ్యాధి వలన వచ్చినదయితే, అప్పుడు ఆస్పరిన్ ను తీసుకుంటే అది రక్తస్రావము యొక్క ప్రమాదమును పెంచుతుంది.

ఒక వ్యక్తి వేరొక ఆరోగ్య పరిస్థితి వలన ఒకవేళ మందులను ఉపయోగిస్తుంటే, అప్పుడు చికెన్ గున్యా కొరకు మందులను తీసుకోవలసి వస్తే, అతడు ముందుగా డాక్టరును సంప్రదించవలసిన అవసరముంటుంది.

జీవనశైలి నిర్వహణ

ఒకవేళ సంరక్షణ అనేది ఇంటి వద్దనే సమకూర్చబడి ఉంటే, ఆ వ్యక్తి క్రింద ఇవ్వబడిన విషయాల గురించి జాగ్రత్తలు తీసుకోవలసి ఉంది:

జనరల్ రక్షణ

  • బాగా ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి. మీకు మీరుగా ప్రయత్నము చేస్తే, అది కండరాల నొప్పిని తీవ్రం చేస్తుంది మరియు అది అలసటకు దారితీస్తుంది.
  • నొప్పిని కొద్దిగా అనుభవిస్తున్నప్పుడు, మీరు మంచి తేలికపాటి పనులను చేయవలసి ఉంటుంది, ఇది కీళ్లలో ఉన్న ధృఢత్వాన్ని తగ్గించడానికి సహాయం చేస్తుంది.  అందువలన, కొద్దిగా నడవడం అనునది నొప్పిని సులభముగా తగ్గించడానికి సహాయం చేస్తుంది.
  • వెచ్చగా మరియు సౌకర్యవంతముగా ఉన్న వాతావరణములో విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నించండి.  వేడిగా ఉన్న వాతావరణమును ఎట్టి పరిస్థితులలో దూరముగా  ఉంచండి, లేకపోతే అది కీళ్ల నొప్పిని మరింత తీవ్రం చేస్తుంది.
  • జ్వరమును తగ్గించడానికి తీసుకునే పారాసెటమాల్ మాత్రను ఒక రోజుకు 4 సార్లు కంటే ఎక్కువగా తీసుకొనకూడదు.
  • పెయిన్ కిల్లర్లను ఖచ్చితముగా దూరముగా ఉంచాలి.
  • ఒక చల్లని కంప్రెస్ ను, మంట మరియు వాపును తగ్గించడానికి ఉపయోగించాలి.  అవి నొప్పిని కూడా తగ్గిస్తాయి.
  • ఒకసారి చికెన్ గున్యాతో రోగ నిర్ధారణ జరిగినట్లయితే, దోమ తెరల క్రింద నిద్రపోవాలి, ఇది ఇతర దోమలు మిమ్మల్ని కుట్టకుండా మరియు వైరస్ వ్యాప్తి చెందకుండా నివారించడానికి సహాయపడుతుంది.  మీరు నీరు అధికముగా త్రాగండి.

ఆహారము

  • అధికముగా ద్రవాలను త్రాగండి.  మీరు మరిగించిన నీటితో ఓరల్ రీహైడ్రేషన్ లవణాల మిశ్రమమును కూడా తీసుకోవాలి, ఇది శరీరములో ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్ నిర్వహణకు సహాయపడుతుంది.  మీరు ఒకవేళ వాంతులు లేక జీర్ణ క్రియ సంబంధమైన సమస్యలతో బాధపడుతుంటే మిశ్రమం ప్రత్యేకముగా చాలా ముఖ్యమైనది.
  • జ్యూసులు, మజ్జిగ వంటి ద్రవాలు,  కొబ్బరి    నీళ్ళు, మరియు తాజా కూరగాయల జ్యూసులు వంటివి కోలుకోవడములో సహాయం చేస్తాయి, ఎందుకనగా అవి ముఖ్యమైన పోషకాలను సమకూరుస్తాయి.
  • బలహీనత మరియు అలసటను తొలగించడానికి కొంచెం కొంచెం  ఆహారమును క్రమమైన సమయాలలో తీసుకోవాలి. అధిక ప్రొటీన్ లు మరియు కేలరీలు కలిగిన ఆహారమును తీసుకోవడము వలన అది శక్తిని ఉత్పత్తి చేయడానికి సహాయము చేస్తుంది.  అయితే, ప్రాసెస్ చేయబడిన ఆహారము మరియు చక్కెర కలిగిన పదార్థాలను దూరముగా ఉంచాలి, ఎందుకనగా ఇవి శరీరము యొక్క రోగనిరోధకతను తగ్గిస్తాయి.
  • మీకు ఒకవేళ కడుపునొప్పి అనునది లేకపోతే, అప్పుడు తక్కువగా మసాలా గల ఆహారమును తీసుకోవడానికి మిమ్మల్ని అనుమతించవచ్చు. ఈ మసాలాలు ఆహారమును రుచికరముగా చేస్తాయి. అయితే, ఎక్కువగా మసాలాలను కలపడం అనునది ఆమ్ల రీఫ్లక్స్ కు దారితీస్తుంది. (ఎక్కువగా చదవండి - గ్యాస్ట్రోఎసోఫాగియల్ రీప్లక్స్ వ్యాధి చికిత్స)
  •   విటమిన్ సి అధికముగా ఉండే పండ్లు రోగనిరోధక  వ్యవస్థ యొక్క పనితీరును మెరుగుపరుస్తాయి. అందువలన నారింజపండ్లు, జామపండ్లు, చిలగడ దుంపలు, నిమ్మపండు మరియు బొప్పాయిపండ్లు అనునవి వేగముగా కోలుకోవడానికి సహాయపడతాయి.
  • చికెన్ గున్యా నుండి కోలుకునే వరకు డీహైడ్రేటింగ్ ద్రవాలైన ఆల్కహాలు, కాఫీ లేక టీ లకు దూరముగా ఉండాలి.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Chikungunya.
  2. J. Erin Staples, Susan L. Hills, Ann M. Powers. Infectious Diseases Related to Travel. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services.
  3. Public Health England [Internet]; Published 25 April 2014: Chikungunya. Government of United Kingdom
  4. Center for Disease Control and Prevention [internet], Atlanta (GA): US Department of Health and Human Services; Chikungunya Virus
  5. World Health Organization [Internet]. Geneva (SUI): World Health Organization; Guidelines on Clinical Management of Chikungunya Fever Guidelines on Clinical Management of Chikungunya ; October 2008
  6. MedlinePlus Medical Encyclopedia: US National Library of Medicine; Chikungunya virus

చికన్‌గన్యా కొరకు మందులు

Medicines listed below are available for చికన్‌గన్యా. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.