సెప్సిస్ - Blood Infection (Sepsis) in Telugu

Dr. Nabi Darya Vali (AIIMS)MBBS

February 04, 2019

March 06, 2020

సెప్సిస్
సెప్సిస్

సారాంశం

అంటువ్యాధి కారకాలు మరియు వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి వాటి ఉత్పత్తి స్థానం నుండి రక్త ప్రవాహంలో వ్యాపించడాన్ని రక్త సంక్రమణ అని అంటారు.ఇది సూక్ష్మజీవుల సంక్రమణ వలన కలిగే ఒక ఉపద్రవం. రక్త సంక్రమణ అనేది ఒక ప్రమాదకరమైన పరిస్థితి, ఇది ప్రాణాంతకమవుతుంది, అందువల్ల తక్షణమే అత్యవసర చికిత్స అవసరం అవుతుంది. శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల లేదా తగ్గుదల, గుండె కొట్టుకొనే వేగం మరియు శ్వాస క్రియ వేగం (ఊపిరి) లో పెరుగుదల వంటివి రక్త సంక్రమణ యొక్క లక్షణాలు. రక్తపోటు మరియు శరీర ఉష్ణోగ్రతతో సహా సంపూర్ణ శారీరక పరీక్ష, మూత్ర పరీక్ష మరియు సంపూర్ణ రక్త కణాల లెక్కింపు (సిబిసి) వంటి పరిశోధనా పరీక్షలు రోగనిర్ధారణకు చాలా ముఖ్యమైనవి. రక్త పరీక్షలు సాధారణంగా తెల్ల రక్త కణాల లెక్కింపులో గణనీయమైన పెరుగుదలను చూపుతాయి. క్లినికల్ నిర్థారణలు (ఆనవాలు మరియు లక్షణాలు) మరియు పరిస్థితి తీవ్రతపై రక్త సంక్రమణ యొక్క చికిత్స ఆధారపడి ఉంటుంది. చికిత్సలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ICU) లో ఉంచడం మరియు మందుల ద్వారా రక్తపోటుని నియంత్రణలో ఉంచడంతో పాటుగా ఫ్లూయిడ్ మరియు యాంటీబయాటిక్ నిర్వహణ చేయబడుతుంది. రక్త సంక్రమణ ఫలితం సరికానిది ఎందుకంటే, చికిత్స ప్రారంభించే సమయానికి, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ అవయవ వ్యవస్థలు సరిగా పనిచేయకపోవచ్చు. రక్త సంక్రమణ యొక్క ఖచ్చితమైన మూలాన్ని గుర్తించడం చాలా కష్టతరం అయినందున దాని ఫలితం కూడా సరియైనది కాదు.

సెప్సిస్ యొక్క లక్షణాలు - Symptoms of Blood Infection (Sepsis) in Telugu

సెప్సిస్ అనేది రోగ నిర్ధారణను కష్టతరం చేసే అనేక ఆనవాళ్ళు మరియు లక్షణాలకు సంబంధించినది. ఏది ఏమయినప్పటికీ, మూడు అతి ముఖ్యమైన రోగ లక్షణాలు ద్వారా ఒక అంటువ్యాధి యొక్క ఉనికిని నిర్ధారణ చేయుట ద్వారా గాని లేదా నిర్ధారణ లేకుండా గాని తెలుసుకోగలుగుతారు. ఈ లక్షణాలు:

  • అధిక లేదా తక్కువ శరీర ఉష్ణోగ్రత
    సెప్సిస్ కారణంగా శరీర ఉష్ణోగ్రతలో పెరుగుదల లేదా తగ్గుదల ఉండవచ్చు. ఉష్ణోగ్రత 38°C కంటే ఎక్కువ అయితే జ్వరం కలిగించవచ్చు లేదా 36°C కి తక్కువగా ఉంటే వణుకునకు దారి తీయవచ్చు.
  • గుండె కొట్టుకొనే వేగంలో పెరుగుదల
    గుండె కొట్టుకొనే వేగం అనేది ఒక నిమిషంలో జరిగే హృదయ స్పందనల సంఖ్య ద్వారా లెక్కించబడుతుంది. సాధారణoగా గుండె కొట్టుకొనే వేగం నిమిషానికి 60-100 స్పందనలు కలిగి ఉంటుంది. నిమిషానికి 100 స్పందనల కంటే ఎక్కువగా ఉంటే గుండె కొట్టుకొనే వేగంలో పెరుగుదలగా పరిగణించబడుతుంది, దీనిని వైద్య పరంగా ట్యాకీకార్డియా అని కూడా అంటారు.
  • శ్వాస వేగం పెరుగుదల
    శ్వాస వేగo అనేది ఊపిరి యొక్క వేగం అని కూడా పిలవబడుతుంది, ఒక నిమిషంలో ఒక వ్యక్తి తీసుకున్న శ్వాసల సంఖ్య. సాధారణ శ్వాస రేటు నిమిషానికి 16-20 శ్వాసలు ఉంటుంది. సెప్సిస్­లో, శ్వాస వేగం నిమిషానికి 20 కంటే ఎక్కువ శ్వాసలకు పెరుగుతుంది.

సెప్సిస్ యొక్క చికిత్స - Treatment of Blood Infection (Sepsis) in Telugu

ప్రాధమిక లక్ష్యంగా వ్యక్తి యొక్క హృదయ స్పందన రేటు, శ్వాసక్రియ మరియు ఊపిరిని సాధారణీకరించడం కోసం ఆసుపత్రిలో ఉన్నప్పుడు వెంటనే చికిత్స ప్రారంభించాలి. చికిత్స క్రింది వాటిని కలిగి ఉంటుంది :

  • ద్రవాలు
    రోగనిర్ధారణ ప్రారంభించబడటానికి ముందుగా ప్రారంభ స్థిరీకరణ కోసం, సాధారణ సెలైన్ రూపంలో ద్రవాలను ఇంట్రాకేథెటర్ సహాయంతో నియంత్రిత పద్ధతిలో ఒక వ్యక్తికి ఇంజెక్ట్ చేయడం ద్వారా నిర్వహించబడుతుంది. ఇది సాధారణ రక్తపోటుని నిర్వహణ చేస్తుంది. శరీరంలోని మూత్ర ఉత్పత్తి, రక్తపోటు మరియు లేక్టేట్ స్థాయిలను పరిశీలించడం ద్వారా ద్రవాన్ని ఎక్కించేటపుడు పర్యవేక్షించబడుతుంది.
  • ఉష్ణోగ్రత నియంత్రణ చేయుట
    పారాసెటమాల్ వంటి జ్వర నివారిణి (జ్వరం కోసం మందులు) వాడకంతో పాటు చల్లటి నీటితో రుద్దడం, చల్లబరచిన దుప్పట్లు వాడడం వంటి భౌతిక పద్ధతులను ఉపయోగించి పెరిగిన ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు.
  • యాంటిబయాటిక్స్
    యాంటీబయాటిక్స్ ఉపయోగించడం ద్వారా ముందస్తు యాంటీబయాటిక్ థెరపీ ప్రారంభమవుతుంది, ఇది సంక్రమణకు కారణమయ్యే అన్ని సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఖచ్చితమైన రోగ నిర్ధారణ చేయబడే వరకు యాంటీబయాటిక్స్ వాడబడతాయి. రక్తం లేదా మూత్రo పరీక్షా నివేదికలు కారణమైన సూక్ష్మజీవులని సూచించిన వెంటనే, రోగనిర్ధారణకు ఒక గంటలోనే నిర్ధారణ చెందిన సూక్ష్మజీవికి ప్రత్యేకమైన యాంటీబయాటిక్ చికిత్స ప్రారంభమవుతుంది. రోగ సంక్రమణ నుండి పూర్తిగా కోలుకొనే సంకేతాలు కనిపించే వరకు యాంటీబయాటిక్స్ కొనసాగించవచ్చు.
  • రోగానికి మూల కారణం గుర్తింపు మరియు నియంత్రణ
    రక్త సంక్రమణకు మూల కారణాన్ని గుర్తించడం అనేది రక్త ప్రసరణలో వ్యాప్తి చెందే స్థానిక సంక్రమణను కనుగొని, ఫలితంగా వచ్చే అన్ని సంకేతాలు మరియు లక్షణాలకు బాధ్యత వహిస్తుంది. సంక్రమణ యొక్క మరింత వ్యాప్తిని నివారించడానికి మరియు ప్రస్తుత సంక్రమణను నియంత్రించడానికి సంక్రమణ మూలాన్ని గుర్తించడం చాలా కీలకమైనది. ముందుగా రోగ కారకం కనుగొనబడుతుంది, మరియు యాంటీబయాటిక్ చికిత్స మొదలవుతుంది, ఇతర అవయవాలకు మరింత నష్టం కలుగకుండా నివారించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
  • రక్తపోటును నిర్వహించడానికి మందులు
    ద్రవాలు మాత్రమే ఉపయోగించడం అనేది సరిపోవనపుడు ద్రవ చికిత్సతో పాటు రక్తపోటును నిర్వహించడానికి కొన్ని మందులు ఉపయోగించవచ్చు. రక్తం యొక్క హీమోగ్లోబిన్ గాఢత 7gm/dL కంటే తక్కువగా ఉన్న సందర్భాలలో సంపూర్ణ రక్త మార్పిడి జరపవచ్చు. (ఇంకా చదవండి - అధిక రక్తపోటుకు చికిత్స)
  • ఒత్తిడి వలన కలిగే అల్సర్ల నివారణ
    రక్తస్రావాన్ని నివారించడానికి శారీరక ఒత్తిడి కారణంగా కడుపులో కనిపించే స్ట్రెస్ అల్సర్లు (దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా) రక్తస్రావం కలుగకుండా ఉండేలా నివారించాలి, లేకుంటే అది మరింత రక్తపోటుకు కారణమవుతుంది. ఇది H2 బ్లాకర్స్ వంటి మందులను వాడకం ద్వారా నివారణ చేయబడుతుంది. (ఇంకా చదవండి – కడుపులో అల్సర్లకు కారణాలు మరియు చికిత్స)
  • ఊపిరితిత్తుల రక్షిత వెంటిలేషన్
    ఊపిరితిత్తుల రక్షణ కోసం, ఆక్సిజన్ సరఫరాని నిరంతరం అందించాలి మరియు అవసరమైతే, వెంటిలేటర్స్ అని పిలువబడే మెషీన్లు ఉపయోగించవచ్చు.
  • సర్జరీ
    ఒక పుండు అనేది చీము నిండిన ఒక కేవిటీ, సెప్సిస్­లో రోగ సంక్రమణ యొక్క మూలాన్ని నయం చేయడానికి దీనిని తొలగించాల్సిన అవసరం ఉంటుంది. శరీరంపై ఎక్కడైనా ఉన్న చీము పూర్తిగా ఒక చిన్న కట్ ద్వారా తొలగించవచ్చు, అయితే అది శరీరంలోపలి భాగంలో ఉంటే, అప్పుడు శస్త్రచికిత్స ద్వారా తొలగించవలసి ఉంటుంది.

జీవనశైలి నిర్వహణ

జీవనశైలి మార్పులు రోగ సంక్రమణలను నివారించడానికి మరియు అలాగే సెప్సిస్­కు సహాయపడతాయి. వీటితొ పాటు:

  • ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం
    అన్ని అవసరమైన ఖనిజలవణాలు, విటమిన్లు, కార్బోహైడ్రేట్ వంటి వాటి యొక్క సమతుల్య నిష్పత్తి (60% వరకు), ప్రోటీన్లు (30% వరకు) మరియు కొవ్వులు (5 -10%)  మీ రోగనిరోధకత బలంగా ఉండటానికి సహాయపడుతుంది.
  • ఆరోగ్యకరమైన అలవాట్లను పొందడం
    ఆహారాన్ని తినేముందు లేదా టాయిలెట్ ఉపయోగించిన తరువాత చేతులు కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు ధరించడం, శుభ్రమైన పరుపు ఉపయోగించడం, ఇంటిని మరియు చుట్టుపక్కల పర్యావరణాన్ని శుభ్రంగా ఉంచడం వంటివి అనారోగ్యాలను నివారించడం వంటివి ఆరోగ్యకరమైన అలవాట్లు.
myUpchar doctors after many years of research have created myUpchar Ayurveda Urjas Energy & Power Capsule by using 100% original and pure herbs of Ayurveda. This Ayurvedic medicine has been recommended by our doctors to lakhs of people for problems like physical and sexual weakness and fatigue, with good results.
Power Capsule For Men
₹719  ₹799  10% OFF
BUY NOW


వనరులు

  1. Levy MM1, Fink MP, Marshall JC, Abraham E, Angus D, Cook D, Cohen J, Opal SM, Vincent JL, Ramsay G; International Sepsis Definitions Conference. 2001 SCCM/ESICM/ACCP/ATS/SIS International Sepsis Definitions Conference.. Intensive Care Med. 2003 Apr;29(4):530-8. Epub 2003 Mar 28. PMID: 12664219.
  2. Cohen J. The immunopathogenesis of sepsis. Nature. 2002; 20:185-191. PMID: 12490963.
  3. Aitken LM, Williams G, Harvey M, et al. Nursing considerations to complement the Surviving Sepsis Campaign guidelines. Crit Care Med. 2011; 39:1800–1818. PMID: 21685741.
  4. Liberati A, D’Amico R, Pifferi S, et al. Antibiotic prophylaxis to reduce respiratory tract infections and mortality in adults receiving intensive care. Cochrane Collaboration. 2010; 9:1–72. PMID: 14973945.
  5. O’Grady NP, Alexander M, Dellinger EP, et al. Guidelines for the prevention of intravascular catheter-related infections. Clin Infect Dis. 2002; 35:1281–1307. PMID: 12517020
  6. De Jonge E, Schultz MJ, Spanjaard L, et al. Effects of selective decontamination of digestive tract on mortality and acquisition of resistant bacteria in intensive care: A randomised controlled trial. Lancet. 2003; 362:1011–1016. PMID: 14522530
  7. Kumar A, Safdar N, Kethireddy S, et al. A survival benefit of combination antibiotic therapy for serious infections associated with sepsis and septic shock is contingent only on the risk of death: A meta-analytic/ meta-regression study. Crit Care Med. 2010; 38:1651–1664. PMID: 20562695
  8. Shankar-Hari, M., Phillips, G. S., Levy, M. L., Seymour, C. W., Liu, V. X., Deutschman, C. S. Developing a New Definition and Assessing New Clinical Criteria for Septic Shock. JAMA, 2016; 315(8), 775. PMID: 26903336
  9. Kumar Anand et al. Duration of hypotension before initiation of effective antimicrobial therapy is the critical determinant of survival in human septic shock. Crit Care Med. 2006; 34:1589–1596. PMID: 16625125
  10. Singer M, Deutschman CS, Seymour CW, et al. The Third International Consensus Definitions for Sepsis and Septic Shock (Sepsis3). JAMA. 2016; 315:801.
  11. Rivers, E., Nguyen, B., Havstad, S., Ressler, J., Muzzin, A., Knoblich, B., Peterson, E., et al. Early goal-directed therapy in the treatment of severe sepsis and septic shock. . New England Journal of Medicine, 2001; 345(19), 1368-1377.

సెప్సిస్ కొరకు మందులు

Medicines listed below are available for సెప్సిస్. Please note that you should not take any medicines without doctor consultation. Taking any medicine without doctor's consultation can cause serious problems.