క్యాన్సర్ - Cancer: causes, symptoms, treatment, medicines, prevention and medicines in Telugu

Dr. Ayush PandeyMBBS,PG Diploma

May 20, 2019

September 11, 2020

క్యాన్సర్
క్యాన్సర్

సారాంశం

క్యాన్సర్ ఒక విస్తారమైన వ్యాధులు సమూహం, దీనిలో కణాల యొక్క అసాధారణ పెరుగుదల వలన కణితులు (కణాజాలం యొక్క ముద్దలు లేదా గడ్డలు) ఏర్పడతాయి. క్యాన్సర్ శరీరంలో ఏవిధమైన అవయవం లేదా కణజాలాల కణాలనైనా (cells) ప్రభావితం చేస్తుంది మరియు చాలా వేగంగా వృద్ధి చెందుతుంది, శరీరంలో వివిధ భాగాలకు వ్యాపించవచ్చు లేదా ఒకే చోట పెరుగుతూనే ఉండవచ్చు. ఈ స్వభావం ఆధారంగా, కణితులు నిరపాయమైనవి (benign) గా ఉంటాయి (వ్యాప్తి చెందనివి) లేదా ప్రాణాంతకమైనవి (వ్యాప్తి చెందేవి) గా ఉండవచ్చు.

వివిధ రకాలైన క్యాన్సర్ల యొక్క కారణాలు వేరువేరుగా ఉంటాయి, అయితే కొన్ని సాధారణ క్యాన్సర్లకు కారణాలు జీన్ మ్యుటేషన్లు (జన్యు ఉత్పరివర్తనలు), ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, ఫైబర్ తక్కువగా ఉండే ఆహార విధానం, రసాయనాలు లేదా రేడియోధార్మికతకు గురికావడం మరియు మొదలైనవిగా ఉన్నాయి. భౌతిక పరీక్ష,ఎక్స్-రేలు, సిటి (CT) స్కాన్, ఎంఆర్ఐ (MRI) మరియు పెట్ (PET) స్కాన్ల ద్వారా క్యాన్సర్ రోగ నిర్ధారణ చేయవచ్చు.

క్యాన్సర్ కారణాలు మరియు ప్రమాద కారకాలను నివారించడం ద్వారా క్యాన్సర్లను చాలా వరకు అరికట్టడం సాధ్యపడుతుంది. చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ, మరియు శస్త్రచికిత్స వంటి ఒకేరకమైన లేదా వివిధ రకాలైన విధానాలు ఉంటాయి. నిర్దిష్టమైన క్యాన్సర్లను ప్రారంభ దశల్లో గుర్తించినట్లయితే తక్షణమే చికిత్స అందించవచ్చు మరియు పూర్తిగా నయం చేయవచ్చు. అయితే, ఇది ఎల్లప్పుడూ సాధ్యపడనప్పటికీ, క్యాన్సర్ వ్యాప్తిని పరిమితం చేయడానికి, రోగి యొక్క జీవితాన్ని సౌకర్యవంతం చేయడానికి మరియు సమస్యలను తగ్గించటానికి అనేక రకాల చికిత్సా విధానాలు అందుబాటులో ఉన్నాయి.

క్యాన్సర్ రకాలు - Types of Cancer in Telugu

కణజాలం (టిష్యూ) యొక్క మూలం పై ఆధారపడి, క్యాన్సర్లు ఈ క్రింది విధంగా వర్గీకరించబడ్డాయి:

  • కార్సినోమాలు (Carcinomas): కార్సినోమాలు ఎపిథెలియల్ కణజాల యొక్క క్యాన్సర్లను సూచిస్తాయి. ఎపిథెలియల్ కణజాలం అనేది ప్రతి అవయవం యొక్క పై పొర/కప్పు (covering) ను కలిగి ఉంటుంది అంటే చర్మం, కడుపు లోపలి పొరలు/గోడలు, నోటి లోపలి పొరలు/గోడలు లేదా ముక్కు యొక్క పొర వంటివి. ఇవి సాధారణంగా నివేదించబడిన రకాలు. కార్సినోమాల యొక్క కొన్ని ఉదాహరణలు ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ మరియు చర్మపు స్క్వేమస్ సెల్ కార్సినోమా (squamous cell carcinoma)  గా ఉన్నాయి.
  • సార్కోమాలు (Sarcomas):  ఈ రకమైన క్యాన్సర్లు కన్నెక్టీవ్ టిష్యూల (కణజాలాల) యొక్క మూలం కలిగినవి . కన్నెక్టీవ్ కణజాలం శరీరంలో  వివిధ భాగాలను కలుపుతుంది మరియు బలాన్ని ఇస్తుంది. ఉదాహరణకు, అడిపోస్ టిష్యూ (కొవ్వు కణజాలం), అరియోలార్ టిష్యూ (areolar tissue), టెండాన్లు, లిగమెంట్లు మరియు ఎముకలు మొదలైనవి.
  • ల్యుకేమియా (Leukaemia): లుకేమియా తెల్ల రక్త కణాలు యొక్క అనియంత్రిత పెరుగుదల ఫలితంగా సంభవించే రక్త (బ్లడ్) క్యాన్సర్. ల్యుకేమియా యొక్క నాలుగు ప్రధాన రకాలు లింఫోసైటిక్ (తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైనవి) మరియు మైలోయిడ్ (తీవ్రమైన మరియు దీర్ఘకాలికమైనవి). ఎముక మజ్జలలో తెల్ల రక్త కణాలు ఏర్పడే మరియు పరిపక్వత (maturation) చెందే వివిధ దశలలో ఉన్న కణాల క్యాన్సర్ను లింఫోసైటిక్ మరియు మైలోయిడ్ లుకేమియా అనే పదాలు సూచిస్తాయి.
  • లింఫోమాలు (Lymphomas): అవి శోషరస కణుపులు (లింఫ్ నోడ్ల) మరియు శోషరస అవయవాల యొక్క క్యాన్సర్లు. మధ్యంతర స్థలలో(interstitial spaces) ఏర్పడే ద్రవాన్ని లింఫ్ (శోషరసం) సూచిస్తుంది. శరీరంలో పలు ప్రాంతాల్లో శోషరస కణుపుల వాహికల (vessels) మరియు శోషరస కణుపుల గుంపుల (clusters) ఒక ప్రత్యేకమైన యంత్రాంగం ఉంటుంది. లింఫ్ (శోషరసం) లింఫోసైట్లును కలిగి ఉంటుంది ఇవి అంటువ్యాధులతో పోరాడతాయి. ఈ ప్రాంతాలు లేదా లింఫోమాల క్యాన్సర్ రెండు రకాలు - హోడ్కిన్స్ (Hodgkin’s) మరియు నాన్- హోడ్కిన్స్ (non-Hodgkin’s) లింఫోమాలు.

అంతేకాకుండా, అవయవం లేదా శరీరంలోని భాగంపై ఆధారపడి, క్యాన్సర్నుఈ క్రింది విధాలుగా వర్గీకరించవచ్చు:

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Capsule by using 100% original and pure herbs of Ayurveda. This ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for sex problems with good results.
Long Time Capsule
₹719  ₹799  10% OFF
BUY NOW

క్యాన్సర్ దశలు - Stages of Cancer in Telugu

కాన్సర్ కణజాలం యొక్క అంచనా ద్వారా క్యాన్సర్ దశలు నిర్దారించబడతాయి. ప్రాణాంతక కణితి గుర్తించిన తర్వాత, కణితి స్వభావాన్ని తెలుసుకోవడానికి మరియు చికిత్సా ప్రణాళికను అంచనా వేయడానికి 'గ్రేడింగ్' మరియు 'స్టేజింగ్' అనే రెండు పద్ధతులు ఉపయోగిస్తారు. గ్రేడింగ్ అనేది హిస్టోలాజిక్, అంటే దీనిలో కణజాలం (టిష్యూ) మైక్రోస్కోప్ ద్వారా అధ్యయనం చేయబడుతుంది, అయితే స్టేజింగ్  అనేది వైద్యసంబంధమైనది మరియు సాధారణ పరీక్ష ద్వారా గుర్తించబడుతుంది.

గ్రేడింగ్

మైక్రోస్కోప్ క్రింద కణజాలాన్ని పరిశీలించిన తరువాత, క్యాన్సర్ గ్రేడ్లుగా వర్గీకరించబడుతుంది. క్యాన్సర్ కణజాలం యొక్క మైక్రోస్కోప్ పరీక్ష రెండు విషయాల గురించి సమాచారాన్ని ఇస్తుంది: క్యాన్సర్ పెరుగుదల రేటు మరియు ఆరోగ్యకరమైన కణాలతో పోలిస్తే తేడాగా ఉండే క్యాన్సర్ కణాల ఆకృతి (అనాప్లాసియా యొక్క డిగ్రీ). ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే కణాల పెరుగుదల అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఆ క్యాన్సర్ను నిరపాయంగా (benign) పేర్కొంటారు. క్యాన్సర్ కణాలు ఒక నిర్దిష్ట ప్రాంతంలో లేకుండా శరీరమంతా వ్యాపిస్తే, దీనిని మెటాస్టాటిక్ (metastatic) పిలుస్తారు. బ్రాడెర్స్ గ్రేడింగ్ సిస్టమ్స్ (Broder’s grading system) క్యాన్సర్ కణాల యొక్క విభన పై ఆధారపడి ఉంటుంది, కొద్దిగా మాములుగా/సాధారణంగా ఉన్న కణాలు నెమ్మదిగా వ్యాపిస్తాయి మరియు బాగా విభజించబడిన కణాలు వేగంగా వ్యాపిస్తాయి. బాగా విభజించబడిన కణాలు సాధారణ కణాల కంటే చాలా వేరుగా కనిపిస్తాయి. ఆ గ్రేడ్లు ఈ విధంగా ఉంటాయి

  • గ్రేడ్ I: బాగా విభజించబడినవి
  • గ్రేడ్ II: మధ్యస్తంగా విభజించబడినవి
  • గ్రేడ్ III: స్వల్పంగా విభజించబడినవి
  • గ్రేడ్ IV: సరిగ్గా విభజించబడనివి

కణితి వ్యాప్తిని నిర్ణయించడానికి క్యాన్సర్ కణజాలపు నమూనాకు పాథోలాజికల్ పరీక్ష, ప్రయోగశాల పరీక్షలు మరియు క్లినికల్ పరీక్షలు నిర్వహిస్తారు.

క్యాన్సర్ దశ మరియు గ్రేడ్ నిర్ణయించడానికి, టిఎన్ఎం స్టేజింగ్ (TNM staging) మరియు అమెరికన్ జాయింట్ కమిటీ (American Joint Committee) స్టేజింగ్ అనే రెండు అత్యంత ముఖ్యమైన మరియు ప్రస్తుతం ఉపయోగించే స్టేజింగ్ పద్ధతులు.

స్టేజింగ్

టిఎన్ఎం స్టేజింగ్ (TNM staging): టిఎన్ఎం (TNM) లో 3 అంశాలు ఉంటాయి, టి (T) అనేది ప్రాధమిక కణితిని (tumour) సూచిస్తుంది, ఎన్ (N) నిర్దిష్ట భాగంలో ఉన్న లింప్ నోడ్ (lymph node) ప్రమేయం కోసం మరియు ఎం (M) మెటాస్టాసీస్ (metastases) ను సూచిస్తుంది. తీవ్రతను సూచించడానికి ఈ మూడు అంశాలను సంఖ్యల ద్వారా సూచిస్తారు:

T0 - కణితి కనుగొనబడలేదు

T1-3 - 1 నుండి 3 సంఖ్యలు కణితి యొక్క పరిమాణం పెరుగుతూ ఉన్నట్లు సూచిస్తాయి, అంటే సంఖ్య పెరిగితే, కణితి పరిమాణం పెద్దదని మరియు అది సమీపం భాగాలకు వ్యాప్తి చెందిందని అర్ధం.

N0 - శోషరస కణుపులు పాల్గొనలేదు.

N1 నుండి N3 వరకు - ఇవి కణితి పరిమాణం, స్థానం, మరియు క్యాన్సర్ వ్యాపించిన శోషరస కణుపుల సంఖ్య పరంగా  శోషరస కణుపు యొక్క క్యాన్సర్ పరిధిని సూచిస్తాయి. అలాగే అధిక సంఖ్య, పెరిగిన శోషరస కణుపుల సంఖ్యను తెలుపుతుంది.

M0 - ఇతర భాగాలకు/ప్రాంతాలకు మెటాస్టాసిస్ వ్యాపించకపోవడం.

M1- ఇతర భాగాలకు/ప్రాంతాలకు కణితి వ్యాపించడం.

క్యాన్సర్ లక్షణాలు - Cancer Symptoms in Telugu

ప్రభావితమైన శరీర భాగంపై ఆధారపడి, క్యాన్సర్ యొక్క లక్షణాలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. క్యాన్సర్ రకం మరియు స్థానంతో సంబంధం లేకుండా కనిపించే కొన్ని సాధారణ సంకేతాలు మరియు లక్షణాలు ఈ కింది విధంగా ఉంటాయి:

  • అసాధారణ బరువు తగ్గుదల లేదా పెరుగుదల
  • బలహీనత మరియు అలసట
  • చర్మం మీద తరచూ కమిలిన గాయాలు ఏర్పడడం
  • చర్మం కింద ఒక గడ్డలు ఉన్న భావన కలుగడం
  • శ్వాస సమస్యలు మరియు దగ్గు ఒక నెల కన్నా ఎక్కువ రోజుల పాటు ఉండడం
  • చర్మపు మార్పులు, ప్రస్తుతం ఉన్న పుట్టుమచ్చల యొక్క పరిమాణం మరియు ఆకృతిలో మార్పులు లేదా గాయాలు ఏర్పడడం
  • చర్మం మీద సులువుగా కమిలిన గాయాలు ఏర్పడడం
  • అతిసారం లేదా మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలు
  • మ్రింగడంలో కఠినత
  • ఆకలిలేమి
  • గొంతు (మాటల) నాణ్యతలో మార్పులు
  • నిరంతరంగా జ్వరం లేదా రాత్రి సమయంలో చెమటలు పట్టడం
  • కండరాల లేదా ఉమ్మడి (జాయింట్) నొప్పులు మరియు గాయాలు ఆలస్యంగా మానడం
  • తరచూ పునరావృత్తమయ్యే సంక్రమణలు

క్యాన్సర్లను వెంటనే నిర్వహించడం ఉత్తమం కాబట్టి, వ్యక్తి ఏవైనా ఇటువంటి లక్షణాలను గమనించినట్లయితే, వెంటనే వైద్యులని సంప్రదించడం అత్యవసరం. చాలా సందర్భాలలో ఈ లక్షణాలు ఏమి గుర్తించబడవు  మరియు చాలా మంది తరువాతి (చివరి) దశలోనే వాటిని తీవ్రంగా అనుభవిస్తారు. నిజానికి, కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు, వారిలో క్యాన్సర్ ఒక సాధారణ పరీక్షలో భాగంగా గుర్తించబడుతుంది.కాబట్టి, స్వల్ప లక్షణాలు కూడా పట్టించుకోకుండా వదిలివేయకూడదు.

క్యాన్సర్ కారణాలు మరియు ప్రమాద కారకాలు - Cancer Causes and Risk factors in Telugu

కారణాలు

కణాల డిఎన్ఏ (DNA) లో కొన్ని మార్పులు లేదా మ్యూటేషన్ల ఫలితంగా క్యాన్సర్ ఏర్పడుతుంది. కణాల యొక్క మెదడుగా పరిగణించబడే డిఎన్ఏ, కణాల పెరుగుదల మరియు వృద్ధి గురించి సూచనలు ఇస్తుంది. ఈ సూచనలులో లోపాలు క్యాన్సర్ కలిగించే అనియంత్రిత కణాల పెరుగుదల మరియు వృద్ధి దారితీస్తుంది.

క్యాన్సర్ అభివృద్ధికి కారణమయ్యే పదార్థాలను కార్సినోజెన్ (కాన్సర్ కారకాలు) అని పిలుస్తారు, అలాగే ఇవి ఇతర హాని కారకాలతో కలిపి క్యాన్సర్ యొక్క ప్రధాన కారణాలుగా ఉన్నాయి. అవి రసాయనాలు కావచ్చు ఉదాహరణకు, పొగాకు పొగలో ఉండే పదార్ధాలు; భౌతికమైనవి కావచ్చు అంటే అల్ట్రావయొలెట్ రేడియేషన్ వంటివి; లేదా హ్యూమన్ పాపిల్లోమావైరస్ వంటి బయోలాజికల్ (జీవసంబంధమైనది) వి కావచ్చు. ఒకే ఒక్క కార్సినోజెన్ క్యాన్సర్ యొక్క బాధ్యతను కలిగి ఉండదు. దానితో పాటుగా అనేక కార్సినోజెన్లు, ఆరోగ్యం మరియు ఆహార విధానం వంటి ఇతర కారకాలు ఒక వ్యక్తిలో క్యాన్సర్ యొక్క అభివ్యక్తికి దారి తీస్తాయి.

ప్రమాద కారకాలు

క్యాన్సర్ యొక్క అతి సాధారణ ప్రమాద కారకాలు:

  • పొగాకు మరియు పొగాకు-సంబంధిత ఉత్పత్తుల పై ఆధారపడటం అంటే ధూమపానం లేదా పొగాకు నమలడం వంటి ఊపిరితిత్తుల మరియు నోరు క్యాన్సర్లకు కారణమవుతాయి.
  • మద్యపానం అధికమవ్వడం కూడా కాలేయ క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అనారోగ్యకరమైన ఆహార విధానం మరియు ఫైబర్ తక్కువగా ఉన్న బాగా శుద్ధి చేసిన ఆహారాలు తినడం అనేది పెద్దప్రేగు క్యాన్సర్కు కారణం కావచ్చు.
  • టెస్టోస్టెరోన్ మరియు ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్ల యొక్క అధిక స్థాయిలు వరుసగా ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు రొమ్ము క్యాన్సర్ అభివృద్ధికి ప్రమాద కారకాలు.
  • వయసు పెరగడం కూడా పెద్దప్రేగు కాన్సర్, రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మరియు అటువంటి కొన్ని రకాల క్యాన్సర్ల  అభివృద్ధి యొక్క సంభావ్యతను పెంచుతుంది.
  • జన్యుపరమైన లోపాలు లేదా మ్యుటేషన్లు క్యాన్సర్ సంభావ్యతను పెంచుతున్నాయి, ఉదా., BRCA1 మరియు BRCA2 జన్యువుల్లోని మ్యుటేషన్లు (ఉత్పరివర్తనలు) ఉన్న మహిళలకు రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది.
  • క్యాన్సర్ ఉన్న కుటుంబం చరిత్ర రొమ్ము వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
  • అనిలిన్ వంటి రసాయనాలు, రంగులు (డైలు), తారు వంటి వృత్తిపరమైన అపాయలకు గురికావడం వంటివి మూత్రాశయ క్యాన్సర్ వంటి కొన్ని క్యాన్సర్ల ప్రమాదాన్ని పెంచుతాయి.
  • కొన్ని రకాల బాక్టీరియల్ మరియు వైరల్ ఇన్ఫెక్షన్లు సిస్టమిక్ రుగ్మతలు కలిగిస్తాయి, ఇవి క్యాన్సర్ కలుగుడానికి కారణమవుతాయి, ఉదాహరణకు,హెచ్. పైలోరి (H.pylori) సంక్రమణ కడుపు క్యాన్సర్ అభివృద్ధికి దారితీస్తుంది; హెపటైటిస్ బి (B) మరియు సి (C) ఇన్ఫెక్షన్లు కాలేయ క్యాన్సర్ అలాగే హ్యూమన్ పాపిల్లోమావైరస్ సంక్రమణ గర్భాశయ క్యాన్సర్కు దారితీస్తుంది.
  • హానికరమైన రేడియేషన్ కలిగిన ఎక్స్-రేలకు లేదా సూర్యకాంతి యొక్క అల్ట్రావయొలెట్ కిరణాలకు తరచుగా బహిర్గతం కావడం కూడా క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది.
  • ఊబకాయం, కొవ్వు ఎక్కువగా తీసుకోవడం మరియు శారీరక శ్రమ లేకపోవడం పురుషులు మరియు మహిళలు ఇద్దరిలోను అనేక రకాలైన క్యాన్సర్ల ప్రమాదానికి కారణమవుతాయి.
  • దాని దీర్ఘకాలిక ప్రభావాల కారణంగా ఒత్తిడి క్యాన్సర్కు ఒక ప్రధాన ప్రమాద కారకంగా ఉన్నట్లు నిర్ధారించబడింది. అదనంగా, గత లేదా ప్రస్తుత ఆరోగ్య సమస్యల కారణంగా రోగనిరోధక శక్తి బలహీనపడడం కూడా ఒక వ్యక్తికి క్యాన్సర్ సంభవించే ప్రమాదాన్ని పెంచుతుంది.

గమనించినట్లయితే, జన్యుపరమైనవి మరియు వయస్సు ఆధారమైనవి కాకుండా, మిగిలిన ప్రమాద కారకాలను ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పులతో మరియు అంటువ్యాధులు మరియు కాలుష్యం నుండి తగిన రక్షణ తీసుకోవడంతో నివారించవచ్చు. ఒకవేళ వ్యక్తికీ క్యాన్సర్ యొక్క కుటుంబ చరిత్ర ఉంటే లేదా ఏదైనా క్యాన్సర్ యొక్క ప్రమాదం ఎక్కువగా ఉంటే, అటువంటి వారు ప్రమాదాన్ని తగ్గించడానికి ముందుగానే జీవనశైలి మార్పులను చేసుకోవడం అవసరం.

myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Kesh Art Hair Oil by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to more than 1 lakh people for multiple hair problems (hair fall, gray hair, and dandruff) with good results.
Bhringraj Hair Oil
₹599  ₹850  29% OFF
BUY NOW

క్యాన్సర్ నివారణ - Prevention of Cancer in Telugu

ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అనుసరించడం మరియు ప్రమాద కారకాలను నిర్వహించడం ద్వారా అనేక రకాలైన క్యాన్సర్లను నివారించడం సాధ్యపడుతుంది. క్యాన్సర్ను నివారించడానికి ఈ కింద ఉన్నవి పాటించవచ్చు

  • ధూమపానం మానివేయాలి.
  • మద్యపానం పరిమితం చెయ్యాలి.
  • సూర్యరశ్మికి అధికంగా గురికావడాన్ని నివారించాలి.
  • ఫైబర్లు అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. ఆహారంలో కొవ్వుల అధికంగా తీసుకోవడాన్ని నివారించాలి మరియు పంది మరియు గొడ్డు మాంసం వంటి ఎర్ర మాంసానికి దూరంగా ఉండాలి. అంతేకాకుండా, ఆహారంలో ప్రాసెస్ చేయబడిన ఆహార పదార్ధాలను తీసుకోవడం తగ్గించాలి.
  • రేడియేషన్కు వృత్తిపరమైన ఎక్స్పోజర్ ఉన్న సందర్భంలో రక్షిత దుస్తులను ధరించడం ద్వారా దానిని పరిమితం చెయ్యాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చేయ్యాలి మరియు ఆరోగ్యకరమైన బరువు మరియు బిఎంఐ (BMI)ను నిర్వహించాలి.
  • ఆరోగ్యకర, సమతుల్య ఆహారం తీసుకోవాలి.
  • క్రమముగా ఆరోగ్య తనిఖీలు చేయించుకోవడం మరియు ఏదైనా అసాధారణతలు ఉంటే వెంటనే అశ్రద్ధ చెయ్యకుండా చికిత్స చేయించుకోవడం అవసరం.
  • దీర్ఘకాలిక ఆరోగ్య సమస్య లేదా దీర్ఘకాలం పాటు నయంకానీ గాయం లేదా చర్మం పై అధికంగా కమిలిన గాయాలు ఏర్పడిన సందర్భంలో వెంటనే వైద్యులని సంప్రదించాలి.
  • క్రమముగా ఇమ్యునైజెషన్స్/వాక్సినేషన్ (టీకాలు) చేయించుకోవాలి. హ్యూమన్ పపిల్లోమావైరస్ (హెచ్ పి వి) టీకా గర్భాశయ క్యాన్సర్ను నివారించడానికి సహాయపడుతుంది మరియు తప్పనిసరిగా చేయించుకోవాలి. హెపటైటిస్ బి టీకా కూడా పరిగణలోకి తీసుకునే మరొక టీకా, ఇది హెపటైటిస్ బి వైరస్ సంక్రమణను నిరోధిస్తుంది, ఇది (హెపటైటిస్ బి వైరస్ సంక్రమణ) కాలేయ క్యాన్సర్కు ఒక తెలిసిన హాని కారకం.
  • ఒత్తిడిని అధిగమించే మార్గాలను కనుగొనాలి. కుటుంబం మరియు స్నేహితులతో సమయము గడపవచ్చు, ఏదైనా ఒక అభిరుచిని అనుసరించవచ్చు, యోగా లేదా ధ్యానం చేయటం, క్రీడలు ఆడడం, లేదా మనస్సును ప్రశాంతపరచే పనులు చేయవచ్చు.

క్యాన్సర్ నిర్ధారణ - Diagnosis of Cancer in Telugu

రోగనిర్ధారణ పరీక్షను ఎంపిక చేసే ముందు, వైద్యులు రోగి వయస్సు, వైద్య చరిత్ర, లింగం, కుటుంబ చరిత్ర, అనుమానిత క్యాన్సర్ రకం, లక్షణాలు తీవ్రత మరియు ఏదైనా మునుపటి పరీక్ష ఫలితాలను పరిశీలిస్తారు. క్యాన్సర్ యొక్క సంభావ్యతను గుర్తించడానికి ఉపయోగించే అత్యంత సాధారణ నిర్ధారణ విధానాలు:

  • ఏదైనా అసాధారణత తనిఖీ కోసం శారీరక పరీక్ష.
  • ప్రయోగశాల పరీక్షల ద్వారా వ్యక్తికి రక్త పరీక్షలు నిర్వహించడం (పూర్తి రక్త గణన, ఎరిథ్రోసైట్ సెడిమెంటేషన్ రేట్, సి-రియాక్టివ్ ప్రోటీన్, కాలేయం మరియు మూత్రపిండపు పనితీరు పరీక్షలు మరియు మొదలైనవి).
  • ఒక నిర్దిష్టమైన క్యాన్సర్ను అనుమానించినప్పుడు వైద్యులు క్యాన్సర్ యాంటిజెన్ (CA) 19.9 వంటి నిర్దిష్ట పరీక్షలు, కార్సినోఎంబ్రియోనిక్ యాంటిజెన్ (CEA [carcinoembryonic antigen]) లేదా ప్రోస్టేట్-స్పెసిఫిక్ యాంటిజెన్ (PSA [prostate-specific antigen]) వంటి పరీక్షలు సూచించవచ్చు.
  • ఎక్స్- రే, సిటి (CT) స్కాన్లు, ఎంఆర్ఐ (MRI), బేరియం మీల్ స్టడీ (barium meal study), ఎముక స్కాన్, పెట్ (PET) స్కాన్, స్పెక్ట్ (SPECT) స్కాన్, యూ.యస్.జి (USG) మొదలైనవి కూడా సూచించబడవచ్చు. కణితి యొక్క అనుమానం ఉన్నకణజాలాన్ని జీవాణుపరీక్ష (బయాప్సీ) కోసం సేకరించి కణితి యొక్క దశ, తీవ్రత మరియు దాని వృద్ధిని గుర్తించడం కోసం మైక్రోస్కోప్ ద్వారా పరిశీలిస్తారు.

క్యాన్సర్ చికిత్స - Treatment for Cancer in Telugu

క్యాన్సర్ యొక్క చికిత్సా ఎంపికలు ప్రాథమికంగా రెండు రకాలు:

శస్త్రచికిత్స (సర్జికల్) విధానాలు

దీనిలో అసాధారణ పెరుగుదలల లేదా కణాల యొక్క గడ్డను తొలగించడం జరుగుతుంది, తర్వాత తొలగించిన భాగం యొక్క జీవాణుపరీక్ష ఉంటుంది. ఇది ప్రత్యేకంగా కణితి స్థానికంగా మరియు తొలగించడానికి అనుకూలంగా ఉన్నప్పుడు ఉపయోగపడుతుంది.

శస్త్రచికిత్స కాని విధానాలు

ఇది కీమోథెరపీని  కలిగి ఉంటుంది, దీనిలో ప్రాథమికంగా అసాధారణంగా పెరుగుతున్న కణాలను నాశనం చేయడానికి మందులు ఉంటాయి. మరియు రేడియోథెరపీ, దీనిలో పెరుగుతున్న కణితి మీదకు గామా కిరణాలు వంటి రేడియేషన్లను ప్రసరిపచేస్తారు.

కొన్నిసార్లు, శస్త్రచికిత్స మరియు శస్త్రచికిత్సకాని (non-surgical) రెండు పద్దతులను ఉపయోగించబడతాయి. మొదట, కణితి యొక్క పరిమాణాన్ని తగ్గించడానికి రేడియోథెరపీ లేదా కీమోథెరపీ సూచించబడుతుంది, తరువాత క్యాన్సర్ కణితిని తొలగించడం జరుగుతుంది. శస్త్రచికిత్స తరువాత, ఇతర భాగాలకు క్యాన్సర్ కణాల వ్యాప్తిని నివారించడానికి కీమోథెరపీ లేదా రేడియోథెరపీ మళ్లీ ప్రాంతంలో నిర్వహిస్తారు.

ఇతర చికిత్సా ఎంపికలు హార్మోన్ల చికిత్స, రోగనిరోధక శక్తి (immunological) చికిత్సలు, బిస్ఫాస్ఫోనేట్లు మొదలైనవి. వీటిని ప్రత్యేక క్యాన్సర్ల కోసం ఉపయోగిస్తారు. ఉదాహరణకు రొమ్ము మరియు ప్రోస్టేట్ క్యాన్సర్లు హార్మోన్ల చికిత్సకు అనుకూలంగా ఉంటాయి.

క్యాన్సర్ సంబంధిత లక్షణాలను నిర్వహించడానికి మందులు కూడా సూచించబడతాయి. వీటిలో నొప్పి నివారిణులు, యాంటాసిడ్లు, యాంటీపైరేటిక్లు ఉంటాయి.

తరచుగా, ఉపశమనం కలిగించే చికిత్స మాత్రమే సాధ్యమయ్యే చికిత్సా ఎంపిక, దీనిలో క్యాన్సర్ కారణంగా ఏర్పడిన నిరంతర నొప్పి మరియు అసౌకర్యం తగ్గించడానికి మత్తుమందులు లేదా ఇతర నొప్పి నివారణల ఉపయోగించబడతాయి, ఎందుకంటే క్యాన్సర్ బాగా  విస్తరించినప్పుడు దానిని నియంత్రించలేము.

జీవనశైలి ప్రమాణాలు

ప్రభావిత వ్యక్తుల జీవన నాణ్యతను మెరుగుపరిచేందుకు మరియు లక్షణాలను నిర్వహించడానికి సులువైన జీవనశైలి మార్పులను సహాయం చేయవచ్చు. వాటిలో ఇవి ఉంటాయి:

  • పోషక పదార్ధాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన ఇంటిలో వండిన ఆహారం తినాలి.
  • క్రమం తప్పకుండా వ్యాయామం చెయ్యాలి. వారానికి 5 రోజులు 30 నిమిషాల పాటు మధ్యస్తమైన శ్రమతో కూడిన వ్యాయామం చెయ్యడం అనేది సహాయం చేయవచ్చు. తీవ్రమైన భౌతిక శ్రమతో కూడిన వ్యాయామం చేయలేక పోతే, 30 నిమిషాల చురుకైన నడక సహాయపడవచ్చు.
  • పొగాకు మరియు మద్యపానాన్ని నివారించాలి.
  • ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి క్రమముగా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలి.
  • యోగా చేయడం, ధ్యానం చేయడం లేదా ఏదైనా మంచి అభిరుచిని అనుసరించడం ద్వారా ఒత్తిడిని నిర్వహించాలి.
  • ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా మరియు సానుకూలంగా ఉండాలి. అన్ని క్యాన్సర్లు ప్రాణాంతకమైనవి కావు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW

క్యాన్సర్ యొక్క రోగసూచన మరియు సమస్యలు - Prognosis and Complications of Cancer in Telugu

రోగసూచన

క్యాన్సర్ పర్యవసానాలు (లక్షణాలు) దాని రకంపై ఆధారపడి ఉంటాయి. చిన్న పరిమాణపు క్యాన్సర్ లేదా ప్రాధమిక దశల్లో ఉన్నవాటికి చికిత్స చేయడం సులభం.మరోవైపు, మెటాస్టాటిక్ క్యాన్సర్ల  పర్యవసానాలు చాలా తక్కువగా ఉంటాయి. దీనిలో క్యాన్సర్ వ్యాప్తిని పూర్తిగా అడ్డుకోలేము మరియు అనేక శరీర వ్యవస్థల వైఫల్యాలు లేదా ఇతర సమస్యలకు దారితీయవచ్చు. ఇంతే కాకుండా, రోగనిర్ధారణ కణితి రకాన్ని బట్టి మరియు ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి కూడా ఉంటుంది.

సమస్యలు

సమస్యల యొక్క తీవ్రత ప్రభావితమైన శరీర భాగాన్ని బట్టి ఉంటుంది. వ్యాపించని కణితుల కంటే మెటాస్టాటిక్ కణితులు చాలా అధిక ప్రమాదకరమైనవి. ప్రభావితమైన శరీర అవయవ వ్యవస్థలపై ఆధారపడి కలిగే సమస్యలు:

  • గుండె ఆగిపోవుట
  • పల్మోనరీ ఎడెమా (ఊపిరితిత్తులలో ద్రవం చేరిపోవడం/నిలిచిపోవడం)
  • కాలేయ వైఫల్యం
  • మూత్రపిండ వైఫల్యం
  • బలహీనమైన రోగనిరోధకత కారణంగా పునరావృతమయ్యే అంటువ్యాధులు

క్యాన్సర్ అంటే ఏమిటి? - What is Cancer? in Telugu

క్యాన్సర్ అనియంత్రమైన కణాల వృద్ధిని సూచిస్తుంది.  అవి (క్యాన్సర్ కణాలు) వాటికవే స్వతంత్రంగా మరియు ఏ విధమైన చర్య (పనితీరు) లేకుండా క్రమరహితంగా పెరుగుతాయి. క్యాన్సర్ కణాలు ప్రాణాంతక (malignant) స్వభావం కలిగినవి అయితే శరీరమంతా వ్యాపిస్తాయి మరియు ఏ భాగంలోనైనా వృద్ధి చెందుతాయి. ఒక వేళా అవి నిరపాయమైనవి (benign) అయితే వ్యాప్తి చెందకుండా ఒకే భాగంలో అభివృద్ధి చెందుతాయి.

క్యాన్సర్, ప్రధానంగా, ఇతర కణజాలాలపై ఆక్రమించడం మరియు వాటిని నాశనం చేసే కణాల అసాధారణ మరియు అనియంత్రిత అభివృద్ధి.



వనరులు

  1. National Cancer Institute [Internet]. Bethesda (MD): U.S. Department of Health and Human Services; Risk Factors for Cancer
  2. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; What Causes Cancer?.
  3. American Cancer Society [Internet] Atlanta, Georgia, U.S; Cancer Staging.
  4. Harsh Mohan: Harshmohan’s textbook of pathology [Internet]
  5. Stuart Ralston Ian Penman Mark Strachan Richard Hobson. Davidson's Principles and Practice of Medicine E-Book. 23rd Edition: Elsevier; 23rd April 2018. Page Count: 1440

క్యాన్సర్ కొరకు మందులు

Medicines listed below are available for క్యాన్సర్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.